Jump to content

బీటెక్‌ బాబుల.. హై‘టెక్‌’ మోసం


TampaChinnodu

Recommended Posts

బీటెక్‌ బాబుల.. హై‘టెక్‌’ మోసం 
అమెజాన్‌ సంస్థకు టోకరా 
పార్శిల్‌ ఖాళీగా ఉందనే ఫిర్యాదులతో 300 చరవాణుల స్వాహా 
hyd-cri12a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: తాము కొనుగోలు చేసిన వస్తువులు పార్శిల్‌లో లేవని ఫిర్యాదులు చేస్తూ ఓ ఘరానా ముఠా ఆన్‌లైన్‌ విక్రయసంస్థ అమెజాన్‌ను మోసం చేసింది. ఏడాది కాలంలో దాదాపు 300 చరవాణులను కాజేసింది. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల దర్యాప్తులో ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్‌ నేరవిభాగం డీసీపీ జానకిషర్మిలతో కలిసి కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన కొండూరి దినేశ్‌కుమార్‌, గుంటూరు జిల్లాకు చెందిన ఏరువ ప్రదీప్‌రెడ్డి హైదరాబాద్‌ ఇబ్రహీంపట్టణంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ మూడేళ్లపాటు ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమయ్యారు.  ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మోసాల బాటపట్టారు.

బూటుతో మొదలు.. గత ఏడాది ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌లో అమెజాన్‌ సంస్థ నుంచి బూట్లు కొనుగోలు చేశారు. తమకు అందిన పార్శిల్‌లో బూట్లు లేవంటూ కొనుగోలు సంస్థకు ఫిర్యాదు చేసి, మరో జత పొందారు. ఈ పథకం విజయవంతం కావడంతో మోసాల పరంపరకు తెర లేపారు. ఇందుకోసం ఎర్రగడ్డకు చెందిన దొడ్ల భానురమేశ్‌ సహకారం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నీటిపల్లి లోవకృష్ణ నుంచి ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులను తీసుకొచ్చే బాధ్యతను భానురమేశ్‌కు అప్పగించారు. డెలివరీ బాయ్స్‌ తీసుకొచ్చిన పార్శిళ్లను అందుకునే బాధ్యతను ప్రదీప్‌రెడ్డి..తన సమీప బంధువు ప్రవీణ్‌రెడ్డికి అప్పగించాడు.

బిహార్‌ నుంచి నకిలీ సిమ్‌ నంబర్ల కొనుగోలు: భాను రమేశ్‌ ఎక్కువ సంఖ్యలో ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు సరఫరా చేయలేకపోవడంతో..ఈ ముఠా డార్క్‌నెట్‌ డీప్‌ వెబ్‌లో వెదికింది. ఈ క్రమంలో సిమ్‌ నంబర్లను సరఫరా చేసే కోల్‌కతా వాసి బిపిన్‌ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. అమెజాన్‌ నుంచి వస్తువులను ఆర్డర్‌ చేసేందుకు  సిమ్‌ నంబర్లను..ఆర్డర్‌ క్రమంలో వచ్చే ఓటీపీ నంబర్లను సమకూర్చే పనిని బిపిన్‌ తీసుకున్నాడు. అలా అమెజాన్‌ సైట్‌లో సుమారు 800 నకిలీ ఖాతాలను సృష్టించి సుమారు 300 చరవాణులను కొన్న ఈ ముఠా..పార్శిళ్లు ఖాళీగా ఉన్నాయన్న ఫిర్యాదులతో అంతే మొత్తంలో చరవాణుల్ని రెండోసారి కొట్టేసింది. వాటిని ఓఎల్‌ఎక్స్‌ వెబ్‌సైట్‌లో లేదా తెలిసిన దుకాణాల్లో తక్కువ ధరకు విక్రయిస్తూ వచ్చింది. అమీర్‌పేట పరిసర ప్రాంతాల నుంచే ఈ తరహా ఫిర్యాదులు భారీగా వచ్చినట్లు గుర్తించిన నానక్‌రామ్‌గూడలోని అమెజాన్‌ సంస్థ ప్రతినిధి అర్జున్‌ అల్లాడి గత నెల 22న సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సైబర్‌క్రైమ్‌ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం ఈ ముఠా నిర్వాకాన్ని బట్టబయలు చేసింది. బిపిన్‌ మినహా మిగిలిన అయిదుగురిని శుక్రవారం అరెస్టు చేశాం. ముఠా నుంచి రూ.10.75 లక్షల నగదు, 556 సిమ్‌ నంబర్లు, 42 చరవాణులు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నాం. ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌కార్డులు జారీ చేసిన మూడు నెట్‌వర్క్‌ సంస్థలకు తాఖీదులు జారీ చేస్తాం.’ అని కమిషనర్‌ వెల్లడించారు.

Link to comment
Share on other sites

6 minutes ago, TampaChinnodu said:

next in line repo maapo. phones meeda insurance claim sese mana NRI telugu theejaalubl@st

@3$%    assurent odu already gudha pagal denguthunnadu ...he improved a lot ....full tracking ippudu.....unlock ki kuda full restrictions

Link to comment
Share on other sites

1 minute ago, nizambadnarsingyadav said:

@3$%    assurent odu already gudha pagal denguthunnadu ...he improved a lot ....full tracking ippudu.....unlock ki kuda full restrictions

koti , abids lo kooda open avvatleva aa locks ? 

Link to comment
Share on other sites

13 minutes ago, boeing747 said:

dexxmma technology ni full ga kummutunnar ga kurrollu

చరవాణులను   Intakee iyyendi baa? Ekkada pettukuntaaru veetini ?@3$%

Link to comment
Share on other sites

2 minutes ago, boeing747 said:

"chara""vaani" ante iddaru ladies aa baa  GSB2.gif

Ettaagoo vaani ki fix ayipoyyam anukuntey... y only iddaru?

chaar vaani——- naluguru vaanee lu gaa

Link to comment
Share on other sites

1 minute ago, Raasko said:

Ettaagoo vaani ki fix ayipoyyam anukuntey... y only iddaru?

chaar vaani——- naluguru vaanee lu gaa

aythe ee chaar vaanis lo 2 neeku migatha naaku  BRAHMANANDAM-DOOKUDU-GIFs.gif

Link to comment
Share on other sites

I heard that they do scams on MacBooks too. Delivery kaaledhu anatam. No product return etc.. there are employees inside amazon in India who are doing this. Their own employees are scamming them.

Link to comment
Share on other sites

9 minutes ago, Staysafebro said:

I heard that they do scams on MacBooks too. Delivery kaaledhu anatam. No product return etc.. there are employees inside amazon in India who are doing this. Their own employees are scamming them.

happening from many years. pattukunna kooda konni months lo bayataki vachi same danda malli start sestharu. easy/huge money. so it wont stop. 

Link to comment
Share on other sites

8 minutes ago, TampaChinnodu said:

happening from many years. pattukunna kooda konni months lo bayataki vachi same danda malli start sestharu. easy/huge money. so it wont stop. 

The deliveries are happening here and the employees who manage the transactions in India are helping them out. Ikkadiki ochona kooda labor mentality poodhu wste fellows ki.

Link to comment
Share on other sites

Ok poragallu technology baga using e madhya kalam lo Paytm scam kuda chesaru hyd la btech poragallu money send avuthunnatu vochela chesi wine shop vadiki 40k bokka ettaranta 😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...