Jump to content

కొలువు చిన్నదైనా కోట్లలో అవినీతి


TampaChinnodu

Recommended Posts

కొలువు చిన్నదైనా కోట్లలో అవినీతి 
అనిశా వలకు చిక్కిన మూడు అవినీతి చేపలు 
పట్టుబడ్డ ఇద్దరు వీఆర్వోలు, ఒక చైన్‌మన్‌ 
  బినామీ పేర్లతో లావాదేవీలు 
రూ.60 కోట్ల గుర్తింపు 
03ap-main7b.jpg

03ap-main7a.jpgకొలువు చిన్నదైనా కోట్లకు పడగలెత్తిన ముగ్గురు ఉద్యోగులు ఒకేరోజు అవినీతి నిరోధకశాఖకు చిక్కారు. వీరిలో ఒకరు ఏకంగా సెటిల్మెంట్ల కోసం ప్రైవేటు కార్యాలయాన్నే నిర్వహిస్తున్నారు. అవసరమైతే  బెదిరించడానికి డమ్మీ తుపాకీ దగ్గర పెట్టుకున్నారు. బినామీల పేర్లతో ఎక్కడికక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. పట్టుబడ్డ ముగ్గురు అవినీతి సిబ్బందిలో ఇద్దరు వీఆర్వోలు కాగా, ఒకరు చైన్‌మన్‌. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు అనిశా అధికారులు 15 బృందాలుగా ఏర్పడి 21 చోట్ల ఏకకాలంలో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించి ... ఈ ముగ్గురి అవినీతి బండారం బయటపెట్టారు. ఇద్దర్ని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బహిరంగ మార్కెట్‌ ప్రకారం వీరి ఆస్తులు రూ.60 కోట్లపైనే ఉంటాయని గుర్తించారు. మార్కెట్‌ ఇటీవల అవినీతికి పాల్పడి పట్టుబడ్డ ఉన్నతాధికారులనే తలదన్నేలా వీరి వ్యవహారం ఉండడం అనిశా అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒక్కొక్కరి అక్రమాల తీరు, ఆస్తుల చిట్టా వీఆర్‌ఓ సంజీవ్‌ స్వాహా పర్వం... 
2008లో ప్రభుత్వ సేవల్లోకి చేరిన సంజీవ్‌కుమార్‌ విశాఖ నగర పరిధిలోని మద్దిలపాలెం క్లస్టర్‌-5, రామ్‌నగర్‌ క్లస్టర్‌లో 2015 వరకు సేవలందించారు. ప్రస్తుతం మల్కాపురం క్లస్టర్‌ వీఆర్వోగా ఉన్నారు. సీతమ్మధార పరిధిలోని పీఎన్‌టీ కాలనీలో నివాసం సహా అక్కయ్యపాలెం, మూలగడ, అనకాపల్లి, మునగపాక మండలంలోని చూచుకొండలలో అనిశా బృందాలు సోదాలు చేశాయి. నగరంలో అనధికార వ్యవహారాలకు ఓ ప్రైవేటు కార్యాలయం నడుపుతున్నట్లు గుర్తించాయి. దానికి తహసీల్దార్‌ కార్యాలయం ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ పేరుతో నామఫలకం పెట్టారు. డస్టర్‌ కారును వినియోగిస్తున్నారు.  అనకాపల్లిలోని కొత్తూరులోని ఆయన నివాసôలో డమ్మీ తుపాకీని అధికారులు కనుగొన్నారు.

