Jump to content

విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!


TampaChinnodu

Recommended Posts

విశాఖ రైల్వేజోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌! 
1002brk-visaka-rail.jpg

దిల్లీ: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. గత నాలుగైదు రోజులుగా పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు చేసిన ఆందోళన, భాజపా అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం చర్చోపచర్చల నేపథ్యంలో రైల్వే జోన్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటుకు ఒడిశా నుంచి ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యనేతలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కేంద్రమంత్రి సుజనా చౌదరి గత రెండు రోజులుగా చర్చలు జరిపారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుతో ఒడిశాకు ఎలాంటి ఇబ్బంది రాదని వారికి వివరించినట్టు సమాచారం. అలాగే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖ రైల్వే డివిజన్‌తో జోన్‌ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాల్తేరు డివిజన్‌లోని 80శాతం ప్రస్తుత జోన్‌లోనే కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఒడిశా నేతలు ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. 
నిన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో పాటు సుజనాచౌదరి, రైల్వేమంత్రి పీయూష్‌గోయల్‌ కూడా హాజరయ్యారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు అభ్యంతరాలపై చర్చించిన నేతలు రెండు వారాల్లో ప్రకటన చేయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఇది కేవలం పరిపాలనా సంబంధమైన వ్యవహారమేనని, పార్లమెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో వీలైనంత త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం సమావేశం అనంతరం తన కార్యాలయ సిబ్బందికి విధివిధానాలు ఖరారు చేయాలని, ఏర్పాటుకు కావాల్సిన పత్రాలు సిద్ధం చేయాలని పీయూష్‌గోయల్‌ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగుతున్నందున ఆ అధికారులతో పాటు ఈస్ట్‌కోస్ట్‌ అధికారులతోనూ చర్చించాక సోమవారం నుంచి తుది ప్రక్రియ ప్రారంభించి పూర్తిచేసే అవకాశం ఉంది. అనంతరం ప్రధాని ఆమోదం తర్వాత గోయల్‌ ఓ స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.

Link to comment
Share on other sites

  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kool_SRG

    13

  • Peacemaker

    8

  • aakathaai

    7

  • Android_Halwa

    5

4s086h.gif?1403646236

 

Ayina Dharmendra Pradhan ki ikkada emiti sambhandam only thing is he is from Orissa but no where related to this... Ilanti same scene Suresh prabhu Vizag tour raakamundu kuda chesaaru...Vachedaaka doubte...

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

4s086h.gif?1403646236

 

Ayina Dharmendra Pradhan ki ikkada emiti sambhandam only thing is he is from Orissa but no where related to this... Ilanti same scene Suresh prabhu Vizag tour raakamundu kuda chesaaru...Vachedaaka doubte...

nijam gaane teliyaka asking. Railway zone vasthey benefits enti assalu ? Is it really that big deal ? 

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

nijam gaane teliyaka asking. Railway zone vasthey benefits enti assalu ? Is it really that big deal ? 

Ante Actually untayi ani cheppalem, only thing is now VSKP is part of ECoR and it has Head quarters(HQ) at Bhubaneshwar... Ikkada problem emiti ante local vallaki ekkuva preference ivvatledu , VSKP has lots of demand for trains to various places but VSKP nunchi start ayye trains veyyatledu etc oka pedha katha undi le...

Edayaina train start cheyyamante adi bhuvaneshwar nunchi start chestaru , VSKP nunchi demand unna saripada berths quota undadu , more over konni trains VSKP nunchi start chesina sollu timings istaru demand lekunte avi mellaga Bhubaneswar ko ekkadiko extend chesetaaru, so VSKP with much potential want separate zone with HQ at VSKP...

Forming a new zone is not a easy thing and is economically not feasible daani meeda already report vachesindi but daanni inka ala laagutunnaru process lo undi ani chepputu ippudu appudu antu.. VSKP vallaki SCR lo kalavataaniki pedda istam ledu if they keep HQ some where else other than VSKP. It may not become a out and out boom advantage but just a it gets upgraded to HQ. 

Aamadyana ee kotha zone form ayithe VIjayawada i.e., capital region lo HQ pettandi ani akkada unna vaallu annaru daaniki malli penta modalayyindi..Chuddam emavudoh.

Link to comment
Share on other sites

17 minutes ago, TampaChinnodu said:

nijam gaane teliyaka asking. Railway zone vasthey benefits enti assalu ? Is it really that big deal ? 

More over if divided they will keep majority of it with ECoR since they are also not inclined to loose the high revenue generated in Waltain division which is generated via freight transport...

+_(

 

30 minutes ago, TampaChinnodu said:

వాల్తేరు డివిజన్‌లోని 80శాతం ప్రస్తుత జోన్‌లోనే కొనసాగేలా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Link to comment
Share on other sites

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి, ఇతర ప్రముఖులు ప్రధాన మంత్రి మోదీతో సమావేశమయ్యారు. బడ్జెట్ గురుంచి చర్చ జరిగాక, బడ్జెట్ ప్రతులు పరిశీలించిన మోదీ
 
" ఈసారి బడ్జెట్ బాగుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇక సవరణలు ఏం లేవు. ఇదే ఫైనల్ చేయండి జైట్లీ గారు" అని అమిత్ షా వైపు చూసి
 
"మీకు కూడా సమ్మతమే కదా షా జి? " అని అడిగారు.
 
