Jump to content

శ్రీదేవి మరణానికి సంబందించి బయటపడుతున్న విస్తుపోయే విషయాలు|Mystery Behind Veteran Actress SriDevi death


AdaraboinaShrikanth

Recommended Posts


అతిలోక సుందరి శ్రీదేవి మరణించి, అప్పుడే రెండున్నర నెలలు దాటిపోయాయి. అభిమానులు, ఆమె మరణాన్ని దిగమింగుకుని, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు . ఐతే, శ్రీదేవి అంత హఠాత్తుగా ఎలా చనిపోయింది.. అంత చిన్న బాత్ టబ్ లో పడిపోయి, ఆమె చనిపోవడమేంటి.. అసలు శ్రీదేవి సమస్య ఏంటి..? ఆమెకున్న అనారోగ్యమేంటి..? అనే ప్రశ్నలు, ప్రతి మనిషికి ఉన్నటువంటి సందేహాలు .కాని ఇప్పటివరకు, శ్రీదేవి చనిపోడానికి స్పష్టమైన కారణం ,అనేది ఎవ్వరు చెప్పలేక పోయారు, శ్రీదేవిది అనుమానాస్పద మరణం కాదనే విషయాన్ని, దుబాయ్ పోలీసులే తేల్చేశారు.ఐనప్పటికీ తమ అభిమాన నటి, చనిపాయిందంటే ఎవ్వరు నమ్మట్లేరు , ఇక ఇండియన్ పోలీసులు అయితే, ఈ  విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఐతే శ్రీదేవి మృతిపై, సందేహాలతో ఉన్న కొందరు వ్యక్తులు, ఆమె మృతి వెనుక రహస్యాల్ని ఛేదించేందుకు, పట్టుదలతోనే పోరాడుతున్నారు. తాజాగా సునీల్ సింగ్ అనే ఫిలిం మేకర్ శ్రీదేవి మరణంపై స్వతంత్ర విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు. ఇప్పటికే ఢిల్లీ కోర్టులో వేసిన అతడి పిటిషన్ తిరస్కరణకు గురవగా.. తాజాగా అతను సుప్రీం కోర్టుకు వెళ్లాడు. కానీ అక్కడ కూడా అతడికి చుక్కెదురైంది.

ఇక్కడనే  ఆ వ్యక్తి శ్రీదేవి మృతి విషయంలో వ్యక్తం చేసిన సందేహాలు.. ఆమె ఇన్సూరెన్స్ కు సంబంధించిన వెల్లడించిన వివరాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒమన్ లో శ్రీదేవి పేరిట రూ.240 కోట్లకు జీవిత బీమా తీసుకున్నారట. ఆమె దుబాయ్ లో కనుక చనిపోతే రూ.240 కోట్లు వచ్చేలా బీమా ఒప్పందం జరిగినట్లు అతను వెల్లడించాడు. దీన్ని బట్టి శ్రీదేవి మృతిలో ఏదో మిస్టరీ ఉందని పిటిషనర్ ఆరోపించాడు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న శ్రీదేవి 5 అడుగుల పొడవున్న బాత్ టబ్ లో పడి చనిపోవడంపైనా అతను సందేహాలు వ్యక్తం చేశాడు. సునీల్ సింగ్ చెబుతున్నట్లు 240కోట్ల జీవిత భీమా  వివరాలు నిజమైతే మాత్రం శ్రీదేవి మృతిని సందేహించాల్సిందే.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...