Jump to content

విదేశాల్లో ఉన్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకం


TampaChinnodu

Recommended Posts

ప్రవాసాంధ్రా.. అందుకో భరోసా! 
ఉద్యోగం, విద్యాభ్యాసం చేసేవారికి అవకాశం 
విదేశాల్లో ఉన్నవారి కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకం 
స్వల్ప ప్రీమియంతో సరికొత్త బీమా పథకం 
kri-sty1a.jpg
ఉద్యోగం, విద్యాభ్యాసం నిమిత్తం స్వదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్లి  అనుకోకుండా ప్రమాదాలకు గురై మరణించినా, శాశ్వత అంగవైకల్యం పాలైనా, అక్కడ ఉపాధికి ఆటంకం ఏర్పడినా ఆ బాధితుడికి, ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రవాసాంధ్ర భరోసా పేరిట బీమా పథకాన్ని ప్రారంభించింది. చంద్రన్న బీమా రీతిలో ఈ పథకాన్ని అమలు చేయటానికి ఏర్పాట్లు చేశారు. వార్షిక ఆదాయంతో నిమిత్తం లేకుండా.. తెల్లరేషన్‌ కార్డుతో పనిలేకుండా.. విదేశాల్లో ఉన్నవారందరికి ఈ పథకం వర్తింపజేసేందుకు సన్నాహాలు చేశారు.

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలామంది ఇతర దేశాలకు ఉద్యోగం, విద్యాభ్యాసం, ఉపాధి కోసం వెళుతున్నారు. అక్కడ జరుగుతున్న ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతున్న, అంగవైకల్యానికి గురవుతున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధిత వ్యక్తుల కుటుంబాల నుంచి విదేశాల్లో ఉన్న ఆంధ్రుల వివరాలు సేకరించాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది ఈ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. విదేశాల్లో సహజ మరణానికి        ఈ పథకం వర్తించదు.

kri-sty1b.jpg

ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లినవారికి.. 
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. 
* ఈసీఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ రిక్వైర్డు), ఈసీఎన్‌ఆర్‌ (ఇమిగ్రేషన్‌ చెక్‌ నాట్‌ రిక్వైర్డు) దేశాల్లో జీవనోపాధికి ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాôధ్రులు అర్హులు. 
* ఉద్యోగులకు బీమా పరిమితి మూడేళ్లు ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవచ్చు. 
* మూడేళ్లకు రూ.150 ప్రీమియం చెల్లించాలి.

kri-sty1c.jpg
విద్య, నైపుణ్య మెరుగుదలకు వెళితే.. 
* 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. 
* విదేశాల్లో చదవడానికి, ఏరకమైన నైపుణ్య పెంపుదలకు వెళ్లినా అర్హులే. 
* ఏడాదికి రూ.75 ప్రీమియం చెల్లించాలి. 
* బీమా ఏడాది పాటు అమల్లº ఉంటుంది. తరువాత పునరుద్ధరించుకోవాలి.
kri-sty1d.jpg
నమోదుకు ఇవి అవసరం.. 
*  బీమా చేసే వ్యక్తి స్వదేశ, విదేశ చిరునామా ధ్రువీకరణ పత్రాలు 
*  ఎన్‌ఆర్‌ఐ హోదా ధ్రువీకరణ పత్రం 
*  విదేశీ డ్రైవింగ్‌ లైసెన్సు 
*  విదేశీ పాసుపోర్టు 
*  ఇండియన్‌ పాస్‌పోర్టు, వీసా 
*  విదేశాల్లో పనిచేస్తున్న సంస్థ పేరు, చిరునామా, యజమాని వివరాలు 
*  విద్యార్థి వివరాలు సమర్పించాలి.

విద్యార్థులకు ప్రయోజనాలివీ 
‌*  ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షలు బీమా పరిహారం చెల్లిస్తారు. 
*  ప్రమాదంలో సంభవించే గాయాలు, అస్వస్థత చికిత్సకు ఆసుపత్రి ఖర్చు కింద రూ.లక్ష చెల్లిస్తారు. 
*  ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైక్యం పొందినా ఒక సహాయకుడితో స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు. 
*  బీమా చేసిన విద్యార్థి ప్రమాదానికి గురై విద్య కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడితో స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు.