హా, మనం అనుకున్న బడ్జెట్ ఇదే కదా? కానీ... అని అమిత్ షా నసుగుతుంటే ,
 
చెప్పండి ఏదైనా సమస్య ఉంటే అడిగారు మోదీ.
 
పక్కనే ఉన్న ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కల్పించుకుని ,
 
"సార్, అంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం కేటాయించలేదు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా,రైల్వేజోన్...... ఇలా దేని మీదా బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనిమీద వ్యతిరేకత వస్తుందేమో అని "..... అని జైట్లీ వైపు చూడగా
 
నాదేముంది అంతా మీ దయ అన్నట్టు మోదీ వైపు చూసాడు జైట్లీ.
 
మోదీ చిద్విలాసంగా నవ్వి" మనం ఆంధ్రాకి బడ్జెట్ కేటాయించడం ఏంది? మనమే ఆంధ్రాని అప్పు అడగాలనుకుంటున్నాం " అని తన పీఏ వైపు చూసి
 
"అవి తీసుకురా" అన్నాడు. పీఏ లోపలికెళ్లగా , మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలతో చూస్తున్నారు. కొన్ని క్షణాల్లో పీఏ ఒక పెద్ద పేపర్ల కట్ట తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందరూ వాటి వైపు చూడగా అవి " ఈనాడు, ఆంధ్ర జ్యోతి" పేపర్లు.
 
"తీసి చదువు" అన్నారు మోదీ. పీఏ ఒక్కో పేపర్ తీసి చదవసాగాడు.
 
వైజాగ్ సదస్సులో పది లక్షల కోట్ల పెట్టుబడులు .
 
త్వరలో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న చైనా.
 
సోమాలియా దేశం నుండి పెట్టుబడుల వరద, సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా.
 
దవోస్ నుండి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తేనున్న చంద్రబాబు.
 
అమెరికాలో లోకేష్ పెట్టుబడుల వేట, ఐదు లక్షల కోట్లు తరలి రానున్నట్టు వినికిడి.
 
అంగారక గ్రహం నుండి .....అని పీఏ చెప్పబోతూంటే "ఆపమన్నట్టు" చెయ్యి ఎత్తాడు మోదీ.
 
మిగతా వారంతా డిస్కవరీ ఛానెల్లో కప్పల్లాగా నోరు తెరచి అలానే ఉన్నారు.
 
ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు అయ్యాయి? అడిగాడు మోదీ.
 
కాస్త ఆలోచించి "యాభై లక్షల కోట్లు సార్ " చెప్పాడు జైట్లీ.
 
మన బడ్జెట్ ఎంత?
 
ఇరవై ఐదు లక్షల కోట్లు
 
అంటే ఆంధ్రా పెట్టుబడుల్లో సగం మన బడ్జెట్ అన్నమాట. ఇక మనం ఏం ఇవ్వగలం వాళ్లకి? ఆ పెట్టుబడుల్లో వాళ్ళు అంతర్జాతీయ రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు, ఇక ప్రత్యేక హోదా అంటారా.... అది ఏ వనరులు లేని బీద రాష్ట్రానికి. లక్షల కోట్ల పెట్టుబడులు, కోటి ఉద్యోగాలు, అరవై ఐటి కంపెనీలు,అద్బుతమైన రాజధాని..... ఇన్ని ఉన్న రాష్ట్రానికి మనమేం చేయగలం? ఏం ఇవ్వగలం? చెప్పండి అన్నాడు మోదీ.
 
ఏం చేయలేము సార్" ముక్తకంఠంతో అన్నారు అందరూ.
 
సో, ఇదే ఫైనల్ చేయండి" అని పైకి లేచాడు మోదీ. 
"అన్నట్టు షా జి, నాయుడు గారికి ఫోన్ చేసి పది లక్షల కోట్లు పంపమని చెప్పండి, అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి " అని వెళ్లిపోయారు.
 
అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మన ఆంధ్రా నాయకుల్లాగా.
 
Source: messenger
Link to comment
Share on other sites

22 minutes ago, aakathaai said:

Idhi nijam aithe odisha mana ap nundi  denkesthunna revenue mana daggare pettukovachu new trains new routes jobs anni Ap ki vasthaai

Waltair division lo 80% akkade unchaka inka separate zone enduku laddu lodi

Link to comment
Share on other sites

It’s brings no benefit to AP. A classic case of over hype.

Few hundred jobs, not the newly created ones but jobs which are already created and running else where will be lived to Vizag. Population will grow by another 500 families. Improvement in local economy.

deeni kosama intha kayyam petukunadi ?

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

It’s brings no benefit to AP. A classic case of over hype.

Few hundred jobs, not the newly created ones but jobs which are already created and running else where will be lived to Vizag. Population will grow by another 500 families. Improvement in local economy.

deeni kosama intha kayyam petukunadi ?

odisha vaalla petthanam nadusthundi kada halwa annaai anduke maadi maaggavale antunnamm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...