Jump to content

ఇదిగో సాయం లెక్క

TampaChinnodu

Recommended Posts

ఇదిగో సాయం లెక్క 
స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనంత సాయం 
రాజకీయ పరిశోధకులు పరిశీలించవచ్చు 
తప్పని నిరూపిస్తే దేనికైనా సిద్ధం 
త్వరలో రైల్వే జోన్‌పై నిర్ణయం 
తెదేపా మాకు మిత్రపక్షమే... 
సమస్యలుంటే పరిష్కరించుకుంటాం 
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టీకరణ 
10ap-main3a.jpg

ఈనాడు, దిల్లీ: ‘స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడున్నరేళ్లలో దేశంలో ఏ రాష్ట్రానికీ ఏ కేంద్ర ప్రభుత్వమూ అందించనంత సాయం మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అందించింది. ఆ సాయం లెక్కలను వెల్లడిస్తున్నాం. రాజకీయ పరిశోధన చేసేవాళ్లు పరిశీలన చేయొచ్చు. విభజన చట్టంలో చెప్పిన సంస్థలను 93వ సెక్షన్‌ ప్రకారం 10 సంవత్సరాల్లో చేయాలని అదే చట్టంలో గడువు విధించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మూడున్నరేళ్లలో 85% ప్రాజెక్టులను మంజూరు చేసి ప్రారంభించింది. మిగిలిన ఐదు సంస్థలూ ఈ ఏడాదిలో తప్పకుండా ప్రారంభమవుతాయి. ఏపీ విభజన చట్టంలో హామీల అమలుకు మోదీ ప్రభుత్వం నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది. నేను వెల్లడించిన వివరాలు ఎవరైనా అబద్ధమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. అందుకు నేనే బాధ్యత వహిస్తా’ అని ఏపీ భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. శనివారమిక్కడ ఆయన భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హామీల అమలుకు సంబంధించి 27 పేజీల నివేదికను విడుదల చేశారు. రైల్వే జోన్‌ సరిహద్దుల నిర్ధారణపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, ఈ అంశంపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నింటినీ కేంద్రమే ఇస్తుందని చెప్పారు. ఆ ప్రాజెక్టును నాబార్డుతో అనుసంధానం చేయడంవల్ల బడ్జెట్‌లో పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్‌ నిధులను కేంద్రం ఇస్తుందని వివరించారు.

‘తెదేపా మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో, భాజపా మంత్రులు రాష్ట్రంలో కొనసాగినంత కాలం రెండు పార్టీలూ భాగస్వాములే. కేంద్ర, రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకెళ్తే ఏపీ ప్రయోజనాలు నెరవేరుతాయని విశ్వసిస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు సహకరించుకోవడంవల్లే ఇన్ని ప్రాజెక్టులు సాధ్యమయ్యాయి. ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకుని కేంద్రం మంజూరు చేసిన అన్ని సంస్థలకూ వేగంగా భూములు కేటాయించారు. రాజకీయంగా తెదేపా, భాజపాలు మిత్రపక్షాలే. ఇబ్బందులుంటే పరస్పరం చర్చించుకుని అనుమానాలను తొలగించుకుంటాం. కాదూ... కూడదనే అధికారం ఎప్పుడైనా... ఎవరికైనా ఉంటుంది’ అని హరిబాబు పేర్కొన్నారు.

10ap-main3b.jpg

కేవలం కేంద్ర సాయంతోనే ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందలేదు: జీవీఎల్‌ 
పదేళ్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అండతో కేంద్రంలో అధికారం చెలాయించిన సోనియా గాంధీ చివరకు ఏపీ ప్రజల గొంతుకోశారని జీవీఎల్‌ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఏపీకి అండగా ఉంటామని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేవలం కేంద్ర సహాయంతోనే ఏ రాష్ట్రమూ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలే కారకులని, వారిని రెచ్చగొట్టడం, తప్పుదోవ పట్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేంద్రం అన్ని హామీలను నెరవేర్చిందని, అంతకంటే ఎక్కువే ఇచ్చిందని పవన్‌ కల్యాణ్ను ఉద్దేశించి జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు. అభివృద్ధి కోసం ‘వినూత్నంగా ఆలోచించండి.. పని చేయండి’ అని హితవు పలికారు.

డబ్బుపరంగా అంచనా వేయని చాలా ప్రాజెక్టులున్నాయి. 
* 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడిన తొలి 10 నెలలకు రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆ రోజు రాజ్యసభలో విభజన బిల్లు పాస్‌ అవుతున్న సమయంలో భాజపా చేసిన ఒత్తిడి మేరకు అప్పటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.4,979.50 కోట్లు ఇచ్చింది. ఇంక ఎంత చెల్లించాలన్న తుది లెక్కపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. 
* ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టే ప్రాజెక్టుల రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇవ్వడానికిగల అవకాశాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో సంప్రదిస్తోంది. అతి త్వరలో దీన్ని ప్రకటిస్తారు. 
* వివిధ పథకాల కింద రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 వరకు 4,193 కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా, ఆ తర్వాత కొత్తగా 3,720 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించారు. 
* విభజనకు ముందు 17.6% మేర ఉన్న విద్యుత్తు లోటు 2017 డిసెంబరు నాటికి 0.1%కి తగ్గింపు. పీక్‌ షార్టేజ్‌ 20.2% నుంచి 0కి తగ్గింపు. గత మూడున్నరేళ్లలో 25%కిపైగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెంపు. 2014 మార్చిలో 17,732 మెగావాట్లు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 2017 డిసెంబరు నాటికి 22,257 మెగావాట్లకు చేరింది. 
* 2009-14 మధ్యకాలంలో రూ.5,100 కోట్లున్న బడ్జెట్‌ 2014-19 మధ్యకాలంలో రూ.14,151 కోట్లకు పెరిగింది. ఇది 219% పెరుగుదల. 
* రూ.27,200కోట్ల పెట్టుబడులకు వీలైన రూ.6.8 లక్షల గృహాలమంజూరు. ఇందులోకేంద్రంవాటా రూ.10,200 కోట్లు.

