Jump to content

అత్యాచారం చేస్తే.. అదే చివరిరోజు


TampaChinnodu

Recommended Posts

అత్యాచారం చేస్తే.. అదే చివరిరోజు 
ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక 
4ap-main4a.jpg

ఈనాడు అమరావతి: రాష్ట్రంలో బాలికలు, మహిళలపై ఎవరైనా అత్యాచారం వంటి నేరాలకు పాల్పడితే వారికదే చివరి రోజవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. నేరం చేసినవాళ్లను ఉరికంబం ఎక్కిస్తామని, ఎంత గొప్పవాళ్లయినా ఉపేక్షించేది లేదని, దేవుడు కూడా వారిని కాపాడలేడని స్పష్టంచేశారు. ‘‘జీవితంపై ఆశ లేకపోతేనే అలాంటి నేరాలు చేయండి. టెస్ట్‌ చేయాలనుకుంటే చేయండి. ఏమవుతుందో చూస్తారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు పెడతామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు తెస్తామని అన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటన అత్యంత నీచమైన నేరమని, తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను శనివారం పరామర్శిస్తానన్నారు. ఆ బాలికకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు, చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, నేరస్తులకు ఒక హెచ్చరిక జారీ చేసేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక తహసీల్దారు, పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో తాను పాల్గొంటానన్నారు. రెండు మూడు గంటలపాటు జరిగే ఈ ర్యాలీల్లో అందరూ పాల్గొనాలని  పిలుపునిచ్చారు. దాచేపల్లి ఘటన నేపథ్యంలోనూ వైకాపా తప్పుడు రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘‘ఖబడ్దార్‌. తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలనూ వదిలిపెట్టను. తమాషాలు చేయొద్దు. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను’’ అని హెచ్చరించారు. ‘‘దాచేపల్లి ఘటనలో నేరస్తుడి తమ్ముడి కుమారుడు వైకాపా నాయకుడు. గత ఎన్నికల్లో వారి కుటుంబ సభ్యులంతా ఆ పార్టీకే పనిచేశారు. కానీ వైకాపా నాయకులు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు’’ అని మండిపడ్డారు. ‘‘బెట్టింగ్‌లు, ఏటీఎంలలో డబ్బులు కొట్టేయడం, దొంగ నోట్లు మార్చడం వంటి నేరాల్ని వైకాపా నాయకులు అలవాటుగా మార్చుకున్నారు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా తప్పు తప్పే. శిక్ష తప్పదు’’ అని హెచ్చరించారు.  దాచేపల్లి బాలిక కుటుంబ సభ్యుల్ని శుక్రవారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌ హాలుకి పిలిపించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

నేను చండశాసనుడిని..! 
‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. జరగవు కూడా. నేను ఎప్పుడూ మెతగ్గా ఉండను. కఠినంగా ఉండాలనుకుంటే చండశాసనుడినే. హైదరాబాద్‌లో మతకలహాలు జరగకూడదంటే జరగకూడదంతే. రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండకూడదంటే ఉండకూడదు. తీవ్రవాదులు ఇష్టానుసారం చేస్తే ఊరుకోలేదు. చివరకు నన్ను లక్ష్యంగా చేసుకుని అలిపిరి దగ్గర 23 క్లేమోర్‌ మైన్స్‌ పెట్టి బ్లాస్ట్‌ చేశారు. ప్రాణం కూడా లెక్కపెట్టలేదు. ఈ రాష్ట్రంలో రె½డీలు, అరాచక శక్తులు ఉండటానికి వీల్లేదు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘ఒక నేరం చేశాక, మనిషి తప్పించుకోలేని పరిస్థితి సృష్టించాం కాబట్టి, దొరికినా ఉరిశిక్ష పడుతుందన్న భయంతో దాచేపల్లి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నాను. 48 గంటల్లోపు కేసు ఛేదించాం. భవిష్యత్తులోను ఇదే స్ఫూర్తి ఉండాలి’’ అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. ‘‘కొందరు తప్పుడు మార్గంలో వెళుతున్నారు. నీలి చిత్రాలకు, టెక్నాలజీకి బానిసలవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటివన్నీ చూసి నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాళ్లను వదిలిపెట్టను. దాచేపల్లి ఘటనే రాష్ట్రంలో చివరిది కావాలి. ఆబోతుల్లా ప్రవరిస్తామంటే ఊరుకోను. ఎవరు ఆడపిల్లల జోలికి వచ్చినా మనుగడ ఉండదు. ఇదే చివరి హెచ్చరిక. మీ ఆటలు సాగడానికి ఇది వేరే రాష్ట్రం కాదు ’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గుంటూరు కొత్తపేట పోలీసులు రమావత్‌ నాయక్‌ అనే వైకాపాకి చెందిన వ్యక్తిని అత్యాచారయత్నం కేసులో అరెస్టు చేశారని, అతనిపై నిర్భయ చట్టం కింద కేసు పెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.

