Jump to content

హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తా


TampaChinnodu

Recommended Posts

హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తా 
దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తా 
భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తా 
70 ఏళ్లుగా దేశానికి వీళ్లు చేసిన అభివృద్ధి ఏమిటి? 
రైతు ఆత్మహత్యలు తప్ప.. సాగునీరు ఇచ్చారా? 
ప్రతి ఎకరాకూ, ప్రతి పొలానికీ నీరు.. ఇదే మన నినాదం 
సిట్టింగ్‌లందరికీ సీట్లు, మంత్రివర్గంలో మార్పులుండవ్‌ 
తెరాస ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ 
27hyd-main1a.jpg
రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు పెట్టి, నీటి యుద్ధాలని కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. చాటలో తౌడుపోసి కుక్కలకు కొట్లాట పెట్టటమంటే ఇదే! భారతదేశ రైతులను అరిగోస చేసి, రైతుల ఆత్మహత్యలకు కారణమవు తున్నాయి.  అందుకే ‘హర్‌ ఎకర్‌కో పానీ... హర్‌ ఖేత్‌కో పానీ’ నినాదంతో ముందుకు వస్తున్నా. 6-7 ఏళ్లలో దేశమంతటా సాగునీరు ఇచ్చేలా పథకాలు అమలు చేస్తా. హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌, భాజపాలను హెచ్చరిస్తున్నా. తస్మాత్‌ జాగ్రత్త’

‘శక్తి ధారపోసి దేశ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించాలని తీర్మానం చేశారు. దిల్లీ వెళ్తున్నా అనుకోవద్దు. హైదరాబాద్‌ నుంచే భూకంపం పుట్టిస్తా. దేశరాజకీయాలను ప్రభావితం చేస్తా. కాంగ్రెస్‌, భాజపా కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించి తాగునీరు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, ఉపాధితో కూడిన అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దుతా. తెరాస కార్యకర్తలిచ్చిన స్ఫూర్తితో తెలంగాణ గడ్డ నుంచే దేశ ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తా! జై తెలంగాణ.. జై భారత్‌! 
కొన్ని విషయాలు చెబితే చెక్కర్‌ వచ్చి పడాలి.. 
‘దేశంలో అందుబాటులోని నీటిని 40 కోట్ల ఎకరాలకు ఇస్తే ఇంకా 30 టీఎంసీలు మిగులుతాయి. ఇన్నేళ్లుగా తాగునీటి కొరత తీర్చలేదు. వ్యవసాయానిక నీరివ్వలేదు. చేతగాకే ఈ ఆలోచనలు చేయలేదు. కృష్ణానదిపై 2004లో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ వేశారు. అదేమీ తేల్చలేదు. ఆర్నెల్లలో తీర్పు ఇవ్వాలని కేంద్రం ఎందుకు చెప్పదు? ఏ దేశమైనా బాగుపడాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలి. కొన్ని విషయాలు చెబితే చెక్కర్‌ వచ్చి పడాలి. అంతర్జాతీయంగా సరకు రవాణా ట్రక్కు వేగం గంటకు 80 కి.మీ ఉంటే.. మన దేశంలో గత ఏడు దశాబ్దాల్లో 26 నుంచి 36 కి.మీ. పరుగు తీస్తున్నాయి. దేశంలో ఎక్స్‌ప్రెస్‌ రహదారులు 2 వేల కి.మీ మాత్రమే. ఇది వాస్తవం కాదా? కాంగ్రెస్‌, భాజపాలు ఈ దేశం ఉసురు పోసుకుంటున్నాయి. అవి ఏది చేయాలో అది చెయ్యలే.. ఏది చెయ్యకూడదో అది చేస్తున్నాయ్‌!’ - ప్లీనరీ ప్రసంగంలో కేసీఆర్‌

ప్లీనరీకి హాజరైన ప్రవాస తెలంగాణ శాఖల నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుపేరునా అభినందించారు. తన ప్రసంగంలో వారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం వేదిక దిగి వారి వద్దకు వెళ్లి పలకరించారు.
భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తా 
ఈనాడు - హైదరాబాద్‌

70 ఏళ్లు ఈ దేశాన్ని పాలించి... 70 వేల టీఎంసీలను రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు?