ఇదీ అక్రమాస్తుల చిట్టా.. 
* పేరు: కాండ్రేగుల సంజీవ్‌కుమార్‌ 
* హోదా: వీఆర్వో, మల్కాపురం క్లస్టర్‌, విశాఖపట్నం అర్బన్‌ మండలం 
* ఆదాయానికి మించిన ఆస్తులు: రూ.3,77,12,001 (పుస్తక విలువ) (733.090 గ్రాముల బంగారం,  రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.6,440 నగదు, రూ.1,23,336 విలువైన స్థిర డిపాజిట్లు, ఐదు బ్యాంకుల్లో ఖాతాలు, విలువైన పత్రాలు) 
* బహిరంగ మార్కెట్‌లో విలువ: సుమారుగా రూ. 40 కోట్లుపైనే.. 
* కాండ్రేగుల సంజీవ్‌కుమార్‌ పేరుతో అనకాపల్లిలో 2,800 చదరపు అడుగుల జీ ప్లస్‌ 2 నివాసం ఉంది. హుండాయ్‌ సొనాటా ఎస్‌20 కారు, హోండా ద్విచక్రవాహనం. 
* భార్య రమ్య పేరుతో 385 చదరపు గజాల స్థలంలో జీ ప్లస్‌ త్రీ అపార్టుమెంటు, ఖాళీ స్థలం. గాజువాకలోని చినగంట్యాడ దగ్గర జీ ప్లస్‌ 1 భవనం. 
* కుమారుడు దినేష్‌కుమార్‌ పేరుతో అనకాపల్లిలో విజయ మెడికల్‌ సెంటర్‌, నర్సీపట్నం, ఎలమంచిలిలో దినేష్‌ మెడికల్‌ సెంటర్లు. పెదగంట్యాడ సమీపంలోని ఏపీ-ఐలాలో దినేష్‌ సిమెంటు పరిశ్రమ- ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమ. ఆటోనగర్‌లో ఇటుకల పరిశ్రమ ఉంది.

బినామీ ఆస్తులు.. 
* దాసరి డేనియల్‌ పేరుతో విశాఖ నగరంలోని చినవాల్తేరులో 3,767.23 చదరపు గజాల ఖాళీ స్థలం. దీని పుస్తక విలువ రూ.1,18,69,000. ఇందులో సంజీవ్‌కుమార్‌ వాటా: రూ.59,34,500. 
* విశాఖలోని చినగదిలి ప్రాంతంలో రూ.8,13,12,00 పుస్తక విలువున్న 1.60 ఎకరాల ఖాళీ స్థలం కొనుగోలుకు సంజీవ్‌కుమార్‌ రూ.20 లక్షలు అడ్వాన్సు ఇచ్చారు. 
* విశాఖ నగరంలోని పరదేశిపాలెం వద్ద 3.31 ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ విలువ రూ.2 కోట్లకు కొనుగోలు చేసేందుకు రూ.20 లక్షలు అడ్వాన్సు చెల్లించారు. 
* మరో బినామీ వి.ఉమాశంకర్‌ పేరుతో ఎండాడ ప్రాంతంలో 1694 చదరపు గజాల స్థలం కొనుగోలుకు రూ.3 లక్షలు అడ్వాన్సుగా చెల్లించారు. 
* బీశెట్టి గణేశ్వరరావు పేరుతో విశాఖ నగరంలోని వేపగుంట ప్రాంతంలో 13,897 చదరపు గజాల స్థలం అభివృద్ధికి తీసుకుని రూ.12 లక్షలు అడ్వాన్సు ఇచ్చారు.  ఈ భూమిని రూ.1.07 కోట్ల రిజిస్ట్రేషన్‌ విలువకు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 
* పిల్లి శ్రీనివాస్‌ పేరుతో నగరంలోని చంద్రవానిపాలెంలో 1.08 ఎకరాల ఖాళీ స్థలం కొనుగోలుకు రూ.2 లక్షల అడ్వాన్సు ఇచ్చినట్లు గుర్తించారు. 
* సంజీవ్‌కుమార్‌ భార్య కరణం రమ్య, బంధువు దాడి శ్రీరామకృష్ణ పేర్లతో వడ్లపూడిలో 80 సెంట్ల ఖాళీ స్థలం. ఇందులో సంజీవ్‌కుమార్‌ వాటా రూ.1.50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇక్కడే మరో 80 సెంట్ల స్థలం కొనుగోలుకు రూ.3 లక్షల అడ్వాన్సు ఇచ్చినట్లు గుర్తించారు. 
* సంజీవ్‌కుమార్‌ స్నేహితుడు వై.భీమారావు పేరుతో మద్దిలిపాలెంలో రూ.66.35 లక్షల విలువైన 1065 చదరపు గజాల స్థలం కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. మరో స్నేహితుడు టి.రమేష్‌కుమార్‌ పేరుతో మధురవాడలో 3.25 ఎకరాల భూమి కొనుగోలుకు రూ.2 లక్షల అడ్వాన్సు ఇచ్చారు. మరోస్నేహితుడు చౌదరి పేరుతో మధురవాడలో 5 ఎకరాల స్థలం కొనుగోలుకు రూ. 32.32 లక్షల అడ్వాన్సు ఇచ్చినట్లు గుర్తించారు. 
* ఆదిత్య వర్ధన డెవలపర్స్‌ పేరుతో విజయనగరం జిల్లా కొత్తవలసలో 200 ఎకరాల భూమి కొనుగోలుకు రూ.43 లక్షల అడ్వాన్సు ఇచ్చినట్లు గుర్తించారు.