భాజపా నివేదికలో ఏముందంటే..

* రాష్ట్ర రాజధానికి ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చారు. తగిన సమయంలో మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తారు. 
* వెనుకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఇప్పటివరకూ ఏ జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున యేటా రూ.350 కోట్లుగా మూడేళ్లలో రూ.1,050 కోట్లు చెల్లించారు.

పోలవరం ప్రాజెక్టు 
* పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.4,662.28 కోట్లు చెల్లించారు. 2014-15లో రూ.250 కోట్లు, 2015-16లో రూ.600 కోట్లు, 2016-17లో రూ.2,514.70 కోట్లు, 2017-18లో రూ.1,297.58 కోట్లను కేంద్ర జలవనరులశాఖ విడుదల చేసింది. 01.04.2014 నుంచి జరిగే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మిగిలిన ఖర్చునంతా 100% కేంద్రమే భరించాలని నిర్ణయించింది.

విభజన చట్టంలోని విద్యాసంస్థలకు జరిపిన కేటాయింపులు 
* ఐఐటీ: తిరుపతికి సమీపంలోని ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామంలో 589.55 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. 2015-16నుంచి తిరుపతిలోని తాత్కాలిక క్యాంపస్‌ సీవీఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకూ దీనికి రూ.90.93 కోట్లు కేంద్రం విడుదల చేసింది. 
* ఎన్‌ఐటీ: తాడేపల్లి గూడెంలోని శ్రీవాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో 2015-16 విద్యాసంవత్సరం నుంచి ఇందులో ఎన్‌ఐటీ తాత్కాలిక తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంపస్‌ నిర్మాణం కోసం తాడేపల్లి గూడెంలోని ఎయిర్‌ఫీల్డ్‌ ఖరారుచేశారు. రూ.460.50 కోట్లతో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆర్థిక స్థాయీసంఘం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ రూ.50 కోట్లు విడుదల చేశారు. 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ-కర్నూలు): దీనికి సంబంధించిన తరగతులు 2015-16 విద్యాసంవత్సరం నుంచే తమిళనాడు కాంచీపురంలోని ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ప్రారంభమ్యాయి. కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులో దీని శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి భూమి కేటాయించారు. ఇప్పటివరకూ దీనికి రూ.20.01 కోట్లు విడుదల చేశారు. 
* కేంద్ర విశ్వవిద్యాలయం: దీనికోసం అనంతపురం జిల్లాలో భూమి కేటాయించారు. తాజా బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చి (ఐఐఎస్‌ఈఆర్‌): ఇది ఇప్పటికే తిరుపతిలో ఏర్పాటైంది. పునే ఐఐఎస్‌ఈఆర్‌ దీనికి మార్గదర్శకత్వం చేస్తోంది. 2015 ఆగస్టు నుంచే తాత్కాలిక క్యాంపస్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం తిరుపతి సమీపంలోని ఏర్పేడు మండలంలోని శ్రీనివాసురం, పంగూర్‌, చిందేపల్లి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇప్పటికే రూ.64 కోట్లు విడుదలయ్యాయి. తిరుపతిలోని తాత్కాలిక క్యాంపస్‌లో దీని నిర్వహణకోసం రూ.137 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. 
* ఐఐఎం-విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో 2015-16 విద్యాసంవత్సరం నుంచే దీని తరగతులు ప్రారంభమయ్యాయి. దీని నిర్వహణకోసం మార్గదర్శిగా ఉన్న బెంగళూరు ఐఐఎంకు తొలి ఏడాది రూ.13 కోట్లు విడుదల చేశారు. తాత్కాలిక క్యాంపస్‌లో దీని నిర్వహణకు రూ.,79 కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. శాశ్వత క్యాంపస్‌కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ సమీపంలోని గంభీరం గ్రామంలో 334.09 ఎకరాలు కేటాయించింది. 
* వ్యవసాయ విశ్వవిద్యాలయం: గుంటూరు జిల్లాల లాంలో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఇప్పటివరకూ కేంద్రం దానికి రూ.135 కోట్లు విడుదల చేసింది. 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ): విశాఖ సమీపంలోని సబ్బవరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి 200 ఎకరాల భూమి కేటాయించింది. ఇప్పటికే శంకుస్థాపనకూడా పూర్తయింది. 2016-17 విద్యాసంవత్సరం నుంచి ఆంధ్రా యూనివర్శిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి.  మొత్తం రూ.655.46 కోట్ల మూలధనవ్యయంతో దీన్ని ఏర్పాటుచేయడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ.200 కోట్లతో సంచిత నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధిని చమురు కంపెనీలు సమకూరుస్తాయి. 
* ఎయిమ్స్‌: మంగళగిరిలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ రూ.54.51 కోట్లు విడుదల చేసింది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఈ ఎయిమ్స్‌కు సంబంధించిన ఎంబీబీఎస్‌ కోర్సు తాత్కాలిక తరగతులు నిర్వహించనున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి 2020 జూన్‌ మధ్యకాలంలో ప్రస్తుతం శంకుస్థాపన జరిగిన ఎయిమ్స్‌ ప్రాంగణంలో ఓపీడీ, డయాగ్నసిస్‌ సేవలు ప్రారంభించనున్నారు. 
* గిరిజన విశ్వవిద్యాలయం: విజయనగరం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్థలాన్ని స్థల ఎంపిక కమిటీ ఖరారుచేసింది. తాజా బడ్జెట్‌లో దీనికి రూ.10 కోట్లు కేటాయించారు. 
