Jump to content

అక్కడ పెళ్లి కొడుకులు..అద్దెకు దొరుకుతారు


Paidithalli

Recommended Posts

ఆ రోజు కియా ఖా వివాహం. బంధువులందరూ వచ్చి పెళ్లి పనులు చూస్తున్నారు. ఇళ్లంతా సందడిగా ఉంది. హడావిడిగా ఎవరి పనుల్లో వారున్నారు. కియా మాత్రం వాళ్ల సంప్రదాయం ప్రకారం అందంగా తయారై కూర్చోనివుంది.వచ్చిన వాళ్లందరూ కియాను చూసి ‘ఎంత అందంగా ఉందో’అంటూ బుగ్గలను గిల్లి పోతున్నారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని ఉన్నా కియాకు మాత్రం ఏదో తెలియని భయం. పెళ్లన్న మాటే గానీ కియాకు ఏ మాత్రం మనశ్శాంతిగా లేదు. ఎక్కడ నిజం తెలిసిపోతుందేమోనని వెన్నులో వణుకు పుడుతోంది. చుట్టూ అవసరానికి మించి ఏసీలున్నా ముఖమంతా చెమటలు పట్టిపోతున్నాయి. ముహూర్త గడియ రానే వచ్చింది. కియా అనుకున్న విధంగానే పెళ్లైపోయింది. అక్కడి స్థానికాధికారులు వచ్చి కియా వివాహం జరిగినట్టు అధికారిక ధ్రువపత్రం జారీ చేశారు. ఓ ఇరవై నిమిషాల తర్వాత చూస్తే పెళ్లి కొడుకుతో సహా అక్కడికి వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోతున్నారు. చివరికి కియా మాత్రమే మిగిలింది. పెళ్లికూతురును వదిలేసి వరుడు వెళ్లిపోవడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే వాళ్లందరూ అద్దెకు వచ్చిన పెళ్లికొడుకు, బంధువులు, అతిథులు. ఇంతకీ విషయమేంటంటే... కియా ఇప్పుడు మూడు నెలల గర్భిణి. ఈ నిజం తెలిస్తే ఇంట్లో వాళ్లు ఎక్కడ ఆమెను చంపేస్తారోనని ఈ తతంగాన్ని నడిపింది. పెళ్లికాకుండా తల్లయిందన్న నిజం ఎవరికీ చెప్పకుండా పెళ్లిచేసుకుని కొద్దిరోజుల తర్వాత కియాకు ఆమెభర్తకు మనస్పర్థలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకున్నా్మని ఇంట్లో చెప్పాలని ప్రణాళిక వేసుకుంది. అనుకున్న విధంగానే అద్దె వీరందరూ లభించడంతో పెళ్లితంతు జరిగిపోయింది. కేవలం ఒక్క కియానే కాదు వియత్నాంలోని అనేకమంది యువతులది ఇదే దారి. నిజమే వియత్నాంలో అద్దెకు బంధువులు, వరుడు, వధువు దొరికే బిజినెస్‌ లాభదాయకంగా ఉన్నట్టు  సమాచారం.వియత్నాంలో 30ఏళ్లలోపు  వయసు కలిగిన వాళ్లు 93మిలియన్ల మంది ఉన్నారు.ఇక్కడ యువతీయువకులు సహజీవనం చేసే పద్ధతి ఎక్కువగా ఉండటంతో 30%కి పైగా యువత అద్దె వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా గత పదేళ్ల కాలంలో అబార్షన్ల రేటుకూడా పెరిగిందని అక్కడి నేర, వైద్య విభాగ అధికారులు చెబుతున్నారు. అయితే సహజీవనం చేసిన తర్వాత సామాజిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలా అద్దె వివాహాలు చేసుకుంటున్నారు. ఒక్కోసారి విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులే ఇలాంటి పెళ్లిళ్లు చేయించడం గమనార్హం.

సంవత్సరానికి వేల సంఖ్యలో ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయనీ, ఇప్పటి వరకూ ఇలాంటి నకిలీ వివాహాలు ఎన్ని జరిగాయనడానికి లెక్కేలేదని అద్దె బంధువుల వ్యాపారుల్లో  ఒకరైన  ఎన్‌గుయాన్‌ షువాన్‌ అంటున్నారు. పెళ్లికాకుండా తల్లయితే సమాజం వారినెలా చూస్తుందోననీ, ఇంట్లో వారి గౌరవానికి భంగం కలుగుతుందని 70శాతం యువత భావిస్తున్నట్లు ఇవాన్‌ ఇయాన్‌ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటున్నారు. ఇలాంటి ఆలోచనల వల్లే యువత నకిలీ పెళ్లిళ్ల బాట పడుతున్నారని విశ్లేషించారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...