Jump to content

ఇదిగో సాయం లెక్క


TampaChinnodu

Recommended Posts

ఎవరో ఒకరు మాత్రం అబద్ధం ఆడుతున్నారు 
పవన్‌ 
11break114a.jpg

హైదరాబాద్‌: తెదేపా, భాజపా కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరుగుతుందని భావించినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. అంతకుముందు జరిగిన అవకతవకలేమైనా ఉంటే అటు ప్రధానిగా నరేంద్రమోదీ ఇటు అనుభవమున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించి 2014లో మద్దతు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. చాలా సార్లు కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పటికీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి ప్రతీ చిన్నదానికి గొడవ చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకని కొంత సంయమనం పాటించానని వెల్లడించారు.

ప్రజల మాదిరిగానే తనకూ కొంత గందరగోళం ఉందని.. ప్రత్యేక హోదా, హామీలు నెరవేర్చకపోవడం వల్ల అందిరిలాగే తనకూ అసంతృప్తి ఉందని తెలిపారు. అందరికంటే తాను బాధ్యతగా భావిస్తున్నానని.. తనను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పలేదని తనకు స్వతహాగా అనిపించి ప్రజలకోసం వచ్చానన్నారు. కానీ, వచ్చాక జరుగుతున్న పరిస్థితులను చూసి రెండు మూడు సభలను పెట్టానని చాలా విషయాలపై ప్రశ్నించానని, తనకు స్పష్టమైన సమాచారం రాలేదన్నారు. పోలవరంపై శ్వేతపత్రం కోసం ప్రశ్నిస్తే వెబ్‌సైట్‌లో పెట్టామని చూసుకోవాలన్నారని అయితే, అదెక్కడా కనపడలేదని చెప్పారు. గతంలో తాను ఏవైతే మాట్లాడానో.. ఈ మధ్య కాలంలో వాటిపైనే రాష్ట్రప్రభుత్వం గొడవలు చేయడం చూసి ఇప్పటిదాకా కాలయాపన ఎందుకు చేశారా? అని బాధేసిందన్నారు. రెండు పార్టీలు న్యాయం చేయలేని పక్షంలో తనవంతు బాధ్యతగా వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ఎక్కువే ఇచ్చామని కేంద్రంలోని భాజపా చెబుతోందని.. మరోవైపు రాష్ట్రానికి రావాల్సినవేవి సక్రమంగా రావడంలేదని అంతా అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రం చెబుతోందన్నారు.

11break114b.jpg

ఈ పరిస్థితుల్లో తనవంతు బాధ్యతగా ఎదో ఒకటి చేయాలనుకున్నప్పుడు.. రాజకీయాలకు సంబంధం లేకుండా అస్త్రసన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు గుర్తుకొచ్చారన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీతో విభేదించి రాజకీయాల నుంచి వైదొలిగారని.. ఆయనైతే సమస్యను తటస్థంగా చూడగలుగుతారని.. ప్రజల సమస్యలను అర్థవంతంగా చెప్పగలరని భావించానన్నారు. అందుకే ఉండవల్లి, జేపీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కేంద్రం ఎంతైతే నిధులు ఇచ్చిందంటున్నారో దాని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు భాజపా సైతం కేంద్రం ఇచ్చిందని చెబుతుందన్న వివరాలు ఇవ్వాలని చెప్పారు. వాటిని కమిటీకీ అందజేస్తానని చెప్పారు. కచ్చితంగా ఇద్దరిలో ఒకరు మాత్రం అబద్ధం ఆడుతున్నారని చెప్పారు. అదేవరో తేల్చాలని అన్నారు. వివరాలన్నీ తీసుకుని కమిటీ తేలుస్తుందని చెప్పారు. తాము అడుగుతున్న వివరాలను అందజేయాలని ప్రెస్‌మీట్‌ ద్వారా కోరుతున్నానన్నారు.

 
Link to comment
Share on other sites

Quote

గతంలో తాను ఏవైతే మాట్లాడానో.. ఈ మధ్య కాలంలో వాటిపైనే రాష్ట్రప్రభుత్వం గొడవలు చేయడం చూసి ఇప్పటిదాకా కాలయాపన ఎందుకు చేశారా? అని బాధేసిందన్నారు.

