Jump to content

మీరు పట్టించుకోకపోతే రాష్ట్రమే రోడ్లు వేస్తుంది


TampaChinnodu

Recommended Posts

మేమే జాతీయం చేస్తాం 
మీరు పట్టించుకోకపోతే రాష్ట్రమే రోడ్లు వేస్తుంది 
మా ఆధ్వర్యంలోని రహదారులని బోర్డులు పెడతాం 
జాతీయ రహదారుల సంస్థకు ముఖ్యమంత్రి హెచ్చరిక 
లక్ష హోటల్‌ గదుల లక్ష్య నిర్దేశం 
25 వేల గ్రామాల్లో వైఫై 
రాజధానికి 33,700 ఎకరాల భూసమీకరణ పూర్తి 
కలెక్టర్ల సదస్సులో పలు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష 
కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి 
ఈ నెల నుంచి పురపాలికల్లో పర్యటన 
ఈనాడు - అమరావతి 
9ap-main1a.jpg
జాతీయ రహదారుల్ని సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని, అవి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ రహదారులంటూ అక్కడ బోర్డులు పెడతామని జాతీయ రహదారుల సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల జాతీయ రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి నిర్వహణకు నిధులివ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. ఏ రహదారిపైనా గుంతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజైన బుధవారం ఇ-ప్రగతి, ఐటీ, ఆర్టీజీ, పెట్టుబడులు, మౌలిక వసతులు, రోడ్లు- భవనాలు, పర్యాటక, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో నూరు శాతం డిజిటల్‌ అక్షరాస్యత సాధించాలని అధికారులకు సూచించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలోని హోటళ్ల నిర్వహణ అధ్వానంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్ష గదులు అందుబాటులో ఉండేలా హోటళ్ల నిర్మాణం జరగాలని పర్యాటకశాఖకు లక్ష్యం నిర్దేశించారు. అరకు, లంబసింగిలలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంలో హోటళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

* రాష్ట్రంలో 100 శాతం గుంతల్లేని రోడ్లుండాలి. 
* జాతీయ రహదారులన్నీ కనీసం 2 వరుసలుగా ఉండాలి. 
* జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్లన్నింటినీ తారు రోడ్లుగా మార్చాలి. 
* రాజధాని బాహ్య వలయ రహదారి నిర్మాణానికి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలి. 
* విశాఖ- భీమిలి బీచ్‌రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలి. 
* విజయవాడలో బెంజ్‌ సర్కిల్‌ నుంచి నిడమానూరు వరకు రహదారి విస్తరణను ఈపీసీ విధానంలో చేపట్టాలి.

లంబసింగి, అరకులో నక్షత్రాల హోటళ్లు 
లంబసింగి, అరకులలో హోటళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచినా స్పందన లేదని, పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనే హోటళ్ల నిర్మాణం చేద్దామనుకుంటున్నామని అధికారులు చెప్పగా ముఖ్యమంత్రి తిరస్కరించారు. అక్కడ ఐటీడీఏ ప్రైవేటు సంస్థలతో కలిసి 5, 7 నక్షత్రాల హోటళ్లు నిర్మించాలని వాటి నిర్వహణను ఫోర్‌ సీజన్స్‌, ఐటీసీ, తాజ్‌వంటి ప్రఖ్యాత సంస్థలకు అప్పగించాలని స్పష్టం చేశారు. ఏపీటీడీసీ ఆధ్వర్యంలో హోటళ్ల నిర్వహణ అధ్వానంగా ఉంటుందని, ముఖ్యమంత్రి వస్తున్నారన్న లెక్క కూడా వారికి లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

