Jump to content

నేడు ఎంపీ గల్లా జయదేవ్‌కు అభినందన సభ

TampaChinnodu

Recommended Posts

స్పందించకుంటే యుద్ధమే 
పోరాటాలకు సిద్ధం కావాలి 
కేంద్రంతో వైకాపా చేతులు కలపాలని చూస్తోంది.. 
కార్యకర్తల సమావేశంలో గుంటూరు ఎంపీ జయదేవ్‌ 
11ap-main15a.jpg

ఈనాడు,  గుంటూరు: ‘విభజన చట్టంలో పేర్కొన్నట్టు రాష్ట్రానికి సాయం చేయాలని భాగస్వామ్య పక్షంగా కేంద్రాన్ని కోరుతున్నాం. ఇలా అడగటం ఆంధ్రుల అమాయకత్వం అనుకోవద్దు. ఐదు రోజులుగా పార్లమెంటులో చేసిన ఆందోళనలు ఆరంభం మాత్రమే. వాటికి స్పందిస్తే సరి.. లేదంటే యుద్ధానికి సన్నద్ధం కావాలని’ తెదేపా కార్యకర్తలు, ప్రజలకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో తెలుగువారి గోడును తనదైన శైలిలో వినిపించాక ఆదివారం తన నియోజకవర్గమైన గుంటూరుకు వచ్చిన జయదేవ్‌కు తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన్ని ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో జయదేవ్‌ మాట్లాడుతూ.. దిల్లీలోనే కాదు.. ఎక్కడైనా రాష్ట్రానికి, గుంటూరు ప్రజలకు జరిగే అన్యాయంపై తాను తన గొంతుక వినిపించటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. దీనికి మీ సహాయసహకారాలు కావాలని కోరారు. బలమైన ప్రధానిగా చెప్పుకొంటున్న మోదీ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  ‘ఐదు విద్యాసంస్థలకు రూ.10-15 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ కేటాయింపులను చూస్తే అవి పూర్తవటానికి కనీసం పది నుంచి 30 ఏళ్లు పడుతుం’దని గుర్తు చేశారు. ‘పార్లమెంటులో ప్రధాని ప్రసంగించేటప్పుడు భాగస్వామ్యపక్షంగా ఉంటూ ఆందోళన చేయకూడదని, ఆయన ప్రసంగం ద్వారా రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుందేమోనన్న ఆశతో మా సీట్లలో కూర్చున్నాం. వైకాపా మిత్రపక్షం కాదు. ఆ పార్టీ ఎంపీలు కనీసం ఆందోళన చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో వారు గోడ మీది పిల్లివాటంలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ వ్యవహారం చూస్తుంటే భాజపాతో చేతులు కలిపేలా ఉన్నారని భావించాల్సి వస్తుందని’ ఆయన ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. భాజపా నాయకులు ఎన్నికల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ రామకృష్ణ, నాయకుడు మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

