Paidithalli Posted March 19, 2018 Report Share Posted March 19, 2018 అమెరికన్లలోని లోకల్ సెంటిమెంట్ ను తట్టిలేపి....అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగాలను ఇతర దేశాల వారు...ముఖ్యంగా భారతీయులు ఎగరేసుకుపోతున్నారంటూ....అమెరికన్లను ట్రంప్ రెచ్చగొట్టారు. ఆ నేపథ్యంలోనే అమెరికాలోని భారతీయులపై జాత్యాహంకార దాడులు కూడా జరిగాయి. దానికి తోడు...గత ఏప్రిల్ లో ట్రంప్...`బయ్ అమెరికన్....హైర్ అమెరికన్ ` అనే నినాదాన్ని ప్రజల్లోకి అధికారికంగా తీసుకువెళ్లారు. దీంతోపాటు హెచ్ 1 బీ వీసాల్లో కోతలు విధించడం....పలు ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ పై ఆ సంస్థకు చెందిన ముగ్గురు మాజీ ఉద్యోగులు షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను ఆ సంస్థ నుంచి అకారణంగా తొలగించారని తమ స్థానాల్లో దక్షిణ భారత దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులను నియమించారని ముగ్గురు అమెరికన్లు కోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు భారతీయులు తమకన్నా తక్కువ నైపుణ్యం గలవారని వారు ఆరోపించారు.కంపెనీలో తమపై ఉద్యోగులు కూడా భారతీయులేనని అందుకే వారు కావాలనే తమను ఇబ్బంది పెట్టి ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. అంతేకాకుండా ఆ సంస్థలో పనిచేసే భారతీయ సూపర్ వైజర్లు - సహోద్యోగులు తమకు ప్రమోషన్లు రాకుండా అడ్డుకున్నారని తాము సరిగా పనిచేయడం లేదని తమను నిందించారని ఆరోపించారు. `ది సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1964` ప్రకారం తమకు న్యాయం చేయాలని వారు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి ఆరోపణలను కాగ్నిజెంట్ సంస్థ ఖండించింది. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినపుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుందని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. కేవలం హెచ్ 1బీ వీసాల ద్వారా ఉద్యోగాలు పొందిన భారతీయులను లక్ష్యంగా చేసుకొనే వారు ఆరోపణలు చేశారని సంస్థ వాదించింది. కాగ్నిజెంట్ వాదనలతో తాను ఏకీభవిస్తున్నానని ఆ కేసును విచారణ జరపకుండానే కొట్టివేస్తున్నానని లాస్ ఏంజెలిస్ లోని డిస్ట్రిక్ కోర్టు జడ్డి జాలీ గీ తీర్పునిచ్చారు. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.