Jump to content

రాజధాని రాజసం


Navyandhra

Recommended Posts

అమరావతిలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థలు 
వినోద రంగంలో ‘లోథా’ 
మెట్రో రైలు తయారీకి ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ 
ఏరో హబ్‌ కేంద్రం ఏర్పాటుకు ఎలి హజాజ్‌ సంస్థ 
గృహ నిర్మాణ రంగంలో రాయల్‌ హోల్డింగ్స్‌ 
బ్యాటరీల తయారీ యూనిట్లకు ఫోర్టెస్కు మెటల్స్‌ ఆసక్తి 
అభివృద్ధికి నిధులిచ్చేందుకు ఏఐఐబీ హామీ 
సింగపూర్‌లో ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ 
8ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన ప్రాంతమని పేర్కొన్నాయి. స్థిరాస్తి వ్యాపార సంస్థ ‘లోథా గ్రూపు’, ‘ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ గ్రూపు’లు అమరావతిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా, మరికొన్ని ఆసక్తి కనబరిచాయి. మూడు రోజుల సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆయా సంస్థల ఛైర్మన్లు, ఎండీలు, సీఈవోలు, ముఖ్యప్రతినిధుల బృందాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందుంచారు. మాల్స్‌, ఓపెన్‌స్పేస్‌ వంటి వినోద రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు లోథా సంస్థ ఎండీ, సీఈవో అభిషేక్‌ లోథా ముందుకు వచ్చారు. పెట్టుబడులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, ప్రణాళికలతో సెప్టెంబరులో రాష్ట్రానికి వస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అపార అవకాశాలు, అభివృద్ధి తనను ఎంతో ఆకట్టుకున్నాయని అభిషేక్‌ లోథా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. స్థిరాస్తి అభివృద్ధిదారులతో సంప్రదించి రాజధాని నిర్మాణానికి ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామని, ప్రపంచ స్థాయి నిర్మాణదారుల భాగస్వామ్యం తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. భారత్‌లో మెట్రో రైలు తయారీ కర్మాగారాలను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నామని మలేషియాకు చెందిన ఎస్‌ఎంహెచ్‌ రైల్‌ కార్పొరేషన్‌ గ్రూపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జహ్రీన్‌ జమాన్‌ తెలిపారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌ అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. రైలు ఇంజిన్ల తయారీ, పాత లోకోమోటివ్‌లను కొత్త యూనిట్లుగా మార్చడం, రైళ్ల చక్రాలు, ఇరుసు, ఎలక్ట్రిక్‌ రైళ్లభాగాల తయారీలో సంస్థకు మంచి పేరుందని వివరించారు. జీఈ, సీమెన్స్‌, హ్యుండాయ్‌ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు.

భూమిస్తే ఆరు నెలల్లో ఏరో హబ్‌ కేంద్రం: ఎలి హజాజ్‌ సంస్థ: విమాన విడిభాగాలు తయారు చేసే ఏరో హబ్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌కు చెందిన ఎలి హజాజ్‌ సంస్థ ఎండీ ఓఫర్‌ గ్యాబినెట్‌.. సీఎం చంద్రబాబుకు తెలిపారు. భూమిని ప్రభుత్వం సమకూరిస్తే తొలి దశ ఉత్పత్తిని ఆరు నెలల్లోగా ప్రారంభిస్తామని వెల్లడించారు. 30 నుంచి 40 పరిశ్రమల స్థాపనకు సరిపడా సదుపాయాలు, ఉత్పాదనకు సరిపోయే సాంకేతిక సామర్థ్యం, సానుకూల వాతావరణం ఏర్పరిచే శక్తి తమకుందని వివరించారు. సంస్థకు బెంగళూరులో ఉత్పాదక సదుపాయ యూనిట్‌ ఉందని.. ఇప్పటికే పలు ఆర్డర్లు సొంతం చేసుకున్నామని చెప్పారు. అమరావతి వచ్చి అధికారులను సంప్రదించాలని సీఎం ఆయనకు సూచించారు.

ఏపీతో కలిసి పనిచేస్తాం: ఏఐఐబీ: రహదారులు, నీటి పారుదల, ఇంధన రంగాల్లో ఏపీకి ఆర్థికసాయం అందించేందుకు ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబీ) ముందుకొచ్చింది. అభివృద్ధి పనులకు అత్యంత వేగంగా నిధులు సమకూరుస్తామని ఆ బ్యాంకు డైరెక్టర్‌ జనరల్‌ పాంగ్‌ యీ ఇయాన్‌.. సీఎం చంద్రబాబుతో చెప్పారు. ఇప్పటికే గ్రామీణ రహదారులు, పారిశుద్ధ్యం తదితర అంశాల్లో ఏఐఐబీ ప్రతినిధులు ఏపీ బృందంతో కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధిలో భాగస్వాములమవుతామని చెప్పారు. భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. కెపాసిటీ ఫండింగ్‌ విషయంలో సాయపడాలని ముఖ్యమంత్రి కోరగా..ఆయా ప్రాజెక్టుల వివరాలు అందించాలని పాంగ్‌ అన్నారు. వివిధ ప్రాజెక్టు పనులపై తాను ఎక్కువ సమయం ఏపీలోనే గడుపుతుండటంతో రాష్ట్ర పౌరుడిగానే తనను తాను భావించుకుంటున్నానని అన్నారు. అమరావతిలో అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సింగపూర్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని...రాజధాని నగర బృహత్తర ప్రణాళిక తయారీలో తాను వ్యక్తిగతంగా పాలుపంచుకున్నానని సీఎం దృష్టికి పాంగ్‌ తీసుకొచ్చారు. ఏపీ గృహనిర్మాణ ప్రాజెక్టులోనూ భాగస్వామ్యమవుతామన్నారు.

