Jump to content

బీజేపీకి షాకిచ్చి కాంగ్రెస్ గూటికి ఫైర్ బ్రాండ్


Kool_SRG

Recommended Posts

Nagam-Janardhan-Reddy-To-Join-Congress-Party--1519196875-1159.jpg

దేశ వ్యాప్తంగా రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. ఇందుకు తగినట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంచనాలకు తగ్గట్లే జరిగితే.. ఈ డిసెంబరు నాటికే సార్వత్రిక ఎన్నికలు జరిగే వీలుందన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. వలసల కార్యక్రమం మళ్లీ షురూ అయ్యింది.

గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొత్త పరిణామం ఏమిటంటే.. ఎన్నికలు ముగిసిన వెంటనే అధికార పార్టీ గూటికి విపక్ష నేతలు జంప్ కావటంగా చెప్పాలి. మెజార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ.. విపక్షాల్ని అంతకంతకూ ఉక్కిరిబిక్కిరి చేయటం.. కోలుకోలేని రీతిలో దెబ్బ తీయాలనుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది.

ఇందులో భాగంగానే  ఇప్పుడు సరికొత్త మార్పులు చేర్పులు షురూ అయ్యాయి.గడిచిన కొంతకాలంగా బీజేపీలో ఉన్నా.. ఆ పార్టీ సంస్కృతితో మమేకం కాలేకపోతున్న నేతల్లో తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాగం జనార్దన్ రెడ్డి ఒకరు. బీజేపీలో మొదట్నించి ఉన్న వారు తప్పించి.. కొత్తగా చేరిన వారికి సరైన గుర్తింపు లేకపోవటం.. వారిని అధినాయకత్వం విశ్వాసంలో తీసుకోకపోవటం మొదట్నించి ఉన్నదే.

సంఘ్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవటాన్ని ఒక లోపంగా చూపిస్తూ.. కీలక బాధ్యతలు ఇవ్వని నేపథ్యంలో.. ఆ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనన్న భావన పలువురిలో కనిపిస్తోంది. అదును చూసి పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్న నేతలు ఇప్పుడు సరైన అవకాశం కోసం చూస్తున్నారు. అలాంటి వారిలో నాగం ఒకరు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయినట్లుగా సమాచారం.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ఈ వార్త ధ్రువీకరణ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. బీజేపీ నేతలు మాత్రం నాగంకు పార్టీలో బోలెడంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి వైద్యవిద్యలో పట్టా తీసుకున్న నాగంకు మంచి వక్తగా పేరుంది.

ఫైర్ బ్రాండ్ మాదిరి ప్రత్యర్థి పార్టీలపై దునుమాడే నాగం.. గతంలో కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చరిత్ర ఉంది. అలాంటి ఆయన తాజాగా బీజేపీని వదిలి.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెఢీ అయిపోయారన్న వాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

Link to comment
Share on other sites

రాహుల్ గాంధీని కలిసిన నాగం జనార్దన్ రెడ్డి... ఇక కాంగ్రెస్ లో ప్రయాణం!

tnews-80f7f748d7ae6fbeaa42983fe176b7bb915e3d77.jpg

  • ఉత్తమ్ తో కలసి రాహుల్ తో చర్చలు
  • నాగం చేరికను స్వాగతించిన కాంగ్రెస్ అధ్యక్షుడు
  • ఆయన వస్తే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ బలోపేతం

ఒకప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఆపై మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరి, అక్కడా ఇమడలేకపోయిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి రాహుల్ గాంధీని కలసి వచ్చారని, నాగం చేరికను రాహుల్ సైతం స్వాగతించారని తెలుస్తోంది.

ఉస్మానియా మెడికల్‌ కళాశాల నుంచి వైద్యవిద్యలో పట్టా పొందిన నాగం, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారన్న సంగతి తెలిసిందే. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్రను ఆయన సొంతం చేసుకున్నారు. మంత్రిగానూ విధులు నిర్వహించారు. 2013లో ఆయన బీజేపీలో చేరారు. ఇక నాగం కాంగ్రెస్ లో చేరికతో మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, argadorn said:

expected long ago.... pedda bahubali avuthadu emo ...lol...

pedda bali avuthadu BJP lo vunte, atleast Cong to Babhubali kak poina kanisam vunna 10 mandi CM candiadtes number 11  avuddi 

Link to comment
Share on other sites

i Really did not understand why he left tdp. Tdp lo Baney gurthimpu undey.

Appudu party Mari thappu chesadu.. ippudu trs ki povalsindi emo. Congi ki enduku

Link to comment
Share on other sites

Just now, Vaampire said:

i Really did not understand why he left tdp. Tdp lo Baney gurthimpu undey.

Appudu party Mari thappu chesadu.. ippudu trs ki povalsindi emo. Congi ki enduku

trs lo nagarkurnool mla unnadu know....he is rich too...he wants two seats for hima nd son ....kodiga kastamey...

Link to comment
Share on other sites

31 minutes ago, Vaampire said:

i Really did not understand why he left tdp. Tdp lo Baney gurthimpu undey.

Appudu party Mari thappu chesadu.. ippudu trs ki povalsindi emo. Congi ki enduku

Nagam Janardhan reddy is one politician who thinks too much of himself. When he quit TDP along with his follower Jogu Ramanna from Adilabad, there were many offers from TRS for him. But he thought he could beat KCR and started his own political forum and eventually realized his capacity and joined BJP. At that point, had if he joined TRS, he would have been a minister now like his follower Jogu Ramanna who is now a minister for BC welfare. Kondariki konni kalisi raavu anthe..... Ippudu Congress lo join ayina pedda fayida em undadu thanaki.

Link to comment
Share on other sites

47 minutes ago, Gaali_Gottam_Govinda said:

reddy rajyam vardhillali.........Image result for reddy gifs

CITI_c$y day dreaming teddies ....

44 minutes ago, Vaampire said:

i Really did not understand why he left tdp. Tdp lo Baney gurthimpu undey.

Appudu party Mari thappu chesadu.. ippudu trs ki povalsindi emo. Congi ki enduku

trs loki poyinaa , he cant get more than an assurance that he would get an mla seat confirmed

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...