Jump to content

నాలుగేళ్ల గరిష్ఠానికి పెట్రోలు ధర


TampaChinnodu

Recommended Posts

నాలుగేళ్ల గరిష్ఠానికి పెట్రోలు ధర 
మునుపెన్నడూ లేనంత స్థాయికి చేరిన డీజిలు ధర 
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దక్కని ప్రయోజనం 
పన్నుల బాదుడుతో వినియోగదారుల చేతికి వదులుతున్న చమురు 
1ap-main8a.jpg

దిల్లీ: చమురు ధరల పెంపు కొనసాగుతోంది. పెట్రోలు ధర ఆదివారం నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. దేశ రాజధానిలో లీటరు రూ.73.73కు చేరింది. ఇక డీజిలు లీటరు రూ.64.58కు చేరింది. డీజిలుకు సంబంధించి ఇప్పటివరకు ఇదే గరిష్ఠ ధర. దేశ రాజధానిలో ఈ రెండింటి ధరలను లీటరుకు 18పైసల చొప్పున పెంచారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దాదాపు 1 శాతం తగ్గినా ఇక్కడ వెసులుబాటు కల్పించలేదు.  2014, సెప్టెంబరు14న సవరించినప్పుడు పెట్రోలు లీటరు రూ.76.06కు చేరింది. ఆ తర్వాత తాజా ధరే గరిష్ఠం. డీజిలు ధరను ఈ ఏడాది ఫిబ్రవరి7న సవరించగా గరిష్ఠంగా లీటరుకు రూ.64.22కు చేరింది. ఇప్పుడు దాన్ని మించిపోయింది.  అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాలని చమురు మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో సూచించినా ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌లో ఈ విషయాన్ని విస్మరించారు.  దక్షిణాసియాలో భారత్‌లోనే పెట్రోలు, డీజిలు ధరలు ఎక్కువ. ధరలో సగం వాటా పన్నులదే. 2014, నవంబరు నుంచి 2016, జనవరి మధ్య ఆర్థిక మంత్రి జైట్లీ తొమ్మిది సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోయినా ఇక్కడ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి పన్నులు పెంచారు. దీంతో అంతర్జాతీయ ధరల తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు అందకుండా పోయాయి. ఆ 15 నెలల్లో మొత్తం మీద పెట్రోలుపై పన్ను లీటరుకు రూ.11.77 మేర, డీజిలుపై రూ.13.47 మేర పెరిగింది. దీంతో 2014-15లో రూ.99వేల కోట్లుగా ఉన్న ఎక్సైజ్‌ ఆదాయం 2016-17లో రూ.2,42,000 కోట్లకు చేరింది. గత ఏడాది అక్టోబరులో ఒకసారి మాత్రమే ఎక్సైజ్‌ సుంకాన్ని లీటరుకు రూ.2 తగ్గించారు. అదే సమయంలో విలువ ఆధారిత పన్ను తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించినా మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ మాత్రమే తగ్గించాయి.

1ap-main8b.jpg
Link to comment
Share on other sites

All signs point to bad time for modi. 

It is surprising Modi hardly trying anything to improve his image before elections even after so many recent setbacks. What is the reason behind his silence ? 

If they lose Karnataka elections , then it is mostly game over for him.

Link to comment
Share on other sites

51 minutes ago, TampaChinnodu said:

All signs point to bad time for modi. 

It is surprising Modi hardly trying anything to improve his image before elections even after so many recent setbacks. What is the reason behind his silence ? 

If they lose Karnataka elections , then it is mostly game over for him.

seeing his media seeking attention tactics, i gues 2019 lo elections ki oka 2 to 3 months mundu petrol/diesel rate cut chestademo and as usual

#Ache din antademo for gaining votes...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...