Jump to content

బాబు వ్యూహానికి నాలుగు పిట్టలు


Hitman

Recommended Posts

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన అంశాల్లో తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకొంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు సంయుక్తంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్వీకరించడంతో ఒక్కసారిగా జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. తెలుగుదేశం, కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు అవసరమైన సభ్యుల సంఖ్య లభించింది. దీంతో స్పీకర్‌ అనుమతించారు. సుదీర్ఘకాలం అనంతరం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ జరగనుంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడి రాజకీయ వ్యూహం ఫలించడంతో ఏపీ ప్రత్యేక హోదా జాతీయ స్థాయి చర్చకు నోచుకుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు ఈ అవిశ్వాస తీర్మానంతో ఎలాంటి ప్రమాదం లేదు. అవసరమైన మెజార్టీతో పాటు అన్నాడీఎంకే.. ఇతర పక్షాలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చే అవకాశముంది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవచ్చు. అయినప్పటికీ పార్లమెంటు సాక్షిగా యూపీఏ-2 హయాములో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. గత నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం ఏపీకి ఎంత సాయం అందించిందీ, ఏయే ప్రయోజనాలు ఇంతవరకూ అమలుకు నోచుకోలేదన్న విషయం ప్రధానంగా చర్చకొచ్చే అవకాశముంది.

చంద్రబాబు రాజకీయ చతురత

2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి తెలుగుదేశం పోటీ చేసింది. అనంతరం పరిణామాలతో ప్రత్యేక హోదా అంశం మరుగునపడింది. హోదా స్థానంలో ప్యాకేజీ ఇస్తామని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించడంతో తెలుగుదేశం అప్పట్లో అందుకు సమ్మతించింది. కానీ 2018 బడ్జెట్‌లోనూ దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే ఆర్థికలోటుతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం దీనిపై అనేక సార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ ఎలాంటి హామీ రాలేదు. 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటం రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై విపక్షం వైకాపాతో పాటు జనసేన విమర్శలు సంధించడంతో తెలుగుదేశం పోరుబాట పట్టింది. అన్ని రకాలుగా పోరాటం చేసిన అనంతరం తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన పోరాటాలు చేయడమే కాకుండా ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగట్టడంలోనూ సఫలీకృతమైంది. గత సమావేశాల్లో వైకాపా అవిశ్వాస తీర్మానంపై అనేక సార్లు ప్రయత్నించగా ఫలించలేదు. తాజా సమావేశాల ప్రారంభం రోజునే తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదానికి రావడం బాబు రాజకీయ వ్యూహానికి నిదర్శనమని భావించవచ్చు.

ఒక ఐడియా.. నాలుగు పిట్టలు

తాజా రాజకీయ వ్యూహంలో చంద్రబాబునాయుడు ఏకంగా ఒక దెబ్బకు నాలుగు పిట్టల్ని కొట్టారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వైకాపాపై పైచేయి, రాష్ట్రంలో భాజపాను ఏకాకి చేయడం, పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన విమర్శలకు బదులివ్వడం, జాతీయ రాజకీయపక్షమైన కాంగ్రెస్‌తో పాటు ఇతర పక్షాలను ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక తాటిపైకి తీసుకొని రావడం... ఈ నాలుగు అంశాలతో దేశ రాజకీయాల్లో తెలుగుదేశం కీలకభూమికను పోషించనుందన్న సంకేతాలు వెళ్లాయి.

వైకాపాపై...

రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశంపై వైకాపా గత లోక్‌సభ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి యత్నించింది. అయితే పలు కారణాల వల్ల స్పీకర్‌ స్వీకరించేలేదు. ఏకంగా వైకాపాకు చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించి ఆమోదింపచేసుకున్నారు. అయితే తాజా లోక్‌సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌ అంశం అవిశ్వాస తీర్మానం రూపంలో చర్చకు రానుండటంతో వైకాపా సభ్యులు లేకపోవడంతో వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కోల్పోయారు. వైకాపాకు చెందిన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డితో పాటు తెలంగాణకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నప్పటికీ వైకాపాతో సంబంధాలు లేవు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తీసుకున్న తొందరపాటు నిర్ణయంతో లోక్‌సభలో వైకాపా సభ్యుల రాజీనామాతో, ఆ పార్టీ దేశం ముందు ఏపీ సమస్యలు విన్నవించుకునే అవకాశం లేకుండా పోయింది.

భాజపాపై పోరు

గత ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి కట్టుగా పోటీచేశాయి. అనంతరం భాజపా తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. హోదా లేకపోయినా ప్యాకేజీ నిధులతో పాటు విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టు.. తదితర అంశాలపై భాజపా పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం తెదేపాపై పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీయేకు రాంరాం చెప్పింది. భాజపాకు రాష్ట్రంలో పెద్దగా బలం లేదు. తెలుగుదేశం ఎన్డీయేలో కీలక పక్షం. అలాంటి పెద్ద పక్షం వెళ్లిపోవడంతో రాష్ట్రంలో భాజపా పరిస్థితి అంతంత మాత్రంగానే మారింది. రాష్ట్రప్రజలు కూడా ప్రత్యేకహోదాపై భాజపానే తప్పుబట్టడం తెదేపాకు కలిసివచ్చే అంశం.

జనసేన విమర్శలకు జవాబు..

పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన గత ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమికి మద్దతు పలికింది. ప్రత్యేకహోదాపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను మద్దతు కూడగడుతానంటూ ప్రకటించారు. ఇప్పుడు తెదేపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో పవన్‌ విమర్శలకు దీటైన జవాబిచ్చినట్టయింది. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్నామని రాష్ట్ర ప్రజలకు తెదేపా తెలియపరిచినట్టయింది.

దేశదృష్టిని ఆకర్షించిన వైనం..

రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్న అంశాన్ని దేశప్రజల దృష్టికి తీసుకురావడంలో తెదేపా విజయం సాధించింది. అప్పట్లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ కూడా తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుపలికే పరిస్థితి తీసుకువచ్చింది. తెదేపాకు సంఖ్యాబలం లేనప్పటికీ కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు అవిశ్వాస తీర్మానానికి వెంటనే తమ మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసం వీగిపోయే పరిస్థితులున్నప్పటికీ పార్లమెంటులో చర్చ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై దేశప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.

Link to comment
Share on other sites

దేశదృష్టిని ఆకర్షించిన వైనం..

అప్పట్లో రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ కూడా తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుపలికే పరిస్థితి తీసుకువచ్చింది. తెదేపాకు సంఖ్యాబలం లేనప్పటికీ కాంగ్రెస్‌, ఎన్‌సీపీలు అవిశ్వాస తీర్మానానికి వెంటనే తమ మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసం వీగిపోయే పరిస్థితులున్నప్పటికీ పార్లమెంటులో చర్చ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాలపై దేశప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.

 

 

ha ha....

Link to comment
Share on other sites

2 hours ago, MuPaGuNa said:

phalinchina chee bee yen vyooham....pittala dorani minchina lokio........

Mana media vunte .. comedy ni kuda .. serious action laga chupistunaru.. mana Khama ante

Link to comment
Share on other sites

22 minutes ago, Unityunity said:

Mana media vunte .. comedy ni kuda .. serious action laga chupistunaru.. mana Khama ante

inka repati nundi choodali yel00w medi@ .............itla chesindu ,atla chesindu ani 

Link to comment
Share on other sites

3 hours ago, MuPaGuNa said:

phalinchina chee bee yen vyooham....pittala dorani minchina lokio........

is GARUDA pitta part of those 4 pittaaaas ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...