Jump to content

రాజీవ్‌ హత్య తరహాలో మోదీ హత్యకు కుట్ర!


Biskot

Recommended Posts

04094331BRK-POLICE.JPG

ముంబయి: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో జరిగిన హింస కేసులో విప్లవ రచయిత సంఘం(విరసం) నేత వరవరరావును, హక్కుల నేతలు వెర్నాన్‌ గోంజాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరియా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పరంబీర్‌ సింగ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

‘అరెస్టు చేసిన పౌరహక్కుల నేతలకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. మోదీ రాజ్‌ను అంతం చేసేందుకు రాజీవ్‌గాంధీ తరహాలో మోదీని హత్య చేయాలని ప్రణాళికలు వేసినట్లు అరెస్టు అయిన పౌరహక్కుల నేతకు, మావోయిస్టులకు మధ్య లేఖల ద్వారా సంభాషణ జరిగింది. గ్రనేడ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖ‌లో ఉంది. పౌరహక్కుల నేతల దగ్గర నుంచి కొన్ని వందల లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని లేఖలు అరెస్టయిన నేతలు, మావోయిస్టులకు మధ్య చేతులు మారాయి. అధికారుల దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక పెద్ద ప్లాన్‌ వేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు లేఖలో ఉంది. స్వాధీనం చేసుకున్న డిస్క్‌ల్లో ఒక రాకెట్‌ లాంచర్‌ పాంప్లెట్‌ లభ్యమైంది’ అని పరంబీర్‌ తెలిపారు.

ఈ కేసులో అరెస్టు చేసిన వారిని జైల్లో పెట్టవద్దని, సెప్టెంబరు 6 వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అరెస్టు అయిన నేతలు వరవరరావు, గోంజాల్వేస్‌, ఫెరీరియాలను వారి స్వగృహాలకు తరలించారు. ఇళ్ల చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...