Jump to content

గంగానదిలో బాక్టీరియా పెరిగిపోతోంది


TampaChinnodu

Recommended Posts

గంగానదిలో బాక్టీరియా పెరిగిపోతోంది
పీసీబీ
08285029BRK-148.JPG

న్యూదిల్లీ: గంగానదిలో హానికారక ఫీకల్‌ కోలిఫార్మ్‌(ఎఫ్‌సీ) బాక్టీరియా పెరిగిపోతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) హెచ్చరిస్తోంది.  సాధారణంగా నీటిలో ఉండాల్సిన బాక్టీరియా కంటే గంగా, యమున సంగమమైన అలహాబాద్‌లో 5-13రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా పెరుగుదల ఉందని ఇక్కడ నదీస్నానాలు చేయడం అంతక్షేమం కాదని తెలిపింది. గంగానదీ ఘాట్ల పరిశుభ్రతపై 2017లో చేసిన అధ్యయనం తాలూకు ఫలితాలను పీసీబీ విడుదల చేసింది.

దీని ప్రకారం... సాధారణంగా నీటిలో ఉండాల్సిన బాక్టీరియా కంటే గంగానది నీటిలో 9రెట్లు ఈ.కోలి పెరుగుతోంది. సాధారణంగా ప్రతి  100మి.లీ నీటిలో 500 ఎంపీఎన్( మోస్ట్‌ ప్రోపబుల్‌ నంబర్‌)‌ ఉన్నట్లయితే వాటిని సురక్షిత నీరుగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం గంగానదిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇది 2,500ఎంపీన్‌/100మి.లీ ఉంది. ఇవి నదీ స్నానానికి ఎంతమాత్రం సురక్షితం కాదు.

పీసీబీ డేటా ప్రకారం ప్రముఖంగా పుణ్యస్నానాలు చేసే ఘాట్ల వద్దే కాలుష్యం కూడా ఎక్కువగా ఉంది. అంతేకాదు హానికారక బాక్టీరియా పెరుగుదల కూడా సుమారు 14రెట్లు అక్కడే ఉంది.

దేశంలో గంగానది ఎక్కువ భాగం ప్రవహించేది ఉత్తర్‌ ప్రదేశ్‌లోనే. ఇక్కడ మొత్తం 16ఘాట్లలో సుమారు 50శాతానికి పైగా ఘాట్లలో ఎఫ్‌సీ బాక్టీరియా పెరుగుదల 13రెట్లకు పైమాటే. బిహార్‌లో 88శాతం ఘాట్లు ఇదే విధంగా కలుషితమై ఉన్నాయి. అత్యంత కలుషితమైన గంగానది ఘాట్లలో కాన్పూర్‌, అలహాబాద్‌, వారణాసిలలో 10-23శాతం ఎఫ్‌సీ బ్యాక్టీరియా పెరుగుదల నమోదయింది. 2011లో  ఇక్కడ ఎఫ్‌సీ స్థాయి 4,000-9,300ఎంపీఎన్‌/100మి.లీ నమోదైంది.

అదే విధంగా 2017 ఆగస్టులో బక్సార్‌లో ఏకంగా ఎఫ్‌సీ స్థాయి ఆందోళనస్థాయికి చేరింది.  ఇది సాధారణం కంటే 6,400 రెట్లు ఎక్కువ.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దాదాపుగా 65%వరకూ ఘాట్ల పరిస్థితి సంతృప్తి కరంగా లేదు. బిహార్‌లో 76%ఘాట్లదీ ఇదే పరిస్థితి. వీటన్నింటికీ భిన్నంగా ఝార్ఖండ్‌లో మాత్రం గంగానది నీరు పరిశుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ సాధారణంగా ఎఫ్‌సీ ఎంత ఉండాలో అంతే ఉంది. ఇక్కడ ప్రతిఘాట్‌ కాలుష్యరహితంగాఉంది. ఉత్తరాఖండ్‌లో 98% ఘాట్లు సురక్షితంగా ఉన్నాయి.

గంగానది కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2015లో కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగ’ పేరుతో గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.20,000కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా192 ప్రాజెక్టులకు గానూ ఇప్పటికే 19,630 కోట్ల రూపాయలకు ఆమోదం లభించింది. ఇందులో 49ప్రాజెక్టులు పూర్తయినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

vammoooo  aa varanasi  em uuur raa naayanaa 

sakkaga roads undavu, hyd mandi's lo roads chaaaaalaaa better aa  uuur antha anniiii avvey galllez sannaaati old roads

 thannukoni thannukoni nadhi odduki pothey  aaa ghat metla meeda ennooo choodaalsi untundhi, konni vollu gaggurapodiche things

ppl just dont just conduct last rites/ dhahana samskaralu there, kondamanadi aythey corpses ni water loki ala vadilesthaaru

i'm never going back again . 

Link to comment
Share on other sites

3 minutes ago, sattipandu said:

vammoooo  aa varanasi  em uuur raa naayanaa 

sakkaga roads undavu, hyd mandi's lo roads chaaaaalaaa better aa  uuur antha anniiii avvey galllez sannaaati old roads

 thannukoni thannukoni nadhi odduki pothey  aaa ghat metla meeda ennooo choodaalsi untundhi, konni vollu gaggurapodiche things

ppl just dont just conduct last rites/ dhahana samskaralu there, kondamanadi aythey corpses ni water loki ala vadilesthaaru

i'm never going back again . 

Bodi gadu develof cheyaledha?

Link to comment
Share on other sites

6 minutes ago, reality said:

Bodi gadu develof cheyaledha?

aaadi G , hindutva wave lo gelichi10gaademooo 

3 minutes ago, xxxmen said:

Deniki karanam kuda pulkas a na

4 yrs aligned kada, papam lo paalu panchukunnatteee

Link to comment
Share on other sites

4 minutes ago, sattipandu said:

aaadi G , hindutva wave lo gelichi10gaademooo 

4 yrs aligned kada, papam lo paalu panchukunnatteee

Tampa chinnu news ante only pulkas gurnchi ankuna

Link to comment
Share on other sites

Sick of this govt and people too !!! Basically india lo janani apatam a devudi taram kuda kadu !!! Kotha philosophy okati putinchali ganga lo snanam cheste papam vastundi ante gani mana valu a nadhi vadilipettaru !!! Chetta clean cheste drumlu drumlu punyam vastundi ani chepte ika sudandri ganga full clean !!

Link to comment
Share on other sites

18 minutes ago, iPhoneX said:

Already uma bharati cheppindi kada..

 

andaru doddi ki koorchuni sendalam chesarani... inka aapaleda??

pls dont talk about it

naa kodukulaki siguu sheram ledhu akkada

 

Link to comment
Share on other sites

4 minutes ago, sattipandu said:

pls dont talk about it

naa kodukulaki siguu sheram ledhu akkada

 

Modi and cabinet ni Ganga lo snanam cheyyamanali telusthadi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...