Jump to content

Bharath Ane Nenu — chaala bagundi


SoftwarePulkaGandhi

Recommended Posts

Congrats @Prince_Fan @NinduChandurudu

& lolbob fans & ntr fansbl@st

 

 

కథేంటంటే: భరత్‌రామ్‌(మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (శరత్‌ కుమార్‌) తనయుడు. లండన్‌ కేంబ్రిడ్జ్‌లో చదువుతుంటాడు. తన తండ్రి హఠాన్మరణంతో లండన్‌ నుంచి ఇంటికి వస్తాడు. పార్టీ వాళ్లు అంతా కలిసి భరత్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. భరత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలేంటి? తనకి ఎదురైన రాజకీయ కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడు? వసుమతి (కైరా అడ్వాణీ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు భరత్‌ తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేదే కథ!

ఎలా ఉందంటే: ఇదొక పొలిటికల్‌ డ్రామా. దానికి మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌ సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. పొలిటికల్‌ డ్రామా అనేసరికి సందేశాలు.. ఊకదంపుడు ఉపన్యాసాలు రాజకీయ నాయకుల మీద విమర్శలు.. ఉంటాయనుకుంటాం. అయితే వాటిని బలవంతంగా చొప్పించలేదు. రాజకీయ నేపథ్యం అంటే అంతా క్లాస్‌ టచ్‌ ఉంటుదనుకుంటే కూడా పొరపాటే. మాస్‌తో పాటు అన్ని వర్గాలు మెచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. భరత్‌ ముఖ్యమంత్రి అయ్యాక కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. వసుమతితో ప్రేమ కథ కావాల్సినంత వినోదాన్ని పంచింది. భరత్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అలా అక్కడక్కడా వినోదాన్ని తనదైన శైలిలో మేళవించాడు దర్శకుడు. ‘భరత్‌ అనే నేను’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ వాడుకోవడం బాగుంది. విశ్రాంతి దగ్గరా పెద్ద మలుపులు ఏవీ లేవు.

2004reviews306c.jpg

ద్వితీయార్ధం పూర్తిగా మాస్‌కు నచ్చేలా తీర్చిదిద్దాడు. ‘రాచకోత’ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మహేష్‌ అభిమానులకు, యాక్షన్‌ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది. అక్కడి నుంచి కథ వేగమే మారిపోయింది. పాటలను, పోరాట దృశ్యాల్ని, మాస్‌ ఎలిమెంట్స్‌ని రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ద్వితీయార్ధం సాగిపోతుంది. ప్రెస్‌మీట్‌ ఎపిసోడ్‌ మొత్తం క్లాప్స్‌ కొట్టిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న భావాలను ఈ సినిమా తాలుకూ ఆత్మని మహేష్‌ మాటల్లో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశంలో సంభాషణలు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను అద్దం పడతాయి. మీడియాను సైతం కార్నర్‌ చేస్తూ రాసుకొన్న డైలాగ్‌లు ఆలోచింపజేస్తాయి. పాటలను చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. అవెక్కడా అడ్డుతగలవు. పతాక సన్నివేశాలకు ముందు ‘భరత్‌’ జోరు కాస్త తగ్గుతుంది. కానీ, ఇలాంటి కథలకు ఉండే ఇబ్బందే అది. మొత్తంగా చూస్తే ‘భరత్‌ అనే నేను’ పక్కా వాణిజ్యాంశాలతో మేళవించిన రాజకీయ చిత్రంగా మిగిలిపోతుంది.

ఎవరెలా చేశారంటే: ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆయన నటించిన ఉత్తమ చిత్రాల జాబితాలో ‘భరత్‌’ కచ్చితంగా ఉంటుంది. ఆయన స్టైలింగ్‌, లుక్స్‌ అన్నీ అభిమానులకు బాగా నచ్చుతాయి. సంభాషణలు పలికే విధానంలో మహేష్‌ కొత్తగా అనిపిస్తాడు. అక్కడక్కడా ఆయన తండ్రి ‘సూపర్‌స్టార్‌’ కృష్ణని గుర్తుకు తెస్తాడు. ఇక ఎమోషనల్‌ సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేటప్పుడు మరోసారి తనదైన మార్కు వేసి చెలరేగిపోయాడు. కైరా అడ్వాణీకి ఇది తొలి తెలుగు చిత్రం. మహేష్‌ పక్కన చాలా అందంగా కనిపించింది. ఈ మధ్య కాలంలో మహేష్‌ పక్కన చక్కగా కుదిరిన జంటల్లో కైరా పేరు కూడా ఉంటుంది. బ్రహ్మాజీ ఉన్నది కాసేపైనా నవ్వులు పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు. మిగిలిన ఏ పాత్రనూ దర్శకుడు తక్కువ చేయలేదు. కథకు అవసరమైన మేరకు అందరి నుంచి తగిన నటనను రాబట్టుకున్నాడు.

