Jump to content

గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం


Paidithalli

Recommended Posts

7ap-main2a.jpg

గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లుతోందని ఏపీ జలవనరుల శాఖ సాంకేతిక సలహా కమిటీ పేర్కొంది. ఈ ప్రాజెక్టులపై న్యాయపోరాటం లేదా తెలంగాణతో చర్చించి ఓ అంగీకారానికి వచ్చే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. గోదావరి బేసిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వినియోగం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టుల నీటి అవసరాలు, ఎగువన చేపట్టిన ప్రాజెక్టుల ప్రభావం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం సాంకేతిక నిపుణులతో గురువారం సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, సలహాదారు బి.రోశయ్య, విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రెహ్మాన్‌, విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్లు కె.వి.సుబ్బారావు, వి.వి.ఎస్‌.రామ్మూర్తి, అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను, కమిటీ సిఫార్సులను ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో ఇప్పటివరకు ఉన్న నీటి వినియోగం 659.691 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 116.2 టీఎంసీలు, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులకు 320 టీఎంసీల వరద నీరు అవసరం. వరద నీటితో సహా ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు గోదావరిలో 1095.89 టీఎంసీలు. తెలంగాణలో ఉన్న వినియోగం 471.686 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు. మరో 450.31 టీఎంసీల వినియోగంతో అనధికారికంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు పేర్కొని మొత్తం అవసరాలు 1100.11 టీఎంసీలుగా పేర్కొంది. పునర్విభజన తర్వాత 450 టీఎంసీల వినియోగంతో తెలంగాణ ప్రాజెక్టులను చేపట్టిందని కమిటీ పేర్కొంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టినపుడు అపెక్స్‌ కౌన్సిల్‌ లేదా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉందని, అలాంటిదేమీ లేదని పేర్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల కూడా అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా నిర్మిస్తున్నదేనని, దీని వల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ఎత్తిపోతలను 33 టీఎంసీలతో చేపట్టిందని.. దీనికి కేంద్ర జలసంఘం ఆమోదించలేదని, రాష్ట్ర పునర్విభజన తర్వాత వీటి స్థానంలో 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల మొదటి దశను తెలంగాణ చేపట్టిందని తెలిపింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. కేంద్ర జలసంఘం అనుమతి రాకపోయినా రూ.2000 కోట్లకుపైగా వెచ్చించిందని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణ స్థలం వరకు నీటిని తెలంగాణ వినియోగించుకోవచ్చని, తప్పనిసరిగా దిగువకు విడుదల చేసే వ్యవస్థ ఏమీ లేదని వివరించింది. దిగువన ఉన్న సబ్‌బేసిన్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు తీరతాయని వారి ప్రాజెక్టు నివేదికలో పేర్కొనడం సరైనది కాదని తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకెళ్లకుండా న్యాయపోరాటం చేయాలని కమిటీ సూచించింది. వంద టీఎంసీల నీటిని మళ్లించే వీలున్న తుపాకులగూడెం ప్రాజెక్టుపై కూడా ఇదే సూచన చేసింది. గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోడానికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలని సూచించింది. ఇందిరాసాగర్‌ ఎత్తిపోతలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసినందున పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని పేర్కొంది. గోదావరిలో నీటి లభ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిటీ సూచించింది.

Link to comment
Share on other sites

వరద నీటితో సహా ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు గోదావరిలో 1095.89 టీఎంసీలు. తెలంగాణలో ఉన్న వినియోగం 471.686 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 178.116 టీఎంసీలు. మరో 450.31 టీఎంసీల వినియోగంతో అనధికారికంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు పేర్కొని మొత్తం అవసరాలు 1100.11 టీఎంసీలుగా పేర్కొంది

anadhikaram ga... 450 TMCs ento ardham katledhu. tribunals untayi kadha.. G meedha 10guthunaru ala chesthe.. Do they have any proofs for that ? 

varadha neellu samudhram lo kalisina parledhu kani... state US cheskokudadha ??

Link to comment
Share on other sites

పునర్విభజన తర్వాత 450 టీఎంసీల వినియోగంతో తెలంగాణ ప్రాజెక్టులను చేపట్టిందని కమిటీ పేర్కొంది. 

Even if they are doing this without Godavari Tribunal also I will support TG govt. 

before giving some false allegation these guys should discuss with tribunals/central govt. 

  • Like 1
Link to comment
Share on other sites

3 minutes ago, Paidithalli said:

varadha neellu samudhram lo kalisina parledhu kani... state US cheskokudadha ??

Excess water ni hold chese capacity undali kada to divert to any other place. 

Link to comment
Share on other sites

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ఎత్తిపోతలను 33 టీఎంసీలతో చేపట్టిందని.. దీనికి కేంద్ర జలసంఘం ఆమోదించలేదని, రాష్ట్ర పునర్విభజన తర్వాత వీటి స్థానంలో 70 టీఎంసీలతో సీతారామ ఎత్తిపోతల మొదటి దశను తెలంగాణ చేపట్టిందని తెలిపింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడింది

Polavaram lo mana TG gramalaki nashtam unte oppukoledha ? 

assal aa villages ni kalpukuntam annaru AP.. unfortunately, two govts are not even taking care of those villages now. 

thalli ki thindi pettanodu... chinnamma ki bangaram pedthannadata 

Link to comment
Share on other sites

Just now, tacobell fan said:

Excess water ni hold chese capacity undali kada to divert to any other place. 

ekkada undhi baa.. TG lo.. 450 TMCs illegal ga vadkuntunnaru ani chepthunnaru.. antha cinema ledhu... oka panta kuda evadu sakkaga vesthaledu.. assal godavari paina major irrigation projects em unnayi ??

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

thalli ki thindi pettanodu... chinnamma ki bangaram pedthannadata

denni inko language lo kuda cheppochu 

Link to comment
Share on other sites

1 hour ago, tacobell fan said:

Excess water ni hold chese capacity undali kada to divert to any other place. 

Ipudu kadutunna projects ave kada....lift,pump and store..!

 

Link to comment
Share on other sites

seetharam project valla kontha nastam inka rest of the projects enni kattukunna AP ki pedhaga bokka padadhu endhukantey AP loki vachey max godavari water is from sabari and sileru rivers avi orissa chattisgarh nundi vasthaayi. maharastra vaadu already godavari mothanni dams tho max apeysaadu varadha water thppithey normal water kindhaki vadhiley paristhithi ledhu 

Link to comment
Share on other sites

18 minutes ago, tom bhayya said:

seetharam project valla kontha nastam inka rest of the projects enni kattukunna AP ki pedhaga bokka padadhu endhukantey AP loki vachey max godavari water is from sabari and sileru rivers avi orissa chattisgarh nundi vasthaayi. maharastra vaadu already godavari mothanni dams tho max apeysaadu varadha water thppithey normal water kindhaki vadhiley paristhithi ledhu 

River interlink is the solution

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...