11ap-main15b.jpg
Link to comment
Share on other sites

బిచ్చమెత్తుకోవాలా! 
చట్టబద్ధ వాటా కోసం కేంద్రం చుట్టూ తిరగాలా? 
రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూశాక భాజపాపై మిత్రపక్షాల్లోనూ అపనమ్మకం! 
ఐదు ముఖ్యాంశాలు వదిలేసి మిగతావి మాట్లాడుతున్నారు 
రామాయపట్నాన్ని ప్రత్యామ్నాయంగా చూపాం 
రైల్వే మంత్రి మాటలనుబట్టి జోన్‌ రాదనే అనిపిస్తోంది 
వైకాపాకు నిలకడ లేదు 
పోరాటంలో వెనుదిరిగే ప్రసక్తే లేదు 
ఎంపీలు జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, మంత్రి కళావెంకట్రావు, కుటుంబరావుల స్పష్టీకరణ 
ఈనాడు - అమరావతి 
11ap-main1a.jpg
‘ప్రజలను తప్పుదారి పట్టించి నెపాన్ని మాపై నెట్టేయాలనుకుంటున్నారా? ఇదేం పద్ధతి? మా ప్రజలు తెలివితక్కువవాళ్లు (ఫూల్స్‌) కాదని పార్లమెంటులోనే చెప్పా. అదే విషయాన్ని మరోసారి ఈ రాష్ట్రంలోను, కేంద్రంలోనూ ఉన్న భాజపా నాయకులకు గుర్తు చేస్తున్నా’
- ఎంపీ గల్లా జయదేవ్
‘రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది’ 
- మంత్రి కళావెంకట్రావు
‘హరిబాబు విడుదల చేసిన 27 పేజీల దస్త్రంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీకి రూ.22 వేల కోట్లు ఇస్తున్నట్టు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలకూ ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్‌కూ ఇస్తున్నారు తప్ప దానిలో ప్రత్యేకత ఏముంది? 
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
మేము మీకు భిక్షమెత్తుకునేవాళ్లలా కనిపిస్తున్నామా? కేంద్ర పథకాలు, పన్నుల్లో మాకు చట్టబద్ధంగా రావలసిన వాటా కోసం కూడా భిక్షాపాత్ర పట్టుకుని కేంద్రం చుట్టూ తిరగాలా? అదే మీ ఉద్దేశమా? మీరేమైనా మాకు దయాదాక్షిణ్యాలతో (చారిటీ) ఇస్తున్నారా? మేం అంత పనికిమాలినవాళ్లలా కనిపిస్తున్నామా? అసలేమనుకుంటున్నారు మీరు? అన్ని రాష్ట్రాలకూ ఇచ్చినవే ఇచ్చి మాకేదో గొప్ప మేలు చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు?
- విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్‌
విభజన చట్టంలో పేర్కొన్న హామీల గురించి అడుగుతుంటే పాస్‌పోర్టు ఆఫీసు ఇచ్చాం, దూరదర్శన్‌ కేంద్రం ఇచ్చామంటూ కథలు చెబుతారా? అంటే కొత్త రాష్ట్రానికి చట్టబద్ధంగా ఇవ్వాల్సినవీ ఇవ్వరా? ఏదో పక్క దేశంలో ఉన్న రాష్ట్రానికి మేలు చేసినట్టు దానికి ప్రత్యేకంగా నోట్‌ కూడా విడుదల చేస్తారా? ప్రధానమంత్రి ఆవాస్‌యోజన ఏదో మా రాష్ట్రానికే ప్రత్యేకం అన్నట్టు ఎలా మాట్లాడతారు? అది ప్రధానమంత్రి ఆవాస్‌యోజనే కానీ.. ఆంధ్రప్రదేశ్‌ ఆవాస్‌యోజన కాదు.
- ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు

కేంద్ర బడ్జెట్‌పై తెదేపా నేతలు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మూడున్నరేళ్లలో రాష్ట్రానికి మేం చేసినవి ఇవీ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీల నోట్‌పై ప్రతిస్పందించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో కొందరు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావు, ఎంపీలు జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. తెదేపా పోరాటం చేస్తున్న అంశాలపై నిర్దుష్టమైన హామీగానీ, స్పష్టత గానీ ఇవ్వకుండా రాజ్యాంగపరంగా, చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, పన్నుల్లో రాష్ట్రానికి సహజంగా రావలసిన వాటినీ చేర్చి నివేదికలా మార్చి రాష్ట్రానికి తామేదో గొప్ప మేలు చేశామన్నట్టు భాజపా చెబుతోందని సమావేశంలో భావించారు. భాజపా వాదనలోని డొల్లతనాన్ని నేరుగా ప్రజలకే అర్ధమయ్యేలా వివరించాలని నిర్ణయించారు. అనంతరంకళావెంకట్రావు,జయదేవ్‌ రామ్మోహన్‌నాయుడు, కుటుంబరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. భాజపా నోట్‌ తప్పులతడకని, ప్రజల్ని ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టించేందుకు రూపొందించిన పత్రమని దుయ్యబట్టారు. అదేదో సినిమా స్క్రిప్ట్‌లానో, కాల్పనిక పత్రంలానో ఉందని కుటుంబరావు ధ్వజమెత్తారు. రాష్ట్రానికీ ఏమీ చేయకుండానే అన్నీ చేశామన్నట్టు ప్రగల్భాలు పలకొద్దని భాజపాకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదని, హామీలన్నీ సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని కళావెంకట్రావు స్పష్టం చేశారు. విపక్ష వైకాపా వైఖరిపైనా వారు మండిపడ్డారు. 
ఇలా అయితే భాజపాను ఎవరూ నమ్మరు..!: కేంద్రంలోని భాజపా నాయకులు రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుంటే.. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అసత్యాలు, అర్ధసత్యాలతో ప్రచారం చేస్తున్నారని జయదేవ్‌ మండిపడ్డారు. హరిబాబు విడుదల చేసిన నివేదిక దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తమ పోరాటం ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది మాత్రమే కాదని, జాతీయ అంశంగా మారిందని పేర్కొన్నారు.

