Jump to content

Lokesh visiting seattle on Thursday-- Come and join


psycopk

Recommended Posts

రాష్ట్రానికి సిస్‌ ఇంటెలి
30-01-2018 03:41:02

తక్షణమే వంద మందితో ఏర్పాటు
రెండేళ్లలో 1000 మందికి ఉపాధి
పెట్టుబడులకోసం అమెరికాలో లోకేశ్‌ రోడ్‌షో
అమరావతి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన.. రాష్ట్రానికి పలు కంపెనీలను తీసుకొచ్చే దిశగా సాగుతోంది. సోమవారం లాస్‌ఏంజిలెస్ లో ఆయన పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. సిస్‌ ఇంటెలి, సాఫ్ట్‌ హెచ్‌క్యు, ఎలిక్సిస్‌, ఐస్పేస్‌ సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను ప్రారంభించేందుకు అంగీకరించాయి. తక్షణం 100 మంది ఉద్యోగులతో ఏపీలో కంపెనీ ప్రారంభిస్తామని సిస్‌ ఇంటెలి పేర్కొంది. మరికొన్ని కంపెనీలు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రాష్ట్రానికి వస్తామని హామీ ఇచ్చాయి.
 
లోకేశ్‌ తన అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం లాస్‌ ఏంజిలెస్ లో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం, ఏపీఎన్‌ఆర్‌టీ సమావేశంలో పాల్గొన్నారు. ఐటీ రంగంలో గత మూడున్నరేళ్లలో 24 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం 86 వేల డాలర్లుగా ఉందని, రాబోయే మూడేళ్లలో అమెరికాలో ఉన్న తెలుగువారి తలసరి ఆదాయం 1.5లక్షల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం-ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో అమెరికాలో నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ప్రవాసాంధ్రులకు ఎలాంటి సమస్య వచ్చినా...ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్‌ఆర్‌టీ వేదికగా ఉంటుందని పేర్కొన్నారు.
 
పెట్టుబడులకు అనువైన వాతావరణం
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని, స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని లోకేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా పెట్టుబడుల రోడ్‌షోను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీల అధిపతులను కలిశారు. ఎలక్టో హెల్త్‌ కేర్‌ సీఈవో లక్ష్మణ్‌రెడ్డితో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుచేయాలని, పూర్తి సహకారం అందిస్తామని లోకేశ్‌ కోరారు. సిస్‌ ఇంటెలి సీఈవో రవి హనుమార.. లోకేశ్‌ను కలిశారు.
 
హెల్త్‌కేర్‌ ఆటోమేషన్‌, ఐవోటీ, డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌, డిజైన్‌ డెవల్‌పమెంట్‌ సర్వీసె్‌సలను ఈ కంపెనీ అందిస్తోంది. ఏపీలో ఐటీ కంపెనీలను తక్షణమే ప్రారంభించేందుకు డీటీపీ విధానాన్ని తీసుకొచ్చామని, ఎక్కడా లేని రాయితీలు కల్పిస్తున్నామని లోకేశ్‌ వివరించారు. తక్షణం 100 మంది ఉద్యోగులతో కంపెనీని ప్రారంభిస్తామని, వచ్చే రెండేళ్లలో 1000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు.
 
అనంతరం అడ్వాన్స్డ్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ కంపెనీ సీఈవో రిచర్డ్‌ కెయిన్‌, ఉపాధ్యక్షుడు మైక్‌ పాలోమీరాతో మంత్రి భేటీ అయ్యారు. త్వరలోనే ఏపీకి వస్తామని, అక్కడి మార్కెట్‌ అంచనా, పాలసీలు, రాయితీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కెయిన్‌ తెలిపారు. సాఫ్ట్‌ హెచ్‌క్యు సీఈవో క్రాంతి పొన్నంతోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. గుంటూరులో కంపెనీని ప్రారంభిస్తామని క్రాంతి చెప్పారు. ఐస్పేస్‌ సీఈవో రాజేశ్‌ కొత్తపల్లితో లోకేశ్‌ చర్చించారు. విశాఖను మ్యాపింగ్‌ హబ్‌గా మార్చాలనుకుంటున్నామని, అక్కడకు రావాలని లోకేశ్‌ కోరారు. దీనికి రాజేశ్‌ సుముఖంగా స్పందించారు. అలాగే.. ఎలిక్సిస్‌ కంపెనీ సీటీవో డాక్టర్‌ లోగనాథన్‌, సెంట్రామెడ్‌, ప్రెస్‌ మార్ట్‌ డిజిటల్‌ మీడియా కంపెనీ సీఈవో విక్ర మ్‌ తొర్పునూరి, పీబీ సిస్టమ్స్‌ కంపెనీ సీఈవో వేణు గార్నేనితో లోకేశ్‌ భేటీ అయ్యారు.

Link to comment
Share on other sites

Nara Lokesh inaugurated the FalconX incubation centre in San Francisco today. FalconX will seek to promote entrepreneurship in AP by way of boosting cross border interaction of start-ups between the BayArea and Vizag. CBN connected via VC and addressed the gathering during the launch 

 

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

Nara Lokesh inaugurated the FalconX incubation centre in San Francisco today. FalconX will seek to promote entrepreneurship in AP by way of boosting cross border interaction of start-ups between the BayArea and Vizag. CBN connected via VC and addressed the gathering during the launch 

 

Kummiyo.. vizag lo startups kk emaina base or platform

create chesaara like t-hub or something like that?

Link to comment
Share on other sites

Quote

అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం 86 వేల డాలర్లుగా ఉందని, రాబోయే మూడేళ్లలో అమెరికాలో ఉన్న తెలుగువారి తలసరి ఆదాయం 1.5లక్షల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు

thankyou chinna babu . USA lo vunna valla income kooda penchaali ani  chinna babu target bl@st

Link to comment
Share on other sites

Quote

అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం 86 వేల డాలర్లుగా ఉందని, రాబోయే మూడేళ్లలో అమెరికాలో ఉన్న తెలుగువారి తలసరి ఆదాయం 1.5లక్షల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు

chinna babu will brief thatha to raise salaries from 86k to 150k 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

thankyou chinna babu . USA lo vunna valla income kooda penchaali ani  chinna babu target bl@st

Tana vallu kosam kadu prajalu kosam alochinche vade nijamayana nayikudu ade ma lokesam babu

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

chinna babu will brief thatha to raise salaries from 86k to 150k 

Yes and immigration bill mida lobying cheyadnke vachadu daca gurnchi kuda adigadu anta 

Link to comment
Share on other sites

1 minute ago, xxxmen said:

Yes and immigration bill mida lobying cheyadnke vachadu daca gurnchi kuda adigadu anta 

Anna thaluchukunte manadhj current avvochhu ee summer lopu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...