Jump to content

హెచ్‌1బీ వీసాలపై భారతీయులకు పెద్ద వూరట


khabardar

Recommended Posts

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వీసా నిబంధనల్లో సవరణలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికాలోని విదేశీ ఐటీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద వూరట కలిగించే నిర్ణయమిది. వేలాది మంది హెచ్‌1బీ వీసా దారులను అమెరికా నుంచి వెనక్కి పంపే ఎలాంటి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోబోమని అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం సోమవారం వెల్లడించింది. ఈ ప్రకటనతో గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న అక్కడి భారతీయ హెచ్‌1బీ వీసాదారులకు వూరట లభించింది. వీసా పొడిగింపు నిరాకరించి వేలాది మంది హెచ్‌1బీ వీసాదారులను బలవంతంగా అమెరికా నుంచి వెనక్కి పంపిచాలనే నిబంధనలను యూఎస్‌సీఐఎస్‌ పరిగణలోకి తీసుకోదని అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మీడియా రిలేషన్స్‌ అధికారి జొనాతన్‌ వితింగ్టన్‌ వెల్లడించారు.

ప్రస్తుతమున్న నిబంధనల మేరకు ఏసీ 21లోని సెక్షన్‌ 104(సీ) ప్రకారం హెచ్‌1బీ వీసాదారులకు ఆరేళ్లకుపైగా పొడగింపు లభిస్తోంది. అయితే దీనిలో మార్పులు చేసే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోమని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఒకవేళ మార్పులు ఏదైనా జరిగినా హెచ్‌1బీ వీసా దారులు అమెరికా నుంచి వెళ్లకుండా ఉండేందుకు మరో సెక్షన్‌ 106(ఏ)-(బీ) ద్వారా ఏడాది పొడగింపునకు ఆయా కంపెనీలు అభ్యర్థించే అవకాశం ఉందని జొనాతన్‌ తెలిపారు.

హెచ్‌1బీ వీసాలపై పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకున్న అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్‌1బీ వీసా మార్పుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ యంత్రాగంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ వీసాల పొడిగింపును ఆపాలనే ప్రతిపాదనను ఇప్పటికే కొందరు అమెరికా శాసనకర్తలు, న్యాయవాద బృందాలు కూడా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల దాదాపు 5 నుంచి 7.5లక్షల భారత అమెరికన్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. దీంతో అమెరికాలో తీవ్ర నిపుణుల కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌1బీ వీసాల్లో మార్పులు చేయాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

8 minutes ago, playboys said:

how green cards will come plz explain.

ilaanti rules lekapothe, US lo adugu pettina prathi antla vedhavaki GC osthadi ani athani uddesam kaabolu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...