* రాష్ట్రంలో 2020 నాటికి 15వేల హోటల్‌ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు చెప్పగా మొత్తంగా లక్ష గదులను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు. 
* మహీంద్రా గ్రూపు 5వేలు, తాజ్‌ గ్రూపు 5వేల గదులతో హోటళ్ల నిర్మాణానికి హామీ ఇచ్చాయన్న సీఎం. 
* విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా గ్రామీణ పర్యాటకాభివృద్దికి సంస్కృతి పేరుతో ప్రత్యేక ప్రాజెక్టు. శ్రీకాళహస్తి, మదనపల్లి, దిండి, లేపాక్షి జోన్లు మొదటి దశలో అభివృద్ధి. 
* ఈ సంవత్సరం రాష్ట్రంలో 18 ఉత్సవాలు నిర్వహిస్తామన్న అధికారులు. కేవలం ఉత్సవాలు చేసి వదిలేయకుండా విశాఖ, అమరావతి, తిరుపతిల్లో నిరంతరం పండగ వాతావరణం ఉండేలా చూడాలని సీఎం ఆదేశం. 
* విశాఖ మన్యంలో పెరిగే కాఫీ మొక్కల ఆకుల నుంచి రూపొందించిన ‘తేనీరు’ ఆవిష్కరణ. 
* అమరావతిలో మెగా శిల్పారామం. 
* తూర్పుగోదావరి జిల్లా దిండి వద్ద బ్యాక్‌ వాటర్స్‌లో 25 హౌస్‌ బోట్ల ఏర్పాటుకు కేరళ సంస్థల ఆసక్తి. 
* రాజమహేంద్రవరం, పోలవరం వరకూ పాపికొండల్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టు వేగవంతం.

ఇన్నోవేషన్‌ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్‌.. 
‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడు డిజిటల్‌ అక్షరాస్యుడు కావాలి. రాబోయే రోజుల్లో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉందని ప్రపంచం మొత్తం చెప్పుకోవాలి’ అని ముఖ్యమంత్రి పిలుపు.

* ఇ-ప్రగతిపై అధికారులు బాలసుబ్రమణ్యం, సత్యనారాయణ ప్రజెంటేషన్‌. 
* అక్టోబరు 2కి ఇ-ప్రగతి పూర్తి స్థాయిలో సిద్ధం. 
* మే 15కి ఇ-ప్రగతి కోర్‌ ప్లాట్‌ఫాం ఆపరేషన్‌కు సిద్ధం. 
* ఆగస్టు 31కి 30 సర్వీసులు మొదలు. 
* ఆగస్టు నాటికి అన్ని హైస్కూళ్లలో వర్చువల్‌ తరగతి గదులు.

ఫలితం: రంపచోడవరంలో అనారోగ్యంతో ఉన్న మహిళకు అరుదైన గ్రూపు రక్తం 13 బాటిల్స్‌ ఎక్కించాల్సి వస్తే.. ఆర్టీజీఎస్‌తో 29వేల మందికి సందేశం. 20 మంది నుంచి రక్తం సేకరణ.

* రాష్ట్రంలో కొత్తగా 14770 నిఘా కెమేరాల ఏర్పాటు. 
* రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు ఎలక్ట్రిక్‌ కార్లు సమకూర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. 
* ప్రజలనూ ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి. 
* భారత్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టు కింద 25 వేల పంచాయతీల్లో వైఫై హాట్‌స్పాట్‌లు. 
* జక్కంపూడి ఎకనామిక్‌ సిటీకి 90 ఎకరాలు. 
* జూన్‌ నెలాఖరుకు శాసనసభ భవనానికి టెండర్లు 
* రాజధానికి 33,700 ఎకరాల భూసమీకరణ పూర్తి. 
* ఈ నెలాఖరుకు హైకోర్టుకు టెండర్లు 
* మంత్రుల కోసం 36 బంగ్లాలు.

శాఖలపై అసంతృప్తి 
‘అన్న క్యాంటీన్లకు స్థలం ఇవ్వకపోవడమేంటి? ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి ఇవ్వాలన్నా ఇన్ని అభ్యంతరాలా? తమాషానా ఏంటి?’ అని ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్థలాలు ఇచ్చినంత మాత్రాన ఇబ్బందేమీ ఉండదు.. హక్కులు వాళ్లకేమీ రావు. వెంటనే స్థలాలు అప్పగించండి’ అని స్పష్టం చేశారు. ‘వ్యక్తుల మధ్య సమన్వయలేమి, అహం (ఇగో) సమస్యలు ఉన్న చోటే నేను లక్ష్యాలను సాధించలేకపోయా’ అని మండిపడ్డారు. పట్టణ సుందరీకరణ (అర్బన్‌ గ్రీనింగ్‌), నైపుణ్యాభివృద్ధి శాఖలపైనా ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. ‘గతంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే దారిలో పచ్చదనం బాగుందని చెప్పేవాడిని. ఇప్పుడది ఎండిపోయింది.. విజయవాడలోనూ మొక్కలు నాటే కార్యక్రమం సరిగా లేదు..’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ఆలీబాబా ఆసక్తితో ఉన్నా ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఈడీబీ) పట్టించుకోవడం లేదన్నారు. ‘నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి మూడున్నరేళ్లకు పైగా అవుతోంది.. ఇప్పటికీ అనుకున్న లక్ష్యాలను చేరలేకపోయాం.. ఆశించిన ప్రగతి లేదు’ అని ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.

