Jump to content

మానవత్వం పరిమళించిన మచ్చుతునకలివీ..!


yaman

Recommended Posts

పాప కోసం.. 31 రోజుల పాప గుండె సంబంధ వ్యాధితో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. సమయం తక్కువ. కన్నూర్‌ నుంచి తిరువనంతపురం వరకూ వెళ్లాలి. చూస్తే.. 508 కి.మీల దూరం. హెలికాప్టర్‌లో సాధ్యంకాదు. చిన్నారిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఒకటే ఉత్కంఠ. అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు 13 గంటలు పడుతుంది. ఇక ట్రాఫిక్‌ను కలుపుకొంటే మరో గంట అదనం. అంత సమయం అంటే పాప ప్రాణాలకు ముప్పు. అనంతరం అదే రోజు రాత్రి 8.30 గంటలకు తిరువనంతపురానికి పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనంతో కలిసి అంబులెన్స్‌ బయల్దేరింది. ఈ లోగా అధికారులు ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అంబులెన్స్‌ నంబర్‌ను షేర్‌ చేశారు. దీంతో ప్రజలతో పాటు అధికారులూ అప్రమత్తమయ్యారు. అంబులెన్స్‌ ఎక్కడ కనబడితే అక్కడ దానికి సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడంతో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో 14 గంటల్లో చేరుకోవాల్సిన ఆ అంబులెన్స్‌ కేవలం 6.50 గంటల్లోనే తిరువనంతపురానికి చేరుకుంది. దీంతో చిన్నారిని సకాలంలోనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు సాధ్యమైంది. కుల, మత, లింగ బేధాలకతీతంగా అంతా ఏకమై ఆ చిన్నారి ప్రాణాలను కాపాడుకొనేందుకు ఎంతగానో పరితపించారు.

Link to comment
Share on other sites

మానవత్వాన్ని మేల్కొల్పారు! తమిళనాడుకు చెందిన కులతుపరంబ్లి జయన్‌ బతుకుదెరువు కోసం కుటుంబ సమేతంగా 20 ఏళ్ల క్రితం కేరళకు వచ్చాడు. అప్పటినుంచి బట్టలు ఇస్త్రీ చేస్తూ దాన్నే వృత్తిగా మలుచుకొని జీవనం సాగిస్తున్నాడు. తనకొచ్చే ఆదాయం తక్కువైనా జయన్‌కు ఆప్తులు మాత్రం లెక్కలేనందరు. ఏ నలుగురు ఒక చోట కలిసినా ఆయన మంచితనం గురించే చర్చ.ఒంట్లో నలతగా ఉండటంతో భార్య ఒత్తిడితో వైద్యుడి దగ్గరికి వెళ్తే.. పరీక్షించి కిడ్నీల్లో సమస్య ఉందని, చెడిపోయిన కిడ్నీని మారిస్తే తప్ప బతకటం కష్టమని చెప్పారు. శస్త్రచికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. దీంతో నలుగురి బట్టలు ఇస్త్రీ చేస్తే కానీ పూట గడవని స్థితిలో అంతడబ్బు ఎక్కడినుంచి తేవాలో దిక్కుతోచలేదు. ఒక్కసారిగా డీలా పడిపోయారు. చూస్తుండగానే వారికి కాలం భారంగా మారింది. అయితే, ఆ నోటా ఈ నోటా అతడి ఆరోగ్య పరిస్థితి చుట్టుపక్కల వారికి తెలిసింది. ‘అయ్యో.. ఎంత కష్టం వచ్చింది’ అని అంటూ బాధపడ్డారంతా. తలా ఓ చేయివేసి ఎలాగైనా సాయం చేయాలని చొరవతీసుకున్నారు. ముందుగా కొట్టాయం జిల్లాలోని చింగవనం, పాల్లం వాసులు స్పందించారు. ఏకంగా ‘జయన్‌ లైఫ్‌ సేవింగ్‌ సమితి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థనే ఏర్పాటుచేశారు. ఇలా ఒక్కరేమిటీ ప్రతి ఒక్కరూ తమ వంతుగా తమకు తోచిన విధంగా సాయం చేశారు. ఆ విధంగా అక్టోబర్‌ 15న ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సంస్థ సభ్యులు విరాళాలను సేకరించారు. కేవలం ఐదు గంటల్లోనే రూ.11లక్షల వరకు సేకరించారు. ఇందులో రూ.50ల నుంచి రూ. 25,000 వరకు సాయం చేసేందుకు అనేకమంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. రోజువారీ కూలీలైతే ఏకంగా తమ ఒక రోజు కూలీ డబ్బును ఇచ్చారు. అలా ఆ మొత్తం సొమ్మును జయన్‌ కుటుంబ సభ్యుల పేరున ఉమ్మడి ఖాతా తెరచి అందులో వేశారు. తనతో జీవితాన్ని పంచుకున్న అతని అర్ధాంగి కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో జయన్‌ ప్రాణం నిలబడింది.