విలేకరులతో జయదేవ్‌ పేర్కొన్న ముఖ్యాంశాలు 
* మాకు మద్దతుగా వివిధ పార్టీలు గళం కలుపుతున్నాయి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూశాక భాజపాను నమ్మొచ్చా? ఆ పార్టీతో మైత్రి మంచిదేనా? మనల్నీ మోసం చేస్తారా? అన్న అనుమానం మిగిలినవారిలోనూ  ఉంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని కేంద్రం ఎలా అమలుచేస్తుందా? అని దేశం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. న్యాయం మన పక్షాన ఉంది.

* పార్లమెంటులోను, బయటా మేం చేసిన పోరాటానికి పార్టీలకు అతీతంగా ఎంపీలు మద్దతిచ్చారు. చివరకు భాజపా ఎంపీలూ మద్దతుగా మాట్లాడారు. ప్రధాని జోక్యం చేసుకుని అన్యాయాన్ని సరిదిద్దాలి. 
* రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. ఖర్చు పెట్టింది రూ.5,900 కోట్లే. 
* కేంద్రానిదే బాధ్యత.. వాళ్లే జవాబుదారీ అని తెలిసినా కూడా అసత్యాలు ప్రచారం చేసి నెపాన్ని రాష్ట్రంపై నెట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. 
* ఆంధ్రప్రదేశ్‌ను మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చాలే తప్ప.. ఈశాన్య, పశ్చిమ ప్రాంతంలోని వెనుకబడిన రాష్ట్రాలతో పోల్చి మీ వృద్ధి బాగుందని చెప్పడం సరికాదు. దక్షిణాది రాష్ట్రాలన్నిటికంటే ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం చాలా తక్కువ. వాటితో సమానంగా అభివృద్ధి చెందేంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనివ్వాల్సిందే.

* అప్పట్లో యూపీఏ ప్రవేశపెట్టిన రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా సహకరించబట్టే ఆమోదం పొందింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రత్యేక హామీలు ఇవ్వకపోతే బిల్లు ఆమోదం పొందేది కాదు.  విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు ఎంత విలువ ఉందో, చట్టంలో లేకపోయినా ప్రధాని హామీలకూ అంతే ప్రాధాన్యం ఉంది.

* ఈఏపీ ప్రాజెక్టులు, రెవెన్యూలోటు వంటి అంశాలతో పాటు కచ్చితంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందే. 
* ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహాలో సాయం చేస్తామన్నారు. ఒక్క బుందేల్‌ఖండ్‌కే రూ.ఆరువేల కోట్లు ఇచ్చారు. ఇక్కడ ఏడు జిల్లాలకు రూ.1050 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. తలసరి ఆదాయాన్ని బట్టి చూసినా వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ మొత్తం రావలసి ఉంది.

* పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపడతామని హామీనిచ్చారు. సహాయ పునరావాస పనులకు రూ.33 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. దానిపై కేంద్రం స్పష్టతనివ్వలేదు. ఆ ప్రాజెక్టుపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన మొత్తానికి, కేంద్రం ఇచ్చిన మొత్తానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని భర్తీ చేయాలి.

