Jump to content

CBN South Korea Day1 updates


psycopk

Recommended Posts

Just now, Android_Halwa said:

Acha..! 

mari hotels ki star rating chandraal gadu ichinda ? 

manchidi ayindi odakotti....CM pani chey ra ante hotels ki star reting iche pani enduku vaanki...

City develop ayye kodhi, city standards peruguthayi, hotels standards penchutahru.. chandral saar bandal saar ivaanamsaram ledhu...

1994 tharuvatha, city expansion and development based ga hotel standards penchi, 5 star rating ichinnru ra chatte champak das ga..

Link to comment
Share on other sites

  • Replies 129
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Android_Halwa

    15

  • Piracy Raja

    13

  • jesse_bb

    13

  • idibezwada

    11

Top Posters In This Topic

On 12/5/2017 at 12:09 PM, Android_Halwa said:

Acha..! 

mari hotels ki star rating chandraal gadu ichinda ? 

manchidi ayindi odakotti....CM pani chey ra ante hotels ki star reting iche pani enduku vaanki...

vOarVX.gif

Link to comment
Share on other sites

We are waiting for day-2 and day-3 updates....

eenadu paper lo kuda emi updates levu...Can any one please update the thread ? PPT’s epudu emana idea ? 

Link to comment
Share on other sites

ఎల్‌జీ ఆసక్తి!
ప్రముఖ సంస్థల అధ్యక్షులు,   సీఈఓలతో చంద్రబాబు భేటీ
  కియా మోటార్స్‌, ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో బిజినెస్‌ సెమినార్‌
  ముగిసిన సీఎం దక్షిణ కొరియా పర్యటన
ఈనాడు - అమరావతి
6ap-main5a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం ఎల్‌జీ సంస్థ ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు పర్యటనలో భాగంగా బుధవారం సియోల్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ అధ్యక్షుడు సూన్‌ క్వోన్‌తోనూ ఇతర పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. స్టోరేజీ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనపై తమ బోర్డుతో చర్చిస్తామని సూన్‌ తెలిపారు.  సౌరవిద్యుత్‌రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఓసీఐ కంపెనీ సీఈఓ వుహ్యూమ్‌ లీని చంద్రబాబు కోరారు. ఏపీలో లాజిస్టిక్‌ యూనివర్శిటీ ఏర్పాటు అపూర్వమని, భాగస్వామి కావడానికి ఆసక్తిగా ఉన్నామని దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్‌ సంస్థ డార్ల్స్‌ డైరెక్టర్‌ బెన్నీ కాంగ్‌ తెలిపారు.

సియోల్‌లో కియా మోటార్స్‌, కొరియాలోని ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్విహించిన బిజినెస్‌ సెమినార్‌లో చంద్రబాబు బృందం     పాల్గొంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమకు అనుమతుల ప్రక్రియ ఏడాది పడుతుందనుకుంటే, మూడు నెలల్లోనే పూర్తి చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారని కియా మోటార్స్‌ సంస్థ అధ్యక్షుడు హూన్‌ వూ పార్క్‌ ప్రశంసించారు.

ఈ సదస్సులో ముఖ్యాంశాలు...
* కృష్ణపట్నం ఓడరేవు అభివృద్ధి పనులపై సీఈఓ అనిల్‌ ఎండూరి ప్రజంటేషన్‌. బూసన్‌, కృష్ణపట్నం పోర్టుల అనుసంధానంపై చర్చ.
* శ్రీసిటీ సెజ్‌పై సంస్థ ప్రతినిధుల ప్రజంటేషన్‌.
* కాకినాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతంపై జీఎంఆర్‌ సంస్థ ప్రజంటేషన్‌.
* సెమినార్‌ ముగిశాక పలు ద్వైపాక్షిక సమావేశాలు.
* క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన ఔషధాలపై పరిశోధన, ఉత్పత్తిలో పేరుగాంచిన గ్రీన్‌క్రాస్‌ సెల్‌ ఎండీ లీ డక్‌ జూతో సీఎం భేటీ. తూర్పు ఆసియా దేశాల్లో వ్యాపారాభివృద్ధికి ఆసక్తిగా ఉన్నామన్న లీ డక్‌ జూ.
* ఏపీలో కియా మోటార్స్‌ అడుగు పెట్టాక కొరియాకు చెందిన చాలా మంది వాహన తయారీదారులు ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ కామా డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కిమ్‌ యాంగ్‌ హ్యూన్‌. తమ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామని వెల్లడి.
* హుందాయ్‌ మర్చంట్‌ మెరైన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ సూ హో కిమ్‌, జనరల్‌ మేనేజర్‌ డేవిడ్‌ సియోన్గ్‌లకు రాష్ట్రంలో పోర్టుల విస్తరణ, కంటైనర్‌ బిజినెస్‌కుగల అవకాశాల్ని వివరించిన సీఎం. కృష్ణపట్నం పోర్టుని భారత్‌తో తమ ట్రాన్స్‌షిప్‌మెంట్‌కి హబ్‌గా మార్చుకోవాలని భావిస్తున్నామన్న కిమ్‌.
* అన్ని వసతులూ కల్పిస్తామని, రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని బంగ్లాదేశ్‌ కేంద్రంగా 35 ఏళ్లుగా పనిచేస్తున్న యంగ్‌ఒన్‌ సంస్థ ఛైర్మన్‌ సన్గ్‌ కియాక్‌, ప్రతినిధి బృందానికి చంద్రబాబు ఆహ్వానం. జౌళి, దుస్తుల తయారీ రంగాల్లో రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని, మంచి మౌలిక సదుపాయాలున్న శ్రీసిటీ వంటి పారిశ్రామిక నగరం ఉందని ముఖ్యమంత్రి వెల్లడి.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దక్షిణ కొరియా పర్యటన బుధవారంతో ముగిసింది. గురువారం తెల్లవారుజాముకి అమరావతికి చేరుకుంటుంది. ముఖ్యమంత్రి వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, అమరనాథరెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు ఉన్నారు.