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం): రూ.70.87 కోట్లతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిరాష్ట్రాల ప్రకృతివైపరీత్య నిర్వహణ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అద్దె భవనంలో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 
* నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఎక్సైజ్‌ అండ్‌ నార్కోటిక్స్‌: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో 500 ఎకరాల్లో రూ.600 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. 5వేల మందికిపైగా ఐఆర్‌ఎస్‌ అధికారులు, 8వేల మందికిపైగా ఇతర అధికారులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఇలాంటి సంస్థ దక్షిణాదిలో ఇదే ప్రథమం. దేశంలో రెండోది. 
* ఈఎస్‌ఎస్‌ం-ఎన్‌ఐఓటీ, నెల్లూరు: నెల్లూరుకు సమీపంలోని వాకాడు మండలం తుపిలిపాలెం దగ్గర సముద్ర అభిముఖంగా సాగర పరిశోధన సౌకర్యాలకోసం శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో 150 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తారు. సముద్రంలో వివిధ పరికరాలు పరీక్షిస్తారు. కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇక్కడ వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శిస్తారు. 
* ఎన్‌సీఈఆర్‌టీ రీజియనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (ఆర్‌ఐఈ)- నెల్లూరు: రూ.500 కోట్లతో ఏర్పాటుచేసే ఈ సంస్థకు ఇప్పటికే పునాదిరాయిపడింది. ఇక్కడ టీచర్లకు ప్రీసర్వీస్‌, ఇన్‌సర్వీస్‌ శిక్షణతోపాటు, నాలుగేళ్ల బీఎస్సీ, బీఈడీ కోర్సులు, రెగ్యులర్‌ బీఈడీ కోర్సులు, విద్యారంగంలో డాక్టోరల్‌ కోర్సులు నిర్వహిస్తారు. దేశంలో 6వ సంస్థ ఇది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఇక్కడ సేవలు లభిస్తాయి. 
* ఎంఎస్‌ఎంఈ- టెక్నాలజీ సెంటర్‌: రూ.100 కోట్లతో ఏర్పాటుచేసే ఈ సంస్థకు పూడి గ్రామంలో 20 ఎకరాల్లో ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. యేటా 5వేలమందికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. దేశంలోని 15 సెంటర్లలో ఇది ఒకటి. 
* నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌కు నెల్లూరుజిల్లా  చింతలదేవిలో శంకుస్థాపన జరిగింది. రూ.25 కోట్లతో 2వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. దేశీయ పశు బీజాల సంరక్షణ, అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. ఇది దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ సేవలందిస్తుంది. 
* సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: సూరంపల్లి గ్రామంలో ఇప్పటికే దీనికి శంకుస్థాపన జరిగింది. రూ.50.73 కోట్లతో 12 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు, ప్రత్యేక ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. విజయవాడ కనూరులోని న్యూఆటోనగర్‌లోని తాత్కాలిక క్యాంపస్‌లో ఇప్పటికే కార్యకలాపాలు మొదలయ్యాయి. 
* స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, విజయవాడ: ఈ సంస్థ 2008లో ఏర్పాటైనప్పటికీ లయోలాకాలేజీ సమీపంలో కొత్త క్యాంపస్‌ ఎన్‌డీయే ప్రభుత్వ హయాంలోనే జరిగింది. 
* నెల్లూరులో రూ.20 కోట్లతో రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ ఏర్పాటు. 
* విశాఖపట్నం తుర్లువాడ సమీపంలో 20 ఎకరాల్లో దివ్యాంగులకోసం క్రీడా స్టేడియం ఏర్పాటుకు ఆమోదం. 
* విజయవాడలో ఏపీకి ప్రత్యేకంగా దూరదర్శన్‌, ఏఐఆర్‌ కేంద్రాల ఏర్పాటు.విశాఖలో ఏఐఆర్‌కు సంబంధించిన రీజినల్‌ న్యూస్‌యూనిట్‌ ఏర్పాటు ప్రారంభం. 
* విజయవాడలో కొత్త ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రం. ఇక్కడే పాస్‌పోర్టుల ప్రింటింగ్‌, లామినేషన్‌, పంపిణీ. భీమవరంలో కొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు. 
* 950 కొత్త జన ఔషధీ కేంద్రాల మంజూరు.

10ap-main3c.jpg

మౌలిక వసతుల ప్రాజెక్టుల ఏర్పాటు 
* వివిధ పథకాల కింద రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్‌లో 2014 వరకు 4193 కిలోమీటర్ల జాతీయరహదారులుండగా, ఆ తర్వాత కొత్తగా 3,720 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించారు. 
* ప్రస్తుతం రూ.14,506 కోట్లతో 1,637 కిలోమీటర్ల పొడవున 30 పెద్దతరహా పనులు జరుగుతున్నాయి. 
* ఎన్‌హెచ్‌-16లో చిలకలూరిపేట్‌-నెల్లూరు మధ్య రూ.1,535 కోట్లతో 184 కిలోమీటర్ల ఆరువరుసల రహదారి పనులు సాగుతున్నాయి. 
* ఎన్‌హెచ్‌-40లో కడప-కర్నూలు మధ్య రూ.1,585 కోట్లతో 189 కిలోమీటర్ల నాలుగువరుసల నిర్మాణం. 
* ఎన్‌హెచ్‌-63లో కర్ణాటకసరిహద్దు నుంచి గుత్తివరకూ రూ.995 కోట్లతో నాలుగువరుసల నిర్మాణం. 
* ఎన్‌హెచ్‌-65లో విజయవాడ మచిలీపట్నం సెక్షన్‌లో రూ.741 కోట్లతో 65 కిలోమీటర్ల నిర్మాణం. 
* భవానిపురం నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 6 వరుసల పైవంతెన పనులు రూ.333 కోట్లతో జరుగుతున్నాయి. 
* అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే-557 కిమీ: రాజధాని అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడపలను అనుసంధానం చేసే 557 కిలోమీటర్ల ఆరువరుసల రహదారికి రూ.25వేల కోట్లు ఖర్చుచేయబోతున్నారు. ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారుచేస్తోంది.