ఆసుపత్రిలో సంజీవ్‌కుమార్‌ 
సోదాలు జరుగుతున్న సమయంలో బినామీల గురించి అనిశా అధికారులు సంజీవ్‌కుమార్‌ను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డ ఆయన తను చాలా కష్టాల్లో ఉన్నానని చెబుతూ వచ్చారు. అకస్మాత్తుగా గుండె నొప్పి వస్తోందని చెప్పడంతో వెంటనే అనిశా అధికారులు ఆయన్ను నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

ముని‘కోటి’... 
1997లో జీవీఎంసీలో మజ్దూర్‌గా చేరిన ఈయన జోన్‌-2, 3,4లలో పనిచేశారు. ప్రస్తుతం జోన్‌-3 విద్యుత్తు విభాగంలో గతేడాది సెప్టెంబరు నుంచి పనిచేస్తున్నారు. నాగేశ్వరరావుకు విశాఖ నగరంలోని హెచ్‌బీ కాలనీలో 3046 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ 2 ఇల్లు ఉంది. ఓ ద్విచక్రవాహనం ఉంది. 
* భార్య సూర్యప్రభ పేరుతో ఆనందపురం మండలం గంభీరంలో 320 చదరపు గజాల ఇంటి స్థలం, బజాజ్‌ పల్సర్‌ ఉన్నట్లు గుర్తించారు. 
* కుమారుడు హిమశంకర్‌ పేరుతో హెచ్‌బీ కాలనీలో 1080 చదరపు అడుగుల జీ ప్లస్‌ 2 ఇల్లు ఉంది. మారుతి సిఫ్ట్‌ డిజైర్‌ వీడీఐ కారు, మరో కారు ఉన్నట్లు గుర్తించారు.  కోడలు హిరణ్మయి పేరుతో వెస్పా వీఎస్‌ బీఎస్‌ఐఐఐ ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించారు. హిరణ్మయి తల్లి ఆర్జి వెంకటలక్ష్మి పేరుతో టీవీఎస్‌ స్కూటీ ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించారు. 
* పేరు: మునికోటి నాగేశ్వరరావు 
* హోదా: చైన్‌మన్‌, జోన్‌-3, జీవీఎంసీ 
* ఆదాయానికి మించిన ఆస్తులు: రూ.1,31,66,000 (పుస్తక విలువ)  (5555 గ్రాముల బంగారు ఆభరణాలు, వెయ్యి గ్రాముల వెండి, రూ. 3 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.5 లక్షల స్థిర డిపాజిట్లు, రూ.41 లక్షల బ్యాంకు నిల్వ, రూ.1.21 లక్షల నగదు, ఇతర పత్రాలు) 
* బహిరంగ మార్కెట్‌లో విలువ: సుమారుగా రూ. 10.50 కోట్లు

