Jump to content

2019 survey ap’s cm is jagan


Raithu_bidda_

Recommended Posts

ఏపీ, తెలంగాణ రాజకీయ పరిస్థితి గురించి నేషనల్ సర్వే అంటూ వాట్సాప్ లో ఒక అధ్యయన ఫలితం సర్క్యులేట్ అవుతోంది. ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. అనే దాని గురించి పూర్తి వివరాలు లేవు కానీ.. సీట్ల సంబర్ పై ఈ సర్వే ఆసక్తిదాయకమైన విషయాలను చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే.. అనే లెక్క ప్రకారం ఈ సర్వే సీట్ల అంచనాలను చెబుతోంది.

ఏపీ, తెలంగాణల్లో... రాజకీయ పరిస్థితి గురించి ఈ సర్వే చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. స్థూలంగా ఈ సర్వే చెబుతున్న విషయం.. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు చుక్కలే అని. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు కేసీఆర్ లు జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పేసే కలలు కంటున్నారు. ప్రధానమంత్రి అభ్యర్థులం మేమే అన్నట్టుగా వీళ్లు మాట్లాడుతున్నారు.

అయితే.. వీళ్ల పరిస్థితి ఉట్టికి ఎగరలేనట్టుగా ఉందని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా ప్రస్తుత అధికార పార్టీలు మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకోవడం కష్టమే అని ఈ సర్వే చెబుతోంది. ఏపీలో అయితే అది జరిగే పని కాదని ఈ సర్వే తేల్చింది. దీని ప్రకారం.. ఏపీలో చంద్రబాబు బలం 60సీట్ల లోపుకు పడిపోతుందట.

గత ఎన్నికల్లో వంద సీట్ల వరకూ సాధించుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడు అరవై సీట్ల స్థాయికి పడిపోతాడని.. ఆ విధంగా బాబు పాలనకు ది ఎండ్ కార్డు పడుతుందని ఈ సర్వే పేర్కొంది. ఏపీలో మెజారిటీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుందని.. దాదాపు వంద సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడని ఈ సర్వేలో పేర్కొన్నారు.

ఇక మిగిలిన సీట్లను పవన్ కల్యాణ్.. ఒకవేళ కూటమిగా పోటీ చేస్తే కమ్యూనిస్టు పార్టీలు సొంతం చేసుకోగలవని తేల్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ కేసీఆర్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమే అని ఈ సర్వే తేల్చింది. అయితే కొంతలో కొంత పరిస్థితి మాత్రం చంద్రబాబు కన్నా మెరుగ్గా ఉంది. సొంతంగా 50 సీట్ల వరకూ సంపాదించుకోగలదట తెరాస. ఈ సీట్లతో మెజారిటీకి దగ్గర దగ్గరగా వచ్చే అవకాశం ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీ కొంత వరకూ కోలుకున్నా.. అధికారాన్ని సంపాదించుకోవడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ 45సీట్ల వరకూ సాధించుకోవచ్చని అంచనా. ఎంఐఎం తన సీట్లను తను గెలుచుకుంటుంది. బీజేపీ నాలుగైదు సీట్ల స్థాయిలో నిలవవచ్చు. మిగిలిన సీట్ల విషయంలో తీవ్రమైన పోటీనే ఉండవచ్చు. ఎన్నికల ముందు పొత్తులు కూడా తెలంగాణలో పరిస్థితిని నిర్ణయించగలవని ఈ సర్వే అంచనా వేసింది.

Link to comment
Share on other sites

Last chance inka Jagan ki mari..gelavakapote party ni congress lo kani bjp lo gani merge chestadu emo..ippatike 8 years paina nadipadu party ni ruling lo lekunda and ade great.inka kashtam paisalu enni ani testhadu and leaders party marakunda apaledu..gelavakapote Jagan Chiranjeevi ki em chesado CBN Jagan ki ade chestadu (leaders andarini koneyatam)..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...