గల్ఫ్‌ దేశాల్లో మాదిరిగా ఉరి తీయాలి..! 
అత్యాచార ఘటనలకు పాల్పడినవారికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పెట్టి, గల్ఫ్‌లో మాదిరిగా ఉరితీయాలని దాచేపల్లి బాలిక చిన్నాన్న ముఖ్యమంత్రిని కోరారు. ఒంటరిగా ఉన్న బాలికను మీ అమ్మమ్మ ఇంటికి తీసుకెళతానని నమ్మించి సుబ్బయ్య తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు. కథువా, ఉన్నావ్‌ ఘటనల్లో బాధితులకు జరగని న్యాయం, తమకు జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలందించిందని ఆయన పేర్కొన్నారు. 

Link to comment
Share on other sites

Quote

‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. జరగవు కూడా. 

call money case marsipoyada @3$%

Link to comment
Share on other sites

VIJAYAWADA:  In what could be a major development in the sensational “Call Money- Sex Scandal” that grabbed headlines, the Vijayawada 1st Additional Chief Metropolitan Magistrate Court (ACMM) started hearing in the case on Friday.The seven accused -- Yalamanchili Sri Rama Murthy (46), Polurowthu Bhavani Sankara Varaprasad (23), Chennupati Srinivas (52), M Satyanandam (49), Venigalla Srikanth (40), Pendyala Srikanth (40) and Dudala Rajesh (33) appeared before the magistrate.HEARING_BEGINS.jpg

Two years after a woman complained to Police Commissioner Gautam Sawang that financiers exploited her sexually and financially in the guise of money lending, the Machavaram police filed a charge-sheet against the seven accused on January 19 under IPC Sections 376 (D), 376 (1), 354 (A) (i) (ii), 354 (D), 384, 420, 509, 506, 450, 452, 467, 468, 471, 365, 342 IPC r/w 34, and 120(B).The seven accused appeared before the magistrate on the first day of hearing. The court posted the case for March 2 for further hearing. 

In her complaint with city police chief Gautam Sawang in 2015, the victim alleged that, Yalamanchili Sri Rama Murthy, the main (A1) accused asked her to come and meet him in a hotel to settle the civil cases that were filed against her in the past. When she went to the hotel, the accused mixed intoxicants in her drink and gang-raped her. They even shot a video of her when she was not in her senses.She further claimed that the main accused and his accomplices threatened to make public the video if she failed to meet their sexual demands in future.

Major controversy
Meanwhile, the charge-sheet filed by the Machavaram police raised several doubts as the police failed to provide proper scientific evidence in support of the charges of sexual exploitation levelled by the victim. The issue snowballed into a major controversy with several others lodging complaints against ruling party lawmakers, ministers and other influential TDP leaders with similar allegations.

Link to comment
Share on other sites

Quote

గల్ఫ్‌ దేశాల్లో మాదిరిగా ఉరి తీయాలి..! 

Great. Why don't you start that with call money case and show example to world.

Link to comment
Share on other sites

12 minutes ago, TampaChinnodu said:

Great. Why don't you start that with call money case and show example to world.

Movie actor pratyusha?

Link to comment
Share on other sites

8 hours ago, nandananditha said:

Gadhe vuncle alanti case apudu kuda Babu garu cm ga

Big shots case lu lite evadu emi cheyadu 

Link to comment
Share on other sites

3 hours ago, futureofandhra said:

Big shots case lu lite evadu emi cheyadu 

alanti appudu ila janaalu navvukunela statements ichi enduku paruvu theesukovatam. whole state knows about call money case. 

Link to comment
Share on other sites

Nakka to Loki: Orey pappu, ippudu janala mukha chithram ela undhira?

Loki: Nannaru, janalu mimmalni oosthunnaru.. ee <incident> vishayam lo.

Nakka: Ok ra, nenu valla flow ne follow ayyi inkokarni thidatha. Matter over. And <Hyd kattindhi nene>

 

 

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

alanti appudu ila janaalu navvukunela statements ichi enduku paruvu theesukovatam. whole state knows about call money case. 

Mastaru am talking reality all political parties doing this it's unfortunate

And I ask you one thing which party can remove all this issues??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...