Jump to content

అమెరికాలో భారతీయ జంటకు ఏడాది జైలు!


Navyandhra

Recommended Posts

అమెరికాలోని నెబ్రాస్కాలో ఉన్న కింబాల్ లో విష్ణుభాయ్ చౌదరి(50) లీలాబెన్ చౌదరి(44) లు ఓ సెవెన్ స్టార్ హోటల్ ను నిర్వహిస్తున్నారు. 2011 - 2013 మధ్య కాలంలో తమ హోటల్ లో పనిచేసేందుకు ఓ భారతీయుడిని వారు సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండానే అమెరికాకు రప్పించారు. ఆ వ్యక్తితో వారిద్దరూ వారానికి ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా పనిచేయించేవారు. అతడితో రోజంతా ఎక్కువసేపు పని చేయించేవారు. లాండ్రీ పనులతో పాటు బాత్రూమ్ లు కూడా కడిగించేవారు. వెట్టి చాకిరి చేయించుకొని జీతం కూడా ఇవ్వలేదు. ఆ వ్యక్తి తమకు బాకీ ఉన్నాడని అందుకే చేసిన పనికి జీతం ఇవ్వకుండా వేధించేవారు. ఆమెకు నచ్చిన విధంగా బాత్రూం కడగలేదని లీలా బెన్ ...ఆ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఆ వ్యక్తి బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. దీంతో ఆ హోటల్ కు వచ్చిన కస్టమర్ - స్థానిక అధికారుల సాయంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి బయటపడ్డాడు. వారిపై ఫిర్యాదు చేయడంతో కోర్టు ...ఆ జంటకు ఏడాది జైలు శిక్ష - 25 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా ఏడాది శిక్ష పూర్తయిన తర్వాత వారిద్దరికీ రెండేళ్లపాటు దేశ బహిష్కరణ విధించింది. మానవ హక్కుల ఉల్లంఘన హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడే వారిని ఉపేక్షించబోమని తీర్పునిచ్చిన జడ్జి తెలిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, Ara_Tenkai said:

desha bahishkarana ante ekkadiki potharu??? I assume vallu US citizens kada...

india ke.. 2 years US lo undaru anthe.. tharvatha malli ravocchu 

Link to comment
Share on other sites

3 minutes ago, Navyandhra said:

india ke.. 2 years US lo undaru anthe.. tharvatha malli ravocchu 

edichinattu undi... US citizens ayithe bayataku pommanadam endi... vere punishment edaina ivvali gani...

Link to comment
Share on other sites

3 minutes ago, Ara_Tenkai said:

edichinattu undi... US citizens ayithe bayataku pommanadam endi... vere punishment edaina ivvali gani...

copied from Pedharayudu movie. Ooru Bhahiskarana.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...