వీఆర్వో వెంకటేశ్‌ తీరిదీ... 
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గాజువాకలోని నివాసంతోపాటు సీతమ్మధార, గోపాలపట్నం, ఎస్‌.రాయవరం మండలంలోని దార్లపూడి, నర్సీపట్నం మండలంలోని పెదబొడ్డేపల్లిలో అనిశా సోదాలు సాగాయి. వీఆర్వోగా 2008లో ప్రభుత్వ సేవల్లోకి వచ్చిన ఈయన ప్రస్తుతం మద్దిలపాలెం క్లస్టర్‌-5లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వరరావు పేరుతో మారుతి సిఫ్ట్‌ వాహనం ఉంది.  కొడుకు చైతన్య, వెంకటేశ్వరావు అత్త ఎస్‌.సత్యవతి పేరుతో గాజువాక మండలం చినగదిలి గ్రామంలోని శ్రామిక్‌నగర్‌లో 290 చదరపు గజాల ఇంటి స్థలం. గాజువాకలో జి ప్లస్‌ 1 తరహాలో రెండు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అనిశా డీజీ ఆర్‌.పి.ఠాకూర్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ బృందం ఈ తనిఖీలు చేసింది. 
* పేరు: పొలిశెట్టి వెంకటేశ్వరరావు 
* హోదా: వీఆర్వో, మద్దిలపాలెం క్లస్టర్‌, విశాఖపట్నం అర్బన్‌ మండలం 
* ఆదాయానికి మించిన ఆస్తులు: రూ.1,11,25,000 (పుస్తక విలువ) (190 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.3.70 లక్షల నగదు, యాక్సిస్‌ బ్యాంకులో లాకరు) 
* బహిరంగ మార్కెట్‌లో విలువ: సుమారుగా రూ.10 కోట్లుపైనే..

లాకరులో వెండి, బంగారం... 
మద్దిలపాలెం క్లస్టర్‌ వీఆర్వో వెంకటేశ్వరరావుకు చెందిన బ్యాంకు లాకరులో బంగారం, వెండిని అనిశా అధికారులు గుర్తించారు. ఎన్‌ఏడీ కూడలి ప్రాంతంలోని యాక్సెస్‌ బ్యాంకు లాకరులో 740 గ్రాముల బంగారం, కేజీ వెండి గుర్తించామని.. మరికొందరి బ్యాంకు లావాదేవీలపైనా ఆరా తీయాల్సి ఉందని అనిశా అధికారులు చెబుతున్నారు.

-ఈనాడు, విశాఖపట్నం
Link to comment
Share on other sites

అవినీతి శతకం! 
వీఆర్వో ఆస్తి రూ.100 కోట్లు 
బయటపడుతున్న  సంజీవ్‌కుమార్‌ అక్రమార్జన 
రూ.3.77 కోట్ల నుంచి రూ.6.36 కోట్లకు పెరిగిన 
పుస్తక విలువ  బినామీల ముసుగులో అంతులేని ఆస్తులు 
చైన్‌మన్‌ నాగేశ్వరరావు ఖాతాలో మరో రూ.10 కోట్ల విలువైన స్థలం 
ఈనాడు - విశాఖపట్నం 
04ap-main4a.jpg

తీగ లాగితే కోట్ల డొంక కదులుతోంది. అక్రమాల చిట్టా ఒక్కొక్కటి వెలుగుచూస్తోంది. బహిరంగ విపణిలో రూ.40 కోట్లనుకున్న విశాఖపట్నం అర్బన్‌ మండలం మల్కాపురం క్లస్టర్‌ వీఆర్వో సంజీవ్‌కుమార్‌ అక్రమార్జన తాజాగా ఏకంగా రూ.100 కోట్లు దాటేసింది. శనివారం జరిపిన సోదాల్లో పుస్తక విలువ రూ.3.77 కోట్ల అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలు లభించాయి. మరిన్ని కీలక పత్రాలు, ఖాళీ చెక్కు పుస్తకాలు, కారులో ల్యాప్‌టాప్‌, ఇతర సాక్ష్యాలను అనిశా అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దీంతో పుస్తక విలువ రూ.6.36 కోట్లకు చేరింది. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న ఈ ఆస్తుల ధరలను బట్టి చూస్తే విపణి విలువ రూ.వంద కోట్లకుపైనే ఉంటుందని అధికారులు వెల్లడించారు.

