Jump to content

110 years to moosi river floods


kakatiya

Recommended Posts

మానని గాయం.. చేదు జ్ఞాపకం 
వేల మంది జల సమాధి 
భాగ్యనగర చరిత్రలో మహా విషాదం 
మూసీ వరదలకు 110 ఏళ్లు 
hyd-sty1a.jpg
అదో ప్రళయం.. మహా విషాదం.. మహోత్పాతం.. వేలాది మందిని జలసమాధి చేసిన ప్రకృతి విపత్తు.. చారిత్రక ఖిల్లా భాగ్యనగర చరిత్రలో మానని గాయం.. ప్రణాళికాపరమైన నగరాభివృద్ధి అవసరాన్ని నొక్కి చెప్పిన చేదు సంఘటన.. మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తి నేటికి(సెప్టెంబరు 28) అక్షరాలా 110 ఏళ్లు...
ఈనాడు, హైదరాబాద్‌

ఏం జరిగిందంటే... 
1908 సెప్టెంబరు 26... ఉదయం నుంచే వాతావరణ పరిస్థితిలో మార్పు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో అరగంట పాటు తుంపరగా వర్షం పడింది. ఆ తర్వాత 6.30 దాకా భారీ వర్షం కురిపిస్తోంది. రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ  వాన ప్రారంభమై అరగంట కురిసింది. ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు కుండపోతగా పడింది.

27వ తేదీ..  ఆ రోజు ఉదయం 8 గంటల వరకూ నమోదైన వర్షపాతం 15.3 సెంటీ మీటర్లు. ఆ రోజంతా  కొద్దిపాటి విరామాలతో వాన పడుతూనే ఉంది. అర్ధరాత్రి తర్వాత మరోసారి కుండపోతగా కురిసింది. ఆ తర్వాత కురిసిన వర్షపాతం లెక్కకు అందనిదని అంటారు. అప్పటికే నదీ పరివాహక ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. నీటిని ఇంకింప చేసుకోలేనంతంగా నేల చిత్తడిగా మారింది. ఒకదాని తర్వాత ఒకటి చెరువు కట్టలు తెగిపోయాయి. వీటిల్లో ముఖ్యమైనవి పాల్మాకుల, పర్తి చెరువులు. పాల్మాకులకు దిగువన, హైదరాబాద్‌కు 22 మైళ్ల దూరంలో పర్తి చెరువుంది. శంషాబాద్‌లో నమోదైన 24 గంటల వర్షపాతం 32.5 సెం.మీ. పాల్మాకుల, పర్తికి చెరువు కట్టలు తెగిపోవడంతో శంషాబాద్‌ నుంచి వర్షపు నీరంతా మూసీలోకి చొచ్చుకుని వచ్చింది.

hyd-sty1b.jpg

28వ తేదీ.. ఉదయం నుంచే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 27న మూసీలో 4 అడుగుల ఎత్తులో నీరుండగా.. 28 ఉదయం 10 గంటలకల్లా అది 20 అడుగులకు చేరుకుంది. సాధారణంగా మూసీ నది రెండు ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులు. ఆ రోజు మాత్రం కి.మీ.కు మించిన వెడల్పుతో మూసీ నీళ్లు పారసాగాయి. 7 అంగుళాల మేర వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోల్సావాడి(ప్రస్తుత ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి) ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడం మొదలైంది.. పురానాపూల్‌ వెనుకతట్టులోకి నీరు చొచ్చుకు వచ్చింది. 3 గంటల ప్రాంతంలో పశ్చిమ దిశలోని నగర రక్షణ గోడ కూలిపోయింది. సాయంత్రం 4 గంటలకల్లా రహదారులపై నీరు ప్రవహించడం ప్రారంభమైంది. ఒక్కసారిగా అప్జల్‌గంజ్‌లో 11 అడుగులకు.. మిగిలిన ప్రాంతాల్లో 10 అడుగులకు వరద చేరింది. రాత్రి వరకు ఇదే పరిస్థితి. సెప్టెంబరు 26, 27 తేదీల్లో కురిసిన ఆ భారీ వర్షపాతానికి కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను.

hyd-sty1c.jpg
Link to comment
Share on other sites

Osmania general hospital

Urdu poet Amjad who saw his family washed away, later wrote a poem ‘Qayamat-e-Soghra’ detailing his tragedy. — Photo: Surya Sridhar

Hyderabad: More than 110 years after it saved 150 lives during a deluge in the city, the tamarind tree at Osmania General Hospital continues to stand tall

Link to comment
Share on other sites

Musi flood control ki two reservoirs katti, oke debba tho flood control and provided water supply to the city...

the same reservoirs helped city supply water for decades until krishna and Godavari waters supplemented the need...

Vishvesharayya chesindi hyderabadis eppatiki marichipovadhu...

Link to comment
Share on other sites

1 hour ago, hyperbole said:

credit goes to vishweshwariah  one of the greatest engineer of India. 

https://swarajyamag.com/smart-cities/how-m-visvesvaraya-made-hyderabad-flood-free-lessons-for-smart-cities

Avanni maaku thelvad. Rain or drought or floods or IT industry in Hyderabad, its only CBN and his vision without which there was not any history for Hyderabad.

Hyderabad's history started only in 1994 and ended in May,2004.

 

Link to comment
Share on other sites

50 minutes ago, ChinnaBaabu said:

Avanni maaku thelvad. Rain or drought or floods or IT industry in Hyderabad, its only CBN and his vision without which there was not any history for Hyderabad.

Hyderabad's history started only in 1994 and ended in May,2004.

 

Again started in 2014 and ended with vote for note...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...