Jump to content

జూన్‌ 2 నుంచి నవ నిర్మాణ దీక్ష


TampaChinnodu

Recommended Posts

14 hours ago, TampaChinnodu said:
జూన్‌ 2 నుంచి నవ నిర్మాణ దీక్ష 
ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు 
తొలి రోజు బెంజి సర్కిల్‌లో ప్రతిజ్ఞ 
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు అవగాహన 
ఈనాడు డిజిటల్‌ - అమరావతి 
24ap-main3a.jpg

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం, విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని వచ్చే నవ నిర్మాణ దీక్షలో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. జూన్‌ 2 నుంచి వారం రోజులపాటు జరిగే నవ నిర్మాణ దీక్ష, ముగింపుగా నిర్వహించే మహా సంకల్పం కార్యక్రమాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గురువారం ఉండవల్లిలోని ప్రజా దర్బారు హాలులో అధికారులతో సమీక్షించారు. జూన్‌ 2న తొలి రోజు నవ నిర్మాణ దీక్ష విజయవాడలోని బెంజి సర్కిల్‌లో జరుగుతుంది. 8 వరకూ దీక్షలు కొనసాగుతాయి. నవ నిర్మాణ దీక్షలు జరిగినన్ని రోజులు ముఖ్యమంత్రి ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. 12 వేల గ్రామాల్లో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజు జరిగే మహా సంకల్ప సభలో రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. నవ నిర్మాణ దీక్ష జరిగినన్ని రోజులు ఒక్కో రోజు ప్రభుత్వం సాధించిన ఒక్కో విజయంపై వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ‘ఓడీఎఫ్‌, పంట కుంటలు, ఫైబర్‌ గ్రిడ్‌, 3 లక్షల మందితో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం, గృహ నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్యం, పౌష్టికాహార లోపం, రక్తహీనతల్ని నివారించడం, అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటివి ప్రభుత్వం సాధించిన విజయాలు. వీటిలో చాలా కార్యక్రమాల్లో త్వరలోనే సంతృప్త స్థాయికి చేరనున్నాం. ఐదు గ్రిడ్‌లలో విద్యుత్‌, గ్యాస్‌, సిమెంట్‌ రోడ్లకు సంబంధించి ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరాం. దేశంలో మరే రాష్ట్రం ఇన్ని విజయాలు సాధించలేదు. అద్భుతంగా పనిచేసిన ఉద్యోగులందరినీ, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగానికి చెందిన వారిని అవార్డులతో సత్కరించాలి’ అని సీఎం పేర్కొన్నారు.

నవ నిర్మాణ దీక్ష- మహాసంకల్పం 
కార్యక్రమాల వివరాలు ఇవీ.. 
జూన్‌ 2: నవ నిర్మాణ దీక్ష (విభజన చట్టం - అమలు తీరు) 
3: నీటి భద్రత - కరవు రహిత రాష్ట్రం (తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరు, పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులు, జల వనరులు) 
4: రైతు సంక్షేమం, ఆహార భద్రత (వ్యవసాయ, అనుబంధ రంగాలు- పౌర సరఫరాలు) 
5: సంక్షేమం- సాధికారత (వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, సమాజ, కుటుంబ వికాసం) 
6: ఉపాధి కల్పన- జ్ఞానభూమి (పారిశ్రామికం, సేవారంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి) 
7: మౌలిక సదుపాయాలు - మెరుగైన జీవనం (అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి) 
8: మహా సంకల్పం (సుపరిపాలన- అవినీతి రహిత సుపరిపాలన, గ్రామ రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక, ఈ-ప్రగతి, ఐటీ, ఐవోటీ, పౌర సేవలు, సుస్థిర వృద్ధి, దూరదృష్టి)

https://video.twimg.com/ext_tw_video/999345075120324609/pu/vid/640x360/0EgNAuDicDfKNQ8P.mp4?tag=3  ... vaari endi idi ?

Link to comment
Share on other sites

1 minute ago, TheBrahmabull said:

Ap gurinchi matladuthunte tg endukochindi ? Trs Vaallu edavalu so tdp vaaallu yedavale ani prove cheyatam ki vesinatlu undhi kani tdp chesey e dramas correct ani defend cheskune stmt aithe i dont c from this

Link to comment
Share on other sites

16 minutes ago, perugu_vada said:

Ap gurinchi matladuthunte tg endukochindi ? Trs Vaallu edavalu so tdp vaaallu yedavale ani prove cheyatam ki vesinatlu undhi kani tdp chesey e dramas correct ani defend cheskune stmt aithe i dont c from this

Lol good one 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...