Jump to content

అమరావతిలో వ్యాపార సముదాయం నిర్మాణం


TampaChinnodu

Recommended Posts

భారీ ‘వీధి అంగడి’ 
అమరావతిలో వ్యాపార సముదాయం నిర్మాణం 
ప్రజల కోసం 1000 ఫ్లాట్లు 
ఒక్కో చ.అడుగు కనీస ధర రూ.3500 
రాజధాని పనుల పురోగతిపై సీఎం సమీక్ష 
25ap-main5a.jpg

ఈనాడు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పదెకరాల విస్తీర్ణంలో వినూత్న తరహాలో భారీ దుకాణ సముదాయాన్ని (మాల్‌ కాంప్లెక్స్‌) నిర్మించనున్నారు. ‘వీధి అంగడి’ తరహాలో ఉండే ఈ మాల్‌లో తాత్కాలిక నిర్మాణాలుంటాయి. ఎలాంటి పైకప్పు లేకుండా ఉంటుంది. విద్యుత్తును ఆదా చేయడంతోపాటు, ప్రజలకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు ఈ ప్రయోగం చేయాలని నిర్ణయించారు. ఇందులో సినిమాహాళ్ల సముదాయం, ఆహారశాలలు, పార్కింగ్‌ వంటివన్నీ ఉంటాయి. ఈ కాంప్లెక్స్‌ను   రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిర్మిస్తుంది. నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో రాజధాని పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.

రూ.494 కోట్లతో అపార్ట్‌మెంట్లు.. రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు రూ.494 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ అపార్టుమెంట్లు నిర్మిస్తుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏపై సమీక్ష ముగిశాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాజధానిలో పరిపాలనా నగరానికి సమీపంలోనే జీ+12 విధానంలో సీఆర్‌డీఏ తొలి దశలో వెయ్యి ఫ్లాట్లను నిర్మిస్తుంది. వాటిలో 1200 చ.అడుగుల వైశాల్యంతో 500, 1500 చ.అడుగులతో 300, 1800 చ.అడుగులతో 200 ఫ్లాట్లు ఉంటాయి. చ.అడుగు కనీస విక్రయ ధరను రూ.3500గా ప్రాథమికంగా నిర్ణయించాం. డిమాండును బట్టి రెండో దశలో మరిన్ని ఫ్లాట్లు నిర్మిస్తాం. ఎక్కువ మంది అడిగితే 2400 చ.అడుగుల వైశాల్యం కలిగిన ఫ్లాట్లనూ రెండో దశలో నిర్మిస్తాం. అపార్టుమెంట్ల నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాం. 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం. లాభం, నష్టం లేని (నో లాస్‌, నో ప్రాఫిట్‌) విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణం ఉంటుంది’ అని నారాయణ పేర్కొన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూసేకరణ ద్వారాగానీ, భూసమీకరణ ద్వారాగానీ తీసుకోవాల్సిన భూమి ఇంకా 1500 ఎకరాలు ఉందని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా నగరంలో ఐదు టవర్లుగా నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనానికి మరో 20 రోజుల్లో సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్లను ఆర్కిటెక్టులు అందజేస్తారని, ఆ వెంటనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

రాజధానిలో కంటైనర్‌ హోటళ్లు.. రాజధానిలో వివిధ పైపులైన్ల కోసం వేసే డక్టులు, గ్యాస్‌, పెట్రోల్‌ స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలను వినియోగించుకునే వాణిజ్య సంస్థల నుంచి యూజర్‌ ఛార్జీలను వసూలు చేయడం ద్వారా కొంత మేర ఆదాయ వనరులు సమకూర్చుకోవచ్చని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. వచ్చే ఏడాదిన్నర కాలంలో రాజధానికి 38వేల కుటుంబాలు తరలి వస్తాయని అంచనా వేస్తున్నామని, ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంటుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. వారందరి అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సదుపాయాలు ముందే సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. రాజధానిలో స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకొచ్చాయని, వాటి నిర్మాణం జరిగేంతవరకు ప్రస్తుత అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన రహదారుల వెంబడి కంటైనర్‌ హోటళ్లకు అనుమతివ్వాలని నిర్ణయించారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్‌ హోటల్‌ నిర్వాహకులు ఐటీసీ సంస్థతో కలసి కంటైనర్‌ హోటళ్లు ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌ ఆదాయంపై అధ్యయనం.. వివిధ మార్గాల్లో ఆదాయం పెంచడంద్వారా రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రానికి అతిపెద్ద ఆస్తిగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. 1995 నాటికి హైదరాబాద్‌ నగర పరిస్థితేంటి? గడచిన 20 ఏళ్లలో ఆ నగరం నుంచి వచ్చే ఆదాయం ఎంత మేరకు పెరిగింది? ప్రధాన ఆదాయ వనరులేంటి? వంటి అంశాల్ని అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బాండ్ల ద్వారా రాజధాని నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐలను భాగస్వాముల్ని చేయాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ‘హడ్కో’ కంటే ఇతర వాణిజ్య బ్యాంకులు అందించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉన్నందున రాజధానిలో చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు వాటి ద్వారా ఆర్థిక సాయం పొందాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది.

