Jump to content

70 years to air India flight


kakatiya

Recommended Posts

ఎయిరిండియా తొలి విమానం ఎగిరి 70ఏళ్లు

 

0447000306BRK98-AIR-INDIA.JPG

లండన్‌: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానం తొలిసారి గాల్లోకి ఎగిరి 70 వసంతాలను పూర్తి చేసుకుంది. 1948 జూన్‌లో ఎయిరిండియాకు చెందిన తొలి విమానం ముంబయి నుంచి బయలుదేరి లండన్‌ చేరుకుంది. ఈ చారిత్రక ఘట్టం భారత్‌-యూకే మధ్య సత్సంబంధాలకు పునాదులు పడినట్లైంది. జూన్‌ 8న ముంబయిలో టేకాఫ్‌ అయిన విమానం కైరో మీదుగా జెనీవా, అక్కడి నుంచి జూన్‌ 10, 1948న లండన్‌లో ల్యాండ్‌ అయింది. ఎయిరిండియా తొలి విమానంలో 42మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో కొందరు భారత్‌కు చెందిన నవాబులు, మహారాజులు కూడా ఉండటం విశేషం.

70ఏళ్ల భారత్‌-యూకే అనుబంధానికి గుర్తుగా ఈ చారిత్రక సంవత్సరాన్ని ఎయిరిండియా ఘనంగా నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా తొలి ప్రయాణానికి సంబంధించిన అరుదైన చిత్రాలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా రీజనల్‌ మేనేజర్‌ దెబాషి గోల్డర్‌ తెలిపారు. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో విమాన సౌకర్యం చాలా తక్కువగా ఉండేదని, 70ఏళ్ల కాలంలో విమాన ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా భారత విమానయాన రంగంలో పెను మార్పులు వచ్చాయన్నారు. ఆనాటి మెరుపులను, ఖ్యాతిని ఎయిరిండియా తిరిగి సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు భారత్‌-యూకేల మధ్య విమానమార్గం చాలా బిజీగా మారందని బర్మింగ్‌హామ్‌-అమృతసర్‌ల మధ్య నేరుగా మూడు విమానాలు నడుస్తున్నాయని అన్నారు. అనేక మంది భారతీయులు ఇప్పటికే యూకేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, భారత్‌లో ఉన్న తమ బంధువులను చూసేందుకు తరచూ వస్తున్నారని, దీంతో నేరుగా విమానాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Link to comment
Share on other sites

LOndon to HYD oka direct flight easi tagalabadandi lav da 

aa BA vadi fiares mari too much ga vuunay, inak dikku leka, travel time takkuva ani dantlone povasi vastundi 

Link to comment
Share on other sites

17 minutes ago, aakathaai said:

Of late @sinthakaai is the only new dber Who has immense discussion skills in afdb never anticipated this sensational guy manchi db member ithanu

Ya nenu vinnanu manchodilaane unnadu braces_1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...