Jump to content

Minister Nara Lokesh achievements in past ONE year


SonyKongara

Recommended Posts

ఏడాదిలో ఎన్నో విజయాలు!
01-04-2018 06:58:33
 
636581628750284992.jpg
  • మంత్రిగా లోకేశ్‌కు తొలి సంవత్సరం
  • ఐటీలో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు
  • రాష్ట్రానికి పలు ప్రముఖ కంపెనీల రాక
  • పల్లె సేవలో కొత్తగా అడుగులు
  • అభివృద్ధికి టెక్నాలజీ జోడింపు
  • పంచాయతీరాజ్‌లో సంస్కరణల పర్వం
  • రియల్‌టైంలో తెలిసేలా డ్యాష్‌బోర్డు
  • వినూత్న నిర్ణయాలతో ప్రత్యేకత
(అమరావతి): ఒకవైపు గ్రామీణాభివృద్ధి... మరోవైపు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ! రెండూ పరస్పర భిన్నమైనవి! నారా లోకేశ్‌ మంత్రిగా ఆ రెండు శాఖలను చేపట్టి ఆదివారానికి (ఏప్రిల్‌ 1) సరిగ్గా ఏడాది! ‘ఏపీలాంటి కొత్త రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి అంత ఆషామాషీ కాదు. ఫెయిల్‌ అయితే... ఇబ్బంది పడతారు’ అని పలువురు హెచ్చరించినా ఆ శాఖను తీసుకున్నట్లు లోకేశ్‌ ఇటీవల తెలిపారు. ఆయన సారథ్యంలో ఐటీ, పంచాయతీరాజ్‌లో సాధించిన విజయాలు, ప్రగతిని ఆ శాఖలు వెల్లడించాయి. దీని ప్రకారం... రాష్ట్ర విభజన నాటికి 99శాతం ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయి. కేవలం ఒక్క శాతం, అది కూడా చిన్న చిన్న కంపెనీలు మాత్రమే ఏపీలో ఉన్నాయి. ఏపీకి ఐటీ రంగాన్ని ఆహ్వానించడమే వృథా అని కొందరన్నారు. ఒకపక్క హైదరాబాద్‌, మరోపక్క బెంగళూరు, చెన్నైలు ఉండగా... ఇక ఏపీకి వచ్చేదెవరన్న ప్రశ్నలు వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో సరైన విధానాలు, సత్వర అనుమతుల ద్వారా కంపెనీలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించాయి. ఈ ఏడాది కాలంలో పలు వినూత్న పాలసీలను రూపొందించాయి. ఇందులో భాగంగా డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్క్‌ పాలసీని తీసుకొచ్చారు. ఇటు ఐటీ కంపెనీలకు తగిన స్పేస్‌ ఇవ్వడం, అటు రియల్‌ఎస్టేట్‌కు ఊతం ఇచ్చేందుకు ఈ విధానం తోడ్పడింది. అద్దెలో సగం ఐటీ శాఖే చెల్లించడం ఈ విధానంలో కీలకం. ఫార్చ్యూన్‌-500కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ-2017-20ని తీసుకొచ్చారు. కొత్త సాంకేతికతలవైపు ఇప్పటినుంచే బాటలు వేసేందుకు సైబర్‌ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్లౌడ్‌హబ్‌ పాలసీని రూపొందించారు. దేశంలో ఉన్న అతిపెద్ద గ్లోబల్‌ ఇన్‌హౌస్‌ సెంటర్‌ కంపెనీలను ఆకర్షించేందుకు ఒక విధానం తీసుకొచ్చారు. అదే సమయంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ కంపెనీలను ఒకేచోట కాకుండా వికేంద్రీకృత అభివృద్ది చేయాలనే ప్రణాళికతో పనిచేశారు. పలుదేశాలు తిరిగి, పలుమార్లు కంపెనీలతో చర్చలు జరిపారు. ఫలితంగా విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, కాన్‌డ్యుయెంట్‌, ఏఎన్‌ఎ్‌సఆర్‌, గూగుల్‌ ఎక్స్‌ లాంటి భారీ కంపెనీలు వచ్చాయి. విశాఖపట్నంలో ఒకప్పుడు ఖాళీగా ఉన్న హిల్‌-1, హిల్‌-2 ఇప్పుడు ఐటీ కంపెనీలతో నిండిపోయాయి. మిలీనియం టవర్స్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. కాపులుప్పాడలో ఐటీ పార్కు ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. అమరావతిలో హెచ్‌సీఎల్‌ రాక ఐటీ ముఖచిత్రాన్ని మార్చబోతోంది. పై డేటా సెంటర్‌ ఏర్పాటైంది. ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న గన్నవరం మేథా టవర్స్‌ ఈ ఏడాదిలో పూర్తిగా నిండిపోయిం ది. మంగళగిరి ప్రాంతం మినీ ఐటీ హబ్‌గా రూపొందుతోంది. ఏపీఎన్‌ఆర్‌టీతో కలిసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలోని ఇండ్‌వెల్‌ టవర్స్‌, మేథా టవర్స్‌, కే విజినెస్‌ స్పేస్‌, పై కేర్‌, ఎన్నార్టీ టెక్‌ పార్కుల్లోకి పదుల కొద్దీ కంపెనీలు వచ్చాయి. తిరుపతిలో జోహో కార్యకలాపాలు ప్రారంభించింది. బెంగళూరులోని కంపెనీలను ఆకర్షించేందుకు అనంతపురంలో బెంగళూరు ప్లస్‌ ప్లస్‌ పేరుతో ఐటీపార్కుకు కసరత్తు చేస్తున్నారు. బిగ్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీల్లో ముందుకెళ్లేందుకు విశాఖలో ఫిన్‌టెక్‌ వ్యాలీని ఏర్పాటుచేశారు.
 