He is correct about this. In the past PK multiple times already asked same questions Galla asking now. But Yellow Bhajana batch only wants to praise Galla like hero. 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

He is correct about this. In the past PK multiple times already asked same questions Galla asking now. But Yellow Bhajana batch only wants to praise Galla like hero. 

Kaka lite ivanni...Last ki yelago poyi CBN sanka yekkuthadu at any cost.@3$%...Nakaithe CBN ni save chese drama la vundi idantha...Manaki teliyanda kaka CBN ki yeppudu avasaramate appudu vasthadu

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

He is correct about this. In the past PK multiple times already asked same questions Galla asking now. But Yellow Bhajana batch only wants to praise Galla like hero. 

Oh boy. Are u taking pk serious.   Raithula kastalu telusukundam ani adhikarapaksha minister intiki vellina telivi vaadidi. He is just working according to the script given by cheebbbnnn

 

Link to comment
Share on other sites

7 minutes ago, Vaampire said:

Oh boy. Are u taking pk serious.   Raithula kastalu telusukundam ani adhikarapaksha minister intiki vellina telivi vaadidi. He is just working according to the script given by cheebbbnnn

 

I am not taking PK serious. He will surely support TDP at end. I am just asking yellow batch why they ignored his comments before and praising galla now for same exact scenario. 

Link to comment
Share on other sites

39 minutes ago, Teluguvadu8888 said:

Kaka lite ivanni...Last ki yelago poyi CBN sanka yekkuthadu at any cost.@3$%...Nakaithe CBN ni save chese drama la vundi idantha...Manaki teliyanda kaka CBN ki yeppudu avasaramate appudu vasthadu

Yes. Last ki jagan donga. Cbn is nippu.  So have to support nippu CBN antaadu anthey.

Link to comment
Share on other sites

53 minutes ago, TampaChinnodu said:

Yes. Last ki jagan donga. Cbn is nippu.  So have to support nippu CBN antaadu anthey.

200%..Jaggadu yekkada strong vundo akkada poti chesthadu ani talk braces_1

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Yes. Last ki jagan donga. Cbn is nippu.  So have to support nippu CBN antaadu anthey.

Ee video chudu kaka..Asalu Jagan anna name vinataniki kuda isthtapadatam ledu PK god..Gov ni yedaina ante country gurinchi matladuthunnadu. TDP gov meeda eega kuda vaalanivvatledu braces_1

 

Link to comment
Share on other sites

6 hours ago, Teluguvadu8888 said:

S.True...2019 lo kuda polavaram nene kadthunna ani CBN chepthe nammodhu Marie..OK na?? 

Ikkada cbn avineethi chesada Leda aney topic valla use ledu

Every one know avineethi jarigindi Inka jarugatadi 

Show me one gov which is perfect 

Enni gov marina idhi maradu 

India lo diversion politics ilanti thinking vuntey chalu work avutayi 

Just one question do you believe bjp given all funds to AP 

Ikkada cbn avineethi prove chesedi ledu 

Ye party kooda cheyadu 

Overall ga nee lanti vallani vp chestaru 

Funds to AP is lost at the end 

Cbn avineethi meeda they can do all enquiry n send him to jail 

But the point is where are the promises 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

Yes. Last ki jagan donga. Cbn is nippu.  So have to support nippu CBN antaadu anthey.

Inka clarity lekapothey ela bhayya

Cbn nippu anadam comedy 

Andariki telusu avineethi jarigindi

Send cbn to jail who cares

We need promises to be fulfilled

Ikkada ee diversion tho bjp promises side avutayi

 

Link to comment
Share on other sites

14 minutes ago, futureofandhra said:

Inka clarity lekapothey ela bhayya

Cbn nippu anadam comedy 

Andariki telusu avineethi jarigindi

Send cbn to jail who cares

We need promises to be fulfilled

Ikkada ee diversion tho bjp promises side avutayi

 

Not supporting Jagan here , But My point was about PK finding fault with corruption in Jagan , But not seeing the same in TDP government in his speeches. 

