Jump to content

రాజధాని కోసం కేంద్రం ఎంత ఇవ్వాలంటే...


TampaChinnodu

Recommended Posts

cb-modi1524721430.gif

అమరావతి నగర నిర్మాణానికి పూనిక వహిస్తున్న సీఆర్డీయే మొత్తానికి ఒక విడత లెక్కలు తేల్చింది. అమరావతి నగర నిర్మాణ వ్యయాన్ని 51208కోట్లుగా లెక్క తేల్చారు. మొత్తం మౌలిక వసతులు, రహదార్లు, మురుగునీటి సదుపాయాలు ఇత్యాది అవసరాలు అన్నింటికీ కలిపి ఈ మొత్తాన్ని ప్రస్తుతానికి లెక్క తేల్చారు.

అలాగే.. రాజధాని పరిపాలన నగరం కోర్ కేపిటల్ నిర్మాణానికి మొత్తం ఎంత వ్యయం అవుతుందో కూడా అంచనా కట్టారు. ఆ మేరకు శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాలు అన్నింటికీ కలిపి 12406కోట్ల రూపాయల వ్యయం అవుతుందనే లెక్క తేల్చారు. అనగా.. కోర్ కేపిటల్ నిర్మాణ బాధ్యత కేంద్రానిది గనుక.. కేంద్రం నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి ఆశిస్తున్న మొత్తం 12406కోట్లు అని అనుకోవచ్చు.

కొత్త రాజధాని ఏర్పడినప్పుడు దాని పరిపాలన భవనాల సముదాయాలు ఉండే కోర్ కేపిటల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే భరించాల్సి ఉంటుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం కూడా.. కేంద్రం ఆ నిధులు భరిస్తుందనే అందులో పేర్కొన్నారు. మోడీ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. అమరావతి రాజధాని నగరంలో కోర్ కేపిట్ నిర్మాణానికి అన్నట్లుగా కేంద్రం నుంచి గతంలోనే 1500కోట్ల రూపాయలను విడుదల చేశారు. అయితే ఆ మొత్తాన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం వెలగపూడి వద్ద నిర్మించిన తాత్కాలిక సచివాలయానికే సాంతం ఖర్చు పెట్టేసింది. వారు ఇచ్చిన మొత్తానికంటె కొన్ని కోట్లు ఎక్కువే లెక్కచూపించి.. వెలగపూడి తాత్కాలిక సచివాలయాన్ని పూర్తిచేశారు.

ఆ ఖర్చు సంగతి పక్కన పెట్టి కోర్ కేపిటల్ కు నిధులు ఇవ్వండి అని చంద్రబాబు సర్కారు అడిగింది. మొత్తంగా కేంద్రంనుంచి 2500కోట్లు మాత్రం ఇవ్వగలం అని, 1500కోట్లు ఆల్రెడీ ఇచ్చేశాం గనుక.. ఇక 1000కోట్లు మాత్రం ఇస్తాం అని కేంద్రం పేర్కొంది. అక్కడే ప్రతిష్టంభన కూడా ఏర్పడింది. చంద్రబాబునాయుడు- మోడీ సర్కారును నానా మాటలూ అనడం కూడా మొదలైంది.

తాజాగా సీఆర్డీయే తేల్చిన లెక్కల ప్రకారం కోర్ కేపిటల్ కే 12406కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

కేంద్రం వారి నిబంధనల ప్రకారం కాకుండా.. తాము తలచినట్లుగా డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు భవనాలకు డిజైన్లు రూపొందించడం దగ్గరినుంచి, డీపీఆర్ లు ఆమోదించడం వరకు వారిని భాగస్వాముల్ని చేసి ఉంటే సబబుగా ఉండేది. అలా కాకుండా.. చంద్రబాబు తాను మెచ్చిందే డిజైను అన్నట్లుగా మోనార్క్ లా వ్యవహరించి.. 12.5 వేల కోట్ల లెక్క తేల్చి.. ఇదంతా మీరు ఇవ్వాల్సిందే అంటే.. అందులో కేంద్రానికి ధర్మబద్ధమైన బాధ్యత ఎంత?

