Jump to content

అటెండర్‌ ఆస్తి.. రూ.80 కోట్లకుపైనే!


TampaChinnodu

Recommended Posts

నెల్లూరు : అతను చేస్తోంది మాములు అటెండర్‌ ఉద్యోగం.. అయితే అతని ఆస్తుల లెక్క చూస్తే మాత్రం ఎవరైనా షాక్‌కు గురికావాల్సిందే. ఎందుకంటే.. ఒకటి కాదు రెండు కాదు.. రూ.80 కోట్లకుపైగా విలువైన ఆస్తులను అక్రమ మార్గంలో కూడబెట్టాడు. అతని అక్రమ ఆస్తుల చిట్టాను తాజాగా అవినీతి నిరోధక శాఖ బయటపెట్టింది. 
నెల్లూరు జిల్లా రవాణా శాఖ ఉద్యోగి నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి ఉప రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్న వివరాల ప్రకారం.. రూ.80కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. 50 ఎకరాల భూమికి సంబంధించిన దస్త్రాలు, 18 ఫ్లాట్లు, రెండు కిలోల బంగారం, 7.5లక్షల నగదును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలో 222 చదరపు గజాల నివాస స్థలం, గుడిపాళెం గ్రామంలో 3.950 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నరసింహారెడ్డి భార్య పేరుతో నెల్లూరులోని పలు చోట్ల 1300కుపైగా చదరపు గజాల్లో నివాస స్థలాలు, నెల్లూరు ఎం.వి. అగ్రహారంలో జీఫ్లస్‌ టు భవనం, 47ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాదీనం చేసుకున్నారు.

1break80a.jpg

గత కొన్నేళ్లుగా ప్రమోషన్లు వచ్చినా నరసింహారెడ్డి వెళ్లకుండా.. నెల్లూరు రవాణా శాఖ కార్యాలయంలోనే అటెండర్‌గా పని చేస్తుండటం గమనార్హం. విజయవాడ అనిశా డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అయితే ఇందులో బినామి ఆస్తులు కూడా ఉండి ఉండవచ్చని అధికారులు బావిస్తున్నారు. ఇంకా రెండు లాకర్లు తెరవాల్సి ఉంది.

Link to comment
Share on other sites

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    6

  • ARYA

    3

  • solman

    3

  • Kontekurradu

    2

Top Posters In This Topic

2 hours ago, perugu_vada said:

Attender ye 80C ante inka supervisors entha dobbi untaro #phone

Veedu binami ayuntadu corruption peaks 

Link to comment
Share on other sites

అటెండరైనా అక్రమాల్లో అనకొండ 
ఏకంగా రూ.80 కోట్ల ఆర్జన 
ఎమ్మెల్యే అభ్యర్థులకు వడ్డీకి అప్పులు 
ఏసీబీకి చిక్కిన రవాణాశాఖ చిరుద్యోగి 
నెల్లూరులో ఉదయం నుంచి సోదాలు 
ఈనాడు - నెల్లూరు 
1ap-main3a.jpg

నెల్లూరు రవాణాశాఖ కార్యాలయంలో ఒక అటెండరు కోట్లకు పడగలెత్తాడు. ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఏకంగా ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి పోటీచేసే అభ్యర్థులకు వడ్డీకి అప్పులిచ్చే స్థాయిని సొంతం చేసుకున్నాడు. అతడి అక్రమ సంపాదన అవినీతి నిరోధక శాఖ లెక్కల ప్రకారం ఏకంగా రూ.80 కోట్లు. అతడి పేరు కరాడు నరసింహారెడ్డి. పదోన్నతుల్ని కాలదన్ని ఈ చిరుద్యోగాన్నే బంగారు బాతుగా మలచుకున్నాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తిపాస్తుల పట్ల కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. తన పేర తక్కువ ఉంచుకుని సింహభాగం భార్య పేరిట ఉండేలా చూసుకోవడం అందులో ఒకటి.

