Jump to content

రూ. 13వేలకే అమెరికా ప్రయాణం..!


TampaChinnodu

Recommended Posts

రూ. 13వేలకే అమెరికా ప్రయాణం..!

09124016BRK134.JPG

న్యూదిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన వావ్‌ ఎయిర్‌లైన్స్‌ భారత్‌ నుంచి అమెరికాకు ప్రయాణాన్ని అత్యంత చౌకగా మార్చేయనుంది. న్యూదిల్లీ నుంచి రికియావిక్‌ దీవి మీదుగా ఉత్తర అమెరికాలోని దాదాపు 15గమ్యస్థానాలకు ఈ విమానయాన సంస్థ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో ఒకవైపు ప్రయాణ టికెట్‌ రూ. 13,499 గా నిర్ణయించారు. ఈ విషయాన్ని వావ్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యవస్థాపకుడు స్కూలీ మాగన్సన్‌ మంగళవారం తెలిపారు. న్యూయార్క్‌, లాస్‌ ఏంజిల్స్‌, బోస్టన్‌ వంటి నగరాలు వావ్‌ సంస్థ జాబితాలో ఉన్నాయి.

ఈ టికెట్‌ కేవలం ఒక మనిషి విమానంలో ప్రయాణించడానికి మాత్రమే .. ఇక ప్రయాణికుడి సామగ్రి, భోజనం, కావాల్సిన సీటు కోసం అదనపు మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిత్యం 20 వేలమంది భారత్‌ నుంచి ఉత్తర అమెరికాలోని పలు నగరాలకు ప్రయాణిస్తున్నారు. ‘ భారత్‌ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో మావే అత్యంత చౌక అయినవి. దీనికి భారత్‌లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరిన్న నగరాల్లో విస్తరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాం. ’ అని మాగన్సన్‌ పేర్కొన్నారు.

దిల్లీలో విమానాశ్రయింలో లభించే స్లాట్ల ఆధారంగా ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి సర్వీసులు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వావ్‌ సంస్థ వారానికి ఐదు స్లాట్ల కోసం దిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎంఆర్‌తో చర్చలు జరిపింది. ముఖ్యంగా ఉదయం 6 గంటలకు ప్రయాణం ప్రారంభ సమయం ఉండే విధంగా స్లాట్లను కోరుతోంది. ఈ సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఎ330 నియో విమానాలు భారీగా ఉండటంతో ఇదే అనుకూల సమయంగా సంస్థ భావిస్తోంది. తాము కోరుకున్న స్లాట్లను పొందుతామని ధీమా వ్యక్తం చేస్తోంది.

Link to comment
Share on other sites

Quote

ఈ టికెట్‌ కేవలం ఒక మనిషి విమానంలో ప్రయాణించడానికి మాత్రమే .. ఇక ప్రయాణికుడి సామగ్రి, భోజనం, కావాల్సిన సీటు కోసం అదనపు మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది.

rest room trips ki kooda charge antaaru emo silent_I1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...