TampaChinnodu Posted January 19, 2018 Report Share Posted January 19, 2018 బిట్‌కాయిన్ ట్రేడర్లకు ఆదాయపన్ను శాఖ షాక్! ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ట్రేడర్లకు ఆదాయపన్ను శాఖ షాకిచ్చింది. ట్రేడింగ్ చేసిన వేలాది మందికి పన్ను కట్టాల్సిందిగా నోటీసులు పంపించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో 17 నెలల కాలంలోనే 3.5 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీతో పరిచయం ఉన్న యువ మదుపర్లు, స్థిరాస్తి, నగల వ్యాపారులు బిట్‌కాయిన్ తరహా క్రిప్టోకరెన్సీల్లో భారీ పెట్టబడులు పెట్టారని ముంబయి, దిల్లీ, బెంగళూరు, పుణె నగరాల్లోని తొమ్మిది ఎక్స్ఛేంజీల్లో అధికారుల సమాచారం సేకరించారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ క్రిప్టోకరెన్సీను ఎలా నియంత్రించాలో తెలియక తలలు పట్టుకుంటున్న సంగతి తెలిసిందే. బహుశా మార్చిలో అర్జెంటీనాలో జరిగే జీ20 సదస్సులో సంబంధిత విధానాలు రూపకల్పన చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీలు భారత్‌లో చట్టబద్ధం కావని, వాటి చెలామణికి ఎలాంటి హామీ లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకు చాలాసార్లు మదుపర్లను హెచ్చరించింది. ఆ తరహా మోసపూరిత పథకాల వైపు మళ్లొద్దని చెప్పింది. ఇంత చెప్పినా ప్రతి నెలా దేశంలో రెండు లక్షల మంది కొత్తగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వే తర్వాత ఈ తరహా ట్రేడర్లకు నోటీసులు పంపించామని కర్ణాటక ఆదాయపన్ను శాఖ దర్యాప్తు విభాగ డైరెక్టర్ జనరల్ బీఆర్ బాలకృష్ణన్ తెలిపారు. ‘క్రిప్టో కరెన్సీలపై విధాన పరమైన తుది నిర్ణయం వెలువడే వరకు మేం కళ్లు మూసుకుని ఉండలేం.’ అని బాలకృష్ణన్ అన్నారు. పెట్టబడి లాభాలపై పన్ను కట్టాలని నోటీసులు పంపించామని వెల్లడించారు. చాలా సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు తన పన్ను దరఖాస్తులో ఈ విషయాన్ని ప్రస్తావించడంలేదని వివరించారు. ప్రతి నెలా రెండు లక్షల మంది బిట్‌కాయిన్ ట్రేడర్లు పెరుగుతున్నారని 20 బిలియన్ రూపాయలు మేర లావాదేవీలు జరుగుతున్నాయని జెబ్‌పే తెలిపింది. కాగా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా ఇప్పటికే డబ్బులు పోగొట్టుకున్నామని చాలా మంది పోలీస్‌స్టేషన్లు, కోర్టుల్లో ఫిర్యాదులు చేస్తున్నారని సైబర్‌నేరాల్లో నిపుణుడైన సుప్రీం కోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.