Navyandhra Posted March 26, 2018 Report Share Posted March 26, 2018 సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఉద్ధృత పోరాటం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలతో అఖిల సంఘాల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఒక్కో రాజకీయ పార్టీ, సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వివిధ సంఘాలను ఈ సమావేశానికి పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం సచివాలయంలోనా లేదంటే సీఎం నివాసంలోని ప్రజాదర్బార్లో నిర్వహిస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన పోరాటానికి సంబంధించి రేపు ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఏకతాటిపై ఉన్నాయనే సంకేతాలు పంపడంతో పాటు, అంతా కలిసికట్టుగా పోరాడుతున్నామనే విషయాన్ని కేంద్రానికి తెలియజేసేందుకే ఈ అఖిల సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు ప్రభుత్వం తరఫున కూడా ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన అన్ని హామీలను సత్వరమే పరిష్కరించి రాష్ట్ర ప్రజలకు తగు న్యాయం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ రేపు అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరగకపోయినా, కేంద్రం దిగి రాకపోయినా వచ్చే నెలలో అఖిల సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు దిల్లీకి వెళ్లే ఆలోచనలో కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.