భూసేకరణ కార్యక్రమం జరుగుతోంది. 
* అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు-180 కిమీ: రూ.20వేల కోట్ల విలువైన రాజధాని భాహ్యవలయ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ దీని డీపీఆర్‌ తయారుచేస్తోంది. 
* సేతు భారతం ప్రాజెక్టు కింద రూ.2,500 కోట్లతో 31 ఆర్‌ఓబీలు నిర్మిస్తోంది. ఇప్పటికే 1 ఆర్‌ఓబీ నిర్మాణం మొదలైంది. 11 ఆర్‌ఓబీలు టెండర్‌స్థాయిలో ఉన్నాయి. 
* మెట్రోప్రాజెక్టులు: విశాఖపట్నం: ప్రస్తుతం దీని డీపీఆర్‌ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరారు. విజయవాడ మెట్రోకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.

పెట్రోలియం, సహజవాయువుల రంగం 
* హైడ్రోకార్బన్‌ నిల్వలు అత్యధికంగా ఉన్న ఏపీలో చమురు సంస్థలు రూ.1.40 లక్షలకోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. 2021-22 ఆర్థికసంవత్సరానికల్లా ఇవి కార్యరూపం దాలుస్తాయి. 
* కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ కలిసి రూ.30వేల కోట్లు పెట్టుబడులు పెడతాయి. 2017 భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించిన ఎంఓయూపై ఇప్పటికే సంతకాలు చేశాయి. 
* కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఆఫ్‌షోర్‌అసెట్స్‌పై ఓఎన్‌జీసీ రూ.68వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌భూభాగంలోని బ్లాక్స్‌పై మరో రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. వైజాగ్‌ భాగస్వామ్య సదస్సులో ఇప్పటికే దీనిపై ఎంఓయూ కుదిరింది. 
* రూ.20,928 కోట్లతో  15 మిలియన్‌ టన్నుల గరిష్ఠ సామర్థ్యంతో హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ ఆధునీకరణ. 
* వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌: ఈ కారిడార్‌కు సంబంధించిన ప్రతిపాదిత అభివృద్ధి ప్రణాళికను ఏడీబీ బృందం ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. ఈ కారిడార్‌ నిర్మాణంకోసం రూ.4,211 కోట్లు మంజూరుచేశారు. ఏడీబీ ఇప్పటికే తొలి విడత కింద రూ.2500 కోట్లు విడుదల చేసింది.

విమానాశ్రయాలు 
* భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయ అంగీకరం తెలిపింది. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే కొత్త టెర్మినల్‌ భవనం పూర్తయింది. రన్‌వే విస్తరణ కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలస్థాయికి అభివృద్ధి చేసిన తిరుపతి విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రధాని ప్రారంభించారు. 
* రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నైట్‌ల్యాండింగ్‌, రన్‌వే విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. 
* కడప ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభం అయింది. ఉడాన్‌ పథకం కింద ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి. 
* స్టీల్‌ప్లాంట్‌: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను 11.5 నుంచి 12 ఎంపీటీఏకి విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. దీనివల్ల రూ.38,500 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 
* దుగరాజపట్నం పోర్టు: పీపీపీ విధానంలో ఇక్కడ పోర్టు ఏర్పాటుచేయడానికి కేబినెట్‌ కమిటీ ఆన్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ ఆమోదముద్ర వేసింది. సాంకేతిక కారణాలరీత్యా ఇక్కడ పోర్టు ఏర్పాటు కావడం సాధ్యంకాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చూపించే ప్రత్యామ్నాయ కేంద్రంలో పోర్టు ఏర్పాటుచేయడానికి అవసరమైన మద్దతు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. 
* కడప స్టీల్‌ప్లాంట్‌ సెయిల్‌ ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చింది. నివేదికలోని అంశాల పరిశీలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌డీఎంసీ, మెకాన్‌, ఎంఎస్‌టీసీలకు చెందిన సభ్యులతో టాస్క్‌ఫోర్సు ఏర్పాటైంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతుంది.

రక్షణరంగానికి చెందిన సంస్థలు 
* భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, నిమ్మకూరు: రూ.500 కోట్లతో 50 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తయింది. 
* అనంతపురం జిల్లా గోరంట్లమండలం పాలసముద్రం గ్రామంలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ రూ.500 కోట్లతో 900 ఎకరాల్లో డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుచేస్తోంది. దేశంలోనే అతిపెద్ద మిసైల్‌సిస్టమ్స్‌ ఇంటిగ్రేషన్‌ సౌకర్యం ఇక్కడ ఏర్పాటవుతుంది.

