Jump to content

చంద్ర‌బాబు దెబ్బ‌… దిగొచ్చిన కేంద్రం


Crazy_Robert

Recommended Posts

ముందూ వెనుకా చూసుకోకుండా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం ఆ త‌ర్వాత జ‌రిగిన… జ‌ర‌గ‌బోయే న‌ష్టం తెలుసుకుని నేల‌కు దిగిరావ‌డం… ఏపీ విష‌యంలో కేంద్రం వైఖ‌రి ఇదే. ప్ర‌తిసారీ ఇదే జ‌రుగుతోంది. నంద్యాల ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా ఇలాగే చేసింది. ఏపీలోని అధికార టీడీపీతో ఉంటూనే ప్ర‌తిప‌క్ష వైసీపీకి క‌న్నుకొట్టింది. జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రై టీడీపీని వ‌దిలేయాల‌ని కూడా భావించింది. అయితే, ఏపీలో టీడీపీ స‌త్తా ఏమిటో నంద్యాల ఎన్నిక‌లు స్ప‌ష్టం చేయ‌డంతో ఆ పార్టీ క‌ళ్లు తెరుచుకుంది. ఆ ఫ‌లితాలు వెలువ‌డిన రోజే చంద్ర‌బాబులోని విశ్వ‌స‌నీయ‌త బీజేపీకి గుర్తోచ్చింది. మీరు మాకు విశ్వ‌స‌నీయ మిత్రుడంటూ ప్ర‌ధాని మోడీ… బీజేపీ చీఫ్ అమిత్ షాలు మెసేజ్‌లు పెట్టారు. రెండు రోజులు గ‌డిచిన త‌ర్వాత మ‌ళ్లీ మామూలే. ఏపీకి స‌హాయ నిరాక‌ర‌ణే. చివ‌ర‌కు తాను బాధ్య‌త‌గా నిర్మించాల్సిన పోల‌వరం ప్రాజెక్టు విష‌యంలోనూ కేంద్రం అడ్డంకులు క‌ల్పించ‌డం మొద‌లు పెట్టింది.

19025222_1944724475756477_84113271273265

చివ‌ర‌కూ ఆ విష‌యం చిలికి చిలికి గాలీవాన‌గా మారింది. పోల‌వ‌రం టెండ‌ర్లు ఆపివేయాలంటూ కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్య‌ద‌ర్శి అమ‌ర్జిత్ సింగ్ రాసిన లేఖ ఏపీ ప్ర‌భుత్వానికి మంట పుట్టించింది. అప్ప‌టి వ‌ర‌కూ సౌమ్యంగా ఉంటూ స‌ర్దుకుపోయిన చంద్ర‌బాబు మూడోక‌న్ను తెరిచారు. కేంద్రం ఏమ‌నుకున్నా… ఏం చెప్పినా… తాము మాత్రం ముందుకే వెళ్తామంటూ తెగేసి చెప్పారు. త‌మ‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మని ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో తాము ముందుగా అనుకున్న ప్రకారమే ముందుకు పోతామ‌ని తేల్చి చెప్పారు. అలాగే కేంద్ర‌మంత్రి గ‌డ్క‌రీతో మ‌రోసారి భేటీ అయ్యే ప్ర‌శ్నే లేద‌ని కూడా చంద్ర‌బాబు తెగేసి చెప్పారు. ఎన్న‌డూ లేనిది చంద్ర‌బాబు ధిక్కారంతో కేంద్రంలో పున‌రాలోచ‌నలో ప‌డింది. ఈ నేపథ్యంలో… టెండర్ల వ్యవహారంపై చర్చిద్దాం రండి అంటూ రాష్ట్రాన్ని కేంద్రం ఆహ్వానించింది. ఢిల్లీలో మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ, కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ ప్రతినిధులు సమావేశం కానున్నారు. పోల‌వ‌రం టెండ‌ర్ల విష‌యంలో కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ ఏక‌ప‌క్షంగా ఆదేశాలివ్వ‌డం… ఆ త‌ర్వాత అదంతా ప్ర‌స్తుత ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ చేసిన ఫిర్యాదుతోనే అని తేల‌డంతో చిక్కుముడి మ‌రింత బిగిసింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో.. సీఎం చంద్రబాబు ఒకసారి, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మరోసారి నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా టెండర్లను ఆహ్వానించారంటూ కేంద్రం ఒక అభ్యంతరం వెలిబుచ్చింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి గత నెల 18న తమకు లేఖ అందిందని మరో అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం మూడు వారాలైనా సమయం ఇవ్వకుండా టెండర్లు పిలవడం సరి కాదంటూ మరో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా అభ్యంత‌రాల‌ను చూపిస్తూ టెండ‌ర్ల‌ను అడ్డుకోవ‌డంపై ఏపీ స‌ర్కారు ఆగ్ర‌హంతో ఉంది. వ‌చ్చే ఏడాదికి గ్రావిటీ ద్వారా నీళ్లివ్వాల‌ని తాము ఆఘ‌మేఘాల మీద ప‌నులు జ‌రిపించాల‌ని చూస్తుంటే కేంద్రం మాత్రం దానికి భిన్నంగా ఆదేశాలు జారీ చేయ‌డం ఏపీ స‌ర్కారు ఆగ్ర‌హానికి కార‌ణం.

చంద్ర‌బాబు ధిక్కారంతో ఇంకా ఈ వివాదాన్ని కొన‌సాగిస్తే రాజ‌కీయంగా కూడా త‌మ‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌ద‌ని బీజేపీ భావించ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎలా ఏపీ అభివృద్ధి అడ్డుప‌డుతుందో జ‌నంలోకి వెళ్లిన‌ట్లైంది. దాంతో ఇక్క‌డి బీజేపీ నేత‌లు కూడా స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి ఎదురైంది. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ అంశానికి ముగింపు పలకాలని నిర్ణయించింది. లండన్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీకి చేరుకున్న వెంటనే.. పోలవరం టెండర్ల వ్యవహారంలో రాష్ట్రంలో తలెత్తిన అలజడిపై దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఫోన్‌ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద సమావేశం ఉందని వివరించారు. ఇదే సమాచారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కూ కేంద్రం నుంచి వచ్చింది. దీంతో.. సోమవారం సాయంత్రమే మంత్రి ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో మాట్లాడిన మంత్రి దేవినేని ఉమ తాము అనుస‌రించాల్సిన వైఖ‌రిపై స్ప‌ష్ట‌త తీసుకున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...