Jump to content

Mukkayana third front pedithe


kiraak_poradu

Recommended Posts

కేసీఆర్ కు జై కొడుతున్న పింక్ మీడియా, ఎల్లో మీడియా వర్గాల కథనాలను.. కేసీఆర్ మూడో ఫ్రంట్ ప్రకటనతో ఢిల్లీ ఊగిపోతోందన్న ఊకదంపుడు మాటలను పక్కన పెట్టి చూస్తే.. లాజికల్ గా ఆలోచిస్తే.. కేసీఆర్ మూడో ఫ్రంట్ ప్రకటన రాంగ్ టైమింగ్ అని స్పష్టం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. దేశ రాజకీయ స్థితి గతులను గమనిస్తే.. మూడో ఫ్రంట్ అనేది ఏ మాత్రం నిలిచే అవకాశం లేదనే స్పష్టం అవుతోంది.

కేసీఆర్ ప్రకటన, దేశ రాజకీయ పార్టీల్లో వాళ్ల వాళ్ల పరిస్థితిపై చర్చ.. అనే రెండు అంశాలకు సంబంధించిన వార్తలను గమనిస్తే ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. త్రిపురలో తగిలిన ఎదురుదెబ్బతో సీపీఎంలో కలకలం బయల్దేరింది. వ్యూహాత్మకంగా తప్పిదాలతో ముందుకు వెళ్తున్నాం అని ఆ పార్టీ వారు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది.

మళ్లీ కోలుకోవాలంటే ఏం చేయాలి? అని ఎర్రమేధావులు తర్కించుకోగా.. వాళ్లు తేల్చినది ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లడమే మార్గమని! వరస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఎర్రన్నలు ఇక చేయగలిగింది ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులేద్దామని అనుకున్నారని జాతీయ పత్రికలు పేర్కొంటూ ఉన్నాయి. నేషనల్ మీడియాలో వచ్చిన ఈ వార్తలకూ.. కేసీఆర్ ప్రకటనకూ ఏ మాత్రం సంబంధం లేదు. రెండూ ఒకటే సారి బయటకు వచ్చాయంతే.

త్రిపురలో ఫలితం అనంతరం.. కాంగ్రెస్ తో సఖ్యతగా వెళ్దాం, 2004 నాటి పలితాలు అయినా పొందుదాం.. అనేది కమ్యూనిస్టుల ఆశగా కనిపిస్తోంది. అయితే.. ఆ మాత్రం పొందే అవకాశం కూడా కనిపించడం లేదు కమ్యూనిస్టులకు. 2004లో నాటి ఉమ్మడి ఏపీలో కూడా కమ్యూనిస్టులకు తగురీతిలో ఎంపీ స్థానాలు దక్కాయి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. బెంగాల్ లో వీళ్ల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఏతావాతా మిగిలింది కేరళ. అక్కడ కాంగ్రెస్ తో కయ్యమే. గత 15యేళ్లలో బలపడిన వివిధ ప్రాంతీయ పార్టీలు కమ్యూనిస్టులను దారుణంగా దెబ్బతీశాయి.

బెంగాల్ లో మమత, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో బాబు- జగన్, వంటి వాళ్ల బలం అనూహ్యంగా కమ్యూనిస్టులకు కోలుకోలేని దెబ్బగా మారింది. మరోవైపు బీజేపీ బలపడటం.. కమ్యూనిస్టులకు కష్టాలను తెచ్చిపెట్టింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర.. కూటమి అంటే అందులో కమ్యూనిస్టులు కీలకంగా ఉండాలి. వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ కు వేలడదాం.. అనే స్థితికి వచ్చారు.

ఇక ఇలాంటి మూడో కూటముల్లో రెండో పాత్ర ఎస్పీ, బీఎస్పీ, జనతా పేరుతో ఉన్న పార్టీలవి. ఎస్పీ, బీఎస్పీలు మొన్నటి యూపీ అసెంబ్లీ ఎన్నికలతోనే ఢీలా పడిపోయాయి. వచ్చేసారి.. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేద్దాం అనే భావనతో ఎస్పీ, బీఎస్పీలున్నాయి. యూపీలో జరగబోయేది కూడా అదే. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తుతో రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.

అవి ఎలా మూడో కూటమిలోకి వస్తాయి? ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీల శత్రువు బీజేపీయే. కాంగ్రెస్ కానే కాదు! కేసీఆర్ కు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద శత్రువు! ఇక ఆర్జేడీ కూడా కాంగ్రెస్ ను వదిలి వచ్చే స్థితి లేదు. అన్నాడీఎంకేను బీజేపీ బంధించేసింది. డీఎంకే అవకాశాన్ని బట్టి బీజేపీతో అయినా జతకట్టగలదు, కాంగ్రెస్ తో అయినా ఉండగలదు. జేడీయూను మోడీ ఆక్రమించేశాడు. ఇప్పుడు ఏదయ్యా.. ఖాళీగా ఉన్న పార్టీ అంటే.. జేడీఎస్. కర్ణాటకలో ఎన్నికల మూడ్ ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లతో జేడీఎస్ తలపడుతోంది. దీంతో.. మూడో ఫ్రంట్ అంటోంది.

అయితే రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అయ్యాకా.. హంగ్ తరహా పరిస్థితులు ఏర్పడితే.. అధికారాన్ని అందుకోవడానికి కాంగ్రెస్ తో అయినా, బీజేపీతో అయినా జేడీఎస్ చేతులు కలుపుతుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు! ఇక మమతా దీదీ.. ఇప్పటికే ఆమె చెప్పారట, కాంగ్రెస్ లేని కూటమి అదెలా సాధ్యం? అని! కేసీఆర్ నే ఈ ప్రశ్న అడిగిందట. వీరావేశంతో ప్రసంగించిన కేసీఆరే దీనికి సమాధానం ఇచ్చి ఉండాలి!! ఆ సమాధానం జనాలకు కూడా ఇచ్చి.. అందరి కళ్లూ తెరిపించాలి!

Link to comment
Share on other sites

ఫస్ట్ సెక్రటేరియట్ కి వీళ్ళరా, వీక్లీ ఒకసారి పబ్లిక్ లైఫ్ లో కొచ్చే ఫార్మహౌస్ గాడు కూడా ఫ్రంట్ గురుంచి మాట్లాడ్డం.

Link to comment
Share on other sites

13 minutes ago, manadonga said:

ఫస్ట్ సెక్రటేరియట్ కి వీళ్ళరా, వీక్లీ ఒకసారి పబ్లిక్ లైఫ్ లో కొచ్చే ఫార్మహౌస్ గాడు కూడా ఫ్రంట్ గురుంచి మాట్లాడ్డం.

Em farmhouse ki velle vallu 3rd fr9nt pertodda endi  . Nuvvu Nee pulkas comment 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...