ఉద్యోగులకు ఉపయుక్తమిలా.. 
*  ప్రమాదంలో మరణం సంభవించినా, శాశ్వత అంగవైకల్యం పొంది ఉద్యోగం, ఉపాధి కోల్పోతే రూ.10 లక్షల బీమా పరిహారం అందుతుంది. 
*  ప్రమాదంలో మరణించిన వ్యక్తి పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి, అంగవైకల్యం పొందిన వ్యక్తిని తీసుకురావడానికి సాధారణ విమాన ఛార్జీలు అందిస్తారు. ఒక వ్యక్తిని సహాయంగా ఇచ్చి పంపుతారు. సహాయకుని విమాన ఛార్జీలు చెల్లిస్తారు. 
* బీమా చేయించుకున్న వ్యక్తి అస్వస్థతకు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తిస్తే ఆ వ్యక్తి, ఒక సహాయకుడికి స్వదేశానికి వచ్చేందుకు సాధారణ విమాన ఛార్జీలు చెల్లిస్తారు. 
*  ప్రమాదంలో గాయపడినా, అస్వస్థతకు గురైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కింద రూ.లక్ష చెల్లిస్తారు. 
*  భారత విమానాశ్రయం నుంచి స్వస్థలం చేరడానికి అంబులెన్స్‌ సౌకర్యం  కల్పిస్తారు. 
*  మహిళలకు సాధారణ ప్రసూతి ఖర్చు కింద రూ.35 వేలు, శస్త్రచికిత్స జరిగితే రూ.50 వేలు చెల్లిస్తారు.

*  బీమా చేసిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా బీమా కాలపరిమితిలో సంవత్సరానికి రూ.50 వేలు చొప్పున కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.
Link to comment
Share on other sites

Quote

ప్రమాదంలో సంభవించే గాయాలు, అస్వస్థత చికిత్సకు ఆసుపత్రి ఖర్చు కింద రూ.లక్ష చెల్లిస్తారు. 

Probably not enough to cover the hospital expenses , But rest of the benefits look good.

Link to comment
Share on other sites

2 minutes ago, Unityunity said:

Should applicable to only NRA not to all NRT( Telugu)

AP Aadhar card and Voter ID vunna valle eligible ani sinna bob tweeted

Link to comment
Share on other sites

52 minutes ago, Paidithalli said:

Ajay babu ki tweet pettandi babu . Mana bangaru telangana lo minimum veelliche money ki 10 times ivvali. Ours surplus state no ? 

Yeah surplus according to CAG.

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

na lauda..

deenikante gofundme eskoni bandi nadipiyudu nayam...

Gofundme ni thittinav ippudu adi nayam antav .. insurance kante gofundme nayam aa @3$%

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

na lauda..

deenikante gofundme eskoni bandi nadipiyudu nayam...

Idhi bheema uncle, ante insurance policy ;) how can u compare self paid/covered policy vs funded campaign :o

Link to comment
Share on other sites

8 minutes ago, perugu_vada said:

Idhi bheema uncle, ante insurance policy ;) how can u compare self paid/covered policy vs funded campaign :o

Andhrolla kutra 

Link to comment
Share on other sites

3 hours ago, mettastar said:

Gofundme ni thittinav ippudu adi nayam antav .. insurance kante gofundme nayam aa @3$%

Aa finki gaaniki BABU ni tidatham tappa life lo pedda pani ledhu le.

babu chachipoyevadiki kidney ichi bathikinchina kuda Idantha Lokesh ni CM cheyyataniki nakka chesthunna veshalu ane type aa gorre gaadu.

Link to comment
Share on other sites

6 minutes ago, RunRaajaRun123 said:

Aa finki gaaniki BABU ni tidatham tappa life lo pedda pani ledhu le.

babu chachipoyevadiki kidney ichi bathikinchina kuda Idantha Lokesh ni CM cheyyataniki nakka chesthunna veshalu ane type aa gorre gaadu.

66d12443fb894f722d27ddab651a8ef3.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...