Link to comment
Share on other sites

22 hours ago, cryptokababs said:
కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు అమిత్ షా, అరుణ్ జైట్లీ, ఆర్ధిక శాఖ ముఖ్యకారదర్శి, ఇతర ప్రముఖులు ప్రధాన మంత్రి మోదీతో సమావేశమయ్యారు. బడ్జెట్ గురుంచి చర్చ జరిగాక, బడ్జెట్ ప్రతులు పరిశీలించిన మోదీ
 
" ఈసారి బడ్జెట్ బాగుంది. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాం. ఇక సవరణలు ఏం లేవు. ఇదే ఫైనల్ చేయండి జైట్లీ గారు" అని అమిత్ షా వైపు చూసి
 
"మీకు కూడా సమ్మతమే కదా షా జి? " అని అడిగారు.
 
హా, మనం అనుకున్న బడ్జెట్ ఇదే కదా? కానీ... అని అమిత్ షా నసుగుతుంటే ,
 
చెప్పండి ఏదైనా సమస్య ఉంటే అడిగారు మోదీ.
 
పక్కనే ఉన్న ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కల్పించుకుని ,
 
"సార్, అంతా బాగుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఏం కేటాయించలేదు. పోలవరం, రాజధాని, ప్రత్యేక హోదా,రైల్వేజోన్...... ఇలా దేని మీదా బడ్జెట్ కేటాయింపులు లేవు. దీనిమీద వ్యతిరేకత వస్తుందేమో అని "..... అని జైట్లీ వైపు చూడగా
 
నాదేముంది అంతా మీ దయ అన్నట్టు మోదీ వైపు చూసాడు జైట్లీ.
 
మోదీ చిద్విలాసంగా నవ్వి" మనం ఆంధ్రాకి బడ్జెట్ కేటాయించడం ఏంది? మనమే ఆంధ్రాని అప్పు అడగాలనుకుంటున్నాం " అని తన పీఏ వైపు చూసి
 
"అవి తీసుకురా" అన్నాడు. పీఏ లోపలికెళ్లగా , మిగతా అందరూ క్వశ్చన్ మార్క్ మొహాలతో చూస్తున్నారు. కొన్ని క్షణాల్లో పీఏ ఒక పెద్ద పేపర్ల కట్ట తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. అందరూ వాటి వైపు చూడగా అవి " ఈనాడు, ఆంధ్ర జ్యోతి" పేపర్లు.
 
"తీసి చదువు" అన్నారు మోదీ. పీఏ ఒక్కో పేపర్ తీసి చదవసాగాడు.
 
వైజాగ్ సదస్సులో పది లక్షల కోట్ల పెట్టుబడులు .
 
త్వరలో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న చైనా.
 
సోమాలియా దేశం నుండి పెట్టుబడుల వరద, సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా.
 
దవోస్ నుండి ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తేనున్న చంద్రబాబు.
 
అమెరికాలో లోకేష్ పెట్టుబడుల వేట, ఐదు లక్షల కోట్లు తరలి రానున్నట్టు వినికిడి.
 
అంగారక గ్రహం నుండి .....అని పీఏ చెప్పబోతూంటే "ఆపమన్నట్టు" చెయ్యి ఎత్తాడు మోదీ.
 
మిగతా వారంతా డిస్కవరీ ఛానెల్లో కప్పల్లాగా నోరు తెరచి అలానే ఉన్నారు.
 
ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లు అయ్యాయి? అడిగాడు మోదీ.
 
కాస్త ఆలోచించి "యాభై లక్షల కోట్లు సార్ " చెప్పాడు జైట్లీ.
 
మన బడ్జెట్ ఎంత?
 
ఇరవై ఐదు లక్షల కోట్లు
 
అంటే ఆంధ్రా పెట్టుబడుల్లో సగం మన బడ్జెట్ అన్నమాట. ఇక మనం ఏం ఇవ్వగలం వాళ్లకి? ఆ పెట్టుబడుల్లో వాళ్ళు అంతర్జాతీయ రాజధాని కట్టుకోవచ్చు, పోలవరం పూర్తి చేయొచ్చు, ఇక ప్రత్యేక హోదా అంటారా.... అది ఏ వనరులు లేని బీద రాష్ట్రానికి. లక్షల కోట్ల పెట్టుబడులు, కోటి ఉద్యోగాలు, అరవై ఐటి కంపెనీలు,అద్బుతమైన రాజధాని..... ఇన్ని ఉన్న రాష్ట్రానికి మనమేం చేయగలం? ఏం ఇవ్వగలం? చెప్పండి అన్నాడు మోదీ.
 