మద్దిలపాలెం సమీపంలోని శ్రీసాయి ఆదిత్య నిలయంలో 303 నంబరు ఫ్లాటులో నిర్వహిస్తున్న ప్రైవేటు కార్యాలయానికి తాళాలు వేసి అక్కడి ప్రైవేటు సిబ్బంది పరారయ్యారు. అక్కడ ఒక్కొక్కరికి రూ.25 వేల జీతాలిచ్చి సంజీవ్‌కుమార్‌ నియమించుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ అనధికార కార్యాలయంలో సోమవారం సోదాలు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొగ్గు వెంకటసుబ్రహ్మణ్యం మల్లిఖార్జునరావు అనే ఇంజినీరును బినామీగా పెట్టి ఆదిత్యవర్థన్‌ బిల్డర్స్‌ అండ్‌ డెెవలపర్స్‌ను ప్రారంభించాడు.  భూములు కొనుగోలు చేస్తూ, వాటిలో బహుళ అంతస్తులను నిర్మిస్తూ విక్రయిస్తున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఈ బినామీని ఆదివారం విచారించారు. రూ.50 కోట్ల వరకు ఈ లావాదేవీలు జరిగి ఉండవచ్చని అంచనా వేశారు. మరికొందరు బినామీలతో సుజనా కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో మరో నిర్మాణ సంస్థ నడుపుతున్నారని గుర్తించారు. ఇక్కడా రూ.కోట్లలోనే వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. సంజీవ్‌కుమార్‌ ప్రత్యేకంగా నియమించుకున్న గణాంకాధికారి సామ ఉదయనాగరాజునూ అధికారులు విచారించారు.

04ap-main4b.jpg

తుపాకీ, కత్తి బెదిరింపులకేనా..? 
అనిశా సోదాల్లో అనకాపల్లిలోని ఎన్జీవో కాలనీలో సంజీవ్‌కుమార్‌కు చెందిన నివాసంలో డమ్మీ తుపాకీతోపాటు మరో బటన్‌ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భూముల క్రయవిక్రయాలు, సెటిల్మెంట్ల సమయంలో అవతలి పార్టీని బెదిరించడానికి వీటిని ఉంచుకున్నారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆ తుపాకీ మీట నొక్కితే అగ్గిరవ్వలు వస్తున్నాయి. 
* విజయనగరం జిల్లా గణుగుబూడిలో సంజీవ్‌కుమార్‌ ఏకంగా 200 ఎకరాల కొనుగోలుకు అడ్వాన్సు ఇవ్వడంతోపాటు సంజీవ వనం పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు తేలింది. చాలా భూములకు ఇదేలా అడ్వాన్సులు ఇచ్చినట్లు, మరికొన్ని కొనుగోలు చేసి అభివృద్ధి చేసి వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. సంతకాలతో కూడిన రూ.లక్షల విలువైన ఖాళీ చెక్కులనూ గుర్తించారు. వీఆర్వో సంజీవ్‌కుమార్‌, అతని కుటుంబీకులకు ఐదు బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. మూడింటిలో నిల్వలపై సోమవారం స్పష్టత రానుంది.

04ap-main4c.jpg

చైన్‌మన్‌ ఖాతాలో మరో రూ.10 కోట్లు 
జీవీఎంసీ జోన్‌-3 చైన్‌మన్‌ మునికోటి నాగేశ్వరరావు అవినీతిపై అధికారులు మరింత లోతుగా ఆరా తీయగా.. విశాఖలోని వెంకోజీపాలెంలో రూ.10 కోట్ల విలువైన 339 గజాల స్థలం ఉన్నట్లు తేలింది. దీనిపై న్యాయపరమైన చిక్కులున్నట్లు గుర్తించారు. నాగేశ్వరరావు బావమరిది గతంలో రౌడీషీటర్‌గా పోలీసు రికార్డుల్లో ఉన్నాడు. అతడికి ఎలాంటి ఉద్యోగం లేకున్నా అతడి పేరుతో రూ.85 లక్షల విలువైన ఆస్తులున్నట్లు గుర్తించామని అనిశా అధికారులు తెలిపారు.

ఇద్దరికి ఈ నెల 16 వరకు రిమాండ్‌ 
చైన్‌మన్‌ నాగేశ్వరరావు, వీఆర్వో పోలిశెట్టి వెంకటేశ్వరరావును అధికారులు అనిశా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరికి ఈనెల 16 వరకు రిమాండ్‌ విధించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వో సంజీవ్‌కుమార్‌ కోలుకున్నాక విచారిస్తారు.

