Jump to content

రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు


TampaChinnodu

Recommended Posts

రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

అమరావతి: పెట్టుబడుల సదస్సుల ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24నుంచి విశాఖ వేదికగా మూడురోజుల పాటు జరుగనున్న మూడో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సుమారు 39 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరు కానుండగా.. మరో 3లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు. సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో ప్రభుత్వం ధనం వృథా చేస్తుందన్న విమర్శలపై మంత్రులు మండిపడ్డారు. పెట్టుబడులు తరలివచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న వేళ.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. 

Link to comment
Share on other sites

10 minutes ago, TampaChinnodu said:
రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు

అమరావతి: పెట్టుబడుల సదస్సుల ద్వారా రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24నుంచి విశాఖ వేదికగా మూడురోజుల పాటు జరుగనున్న మూడో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సుమారు 39 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరు కానుండగా.. మరో 3లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు. సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో ప్రభుత్వం ధనం వృథా చేస్తుందన్న విమర్శలపై మంత్రులు మండిపడ్డారు. పెట్టుబడులు తరలివచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న వేళ.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. 

Calling @psyc0pk @futureofandhra

Link to comment
Share on other sites

                                                                                                                     ()>>

ఇప్పటివరకు రూ.3లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Link to comment
Share on other sites

3 hours ago, TOM_BHAYYA said:

Ye raayithu lekuntene 3L C ante inka sS isth ante pakka states oppose cheyadam lo pedda ashcharyam ledhu 

Andhuke...,,”Thana sommu ina dachukoni thinamannaru peddalu.”

Link to comment
Share on other sites

2 hours ago, Idassamed said:

Why banging you head kaka?

JAFFA website open ainda ani...CBN ni yevadaithe thidathado vaallandarni oka daggariki techi CBN ni thittakunda topic divert chesi final ga NDA money ievaledu CBN yem chesthadu ani report isthadi.Deeni malli oka website oka leader..Chi deenamma jevvitham_%~

Link to comment
Share on other sites

మూడో సదస్సులో 3 లక్షల కోట్లు! 
300 ఎంవోయూలకు  ప్రతిపాదనలు 
14 దేశాల వాణిజ్యమంత్రులు.. 40 దేశాల ప్రతినిధులు 
భాగస్వామ్య సదస్సు వివరాలను వెల్లడించిన మంత్రి యనమల 
18ap-main13a.jpg

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులు మంచి ఫలితాలిస్తున్నాయి. గతంలో నిర్వహించిన రెండు సమ్మిట్లలో రూ.11.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వంతో వివిధ పరిశ్రమలు 876 ఎంవోయూలను కుదుర్చుకున్నాయి. వాటిద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒప్పందాల్లో ఇప్పటికే 46 శాతం కార్యరూపం దాల్చాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈనెల 24 నుంచి విశాఖపట్నంలో జరగనున్న మూడో సమ్మిట్‌లో ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్ల విలువైన 300 ఎంవోయూలు చేసుకోవడానికి ప్రతిపాదనలొచ్చాయి. సదస్సు ప్రారంభం నాటికి వీటి విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై ఆదివారం ఆయన మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మూడో సమ్మిట్‌కు 14 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు, 40 దేశాల నుంచి పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. సమ్మిట్‌ ద్వారా వచ్చే పెట్టుబడులే కాకుండా ఆ తరువాతా ప్రభుత్వంతో చాలా కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని, వాటితో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి అవకాశం కలుగుతోందని వివరించారు. విభజన తరువాత కష్టాల్లో కూరుకుపోయామని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని, ఇందుకు ప్రపంచ నలుమూలల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా భాగస్వామ్య సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనికి సహకరించాల్సింది పోయి సదస్సుల సమయంలో ధర్నాలు చేస్తామని విపక్షాలు ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు చక్కని ఆతిథ్యం ఇచ్చి గౌరవమిస్తేనే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని, ఇలాంటి అవాంతరాలు కల్పిస్తే ఎవరు ముందుకు వస్తారని, ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు.

రూ.2 వేల కోట్లతో కన్వెన్షన్‌ కేంద్రం 
భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్న స్థలంలో రూ.2 వేల కోట్లతో శాశ్వత కన్వెన్షన్‌ కేంద్రం, ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మించనున్నట్లు మంత్రి యనమల తెలిపారు. ఈ ప్రాజెక్టును లులు గ్రూప్‌నకు 33ఏళ్ల లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి అవసరమైన ప్రైవేటు స్థలాన్ని సేకరించి అందుకు ప్రతిగా నగరంలో మరోచోట వారికి భూములివ్వడానికి మంత్రి మండలి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. ఇందులో ఎవరికీ లబ్ధి చేకూర్చేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. సమ్మిట్‌ నిర్వహణకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేస్తే వాటి ద్వారా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఏ ఖర్చూ చేయకుండా పెట్టుబడులు రావని, ఇది తెలుసుకుని విపక్షాలు మాట్లాడాలని హితవు పలికారు.

Link to comment
Share on other sites

Quote

సమ్మిట్‌ నిర్వహణకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేస్తే వాటి ద్వారా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని

bl@st}?.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...