కాంగ్రెస్‌ హయాంలో ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి, సన్నాసులు, కుంభకోణాలు, లంబకోణాలు. ఇప్పుడేమో ఆశారాం బాపూలు, డేరా రాంరహీంబాబాలు. నీరవ్‌ మోదీలు, లలిత్‌ మోదీలు. మోదీలు వస్తుంటారు.. బోడిగుండు కొట్టి పోతుంటారు. ధీరేంద్ర బ్రహ్మచారులు, నీరేంద్ర మోదీలను చూసి.. మీకు ఇంకా డబ్బా కొట్టి.. ఆహా కాంగ్రెస్‌, ఓహో బీజేపీ అని పొగిడి.. మంగళ హారతులు పట్టాలా? ఇంతకాలం జరిగింది కానీ ఇక సాగదు’

ప్రభుత్వ కార్యక్రమాలకు 75 లక్షల మంది తెరాస సభ్యులే ఆక్సిజన్‌.

ఆకాశం భూమి ఒక్కటి చేసైనా... ఆరు నూరైనా దేశం బాగుకోసం దేవుడిచ్చిన సర్వశక్తులు ఒడ్డిపోరాడుతా. 
జై తెలంగాణ, జై భారత్‌

27hyd-main1b.jpg
మనుషులకే అంబులెన్సులు పెట్టలేని దేశమిది.. కానీ నాలుగేళ్ల పసికూన రాష్ట్రం తెలంగాణలో పశువుల కోసం దవాఖానాలు, మొబైల్‌ టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం! ఈ అభివృద్ధి వాళ్లకు కనబడటం లేదా?

కొన్ని పనులకు సాహసం, గుండె ధైర్యం కావాలి. గిరిజన బిడ్డలు తమ తండాలను గ్రామపంచాయతీలుగా చేయాలన్నా ఏ ప్రభుత్వాలు చేయలేదు. కానీ తెరాస సర్కారు 4 వేల కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది. 
ఒక్కో పథకం రూపకల్పనకు, అమలుకు రక్తం కరిగించాలి. అధికారులతో గంటలకు గంటలు కూర్చుని... వారాలు, నెలల తరబడి చర్చిస్తేనేగానీ అది సాధ్యం కాదు. మన దగ్గర పార్టీలున్నాయిగానీ.. అర్భకులు, ఎన్నడూ ఉపయోగపడే పనులు చేయలేదు. 
 

మొండిగా భూకంపం సృష్టించి.. రాజకీయ పార్టీలను ఒప్పించి.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా నిజం చేశానో.. రాబోయే రెండు మూడు నెలల్లో పక్షిలా తిరిగి.. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. దేశంలో గుణాత్మక మార్పు.కోసం అంతే కృషి చేస్తా. ప్రజలు సంతోషంగా బతకాలి. ఉద్యోగం రావాలి. దేశ జీడీపీ పెరగాలి. ఈ దేశంలో నేనూ ఒక భాగస్వామినే. మాది బాధ్యత కలిగిన రాష్ట్రం. వెనుకబాటుతనం బాధ మాకన్నా ఎవరికీ ఎక్కువగా తెలియదు. తెరాస కార్యకర్తలు ఇచ్చిన స్ఫూర్తితో దేశ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించి తెలంగాణ గడ్డ నుంచే దేశ ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తా’’

దేశం గురించి మాట్లాడితే కాంగ్రెస్‌, భాజపా మాత్రమేనా? ఇక్కడ భాజపా నాయకులు.. అసలు టెంటే లేదు... ఇక ఫ్రంట్‌ ఎక్కడ  అంటారు.. మరి కేసీఆర్‌ ప్రకటన చేయగానే భయమెందుకు? కేసీఆర్‌ మొండి, సాధించేవరకు ఊరుకోడన్న భయం!

