Jump to content

అవినీతి లక్ష్మీప్రసాద్‌


TampaChinnodu

Recommended Posts

అవినీతి లక్ష్మీప్రసాద్‌ 
పనిచేసిన ప్రతి చోటా అక్రమార్జన 
రూ.80 కోట్ల విలువైన స్థిర, చరాస్థులు సొంతం 
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌ 
20 చోట్ల ఏసీబీ సోదాలు 
ఇటీవల వరకూ ఆర్థిక మంత్రి యనమల వద్ద ఓఎస్డీగా పనిచేసిన లక్ష్మీప్రసాద్‌ 
31ap-main4a.jpg

ఈనాడు, అమరావతి: గెడ్డాపు లక్ష్మీప్రసాద్‌... అడ్డగోలు అవినీతికి చిరునామా. పనిచేసిన ప్రతి ప్రదేశం విచ్చలవిడి సంపాదనకు కేంద్రం. 31 ఏళ్ల కిందట ప్రభుత్వ ఉద్యోగంలో చేరి జీతంతో పాటు గీతం కూడా బాగానే రుచిమరిగిన వ్యక్తి. అది ఎంతలా అంటే రూ.80 కోట్ల మేర అక్రమాస్తులు (మార్కెట్‌ విలువ ప్రకారం) కూడబెట్టేంతలా! నగదు రూపంలో ఒకే వ్యక్తికి రూ.కోటి రుణమిచ్చేంతలా!!  ఇటీవల వరకూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వద్ద ఓఎస్డీగా పనిచేసి కొన్ని నెలల కిందటే వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌ పోస్టులో తిరిగి చేరాడు. ఎట్టకేలకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అభియోగాలపై బుధవారం అవినీతి నిరోధక శాఖ అతడిని అరెస్టు చేసింది. లక్ష్మీప్రసాద్‌ అవినీతిలో కొంత కొత్త కోణం కనిపించింది. తన ఉద్యోగ విధుల్ని పన్ను కట్టని వ్యాపారులకు అనుకూలంగా మార్చేశారన్నది అభియోగం. పన్నుల ఎగవేతకు గాను క్షేత్రస్థాయి అధికారులు విధించే జరిమానాలు, అపరాధ రుసుములను తగ్గించాలని లేదా రద్దు     చేయాలని కోరుతూ వ్యాపారులు ఏపీ వ్యాట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఆయా సందర్భాల్లో వారికి అనుకూలంగా వ్యవహరించి వారి నుంచి లక్ష్మీప్రసాద్‌ భారీగా ప్రతిఫలం పొందినట్టు ఆరోపణలున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ తరఫున కౌంటర్లు దాఖలు చేయకుండా వ్యాపారులకు పరోక్షంగా సహకరించి రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. తమ శాఖలో అంతర్గత బదిలీల్లోనూ చక్రం తిప్పి.. ప్రతిగా పోస్టుకు ఇంత అని ధర నిర్ణయించి సొమ్ములు వసూలు చేశారన్న అభియోగాలూ లక్ష్మీప్రసాద్‌ సొంతం. అక్రమ మార్గాల్లో సంపాదించిన సొమ్మును మరింత రెట్టింపు చేసుకునేందుకు వడ్డీ వ్యాపారం కూడా చేసినట్లు ఏసీబీ తేల్చింది. విజయవాడలోని అతడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీగా ప్రాంసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి నగదు రూపంలో రూ.కోటి అప్పిచ్చి ప్రాంసరీ నోట్లను రాయించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏక కాలంలో 20 చోట్ల సోదాలు 
ఏసీబీ బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఏసీబీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం రేంజికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ గణేశ్‌ నేతృత్వంలోని బృందాలు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, గుంటూరు, శ్రీకాకుళంలోని లక్ష్మీప్రసాద్‌ ఇళ్లతో పాటు అతడి బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. అతడు రూ.8 కోట్ల (పుస్తక విలువ) అక్రమాస్తులు సంపాదించినట్లు తేల్చింది. కూడబెట్టిన స్థిరాస్తుల్లో సింహభాగం రాజధానిలో అంతర్భాగమైన గుంటూరు జిల్లా గోరంట్ల, లామ్‌ ప్రాంతాల్లోనే ఉన్నట్లు గుర్తించింది. వీటి మార్కెట్‌ విలువ భారీగా ఉంటుందని అంచనా. సోదాలు పూర్తయిన అనంతరం లక్ష్మీప్రసాద్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

31ap-main4b.jpg

కీలక ప్రాంతాల్లోనే విధులు 
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కాకరపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీప్రసాద్‌ 1987లో వాణిజ్య పన్నుల శాఖాధికారిగా చేరారు. 1994లో సహాయ కమిషనర్‌గా, 1998లో ఉప కమిషనర్‌గా పదోన్నతులు పొందారు. వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ప్రాంతాలైన గుంటూరు, విజయవాడ, కర్నూలుతో పాటు హైదరాబాద్‌లోని చార్మినర్‌ డివిజన్‌లో పనిచేశారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటులో కొన్నాళ్ల పాటు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించారు. ఇటీవల వరకూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వద్ద ఓఎస్డీగా పనిచేశారు. 2017 జూన్‌ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్‌లో అదనపు కమిషనర్‌ హోదాలో పనిచేస్తున్నారు.