Link to comment
Share on other sites

మేము సైతం అంటూ ముందుకొచ్చిన హిజ్రాలు

సాయం చేయటానికి లింగ భేదాలతో సంబంధం లేదంటూ నిరూపించారు కోల్‌కతాకు చెందిన కొందరు హిజ్రాలు. పూజించే చేతులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని చాటారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు విజృభించి దేశాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ్‌ బంగ, అసోం, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ఉద్ధృత వరదల మూలంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వాలు పెద్దయెత్తున సహాయక చర్యలు చేపట్టినా.. మేము సైతం అంటూ నలభై మంది హిజ్రాలు ఒక్కటై ముందుకొచ్చారు. కోల్‌కతా, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన వీరంతా నిరాశ్రయులకు చేతనైన సాయం చేశారు. బట్టలు సేకరించి ఇవ్వడం, ఆహార పొట్లాలు అందించడం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, శుద్ధ జలం, ఔషధాలు..ఇలా ఒక్కటేమిటి తమకు సాధ్యమైనంత మేర సాయంచేసి తమలోని మానవతను చాటారు. పలువురికీ ఆదర్శంగా నిలిచారు.

Link to comment
Share on other sites

బంధువులు కాకపోయినా బాధ్యతగా..! 

ఆధునికత పెరిగిన తర్వాత సమాజంలో తోటివారిని మనస్ఫూర్తిగా పలకరించడానికి కూడా తీరికలేని రోజులివి. కోల్‌కతా వంటి రద్దీ నగరాల్లోనైతే పరిస్థితి ఇంకా గగనమే. కానీ అక్కడి కస్బా ప్రాంత వాసులు మాత్రం ఎవరో తెలియని ఓ ఎనభై ఏళ్ల వృద్ధురాలి కోసం ఎంతో తపనపడ్డారు. వరుసగా మూడు రోజులు నిద్ర లేని రాత్రులు గడిపి ఆమె బాగోగులు చూసుకున్నారు. ఆమె బంధువుల కోసం రోజుల తరబడి వెతుకుతూనే ఉన్నారు. గర్ఫా రోడ్‌లో ఓ వృద్ధురాలు బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ క్రమంలో అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయింది. దీన్ని గమనించిన అక్కడి టీ కొట్టు యజమాని వెంటనే స్పందించాడు. ఒంట్లో ఓపిక కోల్పోయి నీరసంగా కనిపించిందామె. వెంటనే కాస్త ఆహారాన్ని అందించి ఆమె వివరాలు ఆరా తీశాడు. దీంతో ఆమె సరిగ్గా చెప్పలేకపోయింది. అనంతరం ‘హల్తూ మిలాన్‌ సంఘ్‌ క్లబ్‌ సభ్యులు’ ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. చూపు అంతంత మాత్రంగా ఉన్న ఆ వృద్ధురాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. తానెవరో, ఎక్కడ నుంచి వచ్చిందో తెలియక పోవడంతో ఆమె బాధ్యతను వారంతా భుజాన వేసుకున్నారు. ఆమె బంధువుల కోసం సామాజిక మాధ్యమాల నుంచి ప్రతిచోట వెతుకుతూనే ఉన్నారు. తల్లిదండ్రులే భారమవుతున్నారని ఆశ్రమాల్లో వదిలి బాధ్యత దులిపేసుకునేవాళ్లున్న ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప మానవతావాదంతో మెలిగేవారు ఉండటం నిజంగా గొప్ప విషయమే కదా. అదీ కాకుండా వారంతా ఆమె బాధ్యతల్ని రోజుకొక్కరు చొప్పున తీసుకొని సపర్యలు చేస్తుండటం విశేషం.

Link to comment
Share on other sites

bl@stbl@st

 

inka mana desham lo maanavatvam bathike undhi ani prove chesaru....hats off

vandhala kotly venkesukuni edho saadhichesamu ani peel ayye govt aapicers vellani choosi koncham ayina nerchukunte anadharu baagu padatharu

Link to comment
Share on other sites

1 hour ago, nokia123 said:

bl@stbl@st

 

inka mana desham lo maanavatvam bathike undhi ani prove chesaru....hats off

vandhala kotly venkesukuni edho saadhichesamu ani peel ayye govt aapicers vellani choosi koncham ayina nerchukunte anadharu baagu padatharu

yourock

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...