Jump to content

ఇంద్ర సినిమాకి సీక్వెల్ గా వస్తున్న బోయపాటి-రామ్ చరణ్ ల మూవీ|Sequel For Chiranjeevi Indra Movie


AdaraboinaShrikanth

Recommended Posts

 సోషల్ మీడియాలో ట్రాలింగ్ ఎంత కామన్ అయిపోయిందో.. బెదిరింపులు కూడా అంతే సహజం అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా ఒక పోస్ట్ చేస్తే ఒకవేళ ఆ పోస్ట్ నచ్చకుంటే వాళ్ళని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ప్రస్తుతం జరుగుతుంది.మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ట్రోలింగ్ అనేది సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా ఉందనేది వాస్తవం .సినీ విమర్శకుడు కత్తి మహేష్ సినిమాల పై చెప్పే రివ్యూ లు నచ్చక సదరు హీరోల అభిమానులు కత్తికి నరకమే చూపించారు ,ఈ తథంగా అంత తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రచ్చ చేసింది .పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎందరు ఉన్నారంటే చెప్పడం కష్టమే ,అలాంటిది కత్తి ఏకంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో యుద్దమే చేసాడు .ఇప్పటి వరకు బానే ఉన్న ఇప్పుడు ఈ అభిమానులు తమకున్న హద్దులు దాటేసి మరి ప్రవర్తించడం ఆందోళన చెందాల్సిన విషయమే. తమ అభిమాన హీరోల సినిమాల పై రివ్యూలు రాసేది మహిళలు అనేది కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు . కేరళలో అయితే.. ఓ నటిని రేప్ చేయించేదుకు స్టార్ హీరో దిలీప్ ప్రయత్నించాడనే కేసు నడుస్తోంది. తమ హీరోలే చేయగా,మేమెందుకు చేయకూడదు అనుకున్నారేమో  అభిమానులు,ఇప్పుడు  ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. 

 అల్లు అర్జున్ మూవీ విషయంలో కూడా ఇలాంటి బెదిరింపులే వినిపిస్తున్నాయి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల అయింది. అక్కడ బన్నీకి మంచి మార్కెట్ ఉండగా.. ఈ సినిమాకు ఇక్కడిలానే అక్కడ కూడా  యావరేజ్ రివ్యూలే వచ్చాయి. అపర్ణ ప్రశాంతి అనే ఓ జర్నలిస్ట్ రాసిన నెగిటివ్ రివ్యూ కారణంగా.. అక్కడి అభిమానులు అనేక మంది ఆమెను బెదిరిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. కాకపోతే మామూలుగా ఉండట్లేవు ఈ ట్వీట్ లు ఏకంగా రేప్ చేస్తామంటూ బెదిరించడంతో ఆ మహిళా ఆందోళనకు గురి అయింది.

దీనిపై ప్రశాంతి ఇప్పటికే సైబర్  సెల్ కు కూడా ఫిర్యాదు చేసింది. నిజానికి కేరళలో దాదాపు అందరు రివ్యూ రైటర్ల మాదిరిగానే ఈమె రివ్యూ కూడా ఉంది. కానీ మహిళ కావడంతోనే ఈమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిజానికి రివ్యూలు ఓ వ్యక్తి అభిప్రాయం మాత్రమే. అవి సినిమా జయాపజయాలను నిర్ణయించలేవనే విషయం గతంలోనే నిరూపితం అయింది. ఐనప్పటికీ హీరోలపై ఉన్న అభిమానంతో అభిమానులు ఇలా చేస్తున్నారు, ఇంత జరుగుతున్న హీరోలు స్పందించక పోవడం అనేది అనేది ఆలోచించాల్సిన విషయమే .

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...