9ap-main1b.jpg
కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ఇళ్లెక్కడున్నాయో 
‘పదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో కట్టిన 4 లక్షల ఇళ్ల అడ్రస్‌ దొరకడం లేదు. కేసులు పెట్టాం.. సీబీసీఐడీ అన్నాం.. ఎవరిని అడగాలి? రాజీవ్‌ గృహకల్పను ఇష్టానుసారం చేపట్టారు. దాంట్లోకి ఎవరూ రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన గృహాలు 15వేల వరకూ ఉన్నాయి. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టండి. లబ్ధిదారులను గుర్తించి అప్పగించండి. ఏడాది ఆఖరుకు ఈ ప్రక్రియ పూర్తి కావాలి.’ 
* ప్రభుత్వ స్థలాల్లో 100 చదరపు గజాల వరకు ఇల్లు నిర్మించుకున్న వారికి రిజిస్ట్రేషన్‌ అవసరం లేకుండా చేద్దాం. నాలుగైదు దశాబ్దాల కిందట కొనుక్కుని ఉన్నా వారికి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేద్దాం. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దస్త్రాన్ని పెట్టండి. 
* వచ్చే ఏడాది మార్చిలోగా రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. అప్పటికీ ఇంకా ఇళ్లు లేని కుటుంబాలు 20 లక్షలు ఉంటాయని అంచనా. అలాంటి వారందరిని గుర్తించి రెండేళ్లకు సరిపడా మంజూరు పత్రాలు ఇస్తాం. 
* ఉద్యోగులకు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇళ్లు. కార్మికులకు వారు పనిచేసే సంస్థలతో మాట్లాడి గృహ నిర్మాణం. 
* ఆలయ భూములను వేలం వేస్తే వాటిని కొని పేదలకు ఇళ్లు కడదాం. 
* జూన్‌2నుంచి రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వాలి. 
* 40 పారిశ్రామిక అనుమతులను తిరస్కరించడంపై సమీక్షించాలని సీఎస్‌కు సూచన. 
* ఈ నెల నుంచి పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో పర్యటిస్తా. 
* నిరుద్యోగభృతిపై కార్యాచరణ ప్రారంభించండి. 
* ఈ నెలలో సంతృప్తిస్థాయి 5శాతం పెంచాలి. 
* రాష్ట్రంలో సాధ్యమైనన్ని జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలి.

ఈనాడు కథనంపై చర్చ 
బుధవారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ‘సాగర గర్భంలో ఖనిజ నిధి’ శీర్షికతో వచ్చిన కథనం కలెక్టర్ల సదస్సులో ప్రస్తావనకొచ్చింది. తీరంలో ఖనిజాల సంగతేంటి? అని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. పది నాటికల్‌ మైళ్ల దూరంలో 100 బ్లాకుల్లో ఖనిజ వనరులు ఉన్నట్లు జీఎస్‌ఐ గుర్తించిందని వారు వివరించారు. తీరంలోని ఖనిజాలపైనే రాష్ట్రానికి హక్కు ఉంటుందని 12 నాటికల్‌ మైళ్ల వరకు ఉండే ఖనిజాలు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయని పేర్కొన్నారు. సముద్రం నుంచి వచ్చే పెట్రో ఉత్పత్తులపై రాష్ట్రాలకు రావాల్సిన నిధులపై మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. ఆయన ప్రధాని అయ్యాకే కేసును ఉపసంహరించుకుని రాష్ట్రానికి నిధులు విడుదల చేశారని వివరించారు. దీనివల్ల ఆ రాష్ట్రానికి రూ.7వేల కోట్లకు పైగా దక్కాయన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
సంక్షేమం అమలు ఎంత ముఖ్యమో దానిపై అవగాహన కల్పించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడం అంతే అవసరం అని చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు గ్రామాలకు వెళ్లే సమయంలో అక్కడి ప్రజలతో మాట్లాడాలని చెప్పారు. సమాచారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై సమాచారశాఖ సలహాదారు సంజయ్‌గుప్తా ప్రదర్శన రూపంలో కలెక్టర్లు, అధికారులకు వివరించారు.