* విభజన చట్టంలో 19 అంశాలున్నాయి. ప్రధాని ఆరు హామీలిచ్చారు. వాటిని పూర్తిగా పలుచన చేశారు. కొన్నింటికి నామమాత్రంగా నిధులిచ్చారు. ఇవన్నీ ఎప్పటికి పూర్తి చేస్తారన్న స్పష్టత కావాలి. 
* పోలవరం, అమరావతి, రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్‌... ఈ ఐదూ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యాంశాలు. వీటిని వదిలేసి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. 
* కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐదే పెండింగ్‌లో ఉన్నాయని హరిబాబు చెప్పారు. మొదలైన వాటి పరిస్థితేంటి? వాటికి అరకొరగా కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతాయి? 
* కడప ఉక్కుపరిశ్రమ సాధ్యం కాదని నివేదిక వచ్చిందంటున్నారు? ఆ విషయం చెప్పకుండా ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? 
* దుగరాజపట్నం నౌకాశ్రయాన్ని రక్షణ శాఖ, ఇస్రో వ్యతిరేకించాయంటున్నారు. రామాయపట్నాన్ని ప్రత్యామ్నాయంగా చూపించాం.. ఆ ప్రస్తావనేదీ? 
* కేంద్ర మంత్రి మాటలు చూస్తుంటే రైల్వేజోన్‌ రాదనే అనిపిస్తోంది. 
* విభజన చట్టంలో హామీల అమలుకు పదేళ్ల గడువుందని హరిబాబు అంటున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది. వాళ్ల నాయకుల ఉద్దేశాలకు అనుగుణంగా మాట్లాడకూడదు. 
* రాజధానికి నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇచ్చాం. ఇంకా రూ.వెయ్యి కోట్లే ఇస్తామంటున్నారు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీకే రూ.వెయ్యి కోట్లవుతుంటే రాజధానికి రూ.3500 కోట్లు ఏ మూలకు?

అదో చిన్న నవలలా ఉంది 
రాష్ట్రానికి అన్నీ చేసేశామని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ చెప్పడంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మండిపడ్డారు. ‘ఆర్థికాంశాలు దాస్తే దాగేవి కాదు. జాతీయ రహదారుల సంస్థ ప్రతి 48 గంటలకు ప్రాజెక్టుల పురోగతిని నవీకరిస్తుంది. 2014-15 నుంచి 2017-18 వరకు రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు వేశారు? రూ.6 వేల కోట్లు కంటే ఖర్చు చేయలేదు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చాలావరకు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేవి. కేంద్రం జేబులోంచి ఇవ్వాల్సిన పనిలేదు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు రూ.20 వేల కోట్లు ఇస్తున్నామని చెబుతున్నారు. భూసేకరణకే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8,500 కోట్లు ఖర్చవుతుంది. ఇతర మౌలిక వసతులకు రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది’ అని తెలిపారు. ‘మొదటి సంవత్సరం రెవెన్యూ లోటు భర్తీపై రెండుసార్లు చర్చించాం. రూ.4 వేల కోట్లే వస్తుందని చెబుతున్నారు. రుణమాఫీ, పింఛన్లు, పీఆర్‌సీ అమలుకు ఖర్చు చేసిన మొత్తాన్ని దానిలో కలపబోమని చెబుతున్నారు. అవన్నీ తీసేసినా రూ.7500 కోట్లు వస్తుందని మొదట వాళ్లే చెప్పారు. రైతు రుణమాఫీ అమలుకు, ఆ ఏడాది మేం చెల్లించాల్సిన రూ.8,500 కోట్ల బిల్లుల్ని వాయిదా వేసుకున్నారు. అది రెవెన్యూలోటు కాదా? అనుమానాలుంటే రూ.7500 కోట్లు పోను మిగతా మొత్తాన్ని నిర్ణయించేందుకు కమిటీ వేయమని కోరుతున్నాం. 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడితోనే కమిటీ వేయమని కోరుతున్నాం. రెవెన్యూ లోటుపై మేం ఒక ఫార్ములాకు వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. అదేంటో ప్రజలకే చెప్పొచ్చు కదా?’ అని పేర్కొన్నారు. హరిబాబు 5 పేజీల్లో చెప్పేదాన్ని అక్షరాల పరిమాణాన్ని పెంచి 27 పేజీల్లో పెట్టారని.. దాన్నో చిన్న నవలలా మార్చారని ఎద్దేవా చేశారు. 
పీఎం ఆవాస్‌యోజన కింద రాష్ట్రానికి రూ.7972 కోట్లు ఇచ్చామని చెప్పారని, ఇచ్చింది రూ.1038 కోట్లు మాత్రమేనని తెలిపారు.