04ap-main4d.jpg
Link to comment
Share on other sites

4 minutes ago, boeing747 said:

anduke ee bokkalo US lo undebadulu india poyi govt job cheskotam better..n9s3w1.gif

Agreed man. 100 crores anta. ikkada company ki VP ina raavu life time motham lo.

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

Agreed man. 100 crores anta. ikkada company ki VP ina raavu life time motham lo.

aa rate lu annnni present market rate ki estharu..govt lekkalu prakaram aite koti kuda vundadu....so vaadu fine govt lekkala prakarame vesthadu ga.......avi anni exaggerating numbers anthe....reality lo 30% kuda vundavu.

Link to comment
Share on other sites

3 minutes ago, perugu_vada said:

Enduku uncle ilanti news lu ;) 1-2weeks hawa then they will b back to their previous jobs by bribing authorities ;) waste of time for viewers 

nippu , nijayeethi , real time governance dash board lu , corruption free government ani statement isthunna valla kosam. 

Link to comment
Share on other sites

4 minutes ago, TampaChinnodu said:

nippu , nijayeethi , real time governance dash board lu , corruption free government ani statement isthunna valla kosam. 

Baanisalu baavi lo nunchi bayata ki raru kadha, be it in ap r tg ;) same situation

Link to comment
Share on other sites

6 minutes ago, TampaChinnodu said:

nippu , nijayeethi , real time governance dash board lu , corruption free government ani statement isthunna valla kosam. 

Govt officers corruption chestunnaru.....aakasmika tanikheelu pedite they cry a lot and next election time ki politicians ni munchutunnaru....

current trend enti ante....govt lets them eat......ACB tho daadulu cheyinchi, get back whatever they have earned....cancel their PF and other related stuff, add it to govt....

Revenue lotu ni koddiga ayina aapataniki current AP govt tactic idi......Last 2.5 years ga nadustondi.....Govt employees circle lo joke aipoindi.....they all know who is corrupt and who is going to get targeted next......Most of them have worked during united AP and have holdings in both states....

Link to comment
Share on other sites

12 minutes ago, TampaChinnodu said:

nippu , nijayeethi , real time governance dash board lu , corruption free government ani statement isthunna valla kosam. 

One person avineethi ni govt ki antagattadam tappemo.....what those individuals have earned has been over past 20 years...

oka ayana majdoor ga join ayyi 10C valuation lo unnadu anta...ridiculous corruption....

Link to comment
Share on other sites

1 minute ago, Peacemaker said:

Govt officers corruption chestunnaru.....aakasmika tanikheelu pedite they cry a lot and next election time ki politicians ni munchutunnaru....

current trend enti ante....govt lets them eat......ACB tho daadulu cheyinchi, get back whatever they have earned....cancel their PF and other related stuff, add it to govt....

Revenue lotu ni koddiga ayina aapataniki current AP govt tactic idi......Last 2.5 years ga nadustondi.....Govt employees circle lo joke aipoindi.....they all know who is corrupt and who is going to get targeted next......Most of them have worked during united AP and have holdings in both states....

Real ga rides lo dorikinolla nunchi money raabadutunara ? If so y govt not declaring those amounts after a while ? Y is d news going under d water ? 

Link to comment
Share on other sites

1 minute ago, Peacemaker said:

Govt officers corruption chestunnaru.....aakasmika tanikheelu pedite they cry a lot and next election time ki politicians ni munchutunnaru....

current trend enti ante....govt lets them eat......ACB tho daadulu cheyinchi, get back whatever they have earned....cancel their PF and other related stuff, add it to govt....

Revenue lotu ni koddiga ayina aapataniki current AP govt tactic idi......Last 2.5 years ga nadustondi.....Govt employees circle lo joke aipoindi.....they all know who is corrupt and who is going to get targeted next......Most of them have worked during united AP and have holdings in both states....

Will appreciate the government if that really happens atleast now. In the past it didn't happened. Malli ade jobs lo join ayye vallu political influence use sesi, leaders ki bribes ichi. And those court cases takes decades to get resolved , and by that time they will be dead any way.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...