Link to comment
Share on other sites

వసతులకు మాదీ పూచీ
07-12-2017 02:31:49
636482107108386976.jpg
  • భారీ పెట్టుబడులతో రండి
  • దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు
  • పరిశ్రమల స్థాపనకు ఏపీ భేష్‌
  • కియ ప్రెసిడెంట్‌ పార్క్‌ ప్రశంస
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని వసతులూ కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా బాబు చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన మూడో రోజై న బుధవారమూ బిజీ బిజీగా సాగింది. కియ మోటా ర్స్‌, కొరియాలోని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంయుక్తంగా నిర్వహించిన బిజినెస్‌ సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సులభ సరళి వ్యాపార విధానం కొనసాగుతుందని.. ఇందుకు ఆటోదిగ్గజ సంస్థ ‘కియ’ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో కియ ప్రెసిడెంట్‌ హాన్‌ వూ పార్క్‌ మాట్లాడుతూ..‘ఏపీలో పరిశ్రమ స్థాపనకు పూర్తి అనుకూల వాతావరణం ఉంది. అనుమతులు, భూ కేటాయింపులు, అభివృద్ధి పనులు వేగంగా చేస్తారు.
 
 
ఏపీలో పరిశ్రమ స్థాపన మాకు ఓ మంచి అనుభవం’ అంటూ కియ ప్రెసిడెంట్‌ హాన్‌ వూ పార్క్‌ ఏపీపై ప్రశంసల వర్షం కురిపించారు. కియ పెట్టుబడుల విస్తరణకు ఏపీ సరైన స్థావరంగా గుర్తించామని పార్క్‌ వెల్లడించారు. ఈ సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని అవకాశాలు, వనరు లు, ఇక్కడ కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై సీఎం ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కియ మోటార్స్‌ బిజినెస్‌ సెమినార్‌లో కృష్ణపట్నం ఓడరేవుపై ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. పోర్టు అభివృద్ధి పనులపై సీఈవో అనిల్‌ ఎండూరి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. బుసాన్‌, కృష్ణపట్నం పోర్టుల అనుసంధానం గురించి అనిల్‌ వివరించారు. బుసాన్‌ నుంచి కృష్ణపట్నానికి 19 గంటల ప్రయాణ సమయం పడుతుందని వివరించారు. అనంతరం శ్రీసిటీ సెజ్‌పై సంస్థ ప్రతినిధులు వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న స్పెషల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రీజియన్‌పై జీఎంఆర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామి మాట్లాడుతూ.. ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
 
 
పలు కంపెనీల సీఈవోలతో భేటీ
ఓసీఐ కంపెనీ సీఈవో వు హ్యూమ్‌లీతో సీఎం సమావేశమయ్యారు. ఓసీఐ సంస్థ అమెరికాలోని టెక్సా స్‌, న్యూజెర్సీ, జార్జియా రాష్ట్రాల్లో, మలేషియాలో సౌర విద్యుత్‌ రంగంలో కార్యకలపాలు నిర్వహిస్తోంది. వివిధ దేశాల్లో తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై లీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు లీ వెల్లడించారు. గత ఏడాది విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు తాను హాజరయ్యానని లీ వివరించారు. అప్పటి నుంచి ఏపీని నిశితంగా గమనిస్తున్నానని చంద్రబాబుకు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఏపీ అమలు చేస్తు న్న విధానాలు బాగా నచ్చాయన్నారు.
 
