Jump to content

శాసనసభ ఆకృతిపై తుది నిర్ణయం 13న

SonyKongara

Recommended Posts

సీఎంతో రాజమౌళి సమావేశం
10ap-main3a.jpg

ఈనాడు అమరావతి: అమరావతి పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవనం తుది ఆకృతిని ఈ నెల 13న ఖరారు చేయనున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ సిద్ధం చేసిన ఆకృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమీక్షించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ ముఖ్య  కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన ఆకృతుల విశేషాలను రాజమౌళి సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం అమరావతికి వస్తున్నారు. 12, 13 తేదీల్లో ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. ఆ సందర్భంగా శాసనసభ భవనం తుది ఆకృతిని ఖరారుచేసే అవకాశం ఉంది. అక్టోబరు చివరి వారంలో ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన హైకోర్టు, శాసనసభ ఆకృతులను పరిశీలించారు. ఆ బృందంలో రాజమౌళి కూడా ఉన్నారు. హైకోర్టుకు బౌద్ధ స్ధూపాన్ని పోలినట్టు రూపొందించిన ఆకృతిని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. దాని ముఖద్వారంలోను, భవనం లోపలి భాగాల్లోనూ కొన్ని మార్పులు సూచించారు. ఆ విధంగా మార్పులు చేసిన ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ బృందం తీసుకురానుంది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరోసారి సమావేశమై తాము చేసిన మార్పులను ఆయనకు వివరించి ఆయన అనుమతి తీసుకుంటారు. శాసనసభకు సంబంధించి ముఖ్యమంత్రి లండన్‌ వెళ్లినప్పుడు రెండు ఆకృతుల్ని ఎంపిక చేశారు. చతురస్రాకారంలో ఉన్న ఆకృతితో పాటు భవనంపై పొడవైన స్తంభం (టవర్‌)తో ఉన్న ఆకృతిని ఎంపిక చేశారు. ఆ రెండు ఆకృతులను మరింత మెరుగుపరిచి తీసుకురావాలని, వాటిలో ఉత్తమైనదాన్ని ఎంపిక చేద్దామని చెప్పారు. ఆకృతులు తెలుగుదనం ఉట్టిపడేలా, ఆంధ్రుల సంస్కృతికి అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగిన  సూచనలిచ్చే బాధ్యతను రాజమౌళికి అప్పగించారు.

Link to comment
Share on other sites

636485880724945094.jpg
విజయవాడ: అమరావతికే తలమానికంగా నిర్మించనున్న ఏపీ అసెంబ్లీ డిజైన్లు దాదాపు ఖరారయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు అసెంబ్లీ డిజైన్‌ను ఓకే చేయనున్నారు. కొత్త డిజైన్లను ఇవాళ నార్మన్‌ ఫోస్టర్స్‌ అమరావతికి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 25న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ అసెంబ్లీ కోసం రెండు డిజైన్లను సమర్పించింది. ఆ డిజైన్లను మరింత మెరుగుపరచి, తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీంతో సవరించిన డిజైన్లను ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం అమరావతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిజైన్లపై నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్న దర్శకుడు ఎస్‌.ఎస్.రాజమౌళి తదితరులతో సీఎం సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడు పి.నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఆర్కిటెక్ట్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
అసెంబ్లీ భవనం అమరావతికే కాకుండా రాష్ట్రానికే మణిమకుటంగా ఉండాలన్న తన అభిలాషను చంద్రబాబు పునరుద్ఘాటించారు. అది మన ఘన చరిత్ర, వారసత్వ, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూనే వైవిధ్యానికి, సృజనాత్మకతకూ నిలువెత్తు దర్పణంగా నిలిచి, తరతరాలపాటు తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలని సీఎం తెలిపారు.
 
అసెంబ్లీ చుట్టూ చక్కటి కొలనును ఏర్పాటు చేసి, ఆ జలాల్లో ఉన్నత చట్ట సభ వెలుగులు ప్రతిబింబించేలా చూడాలన్నారు. అసెంబ్లీ భవనం పగలు సూర్యకాంతిలో తళతళలాడాలని, రాత్రివేళల్లో వెన్నెల వెలుగుల్లో కాంతులీనాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఒక్క అంశంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. గత కొన్ని నెలలుగా డిజైన్ల రూపకల్పనకు తాము జరుపుతున్న కృషి, తద్వారా లభించిన ఫలితాల గురించి రాజమౌళి తదితరులు సీఎంకు వివరించారు. వాటిని విన్న చంద్రబాబు మరిన్ని సూచనలిచ్చారు. కాగా, సోమవారం నారాయణ, రాజమౌళి, శ్రీధర్‌, చంద్రశేఖర్‌ ప్రభృతులతో ఫోస్టర్‌ బృందం విజయవాడలో సమావేశమై, రివైజ్‌ చేసి, తెచ్చిన డిజైన్లను చూపనుంది. ఈ సందర్భంగా సీఎం చేసిన సూచనలను కూడా పొందుపరుస్తూ మార్పుచేర్పులు చేయాల్సిందిగా సూచిస్తారు. మంగళ, బుధవారాల్లో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నిపుణులతో కలసి ఈ డిజైన్లను పరిశీలించనున్న చంద్రబాబు వాటిల్లో మెరుగైనదాన్ని ఖరారు చేస్తారు. ప్రజాభిప్రాయం కనుగొనేందుకు ఈ ఆకృతులను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచే అవకాశం కూడా ఉందని తెలిసింది.

Link to comment
Share on other sites

2 hours ago, SonyKongara said:

Worst gaa vunnayi designs anni.

Just look at Karnataka Assembly. Its the best in India. Please build one which looks at least 50% of it.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...