మంగళవారం ఉదయం ఏసీబీ కేంద్ర విచారణ బృందం(సీఐయూ) ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు చేపట్టింది. నెల్లూరు నగరంలోని నరసింహారెడ్డి ఇంటితో సహా జిల్లాలోని అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తవ్వేకొద్దీ అక్రమ ఆస్తుల చిట్టా బహిర్గతం అయ్యింది. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు, బంగారం, వెండి, నగదు నిల్వలు, డిపాజిట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ అధికారులు గుర్తించిన అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూములు, 18 నివాస స్థలాలు, పెద్ద భవంతి, రెండు కిలోల బంగారం, బ్యాంకులోను, ఇంట్లోను నగదు నిల్వలు, రూ.1.01 కోట్ల విలువైన ఎల్‌ఐసీ డిపాజిట్లు బయటపడ్డాయి. ఎల్‌ఐసీ పాలసీలకు రూ.10 లక్షల ప్రీమియం చెల్లించినట్లు తేలింది. చిరుద్యోగి దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బహిర్గతం కావటం రాష్ట్రంలోనే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయి మరీ అక్రమార్జనకు తెగబడ్డాడు. అతన్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

నరసింహారెడ్డి.. రవాణాశాఖ కార్యాలయంలో అటెండరుగా 22 అక్టోబరు, 1984లో చేరాడు. అప్పటి నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకు ఒక సారి పదోన్నతి తీసుకున్నా.. ఇప్పటికే సుమారు మూడు పదోన్నతులను తీసుకోవాల్సి ఉంది. నరసింహారెడ్డి మాత్రం ఇప్పటికీ అదే రవాణాశాఖ కార్యాలయం.. అదే అటెండరు ఉద్యోగం. చూస్తే ఎవరికైనా పాపం జీవితం అంతా అటెండరుగానే కొనసాగిస్తున్నాడు అనేంత దయనీయంగా కనిపిస్తాడు. దీని వెనుక భారీ దోపిడీ వ్యవహారమే నడిచింది. విధుల్లో చేరినప్పటి నుంచి పదోన్నతి కూడా తిరస్కరిస్తూ.. అక్రమాలకు అలవాటు పడ్డాడు. ఉన్నతాధికారులను గుప్పెట్లో ఉంచుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డాడు. కార్యాలయంలో ఎప్పటి నుంచో పాతుకుని పోవటంతో ఎక్కడ ఎలాంటి అక్రమ సంపాదన వస్తుందన్న విషయంపై అవగాహన ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని భారీగా చేతివాటాన్ని చూపాడు. వచ్చిన అక్రమార్జనతో ఎక్కడపడితే అక్కడ పొలాలు, ఇళ్ల స్థలాలు, బంగారం, డిపాజిట్లు చేశాడు.

నరసింహారెడ్డి తన పేరిట స్థిరాస్తులు తక్కువగా చూపి.. మిగిలినవి భార్య పేరిట చూపాడు. ఇంకా ఆయన బంధువులు ఎవరు? వారి పేరిట ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు వడ్డీకి అప్పులిచ్చిన సమాచారం ఉండడంతో మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