2004reviews306d.jpg

సాంకేతికంగా.. ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘భరత్‌ అనే నేను’, ‘వచ్చాడయ్యో సామి’ పాటలను సరైన టైమింగ్‌లో వాడుకున్నాడు దర్శకుడు. రెండూ హీరోయిజాన్ని అత్యున్నత స్థాయిలో చూపించే పాటలే. ‘వసుమతి’ పాటలో సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది. మూడు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరీ హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్‌ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తెరకెక్కించాడు. రవి కె.చంద్రన్‌ కెమెరా పనితనం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఖరీదైన చిత్రం ఇదే కావచ్చు. కొరటాల శివ మరోసారి కథకుడిగా, దర్శకుడిగా రాణించాడు. తనెప్పుడూ ఒక మంచి పాయింట్‌ను కమర్షియల్‌ హంగులు జోడించి చెబుతుంటాడు. ఈసారి అదే పంథాంలో వెళ్లి విజయవంతమయ్యాడు. గత మూడు చిత్రాలతో పోలిస్తే ‘భరత్‌ అనే నేను’ ఒక మెట్టుపైనే ఉంటుంది. కమర్షియల్‌ దర్శకుడిగా కొరటాల మరింత ఎత్తుకు ఎదిగినట్టే.

బలాలు 
+ మహేష్‌బాబు పాత్ర చిత్రణ, నటన 
+ కథాంశం 
+ వాణిజ్య విలువలు 
+ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ 
+ సంగీతం

బలహీనతలు 
- క్లైమాక్స్‌లో తగ్గిన వేగం

చివరిగా:‘భరత్‌ అనే నేను’ మహేష్‌కు మరో ‘శ్రీమంతుడు’

Link to comment
Share on other sites

Just now, aakathaai said:

Ya talk chepthunnaru choosinollu bagundani db lo edupu batch ki thappithe andariki nachindi

Lavdalo dB idhi..I'm leaving this ..sbdb ccdb Twitter lo pokiri range talk undi 

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Thank you bro.. you are the first one in this dB  to support our movie 

Inka gear maarchu uncle inkentha kalam outdated hadavidi

Link to comment
Share on other sites

1 minute ago, Idassamed said:

Time ki Atom or Chase pay kooda ledhu :3D_Smiles_314:

Ehey repu moviepass tho povude.. premiers ante 20$ lite repu 15 ye .. mem extra 1$ kattali anthe

Link to comment
Share on other sites

1 minute ago, aakathaai said:

Inka gear maarchu uncle inkentha kalam outdated hadavidi

Lol bob gadi movie ki pedda hangama ledhu bro .. sree reddy topic kanna heenam ga undhi media lo position .. but movie baane untadhanikunta... last 2 ani muthyalu trailer lone telsipoindhi.. sivanna meedha konchem hopes unnai

Link to comment
Share on other sites

5 minutes ago, NinduChandurudu said:

Lavdalo dB idhi..I'm leaving this ..sbdb ccdb Twitter lo pokiri range talk undi 

Nee lanti business magnet vellipothe..Mana dB yem aipovali Anna @3$%

Link to comment
Share on other sites

10 minutes ago, himacream said:

first time aa 3 mugguru kakunda inkokaru Bob movie ki support ga oka thread veyatam choosthunna......bl@st

Next time nundi .. 

aaa naluguru aaa naluguru

Link to comment
Share on other sites

38 minutes ago, NinduChandurudu said:

Lavdalo dB idhi..I'm leaving this ..sbdb ccdb Twitter lo pokiri range talk undi 

pokiri ki first la talk baaledu....bangaaram flop talk tharuvatha baaga lechindi cinema

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...