Jump to content

Amaravathi Constructions Start


SonyKongara

Recommended Posts

అమరావతిలో నిర్మాణాల సందడి..
61 టవర్లు.. 3,840 ఫ్లాట్లు
18నెలల్లో పూర్తి చేయాలని ఆదేశం
amr-top2a.jpg

అమరావతి: అమరావతి నగరంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అఖిలభారత సర్వీసు అధికారులకు చేపట్టిన నివాస గృహాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆయా గుత్త సంస్థలు మౌలిక సదుపాయాలను యంత్ర సామగ్రిని సమకూర్చుకుంటున్నాయి. మట్టి నమూనా పరీక్షలను ప్రారంభించాయి. అమరావతి రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు నివాస గృహాల నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఆకృతులకు ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. రాయపూడి, నేలపాడు ప్రాంతాల్లో ఈ గృహాల సముదాయం నిర్మించనున్నారు. దీంతో ఈ ప్రాంతం సందడిగా తయారైంది. ఆయా సంస్థల రిగ్‌లు వచ్చాయి. భూమి చదును చేసే పనులు ప్రారంభించారు. మట్టి నమూనాలు ప్రయోగశాలలో పరిశీలించి పునాదులకు సాంకేతిక జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ పనులను సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ పర్యవేక్షిస్తున్నారు. 2019 జనవరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఆకాశహర్మ్యాలు పూర్తయితే రాజధాని నగరానికి కొత్త శోభ సంతరించుకోనుంది. సచివాలయం ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు ఇక అక్కడే నివాసం ఉండాల్సి ఉంటుంది.

ఆకాశహర్మ్యాలు తీరు ఇలా..!
ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొత్తం మూడు రకాల గృహాలను నిర్మించనున్నారు. 65 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 61 బహుళ అంతస్థులు ఆకాశహర్మ్యాలు నిర్మాణం కానున్నాయి. గుత్త సంస్థలతో అక్టోబరులో ఒప్పందం చేసుకున్నారు.
‌* ప్యాకేజీ 1ని ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. ప్యాకేజీ2ను ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకోగా ప్యాకేజీ 3 గృహాల సముదాయాన్ని షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మాణం చేపడుతుంది.
‌* ఒకొక్క సంస్థ 30 రిగ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనరు ఇటీవల సూచించారు. నిర్మాణ స్థలం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
‌* ప్యాకేజీ1లో ఎమ్మెల్యేలకు, అఖిల భారత సర్వీసు ఉద్యోగులకు కలిపి 432 ఫ్లాట్లు నిర్మాణం చేయనున్నారు. మొత్తం 18 టవర్లు ఏర్పాటు కానున్నాయి. ఫ్లాట్‌ విస్తీర్ణం 3,500 చదరపు అడుగులు కాగా మొత్తం విస్తీర్ణం 4546 చ.అ.గా ఉంది. రూ.608కోట్లు నిర్మాణానికి ఖర్చు చేస్తుండగా పన్నులు, ఇతర అంతర్గత, బాహ్య మౌలికవసతులకు రూ.92కోట్లు వెచ్చిస్తున్నారు.
‌* ప్యాకేజీ 2లో ఎన్‌జీఓలకు నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్యాకేజీని ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. మొత్తం విలువ రూ.1098 కోట్లు కాగా రూ.835.17కోట్లు నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. రూ.264.83 కోట్లు అంతర్గత, బాహ్య మౌలిక వసతులకు ఖర్చు చేయనున్నారు. ఈ కేటగిరిలో మొత్తం 22టవర్లను నిర్మాణం చేయనున్నారు. ఇవి కూడా 12 అంతస్థులతో ఉంటాయి. ఇక్కడ ప్లాట్‌ విస్తీర్ణం 1200 చదరపు అడుగులు కాగా మొత్తం నిర్మాణ విస్తీర్ణం 1627 చదరపు అడుగులుగా ఉంటుంది. 27.47 ఎకరాల్లో ఈ 22 అపార్టుమెంట్లు నిర్మాణం చేయనున్నారు.‌్ర ప్యాకేజీ 3లో మూడు రకాల అపార్టుమెంట్లు నిర్మాణం చేయనున్నారు. నేలపాడు సమీపంలోనే గెజిటెడ్‌ 1, 2  నాలుగో తరగతి ఉద్యోగులకు వీటిని నిర్మాణం చేయనున్నారు. మొత్తం 21 టవర్లను 12 అంతస్థులుగా నిర్మిస్తారు.
* గెజిటెడ్‌1 కేటగిరిలో 2,313 చదరపు అడుగుల చొప్పున, 2కేటగిరిలో 2010 అడుగుల చొప్పున, నాలుగో తరగతి ఉద్యోగులకు 1235 అడుగుల విస్తీర్ణం ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నారు. వీటికి మొత్తం రూ.854 కోట్లు వెచ్చిస్తున్నారు. దీనిలో 682కోట్లు నిర్మాణానికి రూ.172కోట్లు ఇతర మౌలిక వసతులకు కేటాయించనున్నారు.

చురుకుగా నిర్మాణ పనులు..!
విద్యుత్తు లైన్లను తొలగిస్తున్నారు. నీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు. ఇసుక, కంకర సరఫరా చేసేందుకు గనుల శాఖను ఆదేశించారు. నిర్మాణ స్థలంలో ఆయా సంస్థల కార్యాలయాలు, లేబర్‌ క్యాంపులు వాటికి కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యంత్ర సామగ్రి నిలిపే స్థలాలను యార్డులను, బ్యాచింగ్‌ ప్లాంట్లు, హైడ్రాలిక్‌ రిగ్స్‌, బార్‌బెండింగ్‌, కటింగ్‌ మిషన్లు, టవర్‌ క్రేన్లు తదితర యంత్రాలను ఏర్పాటుచేశారు.

Link to comment
Share on other sites

Complete cheyataniki inkokkadu ravali and mulaki vunna 3unda la neney chesanu ani self pump kottukovali bcoz Edina complete ga sariga chestey kada verey vadu pogudataniki.... all funds and time wasting fellow 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...