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని లీని సీఎం కోరారు. అనంతరం ప్రసిద్ధ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎల్‌జీతో సీఎం సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాల గురించి సీఎంకి ఎల్‌జీ ప్రెసిడెంట్‌ సూన్‌ క్వో వివరించారు. భారత్‌లో పెద్ద ఎత్తున ఎల్‌జీ ఉనికి చాటుకుంటుందన్నారు. రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని ఎల్‌జీ ప్రెసిడెంట్‌ క్వోను చంద్రబాబు కోరారు. ఇప్పటిదాకా తాము తయారీ రంగంలో కొరియా దాటి మరోదేశానికి పూర్తి స్థాయిలో వెళ్లలేదని క్వో వివరించారు. అయితే.. బాబు ప్రతిపాదనను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన రాష్ట్రా ల కంటే ఏపీలో ఉన్న సానుకూలతలేమిటని సీఎంని క్వో ప్రశ్నించారు.
 
 
రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ ను అమలు చేస్తున్నామని, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సర్వేలో ఏపీ మొదటి ర్యాంకు సాధించిందని చంద్రబాబు వివరించారు. ‘కియ’ పెట్టుబడుల విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఫాక్స్‌కాన్‌ తమిళనాడును వదిలి ఏపీకి వచ్చి 13 వేల మంది మహిళలతో పనిచేయిస్తున్న వైనం వివరించారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే ఏపీలో రెట్టింపు ఉందని బాబు వివరించా రు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడుల విస్తరణ గురించి తమ బోర్డు సమావేశంలో చర్చిస్తామని క్వో తెలిపారు. స్టోరేజీ బ్యాటరీలు, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు ఎల్‌జీ ఆసక్తిని కనబరచింది. ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఒక ప్రభుత్వాధినేతను చూడడం తనను ఆశ్చర్యపరుస్తోందని క్వో వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాలో అతిపెద్ద లాజిస్టిక్‌ సంస్థ డార్సల్‌ డెరెక్టర్‌ టెన్నీ కాంగ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్‌ వర్సిటీలో భాగస్వామ్యం కావాలని కాంగ్‌ను సీఎం కోరారు. లాజిస్టిక్‌ వర్సిటీ ఏర్పాటు చేయడం అపూర్వమని కాంగ్‌ ప్రశంసించారు. భాగస్వామ్యం కావడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు.
 
 
గ్రీన్‌ క్రాస్‌ సెల్‌ సంస్థ ఎండీ లీడక్‌ జు తో సీఎం భేటీ అయ్యారు. కేన్సర్‌ వ్యాధి చికిత్సకు సంబంధించిన ఔషధాలపై పరిశోధన, ఉత్పత్తిలో గ్రీన్‌ క్రాస్‌ సెల్‌ పేరుగాంచింది. దక్షిణ కొరియాలో ఈ ఔషధాలకు గిరాకీ ఉంది. కొరియాలో జాతీయ కార్ల కంపె నీ కామా డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కిమ్‌ యాంగ్‌ హ్యూస్‌తో సీఎం సమావేశమయ్యారు. కియ సంస్థ ఏపీలో అడుగు పెట్టాక పలు కొరియన్‌ ఆటోమొబైల్‌ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయని సీఎం చంద్రబాబుతో హ్యూస్‌ చెప్పారు. ఇప్పటికే యూరోపియన్‌ మార్కెట్‌పై దృష్టి సారించిన కొరియన్‌ కంపెనీలు భారత్‌కు రావడానికి ఆసక్తిగా ఉన్నాయని వివరించారు.
 
హ్యుందాయ్‌ మర్చంట్‌ మెరైన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సూహో కిమ్‌, జనరల్‌ మేనేజర్‌ డేవిడ్‌ సియో్‌స్గతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో పోర్టు విస్తరణ, కంటైనర్‌ బిజినె్‌సకు గల అవకాశాలను సీఎం వివరించారు. వైజాగ్‌ -చెన్నై పారిశ్రామిక కారిడార్‌, బెంగళూరు-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్లు తమకు అదనపు బలమన్నారు. కృష్ణపట్నం పోర్టును భారత్‌లో తమ ట్రాన్స్‌షి్‌పమెంట్‌ హబ్‌గా మార్చుకోవాలని భావిస్తున్నట్లుగా కిమ్‌ చెప్పారు.
Link to comment
Share on other sites

ముగిసిన కొరియా పర్యటన
07-12-2017 02:41:36
 
  • నేడు రాష్ట్రానికి చంద్రబాబు
పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం తెల్లవారుజామున రాష్ట్రానికి తిరిగి వస్తారు. బుధవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ఆయన ముంబాయిలో దిగుతారు. అక్కడ నుంచి బయలుదేరి గురువారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు విజయవాడకు వస్తారు. మధ్యాహ్నం 12.30కు బయలుదేరి విశాఖపట్నం వెళ్తారు. విశాఖ పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌కు చంద్రబాబు స్వాగతం పలుకుతారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి తిరిగి వెళ్లేవరకూ సీఎం విశాఖలోనే ఉంటారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగే తెలంగాణ రాష్ట్ర టీడీపీ సమావేశంలో పాల్గొంటారు. శనివారం కూడా హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆదివారం తిరిగి విజయవాడ వస్తారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...