‘దిల్లీ వెళ్లినపుడు మోదీ గ్రాఫ్‌ పడిపోతోందని అక్కడి జర్నలిస్టులు చెప్పారు. భాజపా ఓడిపోతే కాంగ్రెస్‌ వస్తుంది. స్కీమ్‌ల పేర్లు మారతాయి. స్కామ్‌ల పద్ధతి మారుతుంది. కానీ రైతుల ఆత్మహత్యలు తగ్గవు. ఇదేం బహుమానమని ఈ దేశం మిమ్నల్ని అడుగుతోంది’

ఇక ఇటీవల దిల్లీ నుంచి హైదరాబాద్‌ వస్తూ ఓ స్నేహితుడికి ఫోన్‌ చేశాను. ఎక్కడున్నావంటే బాలి ద్వీపంలో అన్నాడు. మన దేశంలో లేవా అంటే వసతులు బాగాలేవన్నారు. మనకు 7500 చ.కి.మీ తీరం ఉంటే.. బీచ్‌లు అభివృద్ధి చేశామా? ప్రపంచంలోనే స్వచ్ఛమైన నీరు లక్షద్వీప్‌లో ఉంది. కానీ మనం ఇతర దేశాలకు పోతున్నాం. పర్యాటకం అభివృద్ధి చేయకుండా సన్నాసుల్లా మిగిలిపోయారు.

ప్రాణం బక్కపల్చనైనా.. 
ఇప్పటికే 64 ఏళ్ల వయసు వచ్చింది. తెలంగాణ సాధించుకుని ఇక్కడ తిరుగులేని శక్తిగా ఉన్నాం. ప్రాణం బక్కపల్చ దైనా... ఆలోచన మొండి! ఏదైనా మంచి జరగాలని, అదీ తెలంగాణ గడ్డపై నుంచి జరగాలన్న ఆలోచనతోనే.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన చేశాను.

అది ప్రకటన కాదు... ప్రకంపన... వెంటనే దిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ... కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌ అన్నారు.

దేశాన్ని కాంగ్రెస్‌, భాజపా కబంధహస్తాల నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, రైతు ఆత్మహత్యల నివారణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే అజెండాగా.. దేశరాజకీయాల దిశ మార్చేందుకు ముందుకు వస్తున్నామన్నారు. భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్న కూటమితో ఆ రెండు పార్టీల్లో ప్రకంపనలు మొదలయ్యాయని తెలిపారు. 70 ఏళ్లుగా మౌలిక సదుపాయాలు, జీడీపీ, అభివృద్ధి, యువతకు ఉపాధి అందించకుండా పాలకులంతా దేశ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ ఒకటేనని... దేశంలో ప్రజల సంక్షేమానికి జరగాల్సినది జరగడం లేదని, వ్యవస్థలో లోపాన్ని అధిగమించేందుకు తెలంగాణ గడ్డ నుంచి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతోనే కూటమి ప్రకటన చేశామన్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ప్రకటించారు. శుక్రవారమిక్కడ తెరాస ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్ష హోదాలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని, దీన్ని భర్తీ చేయాలని పలు రాజకీయపార్టీలు కోరుకుంటున్నాయన్నారు. అలాగే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని, మంత్రివర్గంలో మార్పులు ఉండవని కూడా స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి వ్యక్తీ ‘తెలంగాణ బిడ్డే’ అన్నారు.