ఏం చేయలేము సార్" ముక్తకంఠంతో అన్నారు అందరూ.
 
సో, ఇదే ఫైనల్ చేయండి" అని పైకి లేచాడు మోదీ. 
"అన్నట్టు షా జి, నాయుడు గారికి ఫోన్ చేసి పది లక్షల కోట్లు పంపమని చెప్పండి, అసలే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి " అని వెళ్లిపోయారు.
 
అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మన ఆంధ్రా నాయకుల్లాగా.
 
Source: messenger

😂😂😂😂😂

Link to comment
Share on other sites

20 minutes ago, futureofandhra said:

Ikkada cbn avineethi chesada Leda aney topic valla use ledu

Every one know avineethi jarigindi Inka jarugatadi 

Show me one gov which is perfect 

Enni gov marina idhi maradu 

India lo diversion politics ilanti thinking vuntey chalu work avutayi 

Just one question do you believe bjp given all funds to AP 

Ikkada cbn avineethi prove chesedi ledu 

Ye party kooda cheyadu 

Overall ga nee lanti vallani vp chestaru 

Funds to AP is lost at the end 

Cbn avineethi meeda they can do all enquiry n send him to jail 

But the point is where are the promises 

My point exactly. Why didn't TDP raised same question last 4 years. Why now just before elections ? And why making it as a huge celebration event and blaming everything on BJP. 

Link to comment
Share on other sites

11 minutes ago, TampaChinnodu said:

Not supporting Jagan here , But My point was about PK finding fault with corruption in Jagan , But not seeing the same in TDP government in his speeches. 

Ippudu comedy chestunnadu pk 

Even pk cm ayina avineethi jarugatadi

The point here is this politicians deviating from funds to AP

Every one knows center didn't give funds

Link to comment
Share on other sites

చేతల్లో గోరంత..మాటల్లో కొండంత 
విభజన హామీలపై భాజపా వాదనను తిప్పికొట్టిన తెదేపా 
11ap-politics1a.jpg

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు, ఆ బిల్లుపైన పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చామని భాజపా చెబుతుండగా, అవన్నీ డొల్ల లెక్కలేనని తెదేపా వాదిస్తోంది. విభజన హామీలను నెరవేర్చేందుకు పదేళ్లు గడువున్నప్పటికీ 15 ఖండిస్తోంది. ఇరు పక్షాల వాదనలు క్లుప్తంగా ఇలా!

అంశం: రెవెన్యూ లోటు భర్తీ 
భాజపా: రాష్ట్రానికి రూ.3,979.5 కోట్లు రెవెన్యూ లోటు భర్తీ కింద ఇచ్చాం. ఇంకా ఎంత చెల్లించాలనేదానికి సంబంధించిన తుది లెక్కపై ప్రస్తుతం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి (2015-20) మధ్య అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మొత్తం రూ.22,133 కోట్లు వస్తాయి. 
తెదేపా: 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని అకౌంటెంట్‌ జనరల్‌ ధ్రువీకరించారు. కేంద్రం మాత్రం ఈ లోటు రూ.4,117.89 కోట్లేనని వాదిస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ కాలవ్యవధిలో మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా ప్రకారమే నిధులు ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమీ మేలు చేకూర్చలేదు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి 
కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ 
భాజపా: ఒక్కో ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు చొప్పున గత మూడేళ్లలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.1,050 కోట్ల నిధులిచ్చాం. 
తెదేపా: ఆ ఏడు జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1,050 కోట్లే ఇచ్చారు. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో అక్కడ రూ.7,266 కోట్లు ఇచ్చారు. 2016 డిసెంబరులో కరవు నివారణ ప్రత్యేక ప్యాకేజీ కింద బుందేల్‌ఖండ్‌కు రూ.7277 కోట్లు ఇచ్చారు.

విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నిధుల కేటాయింపు 
భాజపా: అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశాం. తాజా బడ్జెట్‌లో ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చెరో రూ.10 కోట్లు కేటాయించాం. 
తెదేపా: సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.1,100 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.400 కోట్లు వ్యయమవుతుంది. ఈ రెండింటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాల విలువ, వాటి చుట్టూ ప్రహరీల నిర్మాణానికైన వ్యయం కలిపితే రూ.1,026 కోట్లు. ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలుగా సెంట్రల్‌ యూనివర్సిటీ చట్టం-2009కు, ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం చట్టం-2007కు సవరణలు చేయడానికి గాను ప్రత్యేక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ జరగలేదు.

గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ అండ్‌ 
పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ 
భాజపా: కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ కలిసి రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెడతాయి. 2017 భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించిన ఎంవోయూపై ఇప్పటికే సంతకాలు చేశాయి. 
తెదేపా: ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఆర్థిక సర్దుబాటు(ఫైనాన్స్‌ వయుబల్‌) కింద కేంద్రం రూ.5 కోట్లు ఇవ్వాలి. ఫలితం లేదు.

దుగరాజపట్నం పోర్టు 
భాజపా: పీపీపీ విధానంలో ఇక్కడ పోర్టు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. అయితే సాంకేతిక కారణాల రీత్యా ఇక్కడ పోర్టు ఏర్పాటు సాధ్యం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చూపించే ప్రత్యామ్నాయ కేంద్రంలో పోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారు

కడప ఉక్కు కర్మాగారం 
భాజపా: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సెయిల్‌ ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చింది. అందులోని అంశాల పరిశీలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌డీఎంసీ, మెకాన్‌, ఎంఎస్‌టీసీలకు చెందిన సభ్యులతో కార్యదళం ఏర్పాటైంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతుంది 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు. లాభసాటి కాదంటున్నారు. నివేదికను పక్కనలో పెట్టారు.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు 
భాజపా: ప్రస్తుతం దీని సవివర ప్రాజెక్టు నివేదిక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలను కేంద్రం కోరింది. విజయవాడ మెట్రోకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. 2018-19 బడ్జెట్‌లో నిధులే కేటాయించలేదు.

చట్టంలో పేర్కోనప్పటికి చేసిన అంశాలు 
భాజపా: రక్షణ రంగ సంస్థలు, నౌకాయన సంస్థల ఏర్పాటు, విద్యుత్తు రంగం, జాతీయ జలరవాణా మార్గాలు-4, బొగ్గు, గనులు శాఖ తరఫున భారీగా నిధులు కేటాయించాం. 
తెదేపా: చాలా సంస్థల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములను కేటాయించింది. ఇప్పటికీ వాటిలో చాలా ప్రారంభం కాలేదు. చిన్న చిన్న అంశాలను కూడా ఏదో పెద్ద మేలు చేసినట్లు చెబుతున్నారు.

ప్యాకేజీ, ఫారిన్‌ ట్రేడ్‌ సంస్థల ఏర్పాటు 
భాజపా: ఈ సంస్థలను ఒక్కోటి 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. 
తెదేపా: 25 ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సిన సంస్థలకు 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రూ.5 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఇలా అయితే ఆ సంస్థలు ఎప్పటికి పూర్తవుతాయి?

ప్రత్యేక ప్యాకేజీ 
భాజపా: ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టే ప్రాజెక్టుల రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇవ్వడానికి ఉన్న అవకాశాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. అతి త్వరలో దీన్ని ప్రకటిస్తారు. 
తెదేపా: ప్రత్యేక హోదాతో చేకూరే అన్ని రకాల ప్రయోజనాలను ఏపీకి కలిగించేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు వెల్లడించినప్పటికీ ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.18,857 కోట్ల విలువైన ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించలేదు. నాబార్డు, హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు అవకాశం కల్పించాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా చూడాలని కోరినా ఫలితం లేదు.
11ap-politics1b.jpg
రాజధాని అమరావతికి ఆర్థికసాయం 
భాజపా: రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చాం. త్వరలో మరో రూ.1,000 కోట్లు ఇస్తాం. 
తెదేపా: రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,500 కోట్లే ఇచ్చారు. ఆ నిధులతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాం. 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, సిబ్బంది నివాస భవనాలు, రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. రాజభవన్‌, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రాబోయే అయిదేళ్లలో రూ.42,395 కోట్లు అవసరవమవుతాయి. వీటికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించాం. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇచ్చారు. ఆ నిధులతో చేపట్టిన పనుల వినియోగ పత్రాలను కూడా కేంద్రానికి సమర్పించాం.

