Jump to content

ధనిక దేశాల జాబితాలో మనదేశానికి ఆరోస్థానం


TampaChinnodu

Recommended Posts

సుసంపన్న భారతం 
ధనిక దేశాల జాబితాలో మనదేశానికి ఆరోస్థానం 
  మొత్తం సంపద విలువ రూ.559 లక్షల కోట్లు 
  అగ్రస్థానంలో అమెరికా తర్వాతి స్థానాల్లో చైనా, జపాన్‌ 
2027 కల్లా 4వ స్థానానికి చేరుకోనున్న భారత్‌ 
20ts-main1a.jpg

దిల్లీ: అంతర్జాతీయ ఐశ్వర్య సూచీపై భారత్‌ సత్తాచాటింది. సుసంపన్న దేశాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. మనదేశ మొత్తం సంపద దాదాపు రూ.559 లక్షల కోట్లు. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా అమెరికా నిలిచింది. ఆ దేశ సంపద రూ.4,254 లక్షల కోట్లకు పైమాటే. ‘అంతర్జాతీయ సంపద వలస సమీక్ష’ పేరుతో మారిషస్‌లోని ఆఫ్ర్‌ఆసియా బ్యాంకు తాజా నివేదికను విడుదల చేసింది.

ఒక్కో దేశంలో జీవిస్తున్నవారందరి వ్యక్తిగత సంపదను దేశ మొత్తం సంపదగా తాజా నివేదికలో పరిగణించారు. అప్పులేవైనా ఉంటే.. వాటిని తీసేశాక వ్యక్తులకు మిగిలిన ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వ్యాపార ప్రయోజనాలన్నింటినీ సంపద కింద లెక్కించారు. ప్రభుత్వ నిధులను మాత్రం తాజా లెక్కల్లోకి తీసుకోలేదు. అంత్యంత ధనిక దేశాల జాబితాలో అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో నిలిచింది. వ్యాపారుల సంఖ్య ఎక్కువగా ఉండటం, మంచి విద్యావ్యవస్థ, పటిష్ఠమైన ఐటీ రంగం, బీపీవో, స్థిరాస్థి వ్యాపారం, ఆరోగ్య సేవలు, వార్తాసంస్థల రంగం వంటివి భారత్‌లో సంపద సృష్టికి దోహదపడుతున్నాయి.

పదేళ్లలో బ్రిటన్‌ను అధిగమించే అవకాశం 
రానున్న దశాబ్దకాలంలో భారత్‌ సంపద వేగంగా పెరుగనుంది. 2027 కల్లా మనదేశం జర్మనీ, బ్రిటన్‌లను అధిగమించి.. సుసంపన్న దేశాల జాబితాలో 4వ స్థానాన్ని అలంకరిస్తుందని అంచనా. మొత్తంగా వచ్చే పదేళ్లలో మనదేశ సంపద రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. ఇక 2027 కల్లా చైనా సంపద దాదాపు రూ.4,721 లక్షల కోట్లకు పెరుగుతుందని.. అదే సమయంలో అమెరికా ఐశ్వర్యం సుమారు రూ.5,105 లక్షల కోట్లకు పడగలెత్తుతుందని అంచనా.

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు 
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ప్రైవేటు సంపద రూ.14,616 లక్షల కోట్లు. రానున్న దశాబ్దకాలంలో ఈ విలువ 50శాతం పెరిగి.. రూ.21,823లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. 
* ప్రస్తుతం రూ.6.7 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిఉన్నవారి సంఖ్య 1.52 కోట్లు. 
* రూ.6,700 కోట్ల కంటే అధిక నికర ఆస్తులున్న వ్యక్తుల సంఖ్య 2,252. 
* శ్రీలంక, భారత్‌, వియత్నాం, చైనా, మారిషస్‌ల సంపద వేగంగా వృద్ధి చెందుతోంది.

20ts-main1b.jpg
Link to comment
Share on other sites

list lo only brown/black country okate aithe...

italy,australia ,britain and france ni thokeyali....thatha samapaincha asthi tho manavadu sambaralu sestunattu

Link to comment
Share on other sites

7 minutes ago, Android_Halwa said:

list lo only brown/black country okate aithe...

italy,australia ,britain and france ni thokeyali....thatha samapaincha asthi tho manavadu sambaralu sestunattu

UK pani ayipoyindi.  

CA economy is more than UK anta now. 

Link to comment
Share on other sites

7 minutes ago, TampaChinnodu said:

UK pani ayipoyindi.  

CA economy is more than UK anta now. 

Ofcourse UK Pani aipoindi....inkoka 1-2 decades of prominance...maximum...by 2025, Britain will be making most of it deals with India and trade with India would be more profitable for Britain than ever...it would be their survival...

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Na valley Ee abivrudi antha nene India ki cell phone and computer ni parichayam chesa --- 40 years Nippu sorry thuppu

manaku ie nuisance thapadu broderu...thapadu...

nippu appalsamy naidu...

 

Link to comment
Share on other sites

1 hour ago, LastManStanding said:

Last year ye 6th place ki vellindi kadha GDP...mana media valla hadavidi tappithe

Election time kada

Link to comment
Share on other sites

5 hours ago, TampaChinnodu said:

UK pani ayipoyindi.  

CA economy is more than UK anta now. 

Anna ante, inka anni sardukoni vellipovala UK nundi, 

Maaku kuda KCR lanti, World best leader ravalani KTR anna ki twitter request pettukunta. Kontekurradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...