Jump to content

నలభై వసంతాల చంద్రన్న


Paidithalli

Recommended Posts

భారీ స్థాయిలో పలుకుబడి ఉంది. సొంత కాళ్లపై ఇంటింటికి తిరిగి శ్రమించి చేసిన ప్రచారం ఫలితం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే.. 1978 ఫిబ్రవరి 26న ఆ యువసేనలో ఇదే ఉత్కంఠ. అభ్యర్థిలో తప్ప... ఆ అభ్యర్థే చంద్రబాబు నాయుడు. పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య మిగిలింది ఒకే ఒక్క రోజు 1978, ఫిబ్రవరి 26వ తేదీ. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం హాస్టల్‌లో చంద్రబాబు, ఆయన సహచరుల మకాం. రోజంతా నిర్విరామంగా లెక్కలు వేస్తునే ఉన్నారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు అనే అంచనాలు తేలుస్తున్నారు.
 
ఆ రోజున ఉన్న పరిస్థితి ప్రకారం జనతాపార్టీకి చంద్రగిరి కంచుకోట. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంగర పట్టాభి చౌదరి పలుకుబడి, ప్రాబల్యం ఉన్న మనిషి. ఇటువైపు చంద్రబాబు.. తొలిసారి ఎన్నికల్లో పోటీ... 26 ఏళ్ల ప్రాయం... ప్రచారం బాగానే చేశాం... ఇల్లిల్లు తిరిగాం, కరపత్రాలు పంచాం. చూద్దాం, చేద్దాం, ఓటేస్తాం అన్నవారే అంతా... పలితం ఎలా ఉంటుందో... హాస్టల్ మీటింగ్‌లో కూర్చున్న వారందరిలోనూ టెన్షన్. అయితే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నా... లోలోపల అనుమానం. చంద్రబాబు మాత్రం పేపరు, పెన్ను తీసుకుని ఓటర్ల జాబితా ముందేసుకుని కూడికలు, తీసివేతల్లో మునిగారు. మరికొద్దిసేపటికే మనం గెలుస్తున్నాం అని చెప్పేశారు.
 
1978లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచేందుకు అంతకు రెండేళ్ల ముందే చంద్రబాబు నిర్ణయించుకున్నారు. వ్యూహాత్మక అడుగులు వేశారు. ఇందిర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. అప్పటికే ఆయన ఎస్వీ వర్శిటీలో రిసెర్చ్ స్కాలర్. తన మిత్రులు, సహచర విద్యార్థులు వందమందితో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేశారు. వారంతా చంద్రగిరి నియోజక వర్గంలో ఊరూరూ తిరిగారు. అప్పటి పరిస్థితుల్లో ఇందిరా కాంగ్రెస్‌పై చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత. గ్రామాల్లో బలంగా ఉన్న నేతలు, మోతుబరులు సామాజిక నేతలంతా జనతా వైపు. దళితవాడల్లో ప్రచారానికి వెళితే.. అమ్మో మళ్లీ రావద్దని మొహంమీదే చెప్పేవాళ్లు. గ్రామాల్లోని బలమైన నేతలంతా జనతా పక్షాన ఉండడమే వారి భయానికి కారణం.
 
విద్యార్థులతో కలిసి ఆయా గ్రామాల్లో తిరిగి చంద్రబాబు ప్రచారం చేశారు. నరిసింగాపురం లాంటి గ్రామాల్లో అసలు ప్రచారానికే రానివ్వం అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయినా చంద్రబాబు నిరుత్సాహపడలేదు. నాయకులను వదిలేసి నేరుగా ఆయన జనం వద్దకే వెళ్లారు. ప్రతీ ఇల్లు తిరిగారు. ప్రతీ గడపా ఎక్కిదిగారు. ఒకరిద్దరు స్నేహితులతో అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా తిరిగారు. అప్పట్లో కార్లు పెద్దగా వాడింది లేదు. ఒకటి, రెండు కార్లు... ఒక కారు ఉంటే 15 మంది ఎక్కేవారు. డిక్కీలో కూడా కూర్చోని వెళ్లడమే. ఐదారు గ్రామాలకు వెళ్లి... ఒక్కో గ్రామంలోనూ ముగ్గురిని వదిలేవారు. కొంతమంది బైకులపై వెళ్లేవారు. మరికొందరు నడిచే తమకు అప్పగించిన ఊరుకు చేరుకుని ప్రచారం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల సమితి కీలకంగా ఉండేది. ఆ సమితిలో జనతా పార్టీకి ఆధిక్యం వస్తుందని అంచనా. అదే నిజమయితే తన ఓటమి ఖాయమని చంద్రబాబు గ్రహించారు.
 
పొలింగ్‌కు కొద్ది రోజుల ముందే ఆ పాకాలసమితిలో పట్టున్న స్థానిక నేత వద్దకు చంద్రబాబు వెళ్లారు. మన ప్రాంతానికి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. యువతను ప్రొత్సహించండని కోరారు. అప్పటికే విశ్వవిద్యాలయాల స్థాయిలో జరిగిన ఎన్నికలు, పరిణామాలను చర్చించారు. ఇవన్నీ ఆ స్థానిక నేతను చంద్రబాబు వైపుకు మళ్లించాయి. మద్దతు ఇస్తామని ఆయన మాటిచ్చారు. ప్రచారం, పోలింగ్ నాటి అనుభవాలతో మధ్యలో వచ్చిన ఒక్క రోజు.. అంటే 40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మొత్తం పరిస్థితిపై చంద్రబాబు తన మిత్ర బృందంతో చర్చించారు. ఓట్ల లెక్కింపు రోజు ఏజెంట్లుగా ఎవరెవరు ఉండాలో నిర్ణయించారు. ఆ రాత్రే మిత్ర బృందాన్ని చంద్రగిరికి పంపేశారు. చంద్రగిరి తాలూకా కార్యాలయం వద్దే వారు ఉన్నారు. చంద్రబాబు మాత్రం తిరుపతిలోనే ఉండి లెక్కల పనిలో మునిగారు. అసలు ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్నది బాబు ముందుగానే సర్వే చేయించారు.
 