సూత్రప్రాయ ఆమోదం పొందిన రక్షణ రంగ ప్రాజెక్టులు 
* బొబ్బిలి సమీపంలోని బాడంగిలో రూ.3,266.50 కోట్లతో నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదన. భూసేకరణ ప్రస్తుతం జరుగుతోంది. 
* నాగాయలంక, గొల్లల మోద గ్రామాల సమీపంలో రూ.వెయ్యికోట్లతో డీఆర్‌డీఓ పరీక్ష కేంద్రం. 
* కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రూ.500 కోట్లతో 2,900 ఎకరాల్లో నేషనల్‌ ఓపెన్‌ ఎయిర్‌ రేంజి ఎవల్యూషన్‌ సెంటర్‌. 
* విశాఖ జిల్లా రాంబిల్లి వద్ద నావల్‌ ఆల్టర్నేటివ్‌ ఆపరేషషనల్‌ బేస్‌.

నౌకారంగం 
* కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 100 ఎకరాల్లో రూ.450 కోట్లతో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌హబ్‌ ఏర్పాటు. ఇలాంటి పార్కులు కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లోనూ ఏర్పాటుకు అవకాశం. 
* చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో రూ.3వేల కోట్లతో 2 కోస్టల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ ఏర్పాటు. 
* నేషనల్‌ వాటర్‌వే నెం.4: రూ.7,015 కోట్లతో 315 కిలోమీటర్ల మేర బకింగ్‌హామ్‌ కెనాల్‌ పునరుద్ధర జరుగుతుంది. ఇప్పటికే ముక్త్యాల-విజయవాడ మధ్య 82 కిలోమీటర్ల పొడవైన తొలిదశకు శంకుస్థాన జరిగింది. 
* విశాఖ మెడ్‌ టెక్‌ పార్క్‌లో రూ.20వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా.

విద్యుత్తు రంగం 
* విభజనకు ముందు 17.6% మేర ఉన్న విద్యుత్తు లోటు 2017 డిసెంబర్‌ నాటికి 0.1%కి తగ్గింపు. పీక్‌షార్టేజ్‌ 20.2% నుంచి 0కి తగ్గింపు. గత మూడున్నరేళ్లలో 25%కిపైగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంపెంపు. 2014 మార్చిలో 17,732 మెగావాట్లు ఉన్న ఉత్పత్తిసామర్థ్యం 2017 డిసెంబర్‌ నాటికి 22,257 మెగావాట్లకు చేరింది. 
* దక్షిణాదిలో ఆల్టర్నేట్‌ ట్రాన్స్‌ఫర్‌ కెపాసిటీ రెట్టింపై 7,510 మెగావాట్లకు చేరింది. విద్యుత్తు ధరలు రెండంకెల నుంచి యూనిట్‌కు రూ.3కి తగ్గాయి. 
* సౌభాగ్యయోజన ప్రారంభమయ్యే నాటికి 27,041 ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు లేవు. అందులో 25,756 ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు. 
* పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు మౌలికవసతుల అభివృద్ధికి 13 సర్కిళ్లలోని 90 పట్టణాలకు రూ.690 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు. దీనికి రూ.33 కోట్ల ఐటీ ప్రాజెక్టులు అదనం. 
* డీడీయూజీజేవై కింద రూ.941 కోట్లు మంజూరు. 
* 2.1కోట్లకుపైగా ఎల్‌ఈడీ దీపాల పంపిణీ. దీనివల్ల వినియోగదారులకు రూ.1,132 కోట్ల విలువైన విద్యుత్తు ఆదా. పీక్‌ డిమాండ్‌ 556 మెగావాట్లమేర తగ్గుదల. 
* 7.3 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు. హుద్‌హుద్‌ తర్వాత విశాఖలో ఆరువారాల్లో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు. 
* ఉదయ్‌ స్కీం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి టర్నరౌండ్‌పీరియడ్‌లో రూ.4,440 కోట్లమేర ఆదా. టర్నరౌండ్‌పీరియడ్‌ తర్వాత రూ.6,200 కోట్లమేర ఆదా అయ్యే అవకాశం. 
* 2015-16లో రూ.3,899 కోట్లమేర ఉన్న విద్యుత్తు నష్టాలు 2016-17 నాటికి రూ.2,331కోట్లకు తగ్గాయి. 
* మూడున్నరేళ్లలోనే సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యం అయిదురెట్లు పెరిగింది. 2014లో 1,295 మెగావాట్లు ఉన్న ఉత్పత్తి సామర్థ్యం 2017 డిసెంబర్‌ నాటికి 6,598 మెగావాట్లకు పెరిగింది. 
* 4వేల మెగావాట్ల సామర్థ్యంగల నాలుగు సోలార్‌పార్కులు రాష్ట్రానికి మంజూరయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంప్రదాయేతర విద్యుత్తు సరఫరాకు రూ.1,290 కోట్ల వ్యయంతో 480 సీకేఎం హరిత ఇంధన కారిడార్‌ ఏర్పాటు.

బొగ్గు రంగం 
* ఒడిశాలోని సరపాల్‌-నౌపాడ బొగ్గు బ్లాక్‌ను శ్రీకాకుళంలోని 2,400 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తుకేంద్రం కోసం ఏపీజెన్‌కోకు కేటాయింపు. 
* మధ్యప్రదేశ్‌లోని సులియారీ, ఛత్తీస్‌గడ్‌లోని మదన్‌పూర్‌ సౌత్‌ల్లోని రెండు బొగ్గు బ్లాకులు ఏపీఎండీసీ కేటాయింపు.

