Jump to content

అమరావతిలో ప్రవాసాంధ్రులకు రూ.400 కోట్లతో భారీ భవనం


TampaChinnodu

Recommended Posts

36 అంతస్తుల ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ 
అమరావతిలో ప్రవాసాంధ్రులకు రూ.400 కోట్లతో భారీ భవనం 
  వేల మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాల కల్పన లక్ష్యం 
15ap-main7a.jpg
ఈనాడు అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సంస్థ ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో జంట టవర్లుగా దీనిని నిర్మిస్తారు. పోడియంతో కలిపి 36 అంతస్తులు ఉంటాయి. కేవలం ప్రవాసాంధ్రుల కోసమే, వారి నిధులతోనే నిర్మించే ఈ భవనంలో నివాస, కార్యాలయ వసతులు ఉంటాయి. వీటిలోని ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. దీనిలో ఏర్పాటయ్యే కార్యాలయాల్లో ఐదారు వేల మందికి ఉన్నతస్థాయి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని ఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ‘ఈనాడు’కి తెలిపారు. కొరియాకి చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఆకృతి రూపొందించింది. మరో అంతర్జాతీయ సంస్థ కుష్మన్‌ వేక్‌ఫీల్డ్‌ మార్కెటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తోంది.

అమరావతికి అద్దంపట్టేలా..! 
‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ భవనం ఆకృతిని అమరావతికి అద్దంపట్టేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’లా  తీర్చిదిద్దారు. రెండు టవర్లకు మధ్యలో గ్లోబ్‌ ఉంటుంది. వివిధ దేశాల్లో తెలుగువారి ఉనికికి ఇది నిదర్శనం. మొదట ప్రధాన భవనం, రెండోదశలో చుట్టూ మూడంతస్తుల షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. మొత్తం నిర్మిత ప్రాంతం 11 లక్షల చ.అడుగులు. 
* పార్కింగ్‌ కోసం రెండంతస్తుల సెల్లార్‌, దానిపై మూడంతస్తుల పోడియం ఉంటుంది. దానిపై 33 అంతస్తుల్లో భవన నిర్మాణం జరుగుతుంది. దీనిలో ఒక టవర్‌లో 29, మరో టవర్‌లో 29 అంతస్తులు ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుతూ పైన నిర్మించే భాగం నాలుగంతస్తులుగా ఉంటుంది. 
* ఒక టవర్‌లోని 29 అంతస్తుల్లో ‘రెసిడెన్షియల్‌ ఫ్లాట్లు’ ఉంటాయి. ఒక్కో అంతస్తులో రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. రెండో టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటవుతాయి. 56 వరకు కమర్షియల్‌ ఫ్లాట్లు ఉంటాయి. వీటికి పైన ఉండే నాలుగంతస్తుల్ని పూర్తిగా వాణిజ్య అవసరాలకే కేటాయిస్తారు. 
* రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ వైశాల్యం 4,500 చ.అడుగులు. ఈ టవర్‌లోని రెండు అంతస్తుల్ని సర్వీసు అపార్ట్‌మెంట్‌లుగా తీర్చిదిద్దుతారు. ఒక్కొక్కటి 400 చ.అడుగుల వైశాల్యం కలిగిన 20 విలాసవంతమైన సూట్‌లు ఉంటాయి. కంపెనీల సీఈఓలు, ఇతర ముఖ్యులు వచ్చినప్పుడు వీటిలోనే బస చేయవచ్చు. 
* టవర్ల పై భాగంలోని నాలుగంతస్తుల్లో పెద్ద సంస్థల కార్యాలయాల ఏర్పాటుకి 18 వేలు, అంతకు మించిన చ.అడుగుల వైశాల్యం కలిగిన స్పేస్‌ ఉంటుంది.

పర్యావరణ అనుకూలం 
భవనాన్ని పర్యావరణానికి అనుకూలంగా, తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటూ, ఎక్కువ వ్యర్థాలు బయటకు రాకుండా నిర్మిస్తున్నారు. ‘ఎక్సా స్కెలిటన్‌’ డిజైన్‌ వినియోగిస్తున్నారు. భవనంలో నిలువు స్తంభాలు ఉండవు. చుట్టూ వచ్చే ‘ఫ్రేమ్‌’పైనే భవనం బరువంతా ఆధారపడుతుంది.  5-6 శాతం అదనపు స్థలం అందుబాటులోకి వస్తుంది. 30 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. ప్రాంగణంలోనే మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారు. రీసైకిల్‌ చేసిన నీటిని మొక్కల పెంపకానికి వాడతారు. ఘనవ్యర్థాల్నీ  రీసైకిల్‌ చేస్తారు. ప్రతి అంతస్తులో చుట్టూ పచ్చదనం, లాన్‌లు ఉంటాయి.