* శాఖల వారీగా పథకాల అమలుపై సంతృప్తి శాతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గృహనిర్మాణం సమయంలో ఇంటి స్థలం ఎక్కడుందో కూడా తెలియక ముందే ఫోన్‌ చేసి అభిప్రాయాలు అడుగుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై వచ్చిన సర్వేలతో డైరెక్టరు కన్నబాబు విభేదించారు. తమ సర్వేలో సంతృప్తి శాతం ఎక్కువగా ఉందన్నారు. అది కన్నబాబు అభిప్రాయమేనని చంద్రబాబు నవ్వుతూ అన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    10

  • Hydrockers

    4

  • solman

    3

  • TheBrahmabull

    3

Popular Days

Top Posters In This Topic

15 minutes ago, Hydrockers said:

Mari Ee lekkana central govt iche funds unna padhakalaku central govt sahayam tho ani pettandi mari

 

A person who can't finish a flyover construction since 4 years is criticizing center on roads  @3$%

Link to comment
Share on other sites

16 minutes ago, Hydrockers said:

Mari Ee lekkana central govt iche funds unna padhakalaku central govt sahayam tho ani pettandi mari

 

Abbe...ala cheyadu kada..

babu garu..maha cunnning fox akada...positive aithe publicitu kosam enthavaraku aina potadu...negative aithe motham BJP mida srcp mida tosestadu

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

Abbe...ala cheyadu kada..

babu garu..maha cunnning fox akada...positive aithe publicitu kosam enthavaraku aina potadu...negative aithe motham BJP mida srcp mida tosestadu

Ahey tappem undhi Anna, state ki Central support cheyaali, parliament lo unna bill lo undhi kadhaa, bill ki BJP tho paatu andaru support chesaaru, Mana mukku Dora kooda Anna thamulu laaga vidipodham anaadu.

Bill lo pettindhi kodhi ga chesukuntu mam iraga dheesinam Ani BJP enduku cheppu kovaali.

Anan Mana reddy Raajyam vasthaadhi ley Anna.

 

Dheeniki kosam Andhra meedha CBN meedha intha la edavaalsina avasaram ledhu..

 

Link to comment
Share on other sites

7 minutes ago, caesar said:

Ahey tappem undhi Anna, state ki Central support cheyaali, parliament lo unna bill lo undhi kadhaa, bill ki BJP tho paatu andaru support chesaaru, Mana mukku Dora kooda Anna thamulu laaga vidipodham anaadu.

Bill lo pettindhi kodhi ga chesukuntu mam iraga dheesinam Ani BJP enduku cheppu kovaali.

Anan Mana reddy Raajyam vasthaadhi ley Anna.

 

Dheeniki kosam Andhra meedha CBN meedha intha la edavaalsina avasaram ledhu..

 

Support cheyali ani undhi kada ani ista rajyam GA karchu pedite vallu matram Endhuku istaru ?

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Support cheyali ani undhi kada ani ista rajyam GA karchu pedite vallu matram Endhuku istaru ?

LED bulbs ki center funds isthey , center ki thanks kooda seppakunda antha meme sesam ani PPT vesukunnaru. chinna bob day and night worked anta daani meeda. malli total number of installed LED bulbs count soosthe , it was less than many other states. 

inka enduku istharu man dabbulu ila sesthe.

Link to comment
Share on other sites

Quote

* ఈ నెలాఖరుకు హైకోర్టుకు టెండర్లు 

enni nelakarulu soodalo inka. few months nundi ide telling. 

Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

enni nelakarulu soodalo inka. few months nundi ide telling. 

Next month Kuda ade chebtaru

Mata medha nikabadutadu  MA babu garu -----pulkas

Link to comment
Share on other sites

1 hour ago, TampaChinnodu said:

LED bulbs ki center funds isthey , center ki thanks kooda seppakunda antha meme sesam ani PPT vesukunnaru. chinna bob day and night worked anta daani meeda. malli total number of installed LED bulbs count soosthe , it was less than many other states. 

inka enduku istharu man dabbulu ila sesthe.

That was all time man...

LED buls project aithe...mazaak mazaak la chinna bob own chesukundu...ada chesindu ledu,pettindi ledu...central ministry dashboard vunde kabatti dorikipoimdu kani...itla enni enni chestunaro pulka gallu

Link to comment
Share on other sites

కొన్ని నెలలు తర్వాత...

 

మేము మా స్వంత GST ను సేకరిస్తాము, 
మా  సొంత DELHI ఉంటుంది...
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...