Link to comment
Share on other sites

Quote

పరిపాలనా నగరంలో ఐదు టవర్లుగా నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనానికి మరో 20 రోజుల్లో సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్లను ఆర్కిటెక్టులు అందజేస్తారని, ఆ వెంటనే టెండర్లు పిలుస్తామని తెలిపారు.

What about idly tower man damn

Link to comment
Share on other sites

2 hours ago, Mr Mirchi said:

Next year geladu ani mundhe area development ki aprtments., vyaparaa shops peduthunnadaa vaadi binami lands rates kosam.. bongu gani kontaaru

They will sell. Future lo eppudo appudu develop avuthadi ane hope tho ina kontaaru. Each apartment costing only 50 lacs. Since they are building this in Capital area lands , there wont be any other private projects in this area. 

Link to comment
Share on other sites

5 minutes ago, TampaChinnodu said:

They will sell. Future lo eppudo appudu develop avuthadi ane hope tho ina kontaaru. Each apartment costing only 50 lacs. Since they are building this in Capital area lands , there wont be any other private projects in this area. 

Dont know if the below price is good deal or not. Local people will know better

చ.అడుగు కనీస విక్రయ ధరను రూ.3500గా ప్రాథమికంగా నిర్ణయించాం.

Link to comment
Share on other sites

3 hours ago, TampaChinnodu said:

What about idly tower man damn

Idly tower kattesi, gate degata oka 10 rupees ticket pedithe ade chala pedda revenue generate sestundi ani norman foster idea...ofcourse, a idea ichindi kuda CBN ae anuko...

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

Dont know if the below price is good deal or not. Local people will know better

చ.అడుగు కనీస విక్రయ ధరను రూ.3500గా ప్రాథమికంగా నిర్ణయించాం.

Thats the basic price man...however by the time virtual turns to reality , it will be easily 4500 per sft....apart from additional expenses like car parking, amenities, maintenance etc will add to few more lakhs..and remember, as it is being sold by the government itself, one needs to pay everything in white. 

chances are good that such residences will attract the tag of lower middle class living and eventually neo class will not move into such places. 

Link to comment
Share on other sites

3 minutes ago, Android_Halwa said:

Thats the basic price man...however by the time virtual turns to reality , it will be easily 4500 per sft....apart from additional expenses like car parking, amenities, maintenance etc will add to few more lakhs..and remember, as it is being sold by the government itself, one needs to pay everything in white. 

chances are good that such residences will attract the tag of lower middle class living and eventually neo class will not move into such places. 

Yes. Motham AP Singapore , top 5 city in the world avvaka poyina , atleast the area which is so near to future capital will surely develop in future. It will be a good investment. 

Link to comment
Share on other sites

Anyway, its a bad project. Govt building houses to create infrastructure is a bad idea...it will go through rough weather..at least this has not succeeded in India till now, if it does, then its a miracle..

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Anyway, its a bad project. Govt building houses to create infrastructure is a bad idea...it will go through rough weather..at least this has not succeeded in India till now, if it does, then its a miracle..

Like Singapore miracle

Link to comment
Share on other sites

  • 7 months later...
Quote

అపార్టుమెంట్ల నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాం. 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం. లాభం, నష్టం లేని (నో లాస్‌, నో ప్రాఫిట్‌) విధానంలో అపార్టుమెంట్ల నిర్మాణం ఉంటుంది’ అని నారాయణ పేర్కొన్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూసేకరణ ద్వారాగానీ, భూసమీకరణ ద్వారాగానీ తీసుకోవాల్సిన భూమి ఇంకా 1500 ఎకరాలు ఉందని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా నగరంలో ఐదు టవర్లుగా నిర్మించే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు రెండు మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. హైకోర్టు భవనానికి మరో 20 రోజుల్లో సూపర్‌స్ట్రక్చర్‌ డిజైన్లను ఆర్కిటెక్టులు అందజేస్తారని, ఆ వెంటనే టెండర్లు పిలుస్తామని తెలిపారు

PPT on April 25th 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...