మనదే నిజాయితీ
‘విద్యుత్తు సంస్థల పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించినపుడు... ఒక పార్టీ అధ్యక్షునిగా చాలా ఖర్చులు ఉంటాయని పలు రాష్ట్రాల నాయకులు, మంత్రులు అన్నారు. కోరుకుంటే పార్టీకి డబ్బు వచ్చేది. కానీ నిజాయితీగా ప్రభుత్వ రంగ సంస్థకు పనులు అప్పగించారని కొనియాడారు. పారదర్శకంగా ముందుకు వెళ్తున్నాం. ఇక సంక్షేమం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నెలకు రూ.1000 పింఛను, కల్యాణలక్ష్మి సహాయం లభిస్తోంది. పారదర్శకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. కాలుష్యంలో పనిచేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు మూలవేతనంలో 30 శాతం అదనంగా ఇస్తున్నాం. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లకు దేశంలో ఎక్కడా లేని అత్యధిక వేతనాలు, హోం గార్డులకు రూ.20 వేలు చెల్లిస్తున్నాం. సరళీకృత వ్యాపార విధానం, రాష్ట్ర స్థూల ఆదాయంలో నెం.1గా ఉన్నాం.
పక్కరాష్ట్రాలకు  మనమే ఆదర్శం
ఇటీవల బెంగళూరు వెళ్లాను. మాజీ ప్రధాని దేవగౌడ మాట్లాడుతూ.. ‘మా దగ్గర ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో కర్ణాటకకు పెద్ద సరిహద్దు ఉంది. మీ పథకాలు  తెలిసిపోయి ఇక్కడి ప్రజలు కూడా వాటిని అమలు చేయాలని కోరుతున్నారని కుమారస్వామి చెప్పారు. మీ దెబ్బకు బ్రాహ్మణ, జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని’ చెప్పారు. షిరిడీ వెళ్లినపుడు అక్కడి కలెక్టరు తెలంగాణ పథకాల గురించి చెప్పారు. మహారాష్ట్రకు తెలంగాణతో సరిహద్దు ఉందని, ఆ పథకాలు ఇక్కడా అమలు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారని వివరించారు. ఇదీ మనం చేసిన పనికి దేశంలో లభిస్తున్న ఆదరణ. కర్ణాటకలో కాంగ్రెస్‌ మంత్రి రేవన్న 24 గంటల కరెంటు ఇస్తున్న మీరు గొప్పవారు అన్నారు. ఇది చూసి ఓర్వలేక ఇక్కడివాళ్లు దిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారు. పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్దూ ఇసుక విధానం మెచ్చుకుంటే సిగ్గుపడాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు. సొల్లు పురాణం, చిల్లర మల్లర రాజకీయాలతో నవ్వులపాలు అవుతున్నారు.
టీపీసీసీ వచ్చింది... గులాబీ జెండాతోనే
టీపీసీసీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉత్తమ్‌ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టీపీసీసీ వచ్చిందంటే... దాన్ని తెచ్చింది గులాబీ జెండానే. తెరాస లేకుంటే టీపీసీసీ కాదు.. ఓపీసీసీ కూడా రాదు. అన్నం తిన్నమో... అటుకులు తిన్నమో... ఉద్యమంలో పోలీసు దెబ్బలు తిన్నమో... ఇది తెలంగాణ రాష్ట్రం. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. అబద్దం చెప్పినా... చెప్పేంత తెలివి కావాలి. అతికినట్లు ఉండాలి. నాలుక ఉంది కదా అని మాట్లాడుతూ ఉత్తమ్‌ ఎన్నోసార్లు భంగ పడ్డారు. మంత్రి హరీశ్‌రావు, నేను నాలుగైదుసార్లు మహారాష్ట్రకు వెళ్లి కాళేశ్వరం, చెనాక కొరటా, ప్రాణహిత‌పై ఒప్పందం చేసుకుంటే హైదరాబాద్‌ బేగంపేటలో 50 వేల మంది స్వాగతం పలికారు. కొత్తగా తీసుకువచ్చేదేమిటి.. అన్నీ మేమే తెచ్చామన్నారు. ఇక్కడే బేగంపేటలోనే ఉంటాను. వచ్చి నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నా. కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారో... ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారో ప్రజలు తెలుసుకోవాలి. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేదలు చనిపోతే అంబులెన్సులు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్‌ నేతలు ఈ జీవితంలో చేశారా? కానీ తిమింగలాలు మెక్కారు... అందలాలు ఎక్కారు. పేదలకు పాఠశాలలు పెట్టారా? కడుపునిండా భోజనం పెట్టారా? ఏమీ లేదు. మేం అధికారంలోకి వచ్చాక 500 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక నిధులతో దళిత, గిరిజనులకు కాలేజీలు ప్రారంభించాం. పేదల అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం. మీ జీవితంలో దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఆలోచన చేశారా? ఎదో పిట్టగూళ్లు తప్ప. తెరాస కడుతున్న రెండు పడక గదులు కనిపించడం లేదు. పింఛన్లు, కళ్యాణలక్ష్మి అన్నీ అబద్ధాలేనా... మీ కళ్లకు కనిపించడం లేదా..! నాలుగేళ్లలో కలలో ఎవరూ ఊహించని అనేక కార్యక్రమాలు ఆవిష్కరించాం. తెరాస... తెలంగాణ సాధించిన పార్టీ. కాంగ్రెస్‌ తెలంగాణను ఏడు దశాబ్దాలు ఏడిపించిన పార్టీ. చెప్పాల్సింది చాలా ఉంది. కానీ ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉంది. తెలంగాణను వైఫల్యంగా చూపించే పన్నాగాలను ఎదుర్కొంటూనే దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థాయికి ఎదిగాం. దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని రుజువు చేశాము. జాతీయ, అంతర్జాతీయ, హడ్కో, నాబార్డు తదితర సంస్థలు ఏ రాష్ట్రానికి ఇవ్వని 100 పైచిలుకు అవార్డులు ఇచ్చాయి. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అపురూపమైనవని... మిగతా రాష్ట్రాలు వీటిని అనుసరించాలని ప్రపంచ ఆర్థిక ద్రవ్యనిధి, ప్రపంచబ్యాంకు, నీతి ఆయోగ్‌లు చెబుతున్నాయి.
16వ రూము చూపించు.. రాజీనామా చేస్తా
‘‘కేసీఆర్‌ వంద యాభై రూములతో ప్రగతి భవన్‌ కట్టుకున్నారని బస్సు యాత్రలో ఉత్తమ్‌ అంటున్నారు. సాయంత్రం 5 , 6 గంటలకు సభ అయిపోతుంది. ఈ ప్లీనరీ అయ్యాక ఏడున్నరకు ఇంటివద్దే ఉంటాను. మీడియాను తీసుకుని రమ్మనండి. వంద, యాభై కాదు... కనీసం 15 రూములు చూపించకున్నా అక్కడే ఆయన ముక్కు నేలకు రాయాలి. నీవు 16వ రూము చూపిస్తే చాలు... ఎనిమిది గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సీఎం పదవికి రాజీనామా చేసేస్తా.
కాంగ్రెస్‌... భాజపా... రెండూ రెండే
ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి పరిశీలించిన తరువాత... 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు చేసిన అనుభవంతో చెబుతున్నాను. దేశంలో పరిస్థితులు చూస్తుంటే జరగాల్సింది జరగడం లేదు. లోపం ఉంది. ఎవరికీ, దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? 71 ఏళ్లు గడిచిపోయాయి. కాంగ్రెస్‌ 60 ఏళ్లు. భాజపా 11 ఏళ్లు. భాజపా కాకుంటే కాంగ్రెస్‌... కాంగ్రెస్‌ కాకుంటే భాజపా... ఇది దేశానికి మంచిది కాదు. ఎన్నో కఠోరమైన సత్యాలున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో.. గౌరవం, బతుకుదెరువుల్లో అడుగునున్నాం. కావేరీ జలాలపై కాంగ్రెస్‌.. భాజపాలు రెండూ డ్రామాలు ఆడుతున్నాయి. 2014లో భాజపా ఎందుకు చొరవ తీసుకోలేదు. ఏమైనా అంటే నీటి యుద్దాలు అంటారు. మీ దద్దమ్మ పరిపాలన వల్ల నీటి యుద్ధాలున్నాయి. దేశంలో 70 వేల టీఎంసీల నీరు  అందుబాటులో ఉన్నపుడు.. నన్ను విమర్శించే ముందు మీరు సమాధానం చెప్పొద్దా? ఇన్నేళ్లలో మీరు ఎందుకు చేయలేదు?
ఆ పెత్తనాలు మీకెందుకు...?
మున్సిపాలిటీలు, వ్యవసాయం, విద్య, అంగన్‌వాడీ, గ్రామీణాభివృద్ధి, సాగునీరు, ఆరోగ్యంపై మీ పెత్తనం ఎందుకు? ఎక్కడో మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలంలోని పాఠశాలపై మీ పెత్తనం ఎందుకు? గ్రామీణ సడక్‌ యోజన కింద ప్రధాని వచ్చి పారపట్టి రోడ్డు వేస్తారా?. సర్పంచిలు, మండల పరిషత్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరా? గ్రామీణ ఉపాధి పనులకు దిల్లీలో పోస్టులో డబ్బులు వేస్తారా. స్థానిక సంస్థలను గౌరవించే విధానమిదేనా? పోనీ అభివృద్ధి ఏమైనా చేశారా? కనీసం ఎయిర్‌పోర్టు బాగుండదు. విమానం దిగేందుకు గంటసేపు చక్కర్లు కొట్టాలా? కనీసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయలేని అసమర్థ విధానం కొలువుదీరింది. జీవన ప్రమాణాలు మరీ దారుణంగా ఉన్నాయి. చైనాలో 76 ఏళ్ల సగటు వయసు ఉంటే.. భారత్‌లో 68 ఏళ్లు. ఈ కాంగ్రెస్‌, భాజపాలు ఉంటే ఇలాగే ఉంటుంది. దేశంలో నీటి రవాణా లేదు. గంగా, గోదావరి, కృష్ణా, యమునా, నర్మదా, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు ఉన్నా ఒక్కచోట ఓడ కనిపించదు.

