Jump to content

పరిటాల రవి సన్నిహితుడు చమన్‌ మృతి


Hitman

Recommended Posts

అనంతపురం: తెదేపా దివంగత నేత పరిటాల రవి అత్యంత సన్నిహితుడు చమన్‌సాబ్‌ హఠాన్మరణం చెందారు. మంత్రి పరిటాల సునీత కుమార్తె వివాహం నిమిత్తం చమన్‌ రెండ్రోజులుగా వెంకటాపురంలో ఉన్నారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పరిటాల రవి కుటుంబ సభ్యుడిగా మెలిగిన చమన్‌ గతంలో అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. పరిటాల రవి హత్య తర్వాత చాలాకాలం పాటు అజ్ఞాతంలో గడిపారు.

Link to comment
Share on other sites

1 minute ago, himacream said:

paritaala sunitha ki chaman ki link enti??? enduku antha emotional ayyindhi?

Akka kosam pranam isthaadu, chaman family ki chaala close

Link to comment
Share on other sites

చమన్‌ హఠాన్మరణం 
గుండెపోటుతో కుప్పకూలిన వైనం 
విషాదంలో పరిటాల అభిమానులు 
atp-top2a.jpg

జిల్లా పరిషత్తు, రామగిరి, న్యూస్‌టుడే: జడ్పీ మాజీ అధ్యక్షుడు దూదేకుల చమన్‌ (58) సోమవారం హఠాన్మరణం చెందడంతో పరిటాల అభిమానులు, తెదేపా శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం రామగిరి మండలం వెంకటాపురంలో సొమ్ముసిల్లి కుప్పకూలిన చమన్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చమన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తీసుకొస్తున్నారని తెలియగానే తెదేపా నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భారీగా ఆసుపత్రికి వద్దకు చేరుకున్నారు. మంత్రి పరిటాల సునీత, విప్‌ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, బీకే పార్థసారథి, జడ్పీ ఛైర్మన్‌ పూల నాగరాజు, మేయర్‌ స్వరూప, కలెక్టర్‌ వీరపాండియన్‌, డీఐజీ ప్రభాకర్‌రావు ఆసుపత్రికి చేరుకున్నారు.

సొమ్మసిల్లిన మంత్రి... 
మరోవైపు ఆసుపత్రిలో వైద్యులు చికిత్సలు చేస్తుండగానే చమన్‌ తుది శ్వాస వదిలారు. గుండెపోటు రావడంతోనే ఆయన మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, కార్యకర్తలు బోరున విలపించారు. చమన్‌ మరణవార్త వినగానే మంత్రి పరిటాల సునీత విలపిస్తూ కుమారుడు శ్రీరామ్‌ చేతుల మీద సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న వైద్యులు హుటాహుటిన ఆమెకు చికిత్సలు అందజేశారు. అనంతరం మంత్రిని కలెక్టర్‌, డీఐజీ, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చమన్‌ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్‌.కొత్తపల్లికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నాయకుల సంతాపం... 
చమన్‌ మృతి తెదేపాకు తీరని లోటు అని మంత్రి కాలవ శ్రీనివాసులు , ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. కొత్తపల్లిలో చమన్‌ మృతదేహానికి చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గౌస్‌మోహిద్దీన్‌, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ పర్వీన్‌బాను, జడ్పీ సీఈవో స్వరూపరాణి, పంచాయతీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. చమన్‌ భార్య రమీజాబేగం, కుమారుడిని ఓదార్చి వారికి సానుభూతి తెలిపారు. చమన్‌ రాజకీయాలకు అతీతంగా జడ్పీ పాలక వర్గాన్ని నడిపారనీ.. వివాద రహితుడిగా పని చేసి అందరి మన్ననలు పొందారన్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

గీత కార్మికుడిగా మొదలై.. 
చమన్‌ ప్రస్థానం గీత కార్మికుడిగా మొదలైంది. పరిటాల రవితో పరిచయం.. 1993లో రవి తెదేపాలో చేరడంతో నాటి నుంచి చమన్‌ కూడా ఆయన వెంట నడిచారు. రవీంద్ర అనుచరుడిగా పెనుకొండ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పునర్విభజనకు ముందు పెనుకొండ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పరిటాల వర్గీయులపై దాడులు మొదలవడంతో రవి సూచనతో అజ్ఞాతంలోకి వెళ్లారు. రవి ప్రధాన ప్రత్యర్థి మద్దలచెరువు సూరి హత్య తర్వాత పరిణామాలు మారిపోవడంతో 2012లో అజ్ఞాతం నుంచి చమన్‌ బయటకు వచ్చారు. ఆ తర్వాత రామగిరి నుంచి స్థానిక ఎన్నికల బరిలో దిగి తెదేపా తరపున జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి అధ్యక్ష పీఠం చేపట్టారు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకు నిరుడు పదవికి రాజీనామా చేశారు.