న్యాయం జరిగేంత వరకు పోరాటం 
రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కళావెంకట్రావు స్పష్టం చేశారు. ‘కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావలసినవేమీ రాలేదని వైకాపా తన ప్రసారసాధనాల్లో ఎక్కడా చెప్పలేదు. అది స్వలాభం కోసం పెట్టుకున్న పార్టీనే తప్ప ప్రజాసేవ కోసం ఏర్పాటుచేసింది కాదు.. రాష్ట్రానికి అన్యాయం జరిగిన ఇలాంటి సందర్భంలోనూ ఆ పార్టీ రాజకీయం చేయడం దురదృష్టకరం. స్వప్రయోజనాల కోసం కేంద్రంతో ఎలా లాలూచీ పడాలన్నదే వాళ్ల ఆరాటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు’ అని ధ్వజమెత్తారు.

మీరూ కనపడకుండా పోతారు

‘రాష్ట్ర ప్రజల మనోభావాలను కేంద్రం ఇప్పటికైనా గుర్తించాలి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసి కనిపించకుండా పోయింది. అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాం’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. భాజపా విడుదల చేసిన నివేదికలో విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపైగానీ, అప్పటి ప్రధాని హామీలపైగానీ స్పష్టతా ఇవ్వలేదన్నారు. కేవలం రాజకీయ నిర్ణయంతోనే రైల్వే జోన్‌ ప్రకటించవచ్చునని, కావాలనే జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు..

* విభజన చట్టంలోని 19 అంశాలపై స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఎన్ని సార్లు దిల్లీ గడప తొక్కాలన్న ఉద్దేశంతోనే పోరాటం ప్రారంభించాం. ఈ పోరాటంలో వెనుదిరిగే పరిస్థితి లేదు. విభజన చట్టంలోని అంశాల్నిఎప్పటిలోగా నెరవేరుస్తారన్న స్పష్టత కావాలి.

* బెంగళూరు, ముంబయి సబర్బన్‌ రైలు ప్రాజెక్టులకు కోట్లకు కోట్లు ఇచ్చినప్పుడు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు గుర్తుకు రాలేదా? మంచి రాజధాని కట్టుకోవాలని మేం కలలు కనకూడదా? ఆంధ్రప్రదేశ్‌కు దిల్లీకి మించిన రాజధాని కడతామన్న హామీలన్నీ ఏమయ్యాయి?

* హామీల అమలుకు పదేళ్ల గడువుందని చెప్పడం ఏం న్యాయం? ఆకలేసినప్పుడు అన్నం పెట్టండి. ఆర్థికంగా సహకరించండి. ఆశలు అడియాసలు చేసినందునే ఈ పోరాటం. 
* ఆ రోజు ప్రత్యేకహోదా కోసం పోరాడాం. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే దానికీ ఒప్పుకున్నాం. ఇప్పుడు దానిలోనూ స్పష్టత లేదు. 
* ‘కేంద్రంపై ఐక్యంగా పోరాడుతుంటే.. తెదేపా కుట్ర చేస్తోందని వైకాపా అనడం దురదృష్టకరం. పార్లమెంటులో ఐదు రోజుల పోరాటం కుట్రా? మా మంత్రులు మాట్లాడుతుంటే మీ సభ్యులు రూల్స్‌ చెప్పి ఎందుకు అడ్డుపడ్డారు? మీ ఎంపీలు దిల్లీలో బడ్జెట్‌ బాగుందని, ఇక్కడ మరోలా మాట్లాడుతున్నారు. కుట్రలు చేస్తోంది మీరే. అసలు మీకు నిలకడేది. ఒకసారి రాజీనామాలు చేస్తామంటారు? మీ ఎంపీలేమో ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతారు. ఎవర్ని ఫూల్స్‌ చేస్తారు?

