Jump to content

రాజధానిలో భూ మాఫియా

TampaChinnodu

Recommended Posts

రాజధానిలో భూ మాఫియా 
ఖాళీ స్థలాలపై కన్ను 
పెద్దల పేరు చెప్పి బెదిరింపులు 
మంగళగిరి, న్యూస్‌టుడే 
amr-gen1a.jpg

రాజధాని అమరావతిలోకి వచ్చే మంగళగిరి ప్రాంతంలో కొందరు  రౌడీయిజానికి ఆజ్యం పోస్తున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఇక్కడి భూములపై కన్నేశారు. పోలీసు ఉన్నతాధికారులు, కొందరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాజధానిలో అమాయకుల పిల్లలు వేరే ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న వారిని గుర్తించి నకిలీ దస్తావేజులు సృష్టించి స్థలాలు సొంత చేసుకునే ప్రయత్నం మళ్లీ మొదలైంది. రెండేళ్ల కిందట ఇలాంటి భూ ఆక్రమణల కేసులు మంగళగిరి ప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం భూ దురాక్రమణ కేసుల్లో ఫిర్యాదు వస్తే కోర్టు అనుమతితోనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రౌడీషీటర్లతో కలిసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గురువారం యర్రబాలెం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి పనులు నిలిపి వేయాలని, స్థలం తమదేనంటూ ఏడుగురు వచ్చి బెరింపులకు పాల్పడ్డారు. నిర్మాణ పనులు చూస్తున్న ఇంజినీరింగ్‌ చేసిన సాయికుమార్‌ అనే యువకుడిని కొట్టారు. అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ మేస్త్రీపైనా చేయిచేసుకున్నారు. విషయాన్ని వ్యవసాయమార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావుతో సాయికుమార్‌ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ధనుంజయరావుతోనూ దురుసుగా మాట్లాడారు. ‘తాము డిపార్టుమెంట్‌ మనుషులమని, తమనే డాక్యుమెంట్లు చూపమంటారా? అని ప్రశ్నించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో చెప్పి వచ్చామని డీఎస్పీతో మాట్లాడామని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడు వస్తే డాక్యుమెంట్లు అడుగుతారా?’ అంటూ వారు ఫోన్‌ ద్వారా ధనుంజయరావును బెదిరిస్తూ మాట్లాడారు. అంతటితో ఆగకుండా పోలీసుస్టేషన్‌ వద్ద కూడా హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోవటంతో మిగతా వారంతా పరారయ్యారు. దౌర్జన్యంగా మాట్లాడిన విషయాన్ని ఫోన్‌కాల్‌ రికార్డ్‌ ద్వారా ధనుంజయరావు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 15 రోజుల కిందటే యర్రబాలెం వద్దనే ఒక వ్యక్తి తమ ప్లాట్లు ఆక్రమించుకున్నారంటూ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోనూ ఇలాంటి కేసు రిజిష్టర్‌ అయ్యింది. ఇలా రెండురోజుల వ్యవధిలోనే భూ వివాదాలు, దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులు పోలీసుల వద్దకు వచ్చాయి. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే రెండు జిల్లాల్లో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. వారి కదలికలను పరిశీలించి భూ వివాదాల్లో తలదూర్చుతూ అమాయకలపై దౌర్జన్యానికి పాల్పడే వారిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు. పోలీసులు పట్టించుకోకపోతే భూ మాఫియా అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో సొంత చేసుకోవాలని చూసిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఏకంగా ఒక సబ్‌ రిజిస్ట్రార్‌, డాక్యుమెంట్‌ రైటర్లపైనా వేటు పడింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ భూ మాఫియా విజృంభిస్తోంది.

యర్రబాలెం ఘటనపై కేసు నమోదు 
యర్రబాలెంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. పోలీసు అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని  అన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Link to comment
Share on other sites

becareful when buying lands . crying ani reply sese batch kosam, this happens in TG too. And all political leaders support this regardless of the party.

Link to comment
Share on other sites

5 minutes ago, TampaChinnodu said:

becareful when buying lands . crying ani reply sese batch kosam, this happens in TG too. And all political leaders support this regardless of the party.