8ap-main5b.jpg

అమరావతి నిర్మాణంలో కలిసి పనిచేస్తాం: రాయల్‌ హోల్డింగ్స్‌ సంస్థ: అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ ప్రతినిధి రాజ్‌కుమార్‌ హీరానందానీ చంద్రబాబుతో చెప్పారు. గృహనిర్మాణం, హెల్త్‌ రిసార్ట్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు.

సింగపూర్‌ రాయబారితో భేటీ: ప్రతి మూడు నెలలకోసారి భారత్‌, సింగపూర్‌ దేశాల మధ్య సంబంధాలతో పాటు వివిధ అంశాలపై సమీక్షిస్తున్నామని సింగపూర్‌ రాయబారి గోపీనాథ్‌ పిళ్లై.. చంద్రబాబుకు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఇది మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విజయవంతంగా నడిస్తే అది రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ దిగుబడుల్లో భారత్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఈ రంగంలో దేశం మొత్తం మీద వృద్ధి రేటు అధికంగా ఉన్న రాష్ట్రం తమదేనని చంద్రబాబు వివరించారు.

డస్సాల్ట్‌ 3డీ ప్రయోగశాలను పరిశీలించిన చంద్రబాబు: డస్సాల్ట్‌ థర్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రయోగశాల ఏర్పాటు అంశంలో చైనా, సియోల్‌, సింగపూర్‌లతో కలిసి పనిచేస్తున్నామని.. ఈ అనుభవంతో అమరావతిలో మరింత మెరుగ్గా పనిచేస్తామని డస్సాల్ట్‌ థర్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రయోగశాల సీఈవో బెర్నార్డ్‌ ఛార్లెస్‌ అన్నారు. సీఎం చంద్రబాబు ఈ ప్రయోగశాలను సందర్శించారు. డ్రోన్లను ఉపయోగించి సమాచారం, ఛాయాచిత్రాలను సేకరించే వ్యవస్థను, నగర నిఘాలో అత్యాధునిక, ప్రతిభావంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నామని వివరించారు. గాలి వాలును బట్టి అంచనా వేసి నగరంలో ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే సాంకేతికను అభివృద్ధి చేశామని, జల వనరుల సంరక్షణకు, నగరాన్ని ఆకుపచ్చగా ఉంచేందుకు ఈ సాంకేతికత ఎంతో దోహదపడుతుందన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టడంలో సహకరించాలని కోరారు. సెప్టెంబరులో అమరావతికి వచ్చి డిసెంబరు నాటికి అన్ని అంశాలపై ఉపయుక్తమైన నమూనాను సిద్ధం చేస్తామన్నారు. అమరావతిలో ఈ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మార్చాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. స్మార్ట్‌ నగరాల రూపకలప్పనలో ఈ సాంకేతికను వినియోగించుకుంటామన్నారు.

అగ్రి బిజినెస్‌ బృందంతో భేటీ: జర్మనీకి చెందిన అగ్రి బిజినెస్‌ బృందం చంద్రబాబుతో సమావేశమైంది. చీఫ్‌ కస్టమర్‌ సొల్యూషన్‌ ఆఫీసర్‌ ఐల్విన్‌ టాన్‌ నేతృత్వంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సారథ్యంలో ఈ చర్చలు జరిగాయి. ఏపీఈడీబీతో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అగ్రి బిజినెస్‌ సంస్థ పది ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వీటిపై ఈ సమావేశంలో చర్చించారు.


ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయండి: చంద్రబాబు

ఇనుప ఖనిజం, తీర ప్రాంత సహజవాయు వెలికితీత రంగాల్లో అనుభవం దృష్ట్యా ఏపీలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేయాలని ఫోర్టెస్కు మెటల్స్‌ సంస్థ దక్షిణాసియా ముఖ్య ప్రతినిధి గౌతమ్‌వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఉక్కు తయారీలో అనుభవం ఉన్న తమ అనుబంధ సంస్థతో సంప్రదిస్తానని తెలిపారు. బ్యాటరీల తయారీ, ఇంధన నిల్వ రంగంతో సహా ఫ్లోటింగ్‌ స్టోరేజ్‌ రీ గ్యాషిఫికేషన్‌కు సంబంధించిన వివిధ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇస్రో సహకారంతో లిథియమ్‌ ఇయోన్‌ బ్యాటరీల తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చంద్రబాబుతో చెప్పారు. వన్‌డియమ్‌ బ్యాటరీల తయారీపైన దృష్టిపెట్టామన్నారు. పరిశ్రమలకు భూమి కేటాయించాలని కోరారు. సౌర విద్యుత్తు ఉత్పత్తికి ఉపక్రమించామని, గ్రిడ్‌ నిర్వహణ ఇప్పుడు తమ ముందున్న సవాల్‌ అని ఇంధన నిల్వ, బ్యాటరీల తయారీకి ప్రాధాన్యతనిస్తున్నామని గౌతమ్‌ వర్మతో అన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Pitta said:

8ap-main5b.jpg

 

chair meeda sariga kuda kurcholedu tenor.gif

inkela kurchntaru ??

Link to comment
Share on other sites

Just now, Navyandhra said:

inkela kurchntaru ??

piles ochinattu kurchunnadu chudu sariga right lo tenor.gif?itemid=5124080

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...