చెరగని ముద్ర... 
మూడేళ్ల రెండు నెలలు జడ్పీ అధ్యక్షుడిగా ఉన్న చమన్‌ చెరగని ముద్ర వేశారు. పంచాయతీరాజ్‌ శాఖ అమలు చేస్తున్న పథకాలు, స్వచ్ఛభారత్‌, మరుగుదొడ్ల నిర్వహణ, పొదుపు సంఘాల పురోగతిపై దీన్‌దయాళ్‌ యోజన కింద అనంత జడ్పీకి ప్రథమ పురస్కారం దక్కింది. ఈ అవార్డును నిరుడు లఖ్‌నవూలో కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి నుంచి చమన్‌ అందుకున్నారు. 
* చమన్‌ హయాంలో మూడు పర్యాయాలు ఉద్యోగుల బదిలీలు చేపట్టగా ఎక్కడా విభేదాలు, పొరపాట్లు లేకుండా పారదర్శకంగా జరిగాయి. పదోన్నతులు, కారుణ్య నియామకాల్లో కూడా జాప్యం లేకుండా చూశారు. 
* చమన్‌ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన కుమార్తె చనిపోయింది. దీంతో ఆయనకు ఆడ పిల్లలంటే మమకారం. ఈక్రమంలో చమన్‌ కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలకు వెళ్లినప్పుడు చాలా మంది విద్యార్థులు భోజనం క్యారియర్‌ తెచ్చుకోక పోవడం గమనించారు. మధ్యాహ్న భోజనం తినకుండానే ఉంటున్నామని చెప్పడంతో చలించిన ఆయన రెండేళ్లుగా తన సొంత డబ్బు, దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నారు.

Link to comment
Share on other sites

గీత కార్మికుడిగా మొదలై.. 

చెరగని ముద్ర... 

 

aayana chesina okka manchi pani ikkada vesthe.....DB lo kooda kondharu సొమ్మసిల్లి padochu

Link to comment
Share on other sites

32 minutes ago, himacream said:

గీత కార్మికుడిగా మొదలై.. 

చెరగని ముద్ర... 

 

aayana chesina okka manchi pani ikkada vesthe.....DB lo kooda kondharu సొమ్మసిల్లి padochu

Settlement,Rowdyisum, murders etc... 

Link to comment
Share on other sites

56 minutes ago, himacream said:

గీత కార్మికుడిగా మొదలై.. 

చెరగని ముద్ర... 

 

aayana chesina okka manchi pani ikkada vesthe.....DB lo kooda kondharu సొమ్మసిల్లి padochu

* చమన్‌ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన కుమార్తె చనిపోయింది. దీంతో ఆయనకు ఆడ పిల్లలంటే మమకారం. ఈక్రమంలో చమన్‌ కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలకు వెళ్లినప్పుడు చాలా మంది విద్యార్థులు భోజనం క్యారియర్‌ తెచ్చుకోక పోవడం గమనించారు. మధ్యాహ్న భోజనం తినకుండానే ఉంటున్నామని చెప్పడంతో చలించిన ఆయన రెండేళ్లుగా తన సొంత డబ్బు, దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నారు.

vesindhi kuda sadavava 

Link to comment
Share on other sites

34 minutes ago, mettastar said:

* చమన్‌ అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయన కుమార్తె చనిపోయింది. దీంతో ఆయనకు ఆడ పిల్లలంటే మమకారం. ఈక్రమంలో చమన్‌ కేఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలకు వెళ్లినప్పుడు చాలా మంది విద్యార్థులు భోజనం క్యారియర్‌ తెచ్చుకోక పోవడం గమనించారు. మధ్యాహ్న భోజనం తినకుండానే ఉంటున్నామని చెప్పడంతో చలించిన ఆయన రెండేళ్లుగా తన సొంత డబ్బు, దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నారు.

vesindhi kuda sadavava 

Sontha dabbu kallu geesi, cheppulu kutti sampaadinchaadu paapam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...