1ap-main3b.jpg

ఆస్తిపాస్తుల చిట్టా... 
* నెల్లూరు గ్రామీణ మండలం గుండిపాలెం గ్రామంలో 1.57 ఎకరాల వ్యవసాయ భూమిని 1992లో కొనుగోలు చేశాడు. అదే గ్రామం సర్వే నెం 301, 302లో 1.380 ఎకరాల భూమి కొనుగోలు. గుండిపాలెం గ్రామం సర్వే నెంబర్లు 300/1, 300/2, 302లో ఎకరా వ్యవసాయ భూమి కొనుగోలు చేసి.. దాని చుట్టూ ఇనుప కంచె వేయటానికి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. నెల్లూరు పట్టణంలో సర్వే నెంబర్లు 93, 94/1, 94/2 కొండాయపాలెం పరిధిలో 222 చ.గజాల స్థలాన్ని 1996లో కొనుగోలు చేశాడు. 
* భార్య హరిప్రియ పేరిట భారీ సంఖ్యలో స్థిరాస్తులను కొనుగోలు చేశాడు. నెల్లూరు గ్రామీణ మండలం గుండిపాలెం గ్రామంలో 2 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్లు 300/1, 300/2, 302లలో కొనుగోలు. అదేగ్రామంలో 3.570 ఎకరాల భూమి 1992లో కొనుగోలు. 
* సర్వే నెంబర్లు 275/1, 278/5లో గుండిపాలెం గ్రామంలో 0.95 ఎకరాల భూమి 2008లో కొనుగోలు. 
* సర్వే నెంబర్లు 54, 279లో సంగం మండలం పెరమన గ్రామంలో 35.30 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు. 
* నెల్లూరు పట్టణం ఎంవీ అగ్రహారంలో 46 గజాల ఇంటి స్థలాన్ని 2006లో కొనుగోలు చేశాడు. అక్కడే 346 గజాల ఇంటి స్థలం. 
* శ్రీహరినగర్‌లోని పి.సుబ్బారెడ్డినగర్‌ లేఔట్‌లో ప్లాట్‌ నెం-47లో 240 చ.గజాల స్థలం 2011లో కొనుగోలు. 
* కొండాయపాలెం పరిధిలో 266.66 గజాల నివాస స్థలాన్ని 2011లో కొనుగోలు చేశాడు. శ్రీహరి నగరంలోని పి.సుబ్బారెడ్డి నగర్‌ లే ఔట్‌లో 50 గజాల స్థలం. 
* కొండాయపాలెం పరిధిలోని సర్వే నెం. 358, 360లో 266.66 చ.గజాల స్థలం కొనుగోలు. 
* నెల్లూరు గ్రామీణ మండలం వివేకానందనగర్‌లో 266.66 చ.గజాల వంతున 10 ప్లాట్లు(ఒకటో నెంబరు నుంచి 10వ నంబరు).. మొత్తం 2,666.60 గజాల స్థలం ఒకేసారి కొనుగోలు చేశాడు. ఎంవీ అగ్రహారంలో వంద గజాల్లో నిర్మించిన మూడంతస్తుల భవనం ఉంది. 
* సమీప బంధువు నారాయణమ్మ పేరిట పెరమన గ్రామంలో 4.06 ఎకరాల వ్యవసాయ భూమి. 
* నరసింహారెడ్డి, భార్య, కుమార్తె పేరిట ఉన్న లాకర్‌ను ఇంకా తెరవాల్సి ఉంది.

కిలోల కొద్దీ బంగారం.. వెండి 
* ఏసీబీ అధికారుల తనిఖీల్లో దొరికిన నగదు రూ.7.70 లక్షలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు నిల్వ రూ.20 లక్షలు. బంగారం 2 కిలోలు, వెండి 7 కిలోలు. ద్విచక్ర వాహనాలు రెండు. 

Link to comment
Share on other sites

Nellore: Anti-Corruption Bureau (ACB) officials found gold ornaments weighing 3.65 kg and silver articles weighing 7 kg in bank lockers belonging to transport department attender K. Narasimha Reddy at Cooperative Bank and City Union Bank branches here on Wednesday. 

ACB teams had discovered property worth Rs 80 crore in the name of Reddy and his family on Tuesday, and the teams continued their search on Wednesday. 

 

 

Among the properties to surface on Tuesday were Rs 7.70 lakh in cash, bank balances of Rs 20 lakh, household articles worth Rs 5 lakh, 2 kg gold, 7 kg silver, two motorcycles, LIC deposits worth Rs 1.01 crore and LIC policies with a total premium of Rs 10 lakh. The teams also found documents related to LIC deposits in the lockers on Wednesday. 

Suspecting that Reddy may not have been acting alone in accumulating this unprecedented wealth, ACB officials are likely to probe deeper into his activities, a possibility that has reportedly set off tremors within Nellore’s transport department.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...