రైల్వే 

* రూ.47,989 కోట్ల విలువైన 5,016 కిలోమీటర్ల మేర 32 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 
* కొత్త రైల్వేలైన్లు: 142 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయింది. మార్చి నాటికి మరో 45.5 కిలోమీటర్ల నిర్మాణం పూర్తవుతుంది. 
* డబ్లింగ్‌ అండ్‌ ట్రిపులింగ్‌: 11.5 కిలోమీటర్లు పూర్తి, 21.5 కిలోమీటర్లు మార్చి నాటికి పూర్తి. 
* విద్యుదీకరణ: 489 కిలోమీటర్లు పూర్తి. 161 కిలోమీటర్లు మార్చి నాటికి పూర్తి.

ఏపీ రైల్వే ప్రాజెక్టుల వేగవంత నిర్వహణ 
* కడప-బంగారుపేట లైన్‌: రూ.2,030 కోట్లతో చేపట్టిన 225 కిలోమీటర్ల మార్గం పాక్షింగా పూర్తయింది. 
* రూ.2,289 కోట్లతో 309 కిలోమీటర్ల నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తారు. 
* రూ.1,165 కోట్లతో 113 కిలోమీటర్ల ఓబుళవారిపల్లి-కృష్ణపట్నం లైన్‌ పూర్తిచేస్తారు. 
* రూ.967 కోట్లతో చేపట్టిన నంద్యాల-ఎర్రగుంట్ల పూర్తయింది. దీనివల్ల కొత్త రాజధాని ప్రాంతంతో రాయలసీమకు అనుసంధానం ఏర్పడింది.

డబ్లింగ్‌ రైల్వే లైన్స్‌ 
* గుంతకల్లు-రాయచూరు మధ్య రూ.345 కోట్లతో 81 కిలోమీటర్ల డబ్లింగ్‌ పూర్తి. 
* పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవి: రూ.499 కోట్లతో 30 కిలోమీటర్ల కాజీపేట-విజయవాడ బైపాస్‌ 
* రూ.323 కోట్లతో 41 కిలోమీటర్ల కల్లూరు-గుంతకల్లు లైన్‌ 
* రూ.3,631 కోట్లతో 443 కిలోమీటర్ల గుంటూరు-గుంతకల్లు లైన్‌ 
* రూ.636 కోట్ల రూ.180 కిలోమీటర్ల గుత్తి-ధర్మవరం-యలహంక లైన్‌ 
* రూ.197 కోట్ల 25 కిలోమీటర్ల గుంటూరు-తెనాలి లైన్‌ 
* రూ.237 కోట్ల రేణిగుంట-గుత్తి-వాడి బైపాస్‌ 
* రూ.1,429 కోట్ల 221 కిలోమీటర్ల విజయవాడ-గుడివాడ, మచిలీపట్నం-భీమవరం, నర్సాపూర్‌-నిడదవోలు లైన్‌ 
* రూ.1,857 కోట్ల 220 కిలోమీటర్ల కాజిపేట-విజయవాడ ట్రిప్లుంగ్‌. 
* పెనుకొండ నుంచి ధర్మవరం (ధర్మవరం మినహాయించి) రూ.295 కోట్ల లైన్‌ తాజా బడ్జెట్‌లో చేర్పు.

ప్రస్తుతం జరుగుతున్న రైల్వే పనులు 
కొత్త లైన్లు 
* కోటిపల్లి-నర్సాపురం-58 కిమీ- రూ.1,045 కోట్లు 
* గూడూరు-దుర్గరాజపట్నం-42 కిమీ- రూ.761 కోట్లు 
* భద్రాచలం-కొవ్వూరు-151 కిమీ- రూ.823 కోట్లు 
* కంభం-ప్రొద్దుటూరు- 142 కిమీ- రూ.829 కోట్లు 
ట్రిపుల్‌ లైన్లు 
* దువ్వాడ-విజయవాడ- 335 కిమీ- రూ.3,873 కోట్లు 
* విజయవాడ-గూడూరు-288 కిమీ- రూ.3,246 కోట్లు

విద్యుదీకరణ 
* రూ.753 కోట్లతో మూడులైన్లు పూర్తి 
* రూ.432 కోట్లతో ఒకలైన్‌ పాక్షికంగా పూర్తి 
* రూ.390 కోట్లతో మూడు లైన్లు పూర్తిచేయాలని లక్ష్యం.

ఇతర రైల్వే ప్రాజెక్టులు 
* కోచ్‌ మిడ్‌లైఫ్‌ రిహాబిలిటేషన్‌ ఫ్యాక్టరీ కర్నూలు- రూ.283 కోట్లు, 2019-20కల్లా పూర్తిచేయాలని లక్ష్యం. 
* తిరుపతి రైల్వే స్టేషన్‌ దక్షిణంవైపు రూ.77 కోట్లతో అభివృద్ధి. 
కొత్త రైళ్లు 
* 2014-17 మధ్యకాలంలో 26 కొత్త రైళ్లు ప్రారంభం. 
* భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో రూ.450 కోట్లతో కాకినాడలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌పార్క్‌.

పరిశ్రమలు, వాణిజ్యం 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌- కాకినాడ సెజ్‌లో 25 ఎకరాల్లో ఏర్పాటు 
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ట్రేడ్‌- కాకినాడ సెజ్‌లో మరో 25 ఎకరాల్లో ఏర్పాటు. 
* కేపీఐఎల్‌సీ,లెదర్‌ కాంప్లెక్స్‌ నెల్లూరు రూ.277.93 కోట్లు. 360 ఎకరాల్లో మెగా లెదర్‌ క్లస్టర్‌ ఏర్పాటు. 
* గుంటూరు జిల్లాలో రూ.20 కోట్లతో 120 ఎకరాల్లో స్పైస్‌పార్క్‌ ఏర్పాటు.