How is it possible in BANGARU TELANGANA :o

Link to comment
Share on other sites

11 minutes ago, TampaChinnodu said:
రాజధానిలో భూ మాఫియా 
ఖాళీ స్థలాలపై కన్ను 
పెద్దల పేరు చెప్పి బెదిరింపులు 
మంగళగిరి, న్యూస్‌టుడే 
amr-gen1a.jpg

రాజధాని అమరావతిలోకి వచ్చే మంగళగిరి ప్రాంతంలో కొందరు  రౌడీయిజానికి ఆజ్యం పోస్తున్నారు. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఇక్కడి భూములపై కన్నేశారు. పోలీసు ఉన్నతాధికారులు, కొందరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రాజధానిలో అమాయకుల పిల్లలు వేరే ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న వారిని గుర్తించి నకిలీ దస్తావేజులు సృష్టించి స్థలాలు సొంత చేసుకునే ప్రయత్నం మళ్లీ మొదలైంది. రెండేళ్ల కిందట ఇలాంటి భూ ఆక్రమణల కేసులు మంగళగిరి ప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. అప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం భూ దురాక్రమణ కేసుల్లో ఫిర్యాదు వస్తే కోర్టు అనుమతితోనే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు రౌడీషీటర్లతో కలిసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. గురువారం యర్రబాలెం వద్ద నిర్మాణంలో ఉన్న ఇంటి పనులు నిలిపి వేయాలని, స్థలం తమదేనంటూ ఏడుగురు వచ్చి బెరింపులకు పాల్పడ్డారు. నిర్మాణ పనులు చూస్తున్న ఇంజినీరింగ్‌ చేసిన సాయికుమార్‌ అనే యువకుడిని కొట్టారు. అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ మేస్త్రీపైనా చేయిచేసుకున్నారు. విషయాన్ని వ్యవసాయమార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుత్తికొండ ధనుంజయరావుతో సాయికుమార్‌ చెప్పారు. దీనిపై ప్రశ్నించిన ధనుంజయరావుతోనూ దురుసుగా మాట్లాడారు. ‘తాము డిపార్టుమెంట్‌ మనుషులమని, తమనే డాక్యుమెంట్లు చూపమంటారా? అని ప్రశ్నించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో చెప్పి వచ్చామని డీఎస్పీతో మాట్లాడామని అన్నారు. ఎమ్మెల్యే కుమారుడు వస్తే డాక్యుమెంట్లు అడుగుతారా?’ అంటూ వారు ఫోన్‌ ద్వారా ధనుంజయరావును బెదిరిస్తూ మాట్లాడారు. అంతటితో ఆగకుండా పోలీసుస్టేషన్‌ వద్ద కూడా హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోవటంతో మిగతా వారంతా పరారయ్యారు. దౌర్జన్యంగా మాట్లాడిన విషయాన్ని ఫోన్‌కాల్‌ రికార్డ్‌ ద్వారా ధనుంజయరావు డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 15 రోజుల కిందటే యర్రబాలెం వద్దనే ఒక వ్యక్తి తమ ప్లాట్లు ఆక్రమించుకున్నారంటూ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోనూ ఇలాంటి కేసు రిజిష్టర్‌ అయ్యింది. ఇలా రెండురోజుల వ్యవధిలోనే భూ వివాదాలు, దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులు పోలీసుల వద్దకు వచ్చాయి. రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే రెండు జిల్లాల్లో రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి. వారి కదలికలను పరిశీలించి భూ వివాదాల్లో తలదూర్చుతూ అమాయకలపై దౌర్జన్యానికి పాల్పడే వారిపై చర్యలకు ఉపక్రమించాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు. పోలీసులు పట్టించుకోకపోతే భూ మాఫియా అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం మంగళగిరి, పెదకాకాని ప్రాంతాల్లో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన భూములను నకిలీ డాక్యుమెంట్లతో సొంత చేసుకోవాలని చూసిన వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఏకంగా ఒక సబ్‌ రిజిస్ట్రార్‌, డాక్యుమెంట్‌ రైటర్లపైనా వేటు పడింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ భూ మాఫియా విజృంభిస్తోంది.

యర్రబాలెం ఘటనపై కేసు నమోదు 
యర్రబాలెంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు. పోలీసు అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని  అన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Idi matram nijam

Link to comment
Share on other sites

8 minutes ago, TOM_BHAYYA said:

How is it possible in BANGARU TELANGANA :o

Dora seppinatti Bangaaru Telangana ledu

Bhajana Batch bayapettinattu cheekati Telangana ledu.

It is just same as before division. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...