కశ్మీర్‌లో రోజూ బాంబులతో ప్రజలను చంపిస్తున్నారు. 5 లక్షల మంది సైన్యాన్ని అక్కడ మోహరించి వారి ఉసురు పోసుకుంటున్నారు. దౌత్యంలో మీరేం చేయడం లేదు. మౌలిక సదుపాయాలు లేకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎలా ఉంటుంది? న్యూయార్క్‌ స్టేషన్లో ఓ ముక్కలా కూడా ఉండదు. కానీ ఇదే వైకుంఠం, కైలాసం అనుకుంటూ గడిపేస్తుంటాం.

బిందెలు కనబడటంలే!
‘‘దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నాము. మిషన్‌ భగీరథ 95% పనులు పూర్తయ్యాయి. 10-15 రోజుల్లో అన్ని గ్రామాలకు బల్క్‌ సరఫరా చేస్తాము. మరో 6 వేల గ్రామాలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చే మన కార్యక్రమం.. ప్రపంచ చరిత్రలోనే మిగిలిపోతుంది. జూన్‌, జులై నాటికి ఈ కార్యక్రమం పూర్తికావాలి. గతంలో వేసవిలో హైదరాబాద్‌లో బిందెలు కనిపించేవి. రూ.2 వేల కోట్ల హడ్కోరుణంతో ప్రాజెక్టు చేపట్టడంతో శివారు ప్రాంతాల్లో నీళ్లు పారుతున్నాయి. తెలంగాణలో తాగునీరు, ఆసుపత్రులు, విద్యుత్తు సమస్య లేదు. గతంలో రిజిస్ట్రేషన్‌ విభాగంలో అవినీతి జరిగేది. మ్యుటేషన్‌కు నెలల తరబడి సమయం పట్టేది. విప్లవాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళనతో 80% భూముల హక్కులపై స్పష్టత వచ్చింది. ఇక నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ ఒకేరోజు జరుగుతుంది.   పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు కొరియర్లో వస్తాయి.
క్షణాల్లో కూలేవట!
భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినపుడు ఇతర రాష్ట్రాల అధికారులు ఇక్కడికి వచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టిన క్షణాల్లోనే ప్రభుత్వం కుప్పకూలుతుందని చెప్పారు. మన రాష్ట్రంలోనూ 80 ఏళ్లుగా ఎవరూ ముట్టుకునే సాహసం చేయలేదు. తెలంగాణలో కార్యక్రమాన్ని పూర్తిచేసి మే 10 నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి సహాయంతో పాటు పాసు పుస్తకాలు ఇవ్వనున్నాము.
ఆ నీళ్లు జానా తాగరా?
అరిచేవాళ్లు అరుస్తూనే ఉంటారు. కానీ నీతినీ, మంచినీ సమాజం గుర్తించాలి. గతంలో పక్షపాత వైఖరి కనిపించేది. కానీ మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో అన్ని నియోజకవర్గాలను సమానంగా చూస్తున్నాము. భగీరథ నీళ్లు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాగరా? మేము ఎక్కడా వివక్ష చూపించ లేదు. ఎమ్మెల్యేలకు ఇచ్చే రూ.3 కోట్ల రూపాయలపై సంపూర్ణ అధికారం ఇచ్చాము. అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ బిడ్డలు బాగుపడాలి.
వాళ్లను తరమండి
‘‘ఎన్నికల మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ మాది. కాంగ్రెస్‌ నాయకులు సొల్లుపురాణం మాట్లాడుతూ, అవాకులు, చెవాకులు పేలుతున్నారు. తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు కడుతుంటే కళ్లలో నిప్పులు పోసుకుని 250 కేసులు పెట్టారు. నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఆయా కేసులు విత్‌డ్రా చేసుకునే వరకూ కాంగ్రెస్‌ నాయకులను తరిమి కొట్టాలి.
అందరికీ టికెట్లు....
మంత్రివర్గం మార్చే ఆలోచనలు లేవు. మంత్రులను మార్చి చికాకు, గందరగోళానికి గురిచేసే పరిస్థితులు లేవు. మా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తాం. ఇందులో అనుమానమేం లేదు. ఎవరైనా బాగా లేకుంటే వారిని సరిదిద్దుతాం. ఇంతకు మించి గొప్పవాళ్లు ఆకాశం నుంచి రారు. ఎక్కడో ఒకటి అరా ఉంటుంది తప్ప ఏమీ పెద్దగా ఉండబోదు. ప్రజలే కేంద్రంగా ముందుకు వెళ్తాం. బలహీనవర్గాలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రశాతంగా ఉంది. తెలంగాణ వస్తే ఆంధ్రావారిని తరిమి కొడతారని, వెళ్లగొడతారన్న అపోహలు సృష్టించారు. కానీ ఆంధ్రాప్రజలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసకు మంచి మెజారిటీ ఇచ్చారు. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి వ్యక్తీ తెలంగాణ బిడ్డే. ఇందులో ఎవరికి అపోహలు వద్దు’’
27hyd-main1c.jpg
  • Like 1
Link to comment
Share on other sites