గ్లోబ్లో రివాల్వింగ్‌ రెస్టారెంట్‌..! 
రెండు టవర్ల మధ్యలో... ఏర్పాటు చేసే గ్లోబ్‌ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ గ్లోబ్‌ తిరగకపోయినా... చూసేవారికి తిరుగుతున్నట్టు కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు. దీనిలో నాలుగంతస్తులుంటాయి. రివాల్వింగ్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. దీనిలో కూర్చుంటే 360 డిగ్రీల్లో నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. గ్లోబ్‌లో 10-12 వేల చ.అడుగుల విస్తీర్ణంలో రెస్టారెంట్లు, కిచెన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైనింగ్‌ హాల్‌, లాంజ్‌ వంటివి ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా క్లబ్‌ హౌస్‌ ఉంటుంది. పోడియంలోని మూడు అంతస్తుల్లో మైగ్రేషన్‌ రిసోర్సు సెంటర్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీ, ఫుడ్‌ కోర్టులు వంటి వసతులన్నీ ఉంటాయి. ఒక్కో చ.అడుగు ధరను రూ.5500గా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇప్పటికే 520 మంది నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఫ్లాట్లు కొనుగోలు చేసుకున్న ఎన్‌ఆర్‌టీలు వేరే వారికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. విక్రయించాలనుకుంటే ఐదేళ్ల వరకు ప్రవాసాంధ్రులకే అమ్మాలి.

ప్రవాసాంధ్రులకు గర్వకారణం 
రవికుమార్‌ 
15ap-main7b.jpg
ప్రవాసాంధ్రులకు గర్వకారణంగా అమరావతిలో ఒక భవనం ఉండేలా, అందులో సంస్థలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించడం ద్వారా రాజధానికి వారు తమ వంతు తోడ్పాటునందించేలా చూడటమే దీని వెనుక ప్రధాన ఉద్దేశం. శంకుస్థాపన సమయానికి ఒక్కొక్కటి 50 అడుగులు ఎత్తున్న వివిధ దేశాలకు చెందిన 50 జెండాలతో ఒక నిర్మాణం చేస్తాం. దాన్ని సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దుతాం.
 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

Quote

కేవలం ప్రవాసాంధ్రుల కోసమే, వారి నిధులతోనే నిర్మించే ఈ భవనంలో నివాస, కార్యాలయ వసతులు ఉంటాయి. వీటిలోని ఫ్లాట్లను, కార్యాలయ ప్రాంతాన్ని వారికే విక్రయిస్తారు. 

concept ardam kaaledu. What is government doing in this ? 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

concept ardam kaaledu. What is government doing in this ? 

ok . Government Building it

రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్‌ఆర్‌టీ సొసైటీ సంస్థ ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌’ పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది. 

Link to comment
Share on other sites

NRI ante india lo vundani vaallani antaru ani cheppandi sir veellaki evarinaa..400 crores petti building aa ..tinadaaniki ledhu meesaalaki sampangi noone annadanta evado ala enno needs vunte vaatini vadilesi idi avasaramaa _%~

Link to comment
Share on other sites

9 minutes ago, reddyeee said:

NRI ante india lo vundani vaallani antaru ani cheppandi sir veellaki evarinaa..400 crores petti building aa ..tinadaaniki ledhu meesaalaki sampangi noone annadanta evado ala enno needs vunte vaatini vadilesi idi avasaramaa _%~

NRI's funds tho building anta man. NRI's funds tho build sesi NRI's ki sell sestharu anta. Government building it , But not sure if government is spending money or getting money in this project.  concept ee different gaa vundi. Visionary CBN em sesina first of a kind in the world kada , idi alane vundi. 

calling @psycopk to confirm more details

Link to comment
Share on other sites

endo emo...mothaniki sarkainchipoindu CBN...

NRI's ani edo anukuntundu kani, maha aithe mestri shop pettadam thapa ie NRI's pedaga emi cheyaru

Link to comment
Share on other sites

400 crores is not a big deal especially for an investment for NRI's in my opinion. I heard they will get anything from $5000 per person and then they will have an option to sell/ keep it once everything is done. 

Link to comment
Share on other sites

3 hours ago, AndhraneedSCS said:

400 crores is not a big deal especially for an investment for NRI's in my opinion. I heard they will get anything from $5000 per person and then they will have an option to sell/ keep it once everything is done. 

Ekkada Ina info vunte post the link.

Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

endo emo...mothaniki sarkainchipoindu CBN...

NRI's ani edo anukuntundu kani, maha aithe mestri shop pettadam thapa ie NRI's pedaga emi cheyaru

This seems to be a real estate venture rather than any office set up. Collect money from NRIs , build it  and sell to NRIs. 

Link to comment
Share on other sites

17 hours ago, just2deal said:

2016 lo 27 floors design

2017 lo 30 floors design

2018 lo 36 floors 

inkonni years lo burj khalifa ni beat sestham bl@st  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...