Jump to content

నేటి నుంచి ఆనంద నగరాల సదస్సు


TampaChinnodu

Recommended Posts

నేటి నుంచి ఆనంద నగరాల సదస్సు 
మూడు రోజుల పాటు అమరావతిలో... 
15 దేశాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు 
ప్రారంభించనున్న చంద్రబాబు 
9ap-main10a.jpg

ఈనాడు, అమరావతి: అత్యంత ఆనందదాయక నగరంగా అమరావతిని తీర్చిదిద్దే చర్యలపై సమగ్ర చర్చకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘సంతోష నగరాల సదస్సు’ మంగళవారం(నేటి) నుంచి మొదలుకానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా మూడు రోజుల పాటు ఇది జరగనుంది. వర్ధమాన దేశాల్లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుక్కోవడం, ఆ దిశగా అవసరమైన ఆవిష్కరణల రూపకల్పనపై ఇక్కడ చర్చలు జరగనున్నాయి. పౌర ఆధారిత పరిపాలన, పరిశుభ్ర-ఆరోగ్యకర వాతావరణం, ఉజ్వల ఆర్థిక వ్యవస్థ, నివాసయోగ్యత, సుస్థిరాభివృద్ధి తదితరాంశాలు ప్రధాన ప్రాతిపదికగా ఈ సదస్సు జరగనుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏ, సీఐఐ, డాల్‌బెర్గ్‌, సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ (సింగపూర్‌) సంస్థల భాగస్వామ్యంతో ఇది జరుగుతోంది. సదస్సులో భాగంగా ఏడు అంశాలపై ప్యానల్‌ చర్చలు, రెండు అంశాలపై కార్యశాలలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తారు. అనంతరం జీవితాన్ని ఆనందంగా గడపడమెలా? అనే అంశంపై ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఉపన్యసిస్తారు.

15కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు 
సదస్సుకు మొత్తంగా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఫిన్‌లాండ్‌, యూకే, సింగపూర్‌, జపాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, భూటాన్‌, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, అమెరికా తదితర దేశాల నుంచి 100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మేధావులు, ఆర్కిటెక్ట్‌లు, నగర ప్రణాళిక నిపుణులు తదితరులు వీరిలో ఉన్నారు.

9ap-main10b.jpg

ప్యానల్‌ చర్చలు-అంశాలు 
* 21వ శతాబ్దంలో నగరాలు: సంతోషమే సరిహద్దుగా ఎందుకు కావాలంటే? 
* జీవన అనుకూల వాతావరణం: ప్రజలే ముందు ఆధారిత పరిపాలనపై పౌరులకు హామీ 
* నగరాల సంతోషానికి కొలమానం: ఇదేమిటి? ఎందుకు అవసరం 
* ఆనందదాయక జీవనం: నివాసయోగ్యత 
* పరిశుభ్ర, హరిత, నీలం: సుస్థిర, ప్రభావవంత, స్థితిస్థాపక నగరాలు 
* రైతులు గళం: అమరావతి ప్రథమ పౌరులు 
* ఉద్దేశం-శ్రేయస్సు: ఉజ్వల, సరికొత్త ఆర్థిక వ్యవస్థలు

కార్యశాలలు-అంశాలు 
* సంతోష నగరాల సూచీ దిశగా పయనం ప్రారంభం 
* నగర నాయకుల ప్రయోగశాల: నగరీకరణ కఠిన సవాళ్ల పరిష్కారం

సదస్సుకు సర్వం సిద్ధం 
మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి సీకే కన్వెన్షన్‌ హాలులో జరగనున్న అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సదస్సు వేదికను అతి సుందరంగా, డిజిటల్‌ స్క్రీన్‌లతో ఏర్పాటుచేశారు.

అత్యుత్తమ ఆచరణలు, విధానాలపై చర్చిస్తాం 
అమరావతి ప్రజలు ఆనందంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు అవసరమో ఈ సదస్సు వేదికగా చర్చిస్తాం. వివిధ దేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ ఆచరణలు, విధానాల అధ్యయనానికి సదస్సు దోహదపడుతుంది.

-పి.నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
Link to comment
Share on other sites

Quote

ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యమిస్తోంది. 

bl@st

Link to comment
Share on other sites

33 minutes ago, TampaChinnodu said:

bl@st

Kaka, idi aithe nijam...

first time in the world, a conference is being held in a virtual world...

and a conference title chudu, abhabho... 

Link to comment
Share on other sites

ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యమిస్తోంది

something fishy...

ఫిన్‌లాండ్‌, యూకే, సింగపూర్‌, జపాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, భూటాన్‌, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, అమెరికా తదితర దేశాల ..

ee list choostunte ekkado kodutundi.. ISrael lo CBN old freinds unnaru.. remaining all countries nunchi chinna babu fans vunnaru kabatti.. vallu arrange chesina gorrelu ayyi untaru...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...