ఇద్దరు భార్యలు 
లక్ష్మీప్రసాద్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనారోగ్యంతో గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఆమె విజయవాడలోనే ఉంటారు. రెండో భార్య మాత్రం హైదరాబాద్‌లోని నివాసంలో ఉంటారు.

అరెస్టు లేకుండా చూసేందుకు ప్రయత్నాలు: కేసు నమోదు, సోదాలకే పరిమితం కావాలని అతన్ని అరెస్టు చేయకుండా చూడాలని ఉదయం నుంచే కొంతమంది తీవ్రంగా పైరవీలు చేశారు. అతని భార్య మంచానికే పరిమితమయ్యారని, పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని మానవీయ కోణంలో ఆలోచించాలని కోరుతూ మరికొంత మంది ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు విన్నవించారు. ఏసీబీ అధికారులు మాత్రం అవేవి పరిగణనలోకి తీసుకోకుండా లక్ష్మీప్రసాద్‌ను అరెస్టు చేశారు.

లక్ష్మీప్రసాద్‌ పేరిట ఉన్న అక్రమాస్తులు 
* శ్రీకాకుళం పట్టణంలో 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన జీ ప్లస్‌ 2 భవనం 
* గుంటూరు జిల్లా గోరంట్లలో 400 చదరపు గజాలు ఇంటి స్థలం

మొదటి భార్య గెడ్డపు అలివేలు పేరిట.. 
* విశాఖపట్నంలో 366.66, 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన రెండు వేర్వేరు ఇళ్ల స్థలాలు 
* హైదరాబాద్‌ సమీపంలోని పరిగిలో 200 గజాల విస్తీర్ణం కలిగిన అయిదు ఇళ్ల స్థలాలు 
* గుంటూరు జిల్లా గోరంట్లలో 889 చదరపు గజాల ఇంటి స్థలం

రెండో భార్య పి.మల్లిక పేరిట.. 
* గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్‌లో 972 చదరపు గజాల విస్తీర్ణంలో 3 ఇళ్ల స్థలాలు 
* గుంటూరు జిల్లా గోరంట్ల మండలంలో 240 చదరపు గజాల స్థలం 
* హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో 1485 చదరపు అడుగుల ఫ్లాటు, నారాయణగూడలో 1594 చదరపు అడుగుల ఫ్లాటు, గచ్చిబౌలిలో 2040 చదరపు అడుగుల ఫ్లాటు 
* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో 2.14 గుంటల స్థలం 
* విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురం మండలం దుప్పిటూరులో 0.17 సెంట్ల భూమి

అత్త యారబాటి అప్పలనరసమ్మ పేరిట 
* శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 2 ఎకరాల వ్యవసాయ భూమి

మరదలు పేరిట 
* హైదరాబాద్‌ సమీపంలోని మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమి 
* గుంటూరు జిల్లా గోరంట్లలో 222 చదరపు గజాల ఖాళీ స్థలం

చరాస్తులు 
* బ్యాంకు బ్యాలెన్సు: రూ.34 లక్షలు 
* నగదు: రూ.32 లక్షలు 
* బంగారు ఆభరణాలు: రూ.40 లక్షలు 
* గృహోపకరణాలు: రూ.10 లక్షలు 
* వాహనాలు: 2 మారుతీ కార్లు 
* ఎకో స్పోర్ట్స్‌-1 
* ద్విచక్ర వాహనం-1 
* హైదరాబాద్‌ చిక్కడపల్లి శాఖలోని ఇండియన్‌ ఓవరసీస్‌ బ్యాంకులో ఒక లాకరును ఇంకా తెరవాల్సి ఉంది.

Link to comment
Share on other sites

1 hour ago, mettastar said:

okkokkadini pattukuntunnaru kada nice.. andarini bokkalo eyyali

Pilla fishes ni pattukunte pedda sharks ki food sources thaggipothai ani gollapudi thaata Leader movie lo eppudo cheppaadu ga

Link to comment
Share on other sites

2 hours ago, johnubhai_01 said:

Pilla fishes ni pattukunte pedda sharks ki food sources thaggipothai ani gollapudi thaata Leader movie lo eppudo cheppaadu ga

atta cheppada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...