 
పంచాయతీరాజ్‌లోనూ ‘సాంకేతికత’
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాలో సంస్కరణలు, సాంకేతిక వినియోగంతో పల్లె ప్రజలకు పక్కాగా సేవలు అందేలా లోకేశ్‌ చర్యలు తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తాగునీటి సమస్యపై దృష్టి సారించారు. జలవాణి కాల్‌ సెంటర్‌ పేరుతో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800 425 1899ను ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా చేపట్టే అన్ని పథకాల వివరాలు రియల్‌టైంలో తెలిసే విధంగా డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేశారు. శాఖాపరమైన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించి, చర్యలు తీసుకునేలా అధికారులతో కూడిన వాట్సా్‌పగ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల మిషన్‌ అంత్యోదయలో దేశవ్యాప్తంగా 83 ఉత్తమ గ్రామాలను ప్రకటించగా, అందులో 33 నవ్యాంధ్రకు చెందినవే కావడం విశేషం. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి స్కోచ్‌ అవార్డుల పంట పండింది.
 
పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన డ్యాష్‌బోర్డుకుగాను మంత్రి లోకేశ్‌కు డాక్టర్‌ కలాం ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌ అవార్డ్‌ లభించింది. ఏఐఐబీ బ్యాంకు నిధులు రూ.4234 కోట్లతో 4282 రోడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందించారు. పంచాయతీలకు వీధిదీపాల ఖర్చు తగ్గించేలా... సీసీఎంఎస్‌ జంక్షన్‌ బాక్స్‌లతో కూడిన ఎల్‌ఈడీ లైట్లను అమర్చుతున్నారు. రూ.22 వేల కోట్ల అంచనాతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటుచేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ‘‘ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, కుటుంబానికి దూరంగా ఉంటూ పనిచేస్తున్నా... రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉద్యోగాలు ఇప్పించడంలో వచ్చే కిక్కే వేరు. ఐటీలో 2019నాటికి లక్ష ఉద్యోగాలు, ఎలక్ర్టానిక్స్‌లో అంతకుమించి ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిని కచ్చితంగా సాధిస్తాం!’’
Link to comment
Share on other sites

Arey vongora ga vadiveluu gadi vattakayal ki thadiveluu gadi thadigudda katti vuyyaala voogu lekapothe pappu gadi aathulaki nee athul mudesi thala krinduluga veladu

Link to comment
Share on other sites

32 minutes ago, aakathaai said:

Arey vongora ga vadiveluu gadi vattakayal ki thadiveluu gadi thadigudda katti vuyyaala voogu lekapothe pappu gadi aathulaki nee athul mudesi thala krinduluga veladu

@aakathaai ne basha ke oo kabhi khushi kabhi gham namaste GIF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...