11ap-politics1c.jpg
పోలవరం ప్రాజెక్టు 
భాజపా: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.4,622.68 కోట్లు చెల్లించాం. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయమంతా పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. 
తెదేపా: 2014-15 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.54 వేల కోట్ల వ్యయమవుతుందని ఆగస్టు 2016న కేంద్రానికి నివేదిక పంపించాం. దీనిలో పరిహారం, పునరావాసానికి రూ.33 వేల కోట్లువుతుంది. దానిపైన స్పష్టత ఇవ్వలేదు. గత నాలుగేళ్లలో పోలవరంపై రూ.7,780.07 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రం వెచ్చించిన మొత్తంలో ఇంకా రూ.3,451 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఫలితంగా వడ్డీ రూపంలో రూ.300 కోట్లమేర ఏపీపైన భారం పడింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణితో ప్రాజెక్టు పనుల్లో రెండు నెలలు ఆలస్యమయ్యింది.

వివిధ సంస్థల ఏర్పాటు, నిధుల కేటాయింపు 
భాజపా: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీడీఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐపీఈ, ఎయిమ్స్‌, ఎన్‌ఐడీఎం తదితర విద్యాసంస్థలకు సంబంధించి తాత్కాలిక ప్రాంగణాల్లో ఇప్పటికే తరగతులు కొనసాగుతున్నాయి. జాతీయ విద్యాసంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ నిర్మాణానికి గత రెండేళ్లలో రూ.730.51 కోట్లు విడుదల చేశాం. 
తెదేపా: ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9,654.95 కోట్ల వ్యయమవుతుంది. అయితే ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసింది రూ.680.08 కోట్లే విడుదల చేసింది. ఆయా ప్రాజెక్టుల వ్యయంలో ఇప్పటివరకూ కేంద్రం 7 శాతం నిధులే విడుదల చేసింది. ఈ లెక్కన చూసుకుంటే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి కేటాయించిన స్థలం విలువ, దాని చుట్టూ ప్రహారీ నిర్మాణానికి చేసిన వ్యయమే రూ.11,182.38 కోట్లు.

11ap-politics1d.jpg
జాతీయ రహదారులు, రోడ్డు అనుసంధానత 
భాజపా: వివిధ పథకాల కింద జాతీయ రహదారులు, రోడ్డు అనుసంధానత కోసం రూ.లక్ష కోట్లు నిధులు ఖర్చు చేస్తాం. 180 కి.మీ అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.20 వేల కోట్లును కేంద్రమే భరిస్తుంది. 
తెదేపా: అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఇచ్చారు తప్పితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి భూ సేకరణ జరుగుతోంది. ప్రాజెక్టు అంచనా రూ.25 వేల కోట్లు. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. భూసేకరణకయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తోంది. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్‌ దశలోనే ఉంది. 
రైల్వే ప్రాజెక్టులకు 
భాజపా: 2009-14లో రైల్వేకు కేటాయించింది రూ.5,100 కోట్లు. 2014-19లో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.14,151 కోట్లు కేటాయించాం. రూ.47,989 కోట్ల విలువైన 5,010 కి.మీ. 32 ప్రాజెక్టులు ఇప్పటికే పని జరుగుతోంది. 
తెదేపా: ప్రాజెక్టు అంచనాలు, అవసరమైన నిధుల గురించి చెప్పారే తప్ప ఇప్పటివరకూ ఎన్ని మంజూరు చేశారు? ఇంకా ఎంత విడుదల చేయాలనేది చెప్పలేదు.
విమానాశ్రయాల అభివృద్ధి 
భాజపా: భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. విజయవాడను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే కొత్త టెర్మినల్‌ భవనం పూర్తయ్యింది. రన్‌వే విస్తరణ సాగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి అభివృద్ధి చేసిన తిరుపతి విమానాశ్రయాన్ని ఇప్పటికే ప్రధాని ప్రారంభించారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాత్రి ల్యాండింగ్‌, రన్‌వే విస్తరణ పనులు సాగుతున్నాయి. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ భవనం ప్రారంభమైంది. ఉడాన్‌ పథకం కింద ఇక్కడి నుంచి సర్వీసులు నడుస్తున్నాయి.

తెదేపా: కడప, రాజమహేంద్రవరం విమానాశ్రయాల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...