కమ్యూనికేషన్‌, ఐటీ విభాగం 
* విశాఖలో 13 ఎకరాల్లో సమీర్‌ ఏర్పాటు. ఆర్‌అండ్‌డీకి కేంద్రం రూ.80 కోట్లు విడుదల. 
* వైజాగ్‌ ఎస్‌టీపీఐ, వుడా ఐటీ టవర్‌: లక్ష చదరపు అడుగుల నిర్మాణం. 
* చిత్తూరు జిల్లాలో 501.40 ఎకరాల్లో రూ.339.80 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ఏర్పాటు.

పట్టణాభివృద్ధిశాఖ 
* రూ.27,200 కోట్ల పెట్టుబడులకు వీలైన రూ.6.8 లక్షల గృహాల మంజూరు. ఇందులో కేంద్రం వాటా రూ.10,200 కోట్లు. 
* రూ.7,500 కోట్ల హడ్కో రుణం మంజూరు. 
* నాలుగు స్మార్ట్‌సిటీలకు రూ.1,500 కోట్లు 
* నెల్లూరు భూగర్భ డ్రైనేజీ, తాగునీటికోసం రూ.వెయ్యి కోట్లు 
* అమృత్‌ పథకం కింద 33 నగరాల ఎంపిక. 
* హృదయ్‌ కింద పాత అమరావతి ఎంపిక 
* ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద మూడేళ్లలో 1,93,423 ఇళ్ల కేటాయింపు. దీనికింద రూ.35,985 కోట్ల కేటాయింపు. ఇప్పటివరకూ రూ.7,092.26 కోట్ల విడుదల.

వైద్యరంగం 
* రూ.240 కోట్లతో విజయవాడ, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలల ఆధునీకరణ. 
* రూ.400 కోట్లతో విశాఖలో ఈఎస్‌ఐసీ 300 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి. 
* కృష్ణాజిల్లాలో యోగా, నేచురోపతి కేంద్ర పరిశోధన సంస్థ ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం.

పర్యాటకం 
* రూ.69.83 కోట్లతో కోనసీమలో కాకినాడ హోప్‌ ఐల్యాండ్‌ అభివృద్ధి 
* రూ.61 కోట్లతో నెల్లూరు కోస్టల్‌ టూరిజం సర్క్యూట్‌ అభివృద్ధి.

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

addagologa  karchu petti..lekkalu cheppakunda, cheppamantey mosam chesarani blame games aadutunnaru babu garu

Link to comment
Share on other sites

కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి, ఇతర ప్రముఖులు ప్రధాన మంత్రి మోదీతో సమావేశమయ్యారు. బడ్జెట్ గురుంచి చర్చ జరిగాక, బడ్జెట్ ప్రతులు పరిశీలించిన మోదీ
 
" ఈసారి బడ్జెట్ బాగుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇక సవరణలు ఏం లేవు. ఇదే ఫైనల్ చేయండి జైట్లీ గారు" అని అమిత్ షా వైపు చూసి
 
"మీకు కూడా సమ్మతమే కదా షా జి? " అని అడిగారు.
 
హా, మనం అనుకున్న బడ్జెట్ ఇదే కదా? కానీ... అని అమిత్ షా నసుగుతుంటే ,
 
చెప్పండి ఏదైనా సమస్య ఉంటే అడిగారు మోదీ.
 
పక్కనే ఉన్న ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కల్పించుకుని ,
 
"సార్, అంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం కేటాయించలేదు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా,రైల్వేజోన్...... ఇలా దేని మీదా బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనిమీద వ్యతిరేకత వస్తుందేమో అని "..... అని జైట్లీ వైపు చూడగా
 
నాదేముంది అంతా మీ దయ అన్నట్టు మోదీ వైపు చూసాడు జైట్లీ.
 
మోదీ చిద్విలాసంగా నవ్వి" మనం ఆంధ్రాకి బడ్జెట్ కేటాయించడం ఏంది? మనమే ఆంధ్రాని అప్పు అడగాలనుకుంటున్నాం " అని తన పీఏ వైపు చూసి
 
"అవి తీసుకురా" అన్నాడు. పీఏ లోపలికెళ్లగా , మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలతో చూస్తున్నారు. కొన్ని క్షణాల్లో పీఏ ఒక పెద్ద పేపర్ల కట్ట తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందరూ వాటి వైపు చూడగా అవి " ఈనాడు, ఆంధ్ర జ్యోతి" పేపర్లు.
 
"తీసి చదువు" అన్నారు మోదీ. పీఏ ఒక్కో పేపర్ తీసి చదవసాగాడు.
 
వైజాగ్ సదస్సులో పది లక్షల కోట్ల పెట్టుబడులు .
 
త్వరలో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న చైనా.
 
సోమాలియా దేశం నుండి పెట్టుబడుల వరద, సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా.
 
దవోస్ నుండి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తేనున్న చంద్రబాబు.
 
అమెరికాలో లోకేష్ పెట్టుబడుల వేట, ఐదు లక్షల కోట్లు తరలి రానున్నట్టు వినికిడి.
 
అంగారక గ్రహం నుండి .....అని పీఏ చెప్పబోతూంటే "ఆపమన్నట్టు" చెయ్యి ఎత్తాడు మోదీ.
 
మిగతా వారంతా డిస్కవరీ ఛానెల్లో కప్పల్లాగా నోరు తెరచి అలానే ఉన్నారు.
 
ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు అయ్యాయి? అడిగాడు మోదీ.
 
కాస్త ఆలోచించి "యాభై లక్షల కోట్లు సార్ " చెప్పాడు జైట్లీ.
 