Link to comment
Share on other sites

Quote

bl@st

Link to comment
Share on other sites

46 minutes ago, TampaChinnodu said:

ee bhajan lal batch mamuluga ledu kada...elections tondarlo vunnay kada ani veelu rajamouli ni baga vaadukuntunnaru

Link to comment
Share on other sites

50 minutes ago, TampaChinnodu said:
స్పందించకుంటే యుద్ధమే 
పోరాటాలకు సిద్ధం కావాలి 
కేంద్రంతో వైకాపా చేతులు కలపాలని చూస్తోంది.. 
కార్యకర్తల సమావేశంలో గుంటూరు ఎంపీ జయదేవ్‌ 
11ap-main15a.jpg

ఈనాడు,  గుంటూరు: ‘విభజన చట్టంలో పేర్కొన్నట్టు రాష్ట్రానికి సాయం చేయాలని భాగస్వామ్య పక్షంగా కేంద్రాన్ని కోరుతున్నాం. ఇలా అడగటం ఆంధ్రుల అమాయకత్వం అనుకోవద్దు. ఐదు రోజులుగా పార్లమెంటులో చేసిన ఆందోళనలు ఆరంభం మాత్రమే. వాటికి స్పందిస్తే సరి.. లేదంటే యుద్ధానికి సన్నద్ధం కావాలని’ తెదేపా కార్యకర్తలు, ప్రజలకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో తెలుగువారి గోడును తనదైన శైలిలో వినిపించాక ఆదివారం తన నియోజకవర్గమైన గుంటూరుకు వచ్చిన జయదేవ్‌కు తెదేపా కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన్ని ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో జయదేవ్‌ మాట్లాడుతూ.. దిల్లీలోనే కాదు.. ఎక్కడైనా రాష్ట్రానికి, గుంటూరు ప్రజలకు జరిగే అన్యాయంపై తాను తన గొంతుక వినిపించటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. దీనికి మీ సహాయసహకారాలు కావాలని కోరారు. బలమైన ప్రధానిగా చెప్పుకొంటున్న మోదీ వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.  ‘ఐదు విద్యాసంస్థలకు రూ.10-15 కోట్ల చొప్పున కేటాయించారు. ఈ కేటాయింపులను చూస్తే అవి పూర్తవటానికి కనీసం పది నుంచి 30 ఏళ్లు పడుతుం’దని గుర్తు చేశారు. ‘పార్లమెంటులో ప్రధాని ప్రసంగించేటప్పుడు భాగస్వామ్యపక్షంగా ఉంటూ ఆందోళన చేయకూడదని, ఆయన ప్రసంగం ద్వారా రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుందేమోనన్న ఆశతో మా సీట్లలో కూర్చున్నాం. వైకాపా మిత్రపక్షం కాదు. ఆ పార్టీ ఎంపీలు కనీసం ఆందోళన చేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో వారు గోడ మీది పిల్లివాటంలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ వ్యవహారం చూస్తుంటే భాజపాతో చేతులు కలిపేలా ఉన్నారని భావించాల్సి వస్తుందని’ ఆయన ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. భాజపా నాయకులు ఎన్నికల రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్సీ రామకృష్ణ, నాయకుడు మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

11ap-main15b.jpg

@3$%@3$%

Link to comment
Share on other sites

12 minutes ago, JambaKrantu said:

Oree eella eeshalo.. Aadu edo border lo veerochitam gaa poradi padhi mandi pakistan sainyam ni champi vachinattu veera khadgam valla amma edupu. @3$%

adey kada bhayya ee bhajan lal batch motham sanka nakinchestunnaru janalni...

ee nalugellu same ilaneyu chesaru budget lo...ippudochi elections daggarunnay kada ani ee Fox CBN natakalu aadutunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...