అప్పట్లో సర్వే బృందాలంటే విద్యార్థులే. తనమిత్ర బృందంతోనూ చంద్రబాబు సర్వేలు చేయించేవారు. అదే సమయంలో తాను ప్రచారం చేసిన చోట తన వెనుక కొందరు ఉండేలా చూసేవారు. తన గురించి, ఎన్నికల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆరా తీయిచేవారు. ఆ విషయం మనసులో పెట్టుకుని ఓటర్ల జాబితాను ముందేసుకుని లెక్కలు వేసుకునేవారు. గెలుపు తథ్యం అని నిర్ణయానికి వచ్చాక.. ఆరోజు తెల్లవారుజామున కొద్దిసేపు కునుకు తీశారు. 1978 ఫిబ్రవరి 27న ఫలితాలు రావడం మొదలైంది. చంద్రగిరి నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌లో జనతా పార్టీకే ఆధిక్యం. 2, 3 అలా తొలి దఫా రౌండ్లన్నీ జనతా పార్టీకే మెజారిటీ వస్తోంది. చంద్రబాబు వర్గం విద్యార్థులు ఒక దశలో మెత్తబడ్డారు. ప్రచారం చేసినవారు డీలపడ్డారు. మన లెక్కలు తప్పాయా? ఏంటిలా? అందరిలోనూ మౌనం. తొలి రౌండ్లన్నీ మనకు అంతగా బాగాలేని ప్రాంతాలవని, పాకాల సమితి రానివ్వండి... మనం గెలుస్తున్నాం అని చంద్రబాబు అంచనా వేశారు. చివరికి అదే జరిగింది. చివరి రెండు రౌండ్లలో ఆధిక్యం సాధించారు. అంతిమంగా 2,494 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. ఆయన వేసిన లెక్కలు నిజమయ్యాయి. ఎస్వీ వర్శిటీలో సంబరాలు. ఆ తర్వాత చంద్రబాబు పాకాలసమితిలో తనకు మద్దతు ఇచ్చిన నేతల ఇంటికే ముందుగా వెళ్లి ధన్యవాదాలు చెప్పారు. సీఎం చంద్రబాబు జీవితం అందిరికీ స్పూర్తి దాయకం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ వేత్త చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక పురోగతిలో చంద్రబాబుదే ప్రధాన భూమికగా పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Chief Minister N. Chandrababu Naidu, a tech savvy, has completed 40 years of political life. He has apparently set a trend in re-engineering political leadership. From taking pride on calling himself the Chief Executive Officer (CEO) of Andhra Pradesh in undivided Andhra Pradesh, Mr. Naidu moved on to Core DashBoard and Real Time Governance (RTG) post bifurcation leaving his visitors awestruck.

“This February marks the 40 years of my political journey. I had everything in my political career. I shall continue my relentless fight for Andhra Pradesh,” he said a couple of days ago.

Starting as a youth leader, Mr. Naidu became a local youth Congress president and MLA in 1978. By serving as Chief Minister from 1995-2004 and as Opposition leader for a decade (2004-2014), he saw both successful and turbulent years. He survived an attempt on his life when suspected People’s War Naxalites exploded an improvised claymore mine targeting his motorcade on the Tirumala ghat road in 2003. Probably every page in his political life is interesting and inspiring. He is best known for his focus on urban governance and likes to try out innovative ideas, especially when it came to governance and technology.

“And perhaps the only Chief Minister whose objectives and achievements are difficult to describe without using terms from classic management texts. He is an institution himself,” says TDP politbureau member and Agriculture Minister Somireddi Chandramohan Reddy.

 

Empty coffers

Mr. Naidu’s associates recall that the coffers were empty when he took the reins in 1995. An astute Mr. Naidu released 12 white papers on the State finances and other issues and introduced many market-based reforms while at the same time formulating many populist schemes which none of his predecessors did. During his third stint as CM now, the welfare programmes are being taken to saturation level.

The coffers were empty again and AP was facing revenue deficit when he returned to power post- bifurcation. A tweak in the nomenclature of the weekly calendar — Somavaram polavaram (Monday is Polavaram day) offers vision of and a revealing insight into Mr. Naidu, they say.

Mr. Naidu played a key role in the economic development of the united Andhra Pradesh and was striving to develop AP now. He is very adept in turning the difficulties into opportunities, says Finance Minister Yanamala Ramakrishnudu.

 

Singapore role

And the high rise towers of Cyberabad and the Hi-tech city erased from memory the question of ethics and events of the party coup in 1995. Now, Mr. Naidu, an ardent admirer of Singapore and its founding father, the late Lee Kuan Yew, has roped in entities from the city-state in designing and developing the new capital Amaravati.

Minister Kala Venkat Rao

says Mr. Naidu has been running against time from the day he returned to power in 2014. He reveals his goal for years to come. “We will live the dream of linking the five major rivers. Once it is a reality, AP would be free from drought! I shall continue my relentless fight for the State,” he says.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...