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఖచ్చితంగా అన్యాయమే చేసింది.. కానీ రాజధానికి నిధులు అడిగే విషయంలో తప్పు మొత్తం చంద్రబాబు వైపునే ఉన్నదని.. వారి ముందస్తు అనుమతి లేకుండా.. తన ఇచ్ఛ ప్రకారం వ్యవహరించి.. ఇప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బురద చల్లుతా అని బెదిరిస్తే ఎలా? అనే ఆలోచన పలువురిలో మొదలవుతోంది.

Link to comment
Share on other sites

30 minutes ago, magadu said:

51k kotlaaa CITI_c$y nijam ga evadaina antha istada asalu ee broker CBN gadiki anduke modi G lo gunapam dimpaadu

Ramoji, MuraliMohan, Jagan aasthlani ammi thengithe easy gaa vosthaayi oka Laksha kotlu.

Why CBN need to beg Modi when he has richest people around him?

Link to comment
Share on other sites

కేంద్రం వారి నిబంధనల ప్రకారం కాకుండా.. తాము తలచినట్లుగా డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు భవనాలకు డిజైన్లు రూపొందించడం దగ్గరినుంచి, డీపీఆర్ లు ఆమోదించడం వరకు వారిని భాగస్వాముల్ని చేసి ఉంటే సబబుగా ఉండేది. అలా కాకుండా.. చంద్రబాబు తాను మెచ్చిందే డిజైను అన్నట్లుగా మోనార్క్ లా వ్యవహరించి.. 12.5 వేల కోట్ల లెక్క తేల్చి.. ఇదంతా మీరు ఇవ్వాల్సిందే అంటే.. అందులో కేంద్రానికి ధర్మబద్ధమైన బాధ్యత ఎంత?

ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఖచ్చితంగా అన్యాయమే చేసింది.. కానీ రాజధానికి నిధులు అడిగే విషయంలో తప్పు మొత్తం చంద్రబాబు వైపునే ఉన్నదని.. వారి ముందస్తు అనుమతి లేకుండా.. తన ఇచ్ఛ ప్రకారం వ్యవహరించి.. ఇప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బురద చల్లుతా అని బెదిరిస్తే ఎలా? అనే ఆలోచన పలువురిలో మొదలవుతోంది

 

Evadu rasindo kaani correct ga rasindu, addamaina lekkalu chepi iyyi paisal ante evadu istadu ? enduku istadu ? eedu emo nakka..adu emo gujju...edu emo addamaina kathalu cheppi what i am saying antadu...vadu emo enni kathalu chepina lekkalu supettu, atarvate paisal istha antadu..

 

Link to comment
Share on other sites

if 12,000 crores is all what he needs, its not a herculean task for central government to release these funds over a period of 5-6 years...maha ante annually oka city mida oka 2000 crores work chesthavemo...

kani, comparitively inthe small anount ki modi gadu dobbey annadu ante, edo vundi vaya mamla lopala lopala...may 15th aithe aiponi, asalu nijalu jara bayataki vastayi

Link to comment
Share on other sites

39 minutes ago, Android_Halwa said:

if 12,000 crores is all what he needs, its not a herculean task for central government to release these funds over a period of 5-6 years...maha ante annually oka city mida oka 2000 crores work chesthavemo...

kani, comparitively inthe small anount ki modi gadu dobbey annadu ante, edo vundi vaya mamla lopala lopala...may 15th aithe aiponi, asalu nijalu jara bayataki vastayi

Antha scene yemi ledhu bhayya. Adhantha CBN gaadi valle.

1999-2004 ichina funds yemi cheesaadu? Assalu BJP name yeppudaina vinapadindha? Yenthaseepu TDP bhajane.

ippudu funds ichina BJP ki gaani Narendra Modi ki gaani aa credit share ivvadu.

Also 12k is neither small amount nor a big amount for the center.

Its not small amount because they have to allocate funds from Central Reserve and answerable to several other states.

Its not a big amount as well, centre can step ahead voluntarily but because of CBN, who deny credit to anybody else, centre is not releasing them.

Modi is not as soft as Vajpayee. For Modi neither needs TDP in Parliament nor he likes hype monger CBN.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...