మన బడ్జెట్ ఎంత?
 
ఇరవై ఐదు లక్షల కోట్లు
 
అంటే ఆంధ్రా పెట్టుబడుల్లో సగం మన బడ్జెట్ అన్నమాట. ఇక మనం ఏం ఇవ్వగలం వాళ్లకి? ఆ పెట్టుబడుల్లో వాళ్ళు అంతర్జాతీయ రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు, ఇక ప్రత్యేక హోదా అంటారా.... అది ఏ వనరులు లేని బీద రాష్ట్రానికి. లక్షల కోట్ల పెట్టుబడులు, కోటి ఉద్యోగాలు, అరవై ఐటి కంపెనీలు,అద్బుతమైన రాజధాని..... ఇన్ని ఉన్న రాష్ట్రానికి మనమేం చేయగలం? ఏం ఇవ్వగలం? చెప్పండి అన్నాడు మోదీ.
 
ఏం చేయలేము సార్" ముక్తకంఠంతో అన్నారు అందరూ.
 
సో, ఇదే ఫైనల్ చేయండి" అని పైకి లేచాడు మోదీ. 
"అన్నట్టు షా జి, నాయుడు గారికి ఫోన్ చేసి పది లక్షల కోట్లు పంపమని చెప్పండి, అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి " అని వెళ్లిపోయారు.
 
అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మన ఆంధ్రా నాయకుల్లాగా.
 
Source: messenger
Link to comment
Share on other sites

Orey sigguleni bjp yedavallara parliament doors close chesi endhuku democracy ni champesaru

Congress n bjp cheppali neethi nijayithi gurinchi

Anni political parties with the same avineethi 

Link to comment
Share on other sites

5 hours ago, futureofandhra said:

Orey sigguleni bjp yedavallara parliament doors close chesi endhuku democracy ni champesaru

Congress n bjp cheppali neethi nijayithi gurinchi

Anni political parties with the same avineethi 

1.Kaka topic yendi nuv yem matladuthunnav @~`

2. So avineethi okay na ?  Aithe Jaggadu kuda correst ye ga...@~`

Link to comment
Share on other sites

1 hour ago, Teluguvadu8888 said:

1.Kaka topic yendi nuv yem matladuthunnav @~`

2. So avineethi okay na ?  Aithe Jaggadu kuda correst ye ga...@~`

Anthega Mari

Show me one leader who was charged by court for scams

India lo jaragavu 

Link to comment
Share on other sites

16 minutes ago, Vaampire said:

Hmmmmm.

Center emo ekkuva funds icham antunaru. State emo ledhu Ani. Evaru correct?

Malli idhariki pothu.

Isthey adigavalla andaru pichi vallaa 

It's not tdp funds or bjp funds

AP funds 

It's a diversion again 

Link to comment
Share on other sites

20 minutes ago, futureofandhra said:

Isthey adigavalla andaru pichi vallaa 

It's not tdp funds or bjp funds

AP funds 

It's a diversion again 

icham ani abhadam chepthunna enduku pothu lo unnaru inka???

idhi emaina wife & husband godava naaa. needhey thappu antey needhey thappu ani blame game cheyyadaniki. 

Link to comment
Share on other sites

1 hour ago, futureofandhra said:

Isthey adigavalla andaru pichi vallaa 

It's not tdp funds or bjp funds

AP funds 

It's a diversion again 

S.True...2019 lo kuda polavaram nene kadthunna ani CBN chepthe nammodhu Marie..OK na?? 

Link to comment
Share on other sites

1 hour ago, Vaampire said:

Hmmmmm.

Center emo ekkuva funds icham antunaru. State emo ledhu Ani. Evaru correct?

Malli idhariki pothu.

Above chart lo 3.5 lakhs worth projects are sanctioned .Thats a fact .Dantlo 3 lakh crores are  for petroleum corridor ,road highways and railway projects which may be completed by 2025.Money doesnt come to AP govt they are central projects .Vibajana hamilu pending lo vunnayi universities etc .People of andhra want free money without work .And politicians rechagodutunnaru votlakosam anthe ....

People want central govt to give cash  in hand .Adi possible kadu .Hyd is big loss but maname work chesi build chesukovali economy .Depending on central govt to fulfull our needs would be good but not luxuries.

Link to comment
Share on other sites

2 hours ago, soumyare said:

calm ga post chadivi vellipodamu anukuna .. statement lu ichetapudu vollu dagira pettukuni ivvali especially sweeping generalizations chesey tappudu .. oka project sanction ayithey dabbulu vachinatta ? there are provisions in law (reorganization act) .. for example setting up institutions how much money is given till now ? what is ETA for finishing those ? adi adugutondi janalu .. Next railway zone in how many years will that be sanctioned ? Definite answer is required not we will give soon .. Next revenue deficit .. if finance minister says we dont know how to calculate deficit I have my doubts on his qualifications .. next what about metro rail for vizag and vja .. if they are viable say they are not viable but dont keep saying we will give .. ivvi straight questions .. India lo prati state tax ki contribute chestunayi and its central government responsibility to develop roads and rails .. central government may be doing a good job but answer the questions dont keep saying we are doing other things .. and when you approve metro project for Bangalore what is the basis ? if the answer is Bangalore is contributing more taxes then every southern state will say we contribute more so give us more funds and northern states should not get any or divide as they pay taxes anatru adi possible kadu ga .. so when people ask a question a project answer in straight forward manner and not like we are doing other things ..

if you are working in IT and you ask for promotion and if your manager says we will do it but if he does not give you timeline for 4 years will you be ok ? So next time before judging people vollu dagira pettukoni matladu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...