Enti 20 lo 18 MPs petukoni bhoomi shake chestadaaa? Andukey mamata phone number block chesindi.Party lo sitting mlas jumping out next year adi chuskomanu mundu

Link to comment
Share on other sites

21 minutes ago, evadra_rowdy said:

Enti 20 lo 18 MPs petukoni bhoomi shake chestadaaa? Andukey mamata phone number block chesindi.Party lo sitting mlas jumping out next year adi chuskomanu mundu

Aathcare ... Isari aekkuva chesthe budha vighraham pagalakottali

Link to comment
Share on other sites

TG varaku cheppu nammutha. Gosontivi chepakku roi.  Pagati kalalu.

CBN slaves laga nuvvu em cheppina correct anetodu yevvadu ledu ra mukkoda.

 

Practical ga alochinchu. Enjoy earth quake. %$#$

Link to comment
Share on other sites

1 hour ago, Soul said:

TG varaku cheppu nammutha. Gosontivi chepakku roi.  Pagati kalalu.

CBN slaves laga nuvvu em cheppina correct anetodu yevvadu ledu ra mukkoda.

 

Practical ga alochinchu. Enjoy earth quake. %$#$

Pink slaves will accept what are you saying

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

Pink slaves will accept what are you saying

Yeah let's see. Ivvala telcheddham. Slavery yellow color ki mathrame restricted a....or pink, saffron ki kuda vundha. Let's wait n watch. 

Link to comment
Share on other sites

1 hour ago, Soul said:

TG varaku cheppu nammutha. Gosontivi chepakku roi.  Pagati kalalu.

CBN slaves laga nuvvu em cheppina correct anetodu yevvadu ledu ra mukkoda.

 

Practical ga alochinchu. Enjoy earth quake. %$#$

+1

He better stick to TG and enjoy till a strong opposition develops. 

May be he knows he is talking too much , But just wants a reason to give CM post to KTR. So acting like he can do wonders at center and leave TG politics gracefully

Link to comment
Share on other sites

20 minutes ago, TampaChinnodu said:

+1

He better stick to TG and enjoy till a strong opposition develops. 

May be he knows he is talking too much , But just wants a reason to give CM post to KTR. So acting like he can do wonders at center and leave TG politics. 

KCR playing mind game...trying to hide his weakness by diverting the issue and projecting the image of a powerful man in present day politics.

Sitting MLA's andariki ticket istha antunadu...kani practically ala cheyaledu...sitting ki isthe kam se kam 30 MLA will loose..aina kuda balla gudhi cheptundu ticket istha ani..

over crowded party..vunna 117 seats ki more than 2 prime contenders per constituency...threat of rebels..still some districts lo village level cadre ledu leader ledu...

mekapothy gambiryam antaru kada...presently KCR exhibiting that quality...kani ground level la masthu problems vunai..

Link to comment
Share on other sites

but ie 8000 rupees per acre input subsidy could be the game changer...elections lopu inko 2 times vastadi ie subsidy..

imagine a farmer who has 5 acres...will get 40,000 rupees per crop and he does not need to pay back...

literally state using public money for welfare...courtesy: CBN

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...